Jump to content

Meda Mallikarajuna Reddy Rajampeta MLA resigns


Bezawadabullo

Recommended Posts

  • Replies 83
  • Created
  • Last Reply
3 hours ago, sonykongara said:

rajampet -chengal rayudu

kamalapuram-veera siva reddy

Very good decision. Maa niyojaka varganiki aa daridrudu puttha ki istaremo anukunna. Veera Siva reddy good choice. Too much negative on putha. Manchi ga palakarinchadam kuda raadu aadiki.

 

Link to comment
Share on other sites

7 minutes ago, SIVA_anNFAN said:

Very good decision. Maa niyojaka varganiki aa daridrudu puttha ki istaremo anukunna. Veera Siva reddy good choice. Too much negative on putha. Manchi ga palakarinchadam kuda raadu aadiki.

 

Putta,  Yanamala....extra baggage to Party....aa putta gaadu ycp ki jump kottochuga...

Link to comment
Share on other sites

39 minutes ago, ask678 said:

Yanamala valana party ki bad vasthundhi konni sections lo....zero use, bonus ga negative in some.sections

Yanamala seats విషయం లో influence chesentha scene లేదే.. Govt decisions lo cheyyochu but not seats.... 

Link to comment
Share on other sites

 

రాజంపేట టీడీపీ సీటు ఇవ్వండి
27-01-2019 02:08:04
 
అమరావతి, జనవరి 26, (ఆంధ్రజ్యోతి): తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాజంపేట నియోజవకర్గం స్థానాన్ని తనకు కేటాయించాలని కోరారు. కాగా, ఆ స్థానంలో పార్టీని మళ్లీ గెలిపించేందుకు బలంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. సరైన సమయంలో అందరికీ సరైన అవకాశాలు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

54 minutes ago, KING007 said:

 

రాజంపేట టీడీపీ సీటు ఇవ్వండి
27-01-2019 02:08:04
 
అమరావతి, జనవరి 26, (ఆంధ్రజ్యోతి): తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాజంపేట నియోజవకర్గం స్థానాన్ని తనకు కేటాయించాలని కోరారు. కాగా, ఆ స్థానంలో పార్టీని మళ్లీ గెలిపించేందుకు బలంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. సరైన సమయంలో అందరికీ సరైన అవకాశాలు వస్తాయని సీఎం అన్నట్లు తెలిసింది.

:sleep:

Link to comment
Share on other sites

మేడా రాకతో వైసీపీలో ముసలం
27-01-2019 11:16:45
 
636841846039346762.jpg
రాజంపేట: మేడా మల్లికార్జున రెడ్ది రాకతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం చెలరేగింది. రాజంపేట సీటు మేడాకే అని ప్రచారం జరగడంతో అమర్‌నాథ్ రెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అమర్‌నాథ్ రెడ్డిని కాదని మేడాకు టిక్కెట్ ఇస్తే సహించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నెల 31 వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు
Link to comment
Share on other sites

జగన్‌కు సొంత జిల్లాలోనే షాక్.. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ ఉంటే...
27-01-2019 12:31:48
 
636841892688996940.jpg
  • వైసీపీలో టికెట్ల రగడ
  • రాజంపేటలో నేతల ఎదుటే ఆందోళన
  • ఆకేపాటికి టికెట్‌ ఇవ్వాలని నినాదాలు
  • డబ్బున్న వారు వస్తే అభ్యర్థి అంటే ఎలా
  • జమ్మలమడుగులో అల్లెప్రభావతి జగన్‌పై ఫైర్‌
  • రాయచోటిలో విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాధరెడ్డి గొడవ
వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సిట్టింగ్‌లకే టికెట్లంటూ మొదటి నుంచి ప్రచారం సాగుతూ వచ్చింది. జగన్‌ మాటకు ఎదురే లేదని, ఆయన ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారని, పార్టీలో ఎదిరించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు నమ్ముతూ వచ్చేవారు. సొంత జిల్లాలో నేతలు, కేడర్‌పై జగన్‌కు గట్టి పట్టే ఉందని ఆ ఆ పార్టీ నేతలు పేర్కొంటూ వచ్చేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. జమ్మలమడుగులో అల్లె ప్రభావతి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించింది. రాజంపేటలో ఆకేపాటికే టిక్కెట్‌ ఇవ్వాలంటూ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వైసీపీ అభ్యర్థిని ఓడిస్తానంటూ స్వయంగా ప్రకటించడంతో జిల్లా వైసీపీలో అసమ్మతిరాగం ఊపందుకుంది.
 
