Jump to content

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ


sonykongara

Recommended Posts

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ
12-01-2019 13:38:19
 
636828970998213751.jpg
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్‌ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీకి బాబు లేఖ రాశారు. కోడి కత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి ఎలా వస్తుందని నిలదీశారు. ఫెడరల్‌ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా బాబు ప్రస్తావించారు. టెర్రరిస్టుల చర్యలు అదుపులోకి పెట్టేందుకు జాతీయ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న కేంద్రం, రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని మోదీ చేసిన వ్యాఖ్యలను లేఖలో బాబు పేర్కొన్నారు. అలాగే 2011లో లక్నోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్‌ఐఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని బాబు లేఖలో ప్రస్తావించారు.
Link to comment
Share on other sites

కోడికత్తి కేసు హైదరాబాద్‌కు
12-01-2019 17:17:52
 
636829103657521638.jpg
విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌పై కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. విజయవాడ సబ్‌జైలులో ఉన్న నిందితుడిని దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడిని వారం పాటు విచారించనున్నారు. నిందితుడి అభ్యర్థన మేరకు న్యాయవాది సమక్షంలో ఎన్‌ఐఏ విచారించనుంది. శ్రీనివాసరావును విచారించే సమయంలో తాను ఎన్‌ఐఏ ఆఫీస్‌లోనే ఉంటానని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం తెలిపారు.
 
 
జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అతడిని వారంపాటు ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది. దీంతో శనివారం ఉదయం 10 గంటలకే ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఐఏ కోర్టుగా ఉన్న విజయవాడలోని ప్రిన్సిపాల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు ఈ కేసు విచారణ బదిలీ అవడంతో నిందితుడు శ్రీనివాసరావును శుక్రవారం విశాఖ నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఈ నెల 25 వరకూ రిమాండ్‌ విధించడంతో గాంధీనగర్‌లో ఉన్న జిల్లా జైలుకు తరలించారు. నిందితుడికి రిమాండ్‌ ఖైదీ నంబరు 87 కేటాయించి, ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. అంతకుముందు అతడిని కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేశారు.
Link to comment
Share on other sites

జగన్ కోడికత్తి కేసులో మరో ట్విస్ట్
12-01-2019 17:38:22
 
636829116204301432.jpg
విజయవాడ: ప్రతిపక్ష నేత జగన్‌పై కోడికత్తి కేసులో ట్విస్ట్ నెలకొంది. నిందితుడు శ్రీనివాసరావును ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వాలని విజయవాడ సెషన్స్ కోర్టులో న్యాయవాది సలీం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ విచారణకు స్వీకరించింది. నిందితుడి తరపు న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోర్టు పునరుద్ఘాటించింది.
 
 
మరోవైపు జగన్‌పై కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. విజయవాడ సబ్‌జైలులో ఉన్న నిందితుడిని దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు అతడిని వారం పాటు విచారించనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...