Jump to content

Development Works AP


Yaswanth526

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 106
  • Created
  • Last Reply

కురిచేడు రోడ్డులోని ఎర్రచెరువు వద్ద రూ.1.33 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌ను మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ ఎన్టీఆర్‌ పల్లెవనం పార్కును ఏర్పాటు చేశామన్నారు. #NTRPallavanamPark

https://pbs.twimg.com/media/D0fFxEzU8AAoHLV.jpg

https://pbs.twimg.com/media/D0fFxnKUwAA0JZd.jpg

Link to comment
Share on other sites

https://election.eenadu.net/fullstory.php?date=2019/03/27&newsid=73576&secid=3607&title=

హైటెక్‌ ఆంధ్ర

ఐటీ స్వప్నం.. అవుతోంది సాకారం!
నవ్యాంధ్రలో నవ విప్లవం
ప్రతికూల పరిస్థితుల్లోనూ పెట్టుబడుల హోరు
ఐదేళ్లలోనే ఎలక్ట్రానిక్స్‌లో ముందంజ
సిరికి సూర్యనారాయణ, బీఎస్‌ రామకృష్ణ
ఈనాడు - అమరావతి, విశాఖపట్నం

26election12a.jpg

చంద్రబాబు అంటే ఐటీ బ్రాండ్‌...
ఆయన కృషితోనే హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీ, అంతర్జాతీయ ఖ్యాతి దక్కాయి. ఇప్పుడాయన ఏపీ తొలి ముఖ్యమంత్రి. మరి ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ఆయనేం చేశారు? ఆయన ఎక్కడుంటే అక్కడికి ఐటీ కంపెనీలు వస్తాయనే నమ్మకాన్ని నిజం చేశారా? చూద్దాం రండి..

26election12j_1.jpg

విభజనతో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తగిన మౌలిక వసతులు కల్పించగలరా? మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ప్రోత్సాహకాలు అందించగలరా? నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయా? అనేవి ఎవరికైనా వచ్చే సందేహాలు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్‌. కాండ్యుయెంట్‌, డబ్ల్యూఎన్‌ఎస్‌, కాన్‌సెన్‌ట్రిక్స్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, హెచ్‌సీఎల్‌ వంటి ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థలు, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఫాక్స్‌కాన్‌, డిక్సిన్‌, సెల్‌కాన్‌, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి కంపెనీల రాకతో ఈ రంగంలో దేశంలోనే అగ్రస్థానం కోసం పోటీపడుతోంది.

26election12i_1.jpg

గన్నవరం మేధా టవర్స్‌ నిండింది

26election12h_1.jpg

* హెచ్‌సీఎల్‌ కంపెనీ రాకతో ఐటీ రంగంలో అమరావతి ప్రత్యేక స్థానాన్ని సాధించింది. గన్నవరంలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న మేధా టవర్స్‌లోని రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో గత రెండున్నరేళ్లలో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. హెచ్‌సీఎల్‌ భాగస్వామ్య కంపెనీ ‘స్టేట్‌ స్ట్రీట్‌’ లాంటి దిగ్గజ కంపెనీ మేధా టవర్స్‌లో కొలువుదీరింది. మరో 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థల విస్తీర్ణంతో మేధా టవర్స్‌ పక్కనే మరో భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

విశాఖపట్నం
మధురవాడ కొండల్లో.. సిలికాన్‌ వ్యాలీలు

26election12g_1.jpg

26election12f.jpg

ఐటీ రంగంలో విశాఖకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఐదేళ్లలో ఇక్కడ వందకు పైగా  సంస్థలు ఏర్పాటయ్యాయి. 15 వేల మందికి ఉపాధి లభించింది. రాబోయే రెండేళ్లలో మరో 15 వేల ఉద్యోగాలు వచ్చేలా పలు ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాండ్యుయెంట్‌, పేటీఎం తదితర సంస్థలు కార్యకలాపాలు ఆరంభించాయి. తాజాగా అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడి అంచనా వ్యయంతో మధురవాడ సమీపంలోని కాపులుప్పాడలో డేటాపార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
* ఫైనాన్షియల్‌ టెక్నాలజీ అవసరాలు పెరుగుతుండటంతో ఇక్కడి ఐ.టి.హిల్స్‌పై ఫిన్‌టెక్‌ సంస్థ ‘ఫిన్‌టెక్‌ టవర్‌’ను ప్రారంభించింది

26election12c_1.jpg

 

26election12b.jpg

 

26election12e.jpg

మంగళగిరి సాంకేతిక హారతి

26election12d.jpg

గన్నవరానికి అనుబంధంగా మంగళగిరి మినీ ఐటీ కేంద్రంగా మారుతోంది. పైకేర్‌, ఇన్వికాస్‌ సహా అనేక కంపెనీలు కొలువుదీరాయి. ముఖ్యంగా అంకుర సంస్థలకు ఈ పట్ణణం ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

రూ.12,250 కోట్లు.. 128 ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు

* ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.25,461 కోట్ల పెట్టుబడులతో 376 కంపెనీలు ఏర్పాటు చేసి, 2.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక.
* ఇప్పటివరకు రూ.12,250 కోట్ల పెట్టుబడితో 128 కంపెనీలు ఏర్పాటయ్యాయి. లక్ష మందికిపైగా ఉపాధి లభించింది.
* రిలయన్స్‌, టీసీఎల్‌, వోల్టాస్‌ వంటి దిగ్గజ కంపెనీలు రూ.8,750 కోట్ల పెట్టుబడులతో తిరుపతిలో యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి.
* రిలయన్స్‌ ఆధ్వర్యంలో 150 ఎకరాల్లో ఏర్పాటయ్యే యూనిట్‌లో రోజూ పది లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్‌ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తయారు చేయనున్నారు. 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
దేశంలో తయారయ్యే ప్రతి ఐదు మొబైళ్లలో ఒకటి ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది
అనంతపురం జిల్లాలో ‘బెంగళూరు ప్లస్‌’ పేరుతో ఐటీ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
శ్రీసిటీలో తైవాన్‌కి చెందిన ఫాక్స్‌కాన్‌ కంపెనీ రూ.200 కోట్లతో మొబైళ్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది.  ఇందులో సెకనుకు ఓ మొబైల్‌ తయారు చేయాలనేది లక్ష్యం.
శ్రీసిటీలోనే ఫ్లెÆక్స్‌ట్రానిక్స్‌ సంస్థ మొబైళ్ల తయారీ యూనిట్‌ ఆరంభమైంది.
ఏపీలోని ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల ఉత్పత్తులు చైనా, తైవాన్‌, కొరియా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
విశాఖపట్నంలో వైద్య ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

తిరుపతి

26election12m_1.jpg

26election12k_1.jpg

26election12l_1.jpg

26election12o.jpg

26election12n_1.jpg

తిరుపతిలో 113.27 ఎకరాల్లో 2 ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లను అభివృద్ధి చేశారు. సెల్‌కాన్‌, కార్బన్‌ మొబైల్‌ ఫోన్లు ఇక్కడే తయారవుతున్నాయి.
చిత్రాలు: ఈనాడు ఫొటోగ్రాఫర్ల యంత్రాంగం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...