 
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో టికట్ల రగడ రాజుకుంటోంది. రాజంపేట, జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు టికెట్ల కోసం పట్టుబడుతుండడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి ఈనెల 31న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోగా ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు విభేదిస్తున్నారు. రాజంపేట వైసీపీ కార్యాలయంలో శనివారం ‘డబ్బున్న వారు వస్తే ... అభ్యర్థి అంటే ఎలా అంటూ’ ఆ పార్టీ కేడరు రభస సృష్టించింది. ఆకేపాటి అమర్‌నాధరెడ్డికే వైసీపీ టికెట్‌ ఇవ్వాలంటూ అరుపులు కేకలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు టికెట్‌ ఆశిస్తున్న అల్లె ప్రభావతిని కాదని సుధీర్‌రెడ్డికి టికెట్‌ అంటూ జగన్‌ ప్రకటనపై అల్లె ప్రభావతి జగన్‌పై ఫైర్‌ అయ్యారు. మరోవైపు విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాధరెడ్డి రాయచోటి వైసీపీ టికెట్‌ ఆశిస్తుండగా ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికే టికెట్‌ ఇస్తారని వెల్లడించడంతో ఆయన సొంత ప్రచారం సాగిస్తున్నారు.
 
 
టికెట్ల కోసం నేతల పట్టు
ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లా కడపలో వైసీపీకి మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలు, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సిట్టింగ్‌లకే టికెట్లంటూ మొదటి నుంచి ప్రచారం సాగుతూ వచ్చింది. జగన్‌ మాటకు ఎదురే లేదని, ఆయన ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారని, పార్టీలో ఎదిరించే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు నమ్ముతూ వచ్చేవారు. సొంత జిల్లాలో నేతలు, కేడరుపై జగన్‌కు గట్టి పట్టే ఉందన్నది ఆ ఆపార్టీ నేతలు పేర్కొంటూ వచ్చేవారు. 14 నెలల పాదయాత్ర తరువాత తొలిసారి జిల్లాకు విచ్చేసిన జగన్‌కు జిల్లా ప్రజలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈనెల 13న పులివెందులలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన సందర్భంగా జిల్లాలో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు జగన్‌ను కలిసి టికెట్లపై చర్చించారు.
 
జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి సుధీర్‌రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ కలిసి గెలిపించుకురావాలని జగన్‌ పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న నియోజకవర్గ మహిళా నేత అల్లె ప్రభావ తి జగన్‌ను కలిసి ఏకపక్షంగా ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారని వివాదానికి దిగింది. తనకు టికట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినా చివరికి జగన్‌ లేదు, లేదు అభ్యర్థి ప్రకటన ఖరారైపోయింది అంటూ సముదాయించి పంపారు.
 
 
శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 18 ఏళ్లుగా జమ్మలమడుగు రాజకీయాల్లో ఉన్నానని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా, మండల ఎంపీపీగా, ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ జగన్‌ పెట్టిన పార్టీలో కొనసాగుతున్నానన్నారు. నా సేవలను జగన్‌ గుర్తించలేదని, కానీ ప్రజలు మాత్రం నన్ను కోరుతున్నారని, వారికి సేవ చేసేందుకు జమ్మలమడుగు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అల్లె ప్రభావతి వెల్లడించారు. ఏకపక్షంగా ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారని నియోజకవర్గ నేతలతో మాట్లాడి ప్రకటించాలన్న ఆలోచన జగన్‌కు లేకపోవడం ఎంతో దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
 
రాయచోటి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాధరెడ్డి, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది. రెండుసార్లు టికెట్‌ కోసం ప్రయత్నిస్తే సొంత బావమరిది విజయసాయిరెడ్డే సర్దుబాటు చేసి టికెట్‌ రానీయకుండా చేశారని ఆయన అనుచరుల వద్ద వాపోతున్నారు. ఈసారి వైసీపీ టికెట్‌ ఖచ్చితంగా ఇవ్వాలని లేదంటే వైసీపీ అభ్యర్థి ఓటమికి పనిచేస్తానని ఎవరు టికెట్‌ ఇస్తే ఆ పార్టీలోకి వెళతానని బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇదే అంశాన్ని మీడియాకు కూడా వెల్లడించారు.
 
