Jump to content

dwcra మహిళలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ


sonykongara

Recommended Posts

డ్వాక్రా మహిళలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ 

 

ఫిబ్రవరి మొదటి వారంలో చెల్లించనున్న ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా మహిళలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల వడ్డీ మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2016 ఆగస్టు నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.2200 కోట్ల మొత్తాన్ని ఫిబ్రవరి మొదటివారంలో అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 94 లక్షల మంది స్వయం సహాయ సంఘ మహిళలు గ్రామీణ, పట్టణ పరిధిలో ఉన్నారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలను మంజూరు చేయిస్తోంది. అయితే నెల వారీగా కంతుల చెల్లింపులో భాగంగా మహిళలు అసలుతోపాటు తీసుకున్న మొత్తంపై వడ్డీ కూడా బ్యాంకులకు చెల్లిస్తారు. సభ్యులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం నెల వారీగా డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ప్రతి నెలా రూ. 75 కోట్ల వరకు చెల్లించాల్సిన ప్రభుత్వం విడతల వారీగా చెల్లింపులు చేస్తోంది. తెదేపా అధికారం చేపట్టిన నాటి నుంచి 2016 జులై వరకు వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్లు మేర చెల్లించింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 2016 ఆగస్టు నుంచి చెల్లింపులు జరగలేదు. అప్పటినుంచి చెల్లించాల్సిన మొత్తం రూ.2200 కోట్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Link to comment
Share on other sites

డ్వాక్రా చెల్లెమ్మలకు.. 10వేలు, స్మార్ట్‌ ఫోన్‌ 

 

26న ఆ సంఘాల   మహిళలతో బహిరంగసభ 
అప్పుడే విధివిధానాల ప్రకటన 
ముఖ్యమంత్రి నిర్ణయం 
ఈనాడు - అమరావతి

19ap-main3a_4.jpg

స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా గ్రూపుల) మహిళలు ఒక్కొక్కరికీ పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. వీరికి స్మార్ట్‌ ఫోన్‌ కూడా అందించనున్నారు. రూ.10వేల ఆర్థిక సాయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈనెల 26న స్వయం సహాయక సంఘాల మహిళలతో బహిరంగ సభ ఏర్పాటుచేసి అందులోనే ఈ నిర్ణయాల్ని ప్రకటించాలని సీఎం సూత్రప్రాయంగా నిర్ణయించారు. మొదటి నుంచీ తెలుగుదేశం హయాంలో మహిళా సంఘాలకు అమిత ప్రాధాన్యం లభిస్తోంది. 2014లో అధికారంలోకొచ్చాక సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున అందించారు. ఒకేసారి కాకుండా నాలుగు విడతల్లో పంపిణీ చేశారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కింద నిధులు విడుదల చేస్తున్నా... 2016 ఆగస్టు నుంచి ఆ మొత్తం పెండింగ్‌లో ఉంది. ఈనెల వరకు ఇది రూ.2,300కోట్లకు చేరుకుంది. ఇది కూడా ఒకేసారి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కూడా 26వ తేదీన నిర్వహించే బహిరంగ సభలోనే వెల్లడించనున్నారు.

తాజాగా ఒక్కొక్కరికీ అందించే  రూ.10వేలు... రెండు విడతల్లో ఇవ్వాలా, మూడు విడతల్లోనా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆర్థిక వనరుల లభ్యతనుబట్టి ఇది ఆధారపడుతుంది. కనీసం రెండు విడతలు, గరిష్ఠంగా మూడు విడతల్లో పంపిణీ చేసే అవకాశం  కనిపిస్తోంది. రెట్టింపు చేసిన పింఛన్ల మొత్తంతోపాటు మహిళా సంఘాలకు తొలివిడత    మొత్తాన్ని కూడా ఫిబ్రవరిలోనే అందించనున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌తో సమాచార విప్లవం 
సమాచార మార్పిడికి, విషయ సేకరణకు స్మార్ట్‌ ఫోన్‌ అత్యున్నత సాధనంగా మారిన నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ స్మార్ట్‌ ఫోన్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనప్రాయంగా వివిధ వేదికలపై వెల్లడించారు. ఎలా ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో కూడా ఇప్పుడు స్పష్టత వస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్ల కొనుగోలుకి టెండర్లు పిలిచినట్లు సమాచారం. రెండు సంస్థలతో ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. సెల్‌ఫోన్‌ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు దాన్ని రీఛార్జ్‌ కూడా చేయించాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై కూడా 26వ తేదీ సమావేశం నాటికి స్పష్టత రానుంది.

