Jump to content

పవన్, నాగబాబు కామెంట్లు ప్లాన్ ప్రకారమే..! వారి అసలు వ్యూహం ఇదే..!


sonykongara

Recommended Posts

పవన్, నాగబాబు కామెంట్లు ప్లాన్ ప్రకారమే..! వారి అసలు వ్యూహం ఇదే..!

-
January 12, 2019
 
 
 
 
Pawan-Kalyan-Naga-babu.jpg?resize=600%2C
 

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన అభిమాన గణం మొత్తం మాత్రమే కాదు.. చిరంజీవి సామాజిక వర్గం మొత్తం ఏకమైపోయింది. ఎంతగా.. అంటే.. తెలుగుదేశం పార్టీలో.. ఉన్న చిన్న చితకా కాపు సామాజికవర్గ నేతలు మాత్రమే కాదు… చివరికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో… ఉన్న ఉద్యోగులు కూడా… పీఆర్పీ ఆఫీసులో చేరిపోయారు. అంతగా సామాజికవర్గాన్ని ఏకం చేయగలిగారు చిరంజీవి. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. మళ్లీ అలాంటి పరిస్థితి కోసమే… పవన్ కల్యాణ్, నాగబాబు వేర్వేరుగా అయినా… ఒకే రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం సామాజికవర్గాన్ని ఏకం చేయాడనికే..!

 

ప్రజారాజ్యం పార్టీకి వచ్చినంత ఊపులో కనీసం.. పదిశాతం కూడా జనసేనకు రావడం లేదు. పీఆర్పీ సమయంలో చిరంజీవిని నమ్ముకుని రాజకీయంగా కీలక స్థానంలోకి వెళ్తామన్న.. ఆలోచనతో.. శక్తియుక్తులు మొత్తం కేటాయించిన సామాజిక వర్గ ప్రముఖులు.. ఇప్పుడు అలాంటి నమ్మకాన్ని పవన్ కల్యాణ్ ఏ మాత్రం కల్పించలేకపోతున్నారు. ఫలితంగా… కాపు సమాజికవర్గ నేతలెవరూ.. అప్పట్లో.. పోలోమంటూ.. పీఆర్పీలో చేరినట్లుగా.. ఇప్పుడు.. జనసేనలో చేరడం లేదు. పైగా… జనసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బహుశా.. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి.. అధికారం అనుభవించి.. వెళదామని.. అనుకుంటున్నారని అనుకున్నా… కనీసం.. ప్రతిపక్ష పార్టీ నుంచి అయిన కాపు నేతలు వచ్చి చేరి ఉండాల్సింది కదా..!. నేరుగా వెళ్లి పవన్ కల్యాణ్ ఆహ్వానిస్తున్న కొంత మంది కాపు సామాజికవర్గ ప్రముఖులు కూడా జనసేలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వీరందర్నీ మళ్లీ ఏకతాటిపైకి తేవడానికే… పవన్ కల్యాణ్, నాగబాబు వ్యూహాత్మకంగా.. మాట్లాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

పీఆర్పీలోకి వచ్చినట్లు కాపు నాయకులు రప్పించే ప్రయత్నం..!

ప్రజారాజ్యం పార్టీని నమ్ముకున్న కాపు నేతలు.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు.. అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. పీఆర్పీ దెబ్బకు బాగుపడింది ఎవరూ అంటే.. ఒక్క చిరంజీవి అన్న పేరు మాత్రమే వస్తుంది. ఆయనను నమ్ముకున్న ఇతర నేతలు.. దారుణంగా నష్టపోయారు. వారందరూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారిలోచాలా మంది మళ్లీ టీడీపీలో చేరిపోయారు. మంచి గౌరవనీయమైన స్థానాల్ని పొందారు. కొంత మంది మంత్రి పదవుల్లో ఉన్నారు. పార్టీ పదవులు అనుభవిస్తున్నారు. ఆ సమయంలో… పీఆర్పీలో చేరిన మరికొంత మంది రాజకీయంగా ఎటూ కాని స్థితికి చేరిపోయారు. ఈ అనుభవాల కారణంగా.. మరోసారి…చిరంజీవిని నమ్మినట్లు పవన్ కల్యాణ్‌ను నమ్మడానికి… కాపు నాయకులు సిద్ధంగా లేరు. కనీసం ఆ ఆలోచన కూడా మనసులోకి రానీయడం లేదు.

చిరంజీవి నమ్మినట్లు పవన్‌ను నమ్మలేకపోతున్న నేతలు..!

అంటే… ఏ విధంగా చూసినా.. కాపు సామాజికవర్గం మొత్తం… గతంలో పీఆర్పీకి సపోర్ట్ చేసినట్లుగా ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయడం లేదన్నది మాత్రం నిజం. ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో నిలబడాలంటే.. సొంత సామాజికవర్గ మద్దతు లేకపోతే… కనీస ఓటు బ్యాంక్ సంపాదించుకోవడం కష్టం. కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతే.. సొంత సామాజికవర్గంలోనూ మద్దతు లేదని తేలితే.. పార్టీ నిలబడదు. ఇదే టెన్షన్‌తో నాగబాబు, పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా.. బాలకృష్ణ, ఎన్టీఆర్ లపై వ్యాఖ్యల చేయడం ద్వారా… వారి అభిమానులను రెచ్చగొట్టి.. ఎదురుదాడి చేసేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా… తమకు అండగా.. తమ సామాజికవర్గం వస్తుందని.. అలా అందర్నీ ఏకం చేసి.. జనసేనకు మద్దతుగా నిలబడేలా చేయవచ్చని అనుకుంటున్నారు. అదే అమలు చేస్తున్నారు. ఇది ఎలాంటి రాజకీయం అనేది తర్వాతి విషయం. కానీ పక్కా సోషల్ ఇంజినీరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారన్నది మాత్రం నిజం..!

Link to comment
Share on other sites

Trap lo padda Bala Krishna fans!!!

 

Veediki enduku react avuthunnaro naaku ardham kaavadam ledu...  At least logical attack cheyyandi.. Okappudu PK fans ni nagababu thittina videos, Roja PK ni thittina videos share cheskunte better..

 

Blind attack never works..

Link to comment
Share on other sites

11 minutes ago, Naren_EGDT said:

Mari enduku muskuni kurchunaru

nbk fans enduku musukoni kurchunnaru fans president emi chesthunnadu,pk fans eni videos pedtunnaru, miru kuda okati pettvacchu ga db lo pisukone badulu,eddari ki nbk fans quota lomla seats ippichadu vallu ayina matladu vacchuga..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...