 
డబ్బున్న వాళ్లు వస్తే అభ్యర్థి అంటే ఎలా..?
రాజంపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆకేపాటి అమర్‌నాధరెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆనాటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా రాజంపేట లోక్‌సభ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలపు సాధించాలని గ్రామస్థాయి పర్యటనలు జరుపుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు సస్పెండ్‌ చేసిన వెంటనే ఎమ్మెల్యే మేడా జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేడా పోటీ చేసేలా జగన్‌ హామీ ఇచ్చారని మేడా అనుచరులు ప్రచారం చేశారు. ఆ తరువాత ఆకేపాటి జగన్‌ను కలిసి చర్చించారు. ఈసారి మేడాకు వైసీపీ టికెట్‌ ఇస్తామని నీకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ పదవి ఇచ్చేల జగన్‌ ఆకేపాటితో చర్చించినట్లు సమాచారం. ఇందుకు తాను రాజకీయాలే తప్ప వేరే ఆలోచన లేదని మేడా కుటుంబం వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేస్తుందని మేడాకే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ పదవి ఇస్తే వారు గౌరవంగా ఉండే అవకాశం ఉంటుందని ఆకేపాటి తేల్చి చెప్పినట్లు తెలిసింది.
 
ఈ నేపధ్యంలో శనివారం రాజంపేట వైసీపీ కార్యాలయంలో బూత్‌ కన్వీనర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కడప లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌, కడప మేయర్‌ సురే్‌షబాబు విచ్చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఆకేపాటి అమరనాధరెడ్డి, పట్టణ కన్వీనర్‌ కోలా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట ఆకేపాటి మాట్లాడుతూ మనమంతా కష్టపడి జగన్‌ను సీఎంగా గెలిపించుకోవాలని ఈ బాధ్యత బూత్‌ కమిటీ కన్వీనర్లేదనని, రాజంపేటలో కూడా వైసీపీ గెలుపు సాధించాలని పేర్కొన్నారు.
 
 
దీంతో వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చి ఆకేపాటి నాలుగున్నర సంవత్సరాలు పార్టీలోనే ఉన్నారు, ప్రతి ఊరు, వాడ తిరిగి పార్టీని బలోపేతం చేశారు, అప్పులు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 24 గంటలు పార్టీ కోసమే అహర్నిశలు శ్రమించారు. కేవలం డబ్బు లేదని సాకు పెట్టి టికెట్‌ నిరాకరించే ప్రయత్నం చేస్తున్నారు. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం అంటూ నేతల ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు టికెట్‌ ఇవ్వకపోతే వైఎస్‌ బొమ్మ పెట్టుకుని ఆకేపాటి పోటీ చేస్తారు. డబ్బున్న వాళ్లు వస్తే అభ్యర్థి అంటే ఎలా అని గట్టిగా నిలదీశారు. జగన్‌ ఎందుకు టికెట్‌ ఇవ్వడో చెప్పాలని పార్టీ కార్యాలయంలో కేకలు, అరుపులతో గందరగోళం సృష్టించారు.
 
ఒకరికొకరు తోసుకుంటూ నేతలను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా ఆకేపాటి కొంత సర్దుబాటు చేయడంతో సురేష్ బాబు మాట్లాడుతూ ఆకేపాటి అనేక పోరాటాలు చేశాడు టికెట్‌ వచ్చేందుకు కృషి చేస్తాం మీ బాధను అధినేత దృష్టికి తీసుకెళతాం, వచ్చే నెల 5న బూత్‌ కమిటీలతో జగన్‌ సమర శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ రోజు జగన్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 31న మేడా జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతుండడం అదేరోజు మరోసారి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆకేపాటికే టికెట్‌ ఇవ్వాలని కోరుతామని కేడర్‌ పేర్కొంది. ఇప్పటి వరకు వైసీపీలో స్తబ్ధుగా ఉన్న నేతలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టికెట్‌ల కోసం పోటీ పడుతుండడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
Link to comment
Share on other sites