19ap-main3b_1.jpg

 

Link to comment
Share on other sites

డ్వాక్రాకు భారీ నజరానా
20-01-2019 02:45:04
 
  • ఆడపడుచులకు రూ.9 వేల కోట్ల వరం
  • పసుపు కుంకుమ కింద మరో పది వేలు
  • 93 లక్షల మంది మహిళలకు తక్షణ లబ్ధి
  • కీలక నిర్ణయం తీసుకొన్న రాష్ట్ర సర్కార్‌
  • 1,2, 3 తేదీల్లో చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు రూ.9 వేల కోట్ల భారీ నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘాలకు మరింత ఆర్థిక పరిపుష్టి చేకూర్చి వాటిని బలోపేతం చేసే నిమిత్తం ఈ సాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు వంతున పసుపు కుంకుమ పథకం కింద ఈ సాయం అందనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 93 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 9లక్షల పైచిలుకు సంఘాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 7.25లక్షల సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో 2లక్షల సంఘాలు ఉన్నాయి.
 
 
వీటన్నింటిలో సభ్యులకు ఈ సాయం ఇస్తారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘పసుపు కుంకుమ’ కింద చెక్కులను ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పసుపు కుంకుమ కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలకు ఇంతకుముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం తలకు రూ.10 వేలు ఇచ్చింది. ఆ మొత్తాన్ని మూడు విడతలు చేసి ఏడాదికి ఒక విడత చొప్పున ఇచ్చారు. ఆ రకంగా ఇంతకు ముందు రూ.11వేల కోట్లు చెల్లించారు. ఇప్పుడు అదే మొత్తాన్ని రెండు నెలల వ్యవధిలోనే ఇవ్వనున్నారు. ఈ మొత్తం రూ.9వేల కోట్ల పై చిలుకు ఉంటోంది. అంటే నాలుగేళ్ల వ్యవధిలో డ్వాక్రా సంఘాలకు రూ.20వేల కోట్ల సాయం అందుతుందన్నమాట! ఈ స్థాయిలో మహిళా సంఘాలకు సాయం అందించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
 
 
వందల్లోంచి వేలల్లోకి...
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉండగా ఈ సంఘాలకు రూ.250 కోట్లు సాయం ఇచ్చారు. ఇప్పుడు ఈ సాయం మొత్తాన్ని ఏకంగా 20 వేల కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డ్వాక్రా సంఘాలు బలోపేతం అయ్యాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సాయం వాటిని మరింత బలపడేలా చేస్తుందని అంటున్నారు. తొలి విడత పసుపు కుంకుమ సాయం నిద్రాణంగా ఉన్న చాలా సంఘాలను క్రియాశీలం చేసింది. ఆ డబ్బును ఆసరాగా చేసుకొని అనేక సంఘాలు మళ్లీ రుణాలు తీసుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాయు. ఈ సంఘాల నుంచి చెల్లింపులు కూడా పక్కాగా ఉండటంతో బ్యాంకులు కూడా తేలిగ్గానే రుణ సహాయం చేస్తున్నాయి. రెండో విడత సాయం ఈ సంఘాల సభ్యుల్లో టీడీపీ ప్రభుత్వంపై సానుకూలతను బాగా పెంచుతుందని, రానున్న ఎన్నికల్లో దీని ఫలితం కనిపిస్తుందని ప్రభుత్వ పక్షం ఆశిస్తోంది.
 
