Jump to content

Very nice analysis regarding Jaffa and Langaaa


Muppalla

Recommended Posts

కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్, ఫెడరల్ ఫ్రంట్ వైఎస్సార్సీపీకి లాభమా? శాపమా??

చంద్రబాబు తెలంగాణా వచ్చి కాంగ్రెసుతో అపవిత్రంగా కూటమి కట్టేవరకు కాంగ్రెసు పార్టీ 45-50 వరకు గెలిచే అవకాశం ఉందని తలపండిన విజ్ఞులు అన్న మాట! తెరాసకు కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతికూలతలు కూడా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పాలన, ఫెయిలైన డబుల్ బెడ్రూం పథకం, ఆత్మార్పణం చేసిన వెయ్యి మంది పైగా ఉద్యమకారుల కుటుంబాలని నిర్ధాక్షిణ్యంగా నిరాదరించడం, కొత్త రాష్ట్రంలో కొలువులోస్తాయనే కొండంత ఆశలు వమ్మైన యువత, ఏ పచ్చ మాఫియా బూచి చూపి 2014లో గెలిచాడో అదే లాబీతో విందులు, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత లాంటి వాటితో తెరాస విజయం అంతా సులభంగా కనిపించలేదు! కానీ, ఎప్పుడైతే బాబు ప్రవేశించాడో అప్పుడు కేసిఆర్కి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది తెలంగాణా సెంటిమెంట్ అద్భుతంగా పండింది, అసెంబ్లీనే ఊడ్చేసాడు! ఇది వెల్కమ్ గ్రూప్ వేసిన అద్భుతమైన పాచికా లేక చంద్రబాబు అత్యుత్సాహమో ఆ ఈశ్వరునికే ఎరుక!

ఇప్పుడు మన ఏపీ విషయానికొస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని కేసిఆర్ నుండి ప్రతి తెరాస నాయకుడు చెప్తున్న మాట! చంద్రబాబుని ఓడిస్తామనా లేక గెలిపిస్తామనా అనేదే ఇక్కడ నాలాంటి కొంతమందిలో కన్ఫ్యూజన్. కొంతమంది ఆంధ్రా ప్రజానీకం హైదరబాద్లో ఉండి కానీ ఏపీలో తెలంగాణా ప్రజలు అసలు లేరు. మరి తెరాస ఎలా చంద్రబాబుని ఓడిస్తుంది? వైఎస్సార్సీపీ కి డబ్బు, వ్యూహాలు ఇచ్చి సాయం చెయ్యగలరు! హైదరాబాదులో ఉన్న తెలుగుదేశం బడాబాబుల డబ్బు ఏపీకి చేరకుండా నిలువరించవచ్చు. అంతేగానీ, మేము వైఎస్సార్సీపీకి సాయం చేస్తున్నామంటూ, చంద్రబాబుని ఒడిస్తున్నాం అంటే ఉద్యమ సమయంలో కేసిఆర్, తెరాస నాయకులు, ఉద్యమకారులు అన్న అడ్డగోలుగా మాటలని ఉపయోగించి సెంటిమెంటు రాజేస్తే ఆంధ్రా ప్రజానీకం మొత్తం మారకపోయినా ఒక 3% మారినా ఫలితాలు తారుమారు కావా? నిశ్శబ్దంగా వెనకనుండి సాయం చెయ్యాల్సిన కేసిఆర్ ఎందుకు ఇంత ప్రముఖంగా బహిరంగంగా మద్దతు ప్రటిస్తున్నాడు?

ఇది చంద్రబాబు చేసిన మేలుకు ప్రతిఫలంగా చేసే సాయమా, వెల్కమ్ గ్రూప్ వ్యూహమా? నేను ఇప్పటికే వింటున్నా ఆంధ్రా వాళ్ళని తిట్టి తరిమేసిన కేసిఆర్తో జగన్మోహన్ రెడ్డి గారు కలవడం ఏంటండీ అని!! ఒకవేళ ఇది వెల్కమ్ గ్రూప్ వ్యూహం కాకపోయినా దీన్ని వాడుకుని కొంత శాతం ప్రజలని మోసం చెయ్యడానికి తెలుగుదేశానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి కేసిఆర్ అయినా, జగన్ గారు అయినా?? కేసిఆర్ మద్దతు వలన మనకి ఒక్క ఓటు రాదు ఇది ఖచ్చితం కానీ ఒకవేళ సెంటిమెంట్ వర్క్ అయితే ఎన్నో కొన్ని ఓట్లు పోతాయి - ఇది అవసరమా వైఎస్సార్సీపీకి?

నిజంగా కేసిఆర్ చంద్రబాబుని ఓడించాలని, జగన్ గారిని గెలిపించాలని అనుకుంటే కేసిఆర్, తెరాస నాయకులు చంద్రబాబుని, తెలుగుదేశాన్ని ఒక్క మాట కూడా అనకుండా వైఎస్సార్సీపీ కి వెనకనుండి సాయం చేస్తారు!!

ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెరాస నాయకులు జగన్ గారిని కలుస్తున్నారని వింటున్నా! ఇదే నిజమైతే ఇది వైఎస్సార్సీపీ వ్యూహాత్మక ఘోర తప్పిదం! 2014 లాగానే ఎన్నికల ముందు ఒక తప్పిదం తర్వాత ఇంకోటి చేసుకుంటూ చంద్రబాబు చేతిలో మరోసారి అధికారం బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టే!! జాగ్రత్త!!!

కనీసం, తెరాసతో పొత్తు ఎందుకు ఉండాలో, ఆ పొత్తు వలన ఏపీకి ఏమి ప్రయోజనమో వైఎస్సార్సీపీ ఏపీ ప్రజలకి చెప్పగలగాలి. ప్రాజెక్టుల విషయంలో, ఇరు రాష్ట్రాల ఎంపీలు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామనో, ఇంకోటో ముందే ఆలోచించుకుని నాయకుడి దగ్గరనుండీ ఆఖరి కార్యకర్త వరకు ఒకే మాట చెప్పుకుంటూ ఒకే బాటలో నడవాలి!! నాకెందుకో ఇది దారిన పోయే కంపను మీదేసుకున్నట్టు ఉంది!!

 
 
 
LikeShow more reactions
Comment
Comments
 
  • Malathi Ctr
    Malathi Ctr Return gift అన్నది kcr/బాబు ల personal మాత్రమే, ఇది తొందరగా రావాలని AP ప్రజలు కోరుకుంటున్నారు. దీనికి జగన్ ని trs వారు కలవడానికి సంబంధం ఉందోలేదో తెలియదు.ఫ్రంట్ లొ బాగంగా kcr చాలా మంది ఇతర రాష్ట్ర నాయకులను కలిసాడు, జగన్ గెలుస్తాడని ఫ్రంట్ కి invite చెయ్యాలని అనుకోవచ్చు, జగన్ వయస్సులొ చిన్నవాడు పైగా past history నేపద్యంలో ktr కలవడం మేలనుకున్నాడేమో
    Hide this
  • Gopal Lingireddy
    Gopal Lingireddy This friendship (not coalition) may not damage the prospects as TDP and their yellow media campaigning if TRS and YCP carefully strategize and send a message this friendship is to rescue the state from the hands of yllow mafia, and fight at Central uniSee More
    1
    Hide this
  • A Naveen Reddy
    A Naveen Reddy జగన్ అన్న ఈ తెరాస వాళ్ళను నమ్మకు...

    విషపురుగుల కంటే హీనం వీళ్ళ వ్యక్తిత్వం
    See More
    1
    Hide this
  • Malathi Ctr
    Malathi Ctr Special status ఎవరిస్తే వారికె మద్దతు అని జగన్ చెప్పి అన్ని పార్టీలను ఒకే దూరంలో పెట్టాడు, అదె విధంగా ఫ్రంట్ కూడా ఉండచ్చు కదా, ఏమో ఈ ఫ్రంట్ కు future ఉందేమో
    Hide this
  • Malathi Ctr
    Malathi Ctr Kcr కు ఎదొ ఒక ఆంధ్రపార్టితోడు ఉండటం చాలా అవసరం, బాబు గెలిచేట్టు లేదని జగన్ కోసం చూడచ్చు,
    Hide this
  • Ashok Yeddula
    Ashok Yeddula ఈ విషయం లో జగన్ అన్ని పార్టీలను సమదూరం లో ఉంచుతున్నారు..
    కాంగ్రెస్ భాజపా ఫెడరల్ ఫ్రoట్ దేనిలోనూ వైకాపా చేరదు..
    పొత్తుల ప్రసక్తే లేదు...
    See More
    2
    Hide this
  • Subbareddy Battula
    Subbareddy Battula Correct analysis
    Hide this
  • Sannapa Reddy Krishna Reddy
    Sannapa Reddy Krishna Reddy ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ చేత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయిస్తారేమో మద్దతు ప్రకటించేముందు.
    1
    Hide this
  • Kotha Krishna Rama
    Kotha Krishna Rama జగన్ గారు పెడరల్ ఫ్రంట్ లో జాయిన్ అవుతాం అని చెప్పలేదు. వాళ్ళుమాట్లాఫటానికి మాత్రం వస్తాం అని చెప్పారు అంతే
    1
    Hide this
  • Jayaprakash Reddy Elugoti
    Jayaprakash Reddy Elugoti I don’t think Jagan is going to ally with any front( including Federal front) or NDA or Congress before elections. As per my understanding he is going to keep options open till elections are done. Let KTR meet, there’s no wrong. 

    జగన్ గారు ఇప్పటివరకు చెపుతున్నట్టే ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని reiterate చేస్తే బెటర్
    Hide this
  • Vidyasagar Marappa Reddy
    Vidyasagar Marappa Reddy Jagan is not a parasite like Chandrababu Naidu who comes to power taking the help of toka parties. In 2014 bjp and pavan Kalyan. Now only package Pawan is available.
    Hide this
  • Narsi Reddy Ippala
    Narsi Reddy Ippala అయ్యా గురవారెడ్డి గారు
    జగన్ ఎవరు హోదా ఇస్తే వాళ్లతొ కలుస్తా అన్నారు
    ఇప్పుడు నిస్వార్ధంగా కె సి ఆర్
    See More
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...