రాజధానిలో రాజంపేట రాజకీయం!
30-01-2019 12:31:08
 
636844483469146699.jpg
రాజంపేట: రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు విషయంపై ఆ పార్టీ నాయకులు రాజధాని అమరావతిలో తిష్ట వేశారు. రెండు రోజులుగా టికెట్టు ఆశిస్తున్న ప్రధాన నాయకులు అక్కడే తమ రాజకీయ కలాపాలను వేగిరపరిచారు. ఇందులో భాగంగా మంగళవారం కొంత మంది నేతలు అమరావతిలో రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్‌తో తమ టికెట్టు విషయంపై మంతనాలు జరిపారు. బుధవారం ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుతో మరోసారి టికెట్టు విషయంపై చర్చించడానికి అపాయింట్‌మెంట్‌ కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్టు రేసులో ముందున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్ర సాద్‌, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, రెడ్‌బస్‌ యాప్‌ రూపకర్త చరణ్‌రాజు, రాజు విద్యాసంస్థల అధినేత జగన్‌మోహన్‌రాజు అమరావతిలోనే ఉన్నారు. స్థానికేతరులకు కాకుండా తమకే టికెట్టు కేటాయించాలని రాజంపేటకు చెంది న మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, హరిప్రసాద్‌, కుసుమకుమారి గట్టిగా పట్టుపడుతున్నారు.
 
సోమవారం అర్ధరాత్రి పత్తిపాటి కుసుమకుమారి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి తనకు టికెట్టు ఇవ్వా లని అభ్యర్థించారు. స్థానికులకే టికెట్టు ఇస్తే మంచిదని, మహిళాకోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు టికెట్టు కోసం హైదరాబాదు లోనే మకాం వేశారు. ముఖ్యమంత్రితో టికెట్టు ఆశిస్తున్న నేతలంతా బుధవారం సీఎంతో కలవడానికి జిల్లా నాయకులు అపాయింట్‌మెంట్‌ ఇప్పించారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత టికెట్టు విషయంపై స్పష్టత రానుంది
Link to comment
Share on other sites

మేడా ఇంట.. తమ్ముని మంట..!
30-01-2019 12:22:50
 
636844477706969358.jpg
రాజంపేట: మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ ఫిరాయింపు వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే అదే స్థాయి లో ఆయన సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి అన్న బాటలో నడవకపోవడం కూడా విశేషం సంతరించుకుంది. మేడా మల్లికార్జునరెడ్డికి చిన్నాన్న కుమారుడు మేడా విజయశేఖర్‌ రెడ్డి(బాబు) తాను తెలుగుదేశంలోనే కొనసా గుతానని, ఎవ్వరూ ఎమ్మెల్యే వెంట వెళ్లవద్దని చెప్పడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబంలో ఆయన చిన్నాన్న కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్‌ మేడా బాబు కీలక పాత్ర పోషించేవారు. ఆయన గతంలో తన అన్నతో పాటు అనేక కార్య క్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. సుండుపల్లెలో మండల పార్టీ బాధ్యతలను తన అన్న తరపున గత ఎన్నికల నుంచి నిర్వ హిస్తున్నారు. ఇటీవల సుండుపల్లె అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే మేడా ఎదుటే తమ పనులు కావడం లేదంటూ అక్కడి అధికా రులను గట్టిగా బాబు నిలదీశారు.
 
 
ఒంటిమిట్టలో జరిగిన కల్యాణ మండప నిర్మాణ పను ల్లో తనకు సహకరించడం లేదని అక్కడి అధి కారులపై ప్రధానంగా తహశీల్దార్‌పై చిందు లేశారు. అటువంటి కీలకమైన తమ్ముడు ప్రస్తుత రాజకీయాల్లో అన్న మేడా వెంట లేక పోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల సుండుపల్లె, వీరబల్లినాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తిరిగి మంగళవా రం సాయంత్రం సుండుపల్లె నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎవ్వరూ మేడా మల్లికార్జునరెడ్డి వెంట వెళ్లవద్దని, తాను తెలుగుదేశం పార్టీ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తన అనుచరులతో హైదరాబాద్‌కు వెళ్లి జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునోనున్నారు. ఇటువంటి సమ యంలో కీలకమైన తమ్ముడు విజయ్‌శేఖర్‌రెడ్డి అన్న మేడాకు రాజకీయ ఝలక్‌ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.
 
Tags : meda mallikarjuna reddy, TDP, rajampeta
Link to comment
Share on other sites

రాజంపేటలో బత్యాలకు పెరుగుతున్న మద్దతు

1/31/2019 10:51:38 AM

636845286990908611.jpg

 