 
మూడు విడతలుగా..
మూడు విడతలుగా చెల్లింపులు జరిగేలా చెక్కులు అందిస్తారు. ఒక చెక్కుకు సంబంధించిన డబ్బు ఇప్పుడు వెంటనే అందుతుంది. మిగిలిన రెండు విడతల చెక్కులపై ముందుగానే తేదీలు ముద్రించి ఉంటాయి. రెండు నెలల్లో అంటే మార్చి నెలాఖరులోపు ఈ డబ్బు పూర్తిగా డ్వాక్రా మహిళలకు అందుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రెండు సార్లు బ్యాంకుల అధికారులతో ఈ అంశంపై చర్చించారు.
 
 
ఆ స్వేచ్ఛ సంఘాలకే..
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బును ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛను ఆయా సంఘాలకే వదిలేయనున్నారు. దీనిని సీడ్‌ మనీగా పెట్టుకొని దానికి ఐదింతల వరకూ కొత్త రుణాలు తీసుకొనే అవకాశం కూడా ఆయా సంఘాలకు ఉంది. అలా తీసుకోవాలా లేక సభ్యుల మధ్య ఎవరి డబ్బు వారికి పంపిణీ చేసుకోవాలా అన్నది ఎక్కడికక్కడ సంఘాలే నిర్ణయించుకొంటాయి.
Link to comment
Share on other sites

94 లక్షల డ్వాక్రా మహిళలకు10,000 రూపాయల బహుమతి పసుపు కుంకుమ పథకం కింద... ఫిబ్రవరి -రూ. 2500/- (డబ్బు రూపంలో) మార్చ్ -రూ. 3500/- (ఇప్పుడే ఇస్తారు పోస్ట్ డేటెడ్ చెక్) ఏప్రిల్ - రూ.4000/-(ఇప్పుడే ఇస్తారు, పోస్ట్ డేటెడ్ చెక్)

Link to comment
Share on other sites

15 minutes ago, niceguy said:

Post dated ante ee dates vuntai..

May tharvatha dates ayithe :P

 

Akkada clearga undiga ఫిబ్రవరి -రూ. 2500/- (డబ్బు రూపంలో) మార్చ్ -రూ. 3500/- (ఇప్పుడే ఇస్తారు పోస్ట్ డేటెడ్ చెక్) ఏప్రిల్ - రూ.4000/-(ఇప్పుడే ఇస్తారు, పోస్ట్ డేటెడ్ చెక్)

 

 

Feb 15gth tarvata any time election code will kickin maybe anduke 

Link to comment
Share on other sites

అన్నగా నేనున్నా!
26-01-2019 03:32:00
 
636840703214530640.jpg
  • అప్పు చేసైనా అక్కచెల్లెళ్లకు రూ.10 వేలు
  • రెండు నెలల్లో ఖాతాల్లో జమ చేస్తా
  • నిరంతరంగా పసుపు-కుంకుమ పథకం
  • దేవుడు 94 లక్షల ఆడబిడ్డలను ఇచ్చాడు
  • ఇంకో 6 లక్షల మంది చేరితే కోటి సైన్యం
  • 1.40 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ ఫోన్లు
  • ‘స్థానికం’లో ఇద్దరు పిల్లల క్లాజ్‌ తొలగిస్తాం
  • వెలుగు సిబ్బందికి 30 శాతం జీతం పెంపు
  • టీడీపీ గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయ్‌
  • డ్వాక్రా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి
  • అమరావతి, కడప, విశాఖల్లో ప్రసంగం
 
చెల్లింపు ఇలా..
ఫిబ్రవరి 1న రూ.2,500, మార్చి 8న రూ.3,500, ఏప్రిల్‌ 5న రూ.4 వేలు చొప్పున ఇస్తారు. ముందుగానే చెక్కులిస్తారు. ఆయా తేదీల్లో మహిళలు డబ్బులు డ్రా చేసుకునేలా చర్యలు తీసుకుంటారు.
 
