Jump to content

వైసీపీలోకి దగ్గుబాటి?


sonykongara

Recommended Posts

వైసీపీలోకి దగ్గుబాటి?
14-01-2019 02:57:04
 
636830466712771243.jpg
  • కుమారుడికి పర్చూరు టికెట్‌
  • విజయసాయిరెడ్డి దౌత్యం
  • పురందేశ్వరి బీజేపీలోనే!!
  • వైసీపీ ఫ్లెక్సీలపై దగ్గుబాటి, తనయుడు హితేశ్‌ ఫొటోలు
ఒంగోలు(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన ఏకైక కుమారుడు హితేశ్‌ చెంచురామ్‌ ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా సమాయత్త్తమవుత్నుట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలంగా దగ్గుబాటి, వైసీపీ అధినేత జగన్‌ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పార్టీలో దగ్గుబాటి చేరిక ఖాయమైందని వైసీపీలోని ఉన్నత స్థాయి నాయకులు చెబుతున్న సమయంలోనే పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఆయన అభిమానులు వైసీపీ ఫ్లెక్సీలపై దగ్గుబాటి, ఆయన కుమారుడి ఫొటోలు ఉంచి సోషల్‌ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే, ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి భార్య పురందేశ్వరి అందులోనే ఉంటారని తెలుస్తోంది.
 
 
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీని వీడి 2004లో భార్యతోపాటు కాంగ్రె్‌సలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా.. పురందేశ్వరి బాపట్ల, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి విజయం సాధించి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల నుంచి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
 
అనంతరం పురందేశ్వరి బీజేపీలో చేరి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నుంచి దగ్గుబాటిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడికి పర్చూరు అసెంబ్లీ సీటుతోపాటు, పురందేశ్వరికి కోరుకున్న లోక్‌సభ టికెట్‌ ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపినట్లు తెలిసింది. దీనిపై దగ్గుబాటిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...