  • బత్యాలకు పెరుగుతున్న మద్దతు
  • స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన మహిళా నేత మల్లెల శ్రీవాణి, మార్కెట్‌ చైర్మన్‌ సురేష్‌రాజు, బీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ సుధాకర్‌
  • సీనియర్‌ టీడీపీ నేత డాక్టర్‌ పారా సుబ్బానాయుడు, తదితరులతో మంతనాలు
రాజంపేట, కడప: రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులకు రాజంపేటలో ఘన స్వాగతం లభించింది. ఆయన బుధవారం రాజంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్‌ ఎన్‌టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ జిల్లా తెలుగు మహిళాధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి స్వగృ హానికి చేరుకొని వారి మామ, సీనియర్‌ నాయకుడు మల్లెల సుబ్బరాయుడు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తదనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి డాక్టర్‌ చెన్నూరు సుధాకర్‌తో వారి స్వగృహానికి వెళ్లి వారి సతీమణి మాజీ జడ్పీటీసీ చెన్నూరు సరస్వతి వారి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మండల మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ పారా సుబ్బా నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక మంతనాలు జరిపారు. అంతకుముందు మల్లెల శ్రీవాణి ఇంటికి చేరుకున్న ఆయనకు.. వారి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి అప్పటికప్పుడే బేషరతుగా బత్యాలకు తాము మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. పేదల పక్షపాతిగా, సీనియర్‌ నేతగా జిల్లాలో ఎంతో గుర్తింపు ఉన్న బత్యాల చెంగల్‌రాయులు వెంటే తాము నడుస్తామని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు ఇస్తే గెలిపించుకుంటామని వారు తీర్మానించారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారిన పద్ధతి సరైన తీరు కాదన్నారు.
 
 
మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ సురేష్‌రాజు మాట్లాడుతూ బత్యాల నాయకత్వంలో తాము పనిచేస్తామన్నారు. మేడా మల్లికార్జునరెడ్డి కేవలం డబ్బులతోనే రాజకీయాలు సాధిస్తామనుకోవడం తప్పన్నారు. సీనియర్‌ తెలుగు దేశం నాయకుడు న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బత్యాల రాజంపేటలో ఘన విజయం సాధిస్తారన్నారు. ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమరా వెంకటనరసయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మేడా మల్లికార్జునరెడ్డికి డిపాజిట్‌ దక్కకుండా చేస్తామన్నారు. బత్యాల చెంగల్‌రాయులు రాజంపేట ఎమ్మెల్యే స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌ మాట్లాడుతూ బత్యాల నాయకత్వంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందన్నారు.
 
 
చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా : బత్యాల
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా తాను పనిచే స్తానని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు అన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాజం పేటకు వచ్చానని నియోజకవర్గంలోని సీనియర్‌ నాయకులను, మండల నాయకులను, పార్టీ నేతలను, సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, మండలాధ్యక్షులను, జడ్పీటీసీలను, పార్టీలోని అన్ని కేడర్‌ నాయకులను అన్ని మండలాలకు వెళ్లి కలిసి.. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు. గురువారం రాజంపేటలో పట్టణ, రూరల్‌ టీడీపీ నేతలతో కలిసి ఎన్నికల్లో ఎదుర్కో వాల్సిన వ్యూహాల గురించి, బూత్‌ లెవల్‌లో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట పట్టణ, రూరల్‌ అధ్యక్షులు సంజీవరావు, సుబ్రమణ్యంనాయుడు, మాజీ కౌన్సిలర్‌లు గుగ్గిళ్ల చంద్రమౌళి, మనబోలు వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేతలు శవనం వెంక టసుబ్బానాయుడు, ఎం.వి.రమణ, బీసీ నాయ కులు ఇడి మడకల కుమార్‌, శ్రీరాములు, రెడ్డయ్యనా యుడు, మందపల్లె శ్రీనివాసులు, ఆర్యవైశ్య నాయకులు సత్యనరసింహగుప్త, సునీల్‌, వెంకటనరసయ్య, కొలిమివీధి నాయకులు సూరి తదితరులు పాల్గొన్నారు.

 

 
 
Link to comment
Share on other sites

7 minutes ago, koushik_k said:

Edi gelichina gelavakunna mundu rajampeta gelavali e sari..  e lafoot gadu vodipovalsinde. 

Inthaki extra baggage yanamala uncle DL ki side icchada leda mydukur lo. 

 

Image result for talasani yanamala

Large extra baggage....we junk ni entha twaraga vadhilinchunte antha manchidi party ki and govt ki

Link to comment
Share on other sites

On 1/31/2019 at 6:23 PM, AnnaGaru said:

Rajareddy gadu prati mandal lo rendu faction undelaga chusi pandaga chesadu......chengalarayudu okappudu rajareddy e formula meda poratam chesadu....murder attempt ayyindi....

 

 

I agree narrow escape 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...