 
ఐదు రిటర్న్‌ గిఫ్టులు ఇద్దాం
‘నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆయనకు ఒకటి కాదు.. ఐదు రిటర్న్‌ గిఫ్టులు ఇద్దాం. మనల్ని కించపరుస్తూ కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా తిడుతున్నారు.’
-చంద్రబాబు
 
 
 
అమరావతి/కడప/విశాఖ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘అన్నగా మీకు నేనున్నాను.. అప్పు చేసైనా అక్కచెల్లెళ్లకు అండగా నిలబడతాను. కొండనైనా బద్దలు చేసే శక్తి నా ఆడబిడ్డలు నాకు ఇచ్చారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రక్తసంబంధం లేకపోయినా మనకు రుణానుబంధం ఉందన్నారు. భగవంతుడు 94 లక్షల మంది ఆడబిడ్డలను తనకిచ్చాడని చెప్పారు. ‘రానున్న 75 రోజులు కష్టపడి పనిచేయండి, చేసిన అభివృద్ధి చెప్పే బాధ్యత మీదే.. గ్రామాల్లో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అని మహిళలకు పిలుపిచ్చారు. శుక్రవారం ఒకేరోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులతో ఏర్పాటుచేసిన సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. అమరావతిలోని నేలపాడులో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన డ్వాక్రా సభ్యులు; కడప మున్సిపల్‌ మైదానంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల డ్వాక్రా మహిళలు; విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల స్వయంసహాయ బృందాలతో జరిగిన ఈ భారీ సమ్మేళనాల్లో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
 
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి డ్వాక్రా సంఘాలకుందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే పసుపుకుంకుమ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. దేవుడు దయతలిస్తే ఇది నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. చెల్లెళ్లంతా ఆనందంగా ఉండాలంటే అన్న అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. తప్పుడు విమర్శలు చేస్తున్న వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. విమర్శలు చేసేవారు హైదరాబాద్‌లో ఉంటారని.. వారి భరతం పట్టాలన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
 
కనీసం ఒకరినైనా కనాలి..
‘ప్రతి ఒక్కరూ ఒకే బిడ్డను కనాలని గతంలో నేనే చెప్పాను. సంపూర్ణ కుటుంబ నియంత్రణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పుడు యువత పరిస్థితి మారింది. కొందరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మరికొందరు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. కనీసం ఒకరినైనా కనాలి. మన దేశ విశిష్ట గౌరవం కుటుంబ వ్యవస్థ. పంచాయతీలో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల లోపే ఉండాలన్న నిబంధనను తొలగించాలని నిర్ణయించాం.’
 
 
సంఘాలవారీగా స్మార్ట్‌ ఫోన్లు
‘త్వరలో 1.40 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ ఫోన్లు అందిస్తాం. స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ కార్యక్రమం డ్వాక్రా సంఘాలతోనే ప్రారంభిస్తాం. ముందుగా రాష్ట్ర సమాఖ్య, తర్వాత జిల్లా సమాఖ్య, మండల సమాఖ్యలు, అనంతరం డ్వాక్రా సంఘాల వారీగా పంపిణీ చేపడతాం. 40 రోజుల్లో ఫోన్ల పంపిణీ జరుగుతుంది. డ్వాక్రా మహిళలు కూడా పారిశ్రామికవేత్తలు కావాలి. 10 లక్షల సంఘాలు 10 లక్షల విజన్‌ డాక్యుమెంట్లు చేయాలి. మనం చేసే పనులు వినూత్నంగా ఉండాలన్నారు. 94 లక్షల మందితో జవాబుదారీతనంతో పనిచేయిస్తే ఆదాయం వస్తుంది. టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలి. మండలానికో ఎంఎ్‌సఎంఈ కేంద్రాలు పెడుతున్నాం. వీటిలో డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యమిస్తాం. మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ప్యాకింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ చేస్తాం. దేశవిదేశాలకూ ఎగుమతి చేస్తాం. గతంలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు 30 శాతం వడ్డీతో ప్రజల్ని పీక్కుతింటున్నప్పుడు తిరగబడాలని పిలుపిచ్చింది నేనే. గతంలో ఐదేళ్ల వైఎస్‌ ప్రభుత్వంలో మహిళా సంఘాలకు రూ.200 కోట్లు ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ.21 వేల కోట్లు మహిళా సంఘాలకు అందించాం.’
 
