Jump to content

ఆపరేషన్‌ కమల్‌ విఫలం..!


KING007

Recommended Posts

  •  
ఆపరేషన్‌ కమల్‌ విఫలం..!

1/17/2019 9:05:42 AM

636833128301403005.jpg

 

కుమారస్వామి ప్రభుత్వానికి తప్పిన ముప్పు
 
 
బెంగళూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ఉవ్వెత్తున ఎగసిన సంక్షోభం చల్లారింది. ‘ఆపరేషన్‌ కమల్‌’ మరోసారి విఫలమైంది. కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి పెనుముప్పు తప్పింది. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తగినంత మద్దతును కూడగట్టలేక దెబ్బతిన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బుజ్జగించడంతో మూడ్రోజుల నాటకీయ పరిణామాలకు బుధవారం తెరపడింది. మంత్రి పదవి నుంచి ఇటీవల ఉద్వాసనకు గురైన కాంగ్రెస్‌ నేత రమేశ్‌ జార్కిహోళి మరో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ముంబైలోని ఓ ప్రైవేటు హోటల్‌లో మకాం వేశారు.
 
కేబినెట్‌లో చోటివ్వనందుకు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్‌.నగేశ్‌, ఆర్‌.శంకర్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు మంగళవారం లేఖ రాశారు. వీరు కూడా జార్కిహోళితో కలిసి ముంబై హోటల్లో బస చేశారు. తమ శిబిరంలోకి కనీసం 10 మంది ఎమ్మెల్యేలైనా వస్తే సర్కారును కూలదోయవచ్చని భావించారు. అయితే కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌, సీనియర్‌ మంత్రి డి.కె.శివకుమార్‌ రంగంలోకి దిగి అసంతుష్ట ఎమ్మెల్యేలను బుజ్జగించినట్లు తెలిసింది. ‘ఆపరేషన్‌ కమల్‌’ విఫలం కావడంతో సంక్రాంతి తర్వాత సర్కారు కూలిపోతుందన్న కథనాలతో నిద్రలేని రాత్రులు గడిపిన ఉభయ పార్టీల నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
 
 
తమ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని చాటేందుకు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం శాసన సభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. మద్దతు ఉపసంహరించిన ఇద్దరు స్వతంత్రులను కూడా ఈ సమావేశానికి తీసుకొస్తామని వేణుగోపాల్‌ చెప్పారు. ఇద్దరు స్వతంత్రులు వెళ్లినా నష్టం లేదని, సంఖ్యాబలం తన వైపే ఉందని, తన ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని, అందుకే తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని సీఎం కుమారస్వామి తెలిపారు.
 
 
‘ఆపరేషన్‌ కమల్‌’ విఫలం కావడం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలకు చెంపపెట్టు లాంటిదని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అన్నారు. 224 మంది ఎమ్మెల్యేలతో కూడిన కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌(80), జేడీఎస్‌(37), ఒక బీఎస్సీ(1), ఇద్దరు స్వతంత్రులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వ బలం 120. ఇద్దరు స్వతంత్రులు వైదొలిగినా ప్రభుత్వానికి ఢోకా లేదు. కాగా, తమ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ కూడా ఎరవేస్తున్నట్లు వార్తలు రావడంతో బీజేపీ హరియాణాలోని గురుగ్రాం రిసార్టుకు 100 మంది ఎమ్మెల్యేలను తరలించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...