Jump to content

రాష్ట్రంలో రెండు దశలు!


sonykongara

Recommended Posts

రాష్ట్రంలో రెండు దశలు!

 

తెలంగాణలో ఒకే విడతలో పోలింగ్‌
  ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌?
  లేదంటే మార్చి మొదటివారంలో...
  వచ్చే వారం నుంచి ఈసీ రాష్ట్రాల పర్యటన
  మే 24వ తేదీలోగా ఎలక్షన్‌ ప్రక్రియ పూర్తి
  ఓటు హక్కుపై ఈ నెల 25 లేదా 26 నుంచి ప్రచారం
  1950కి ఫోన్‌ చేసి ఓటు వివరాలు తెలుసుకోవచ్చు
  సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు
ఈనాడు - హైదరాబాద్‌

13ap-amin5a.jpg

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ ఏడాది మే నెల చివరి వారంలోగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో, తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అంశంపై ఆలోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం బృందాల వారీగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. వివిధ రాష్ట్రాల బోర్డు పరీక్షల తేదీలపైనా ఆరా తీసింది. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో రెండు రోజుల పాటు సమీక్షించింది. ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను జారీచేసింది. పోలింగ్‌ సమయంలో ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఓటర్లలో చైతన్యం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ మూడోతరం ఈవీఎంలను వినియోగించింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈవీఎంల తరలింపు సందర్భంగా ఎదురైన సమస్యలపైనా సమీక్షించింది. 2014 ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి నెల అయిదో తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 14వ తేదీన ప్రకటన జారీ చేసింది. తొమ్మిది దశల్లో పోలింగ్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ ఏడో తేదీన తొలిదశ పోలింగ్‌ జరగ్గా.. మే 12న చివరిదైన తొమ్మిదో విడత పోలింగ్‌ జరిగింది. మే 16న ఓట్ల లెక్కింపు చేపట్టి 28వ తేదీనాటికి ఎన్నికల ప్రక్రియ అంతటినీ పూర్తి చేసింది. ఈదఫా కూడా మే నెల 24వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

గణతంత్ర దినోత్సవం నుంచి ప్రచారం!
ఓటు ఉందా? లేదా? అన్న అంశంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర విభాగాలు 1950 నంబరుతో కాల్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే ఓటుకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలన్నది ఎన్నికల సంఘం వ్యూహం. జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25వ తేదీ లేదా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన కానీ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ రెండు రోజుల్లో ఏ తేదీన ప్రారంభించాలన్న విషయంపై వచ్చే వారంలోగా   ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1950 నంబరు కాల్‌ సెంటర్‌ను 30 మందితో నిర్వహించారు. త్వరలో చేపట్టే ప్రచారానికి ఆ కాల్‌ సెంటర్‌ను మరింత విస్తృతం చేయటంతోపాటు ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి పేర్లు, ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రచారం నిర్వహించే రోజుల్లో ఆయా అధికారులు ప్రజల నుంచి వచ్చే ఫోన్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఈసీ బృందం పర్యటన తరువాతే..

తెలంగాణ రాష్ట్రంలో ఒకే దశలో లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినందున ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులున్నట్లు ఎన్నికల సంఘం భావిస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటంతోపాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నందున రెండు దశల్లో జరపాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తోంది. ఎన్నికల సంఘం బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన తర్వాత ఒకదశలోనా? రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

30 minutes ago, Hello26 said:

Modi gadi strategy yedo vundi vutundi deeniki kuda to help out YCP + JS + TRS. Voohaku andani plans vestaru veellu. Mana vallu can't even imagine

Plan emundi, 1st phase ayyaka, Ycp ki better chances అని ప్రచారం చేసి 2nd phase better avvochu ani plan.. 

Link to comment
Share on other sites

23 minutes ago, ramntr said:

Plan emundi, 1st phase ayyaka, Ycp ki better chances అని ప్రచారం చేసి 2nd phase better avvochu ani plan.. 

1st phase seema+Nellore along with telangana, 2nd phase rest of andhra.

Link to comment
Share on other sites

50 minutes ago, RKumar said:

1st phase seema+Nellore along with telangana, 2nd phase rest of andhra.

Hehehe....I think this tells the story of why they (Election Commission + Modi) have planned for polling in CostalAndhra as the last phase.

TG lo TRS + MIM will do good. RS lo Jagan is usually strong (Kadapa, Kurnool & Chittor). --- these are in the 1st phase.

Then 2nd phase lo vunna Andhra/Costal lo usual ga TDP strong. So, ikkada poll management meeda TRS+YCP+JS+BJP baga focus pettachu where these guys are weaker compared to TDP. 

Link to comment
Share on other sites

3 hours ago, Hello26 said:

Modi gadi strategy yedo vundi vutundi deeniki kuda to help out YCP + JS + TRS. Voohaku andani plans vestaru veellu. Mana vallu can't even imagine

Indulo strategy emundi bro Election officers ni nayano bhayano longadeesukuni poll ni rig chestaru. EVM lu lekunda anni niyojaka vargallo TDP valle padi mandi dummy candidates ni nilabedithe sari

Link to comment
Share on other sites

8 hours ago, Hello26 said:

Hehehe....I think this tells the story of why they (Election Commission + Modi) have planned for polling in CostalAndhra as the last phase.

TG lo TRS + MIM will do good. RS lo Jagan is usually strong (Kadapa, Kurnool & Chittor). --- these are in the 1st phase.

Then 2nd phase lo vunna Andhra/Costal lo usual ga TDP strong. So, ikkada poll management meeda TRS+YCP+JS+BJP baga focus pettachu where these guys are weaker compared to TDP. 

Yes pushpalu best in playing such poll management tactics but ivanni govt paina anti unnappudu mathramee workout avuthai 

Govt paina anti lenappudu edooo cheddam ani pulihora kadhalu chestheee telangana type of results vasthai CBN knows this very well so he will go for elections with implementing one or more blasting schemes like pension increase 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...