 
ఇంటికి పెద్ద కొడుకుగా పింఛన్లు
‘చరమాంకంలో పిల్లలు సరిగ్గా చూడడం లేదు. అందుకే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం. ఇంటికి పెద్ద కొడుకుగా పింఛను మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2వేల వరకు పెంచాను. గతంలో రూ.200 ఇచ్చి 200 సార్లు చెప్పుకొన్నవారున్నారు. రాష్ట్రంలో 55 లక్షల మందికి రెట్టింపు పింఛన్లు ఇచ్చేందుకు రూ.14 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మా ఇంట్లో ఎవరూ పట్టించుకోవడంలేదన్నవారే.. రెట్టింపు పెన్షన్‌తో నేడు కోడళ్లు బాగా చూసుకుంటున్నారని చెబుతున్నారు.
 
 
94 లక్షల సైన్యం నాకు అండ..
‘డ్వాక్రా నా మానస పుత్రిక. స్థాపించి.. పోషించి.. ప్రోత్సహించాను. ఇది నా వ్యక్తిగత విజయమే. ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. 23 ఏళ్లలో 94 లక్షల మంది డ్వాక్రా సభ్యులయ్యారు. మరో ఆరు లక్షల మంది చేరితే కోటి మంది సైన్యం నాకు అండగా ఉంది. అప్పట్లో దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చిన తొలి రాష్ట్రం మనదే. మహిళలకు గ్యాస్‌ ఇస్తే అడ్డుపడిన వారంతా 1999లో ఓటమిపాలయ్యారు. అక్కలు, చెల్లెళ్లు అండగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. నాలుగున్నరేళ్లలో ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేల చొప్పున అందజేశాను. ఇప్పుడు ఇంకో పది వేలు అందించాలని నిర్ణయించాను. దీనికి రూ.9,400 కోట్ల వ్యయమవుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా చెక్కుల రూపంలో అందజేస్తాం. రాబోయే రెండు నెలల్లో రూ.10 వేలు మీ ఖాతాల్లో జమచేస్తాం. పసుపు-కుంకుమ కింద మొత్తం రూ.21,116 కోట్లు ఇచ్చాను.’
 
 
మిమ్మల్ని చూస్తుంటే అభిమానం పొంగుతోంది..
‘అన్ని జిల్లాల నుంచి వచ్చిన చెల్లెమ్మలు, అక్కలను చూస్తుంటే అభిమానం పొంగిపోతోంది. ముఖ్యమైన సంఘ నాయకులంతా ఉన్నారు. జిల్లా సమాఖ్యల నాయకురాళ్లు నాకు ఎంతో అభిమానమైనవారు. ఇంత పెద్ద ఎత్తున ఆడబిడ్డలకు అన్నగా ఉండడం ఎంతో గర్వపడుతున్నాను. ఒకరిద్దరు కాదు.. 94 లక్షల మంది అక్కచెల్లెళ్లు ఉండడం నిజంగా ఆనందంగా ఉంది. పసుపు కుంకుమ ఇస్తే మీరు ఆనందంగా ఉన్నారా..? మిమ్మల్ని చూస్తుంటేనే ఆనందంగా ఉన్నారనేది అర్థమవుతోంది. నా జన్మ చరితార్థమైంది. ఏ నాయకుడైనా మీ అభిమానం, మీ ఆదరణ కోసమే పనిచేస్తాడు. మీరు కూడా మేం చేసిన పనుల పట్ల ఆనందంగా ఉంటే అంతకంటే సంతోషం లేదు. మీరు ఆనందంగా ఉండాలంటే.. అన్న అధికారంలో ఉండాలి. గతంలో పసుపు కుంకుమ కింద రూ.8600 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.2500 కోట్లు.. మొత్తం రూ.11,118 కోట్లు డ్వాక్రా సంఘాలకు అందించాం. ఈ నాలుగున్నరేళ్లలో వడ్డీ లేని రుణాలు రూ.67,500 కోట్లు అందించి చరిత్ర సృష్టించాం.’
 
 
ఆడబిడ్డలకు ఎన్నెన్నో..
‘ఆడబిడ్డలకు సైకిళ్లు, శానిటరీ ప్యాడ్స్‌ ఇస్తున్నాం. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతిదానికీ ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నాం. ప్రసవ సమయంలో రూ.ఆరు వేలు ఇస్తున్నాం. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, పౌష్టికాహారం కోసం బాలామృతం, పిల్లల కోసం ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ అందిస్తూ మహిళలను గౌరవిస్తున్నాం. పిల్లల తల్లులకు వందనాలు. చదువు కోసం జ్ఞానభూమి, సైకిళ్లు, విదేశీ విద్య కోసం పది నుంచి రూ.15 లక్షలు, యువతకు నిరుద్యోగ భృతి, సీఎం యువనేస్తం, ఆదరణ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద అందించే సాయాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నాం. ప్రతి ఆడబిడ్డకు సొంత ఇల్లు ఒక కల. ఇప్పటివరకు మహిళల పేరిట 27 లక్షల ఇళ్లు నిర్మించాం. ఇది ధనిక రాష్ట్రాలకు కూడా సాధ్యంకాలేదు. మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటే అభివృద్ధిలో నడిపించే బాధ్యత నాదే. చివరకు ప్రకృతి సేద్యంలో కూడా మన మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు.’
 
 
మీ వాళ్లెవరైనా ఇచ్చారా..?
‘మీ అమ్మ.. నాన్న.. మీ భర్త.. ఎవరైనా రూ.20 వేల డబ్బులిచ్చి స్వేచ్ఛ ఇచ్చారా? మీకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా ఆదుకోవడానికి నేనున్నాను. రూ.20 వేలు మీ చేతిలో పెట్టేందుకు రూ.21 వేల కోట్లు కేటాయించాను. ఇంకా ఇస్తాను. ఆర్థికంగా బలపడడంతో మీలో ధైర్యమొచ్చింది. సమాజ సేవతో ఊళ్లలో నాయకురాళ్లుగా ఎదిగారు. ఈ రోజు డబ్బు ఇవ్వడం కాదు.. సంపాదన నేర్పుతున్నాను. ఆత్మగౌరవంతో మీ కుటుంబానికి సాయం చేయవచ్చు.’
 
 
వెలుగు ఉద్యోగులకు అన్నీ..
‘డ్వాక్రా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వెలుగు ఉద్యోగుల జీతాలు 30 శాతం పెంచుతున్నాం. వారికి హెల్త్‌కార్డు, ప్రమాదబీమా, మెడికల్‌ లీవ్‌లు ఇస్తాం. వేతనంపై హెచ్‌ఆర్‌, ఈపీఎఫ్‌ మంజూరుచేస్తాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫారసుల మేరకు చర్యలు తీసుకుంటాం.’
 
 
టీడీపీ గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయ్‌
‘మరో 75 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మనం గెలిస్తేనే ఈపథకాలు కొనసాగుతాయి. మీగురించి ఆలోచించే వారికోసం మీరు ఆలోచించండి. మన పిల్లలు, వారి భవిష్యత్‌ కోసం మళ్లీ మనమే రావాలి. రాష్ట్ర విభజన వల్ల ఆదాయం తెలంగాణకు.. అప్పులు మనకు వచ్చాయి. కేంద్రం సహకరించకున్నా ఈ ఐదేళ్లలో నిలదొక్కుకున్నాం. పదేళ్లు కష్టపడితే దేశంలో నంబర్‌వన్‌ రాజధానిని నిర్మించుకుంటాం. 25 లోక్‌సభ సీట్లు గెలిస్తేనే ఢిల్లీ మన మాట వింటుంది. 150 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిస్తే పాలనను సునాయాసంగా ముందుకు తీసుకెళ్లగలం.’
 
 
మోదీది నమ్మక ద్రోహం
‘కొన్ని రాజకీయాలు మాట్లాడాలి. 2014లో మీరు గెలిపించారు. ప్రధాని మోదీపై ఆశలు పెట్టుకున్నాం. కానీ అండగా ఉంటానని ఆయన నమ్మక ద్రోహం చేశారు. కడప స్టీలు ప్లాంటు ఇవ్వకపోవడంతో రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ మనమే ప్రారంభిస్తున్నాం. మీ అందరి కోసం.. రాష్ట్ర హక్కుల కోసం నేను పోరాడుతుంటే.. పులివెందుల మోదీ, హైదరాబాద్‌ మోదీ, ఢిల్లీ మోదీలు ఇబ్బందులు పెడుతున్నారు. గద్దల్లా రాష్ట్రంపై వాలారు. ఇప్పటి వరకు రూ.1.16 లక్షల కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉంది. జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.4 వేల కోట్లు బకాయిలున్నాయి. మోదీపై మనం పోరాటం చేస్తుంటే కోడికత్తి పార్టీ రాష్ట్ర హక్కులకోసం పోరాటం చేయడం లేదు. కేసుల మాఫీ కోసం జగన్‌ కేంద్రంతో కలిసిపోయారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమేనని కాంగ్రెస్‌ చెప్పడంతో ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. కొందరు మతం, కులం పేరు తీసుకొస్తారు. వాళ్లు ఉన్నప్పుడు ఏం చేశారో.. నేనేమి చేశానో గట్టిగా అడగండి.. మళ్లీ ఈ పసుపు కుంకుమ కొనసాగించాలి.. టీడీపీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ అమలవుతాయని చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ఒక ప్రభుత్వం నిరంతరాయంగా ఉంటే.. మంచి నాయకుడు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. నాయకుడు సేవకుడిగా ఉంటేనే ప్రజలు ప్రగతిపథంలో నడుస్తారు. మా చెల్లెమ్మలను గట్టిగా అడుగుతున్నా. మీ భవిష్యత్‌ బాగుపడాలంటే రానున్న 75 రోజులు కష్టపడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..? వైసీపీ అతి తెలివిగా ప్రవర్తిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోంది. తన మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. మీరంతా నాకు అండగా ఉంటే వారికి డిపాజిట్లు కూడా రావు.. కుట్రలు, కుతంత్రాలు నమ్మొద్దు. మీ అందరికీ పాదాభివందనం.. నన్ను ఆశీర్వదించండి.’
Link to comment
Share on other sites

అబ్బో ఇది మాత్రం పీక్స్ 

చంద్రన్న తన బేబీ అయిన  ఒక కోటి డ్వాక్రా చెల్లెమ్మలు టీవీ లలో క్రికెట్ మ్యాచ్ కన్నా ఆతృతగా ఎంజాయ్ చేస్తున్నారు 

రేపు స్మార్ట్ ఫోన్ తో ఈ చెల్లెమ్మలతో డైరెక్ట్ అన్న ఇంటరాక్షన్ ఊహించండి 

brahmi1.gif

 

 

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, AnnaGaru said:

అబ్బో ఇది మాత్రం పీక్స్ 

చంద్రన్న ఒక కోటి డ్వాక్రా చెల్లెమ్మలు టీవీ లలో క్రికెట్ మ్యాచ్ కన్నా ఆతృతగా ఎంజాయ్ చేస్తున్నారు 

 

రేపు స్మార్ట్ ఫోన్ తో ఈ చెల్లెమ్మలతో డైరెక్ట్ అన్న ఇంటరాక్షన్ ఊహించండి 

brahmi1.gif

 

 

 

Idedo troll laaga undi  :P

Link to comment
Share on other sites

dwakra sisters ki isthe thappu ledu ... 

old age vallaki, disabled vallaki ... hardworking dwakra women ki isthe ematram thappu ledu ... I'd gladly pay taxes for that.

Sooner or later, I will be old age and disabled ... its a certainty ... and I'm going to need help from the state ... I'd gladly pay the taxes now.

Link to comment
Share on other sites

58 minutes ago, minion said:

dwakra sisters ki isthe thappu ledu ... 

old age vallaki, disabled vallaki ... hardworking dwakra women ki isthe ematram thappu ledu ... I'd gladly pay taxes for that.

Sooner or later, I will be old age and disabled ... its a certainty ... and I'm going to need help from the state ... I'd gladly pay the taxes now.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...