Jump to content

No Tax on Autos, Tractors


Yaswanth526

Recommended Posts

ఆటోలు, ట్రాక్టర్లకు పన్నులుండవు!

 

రాష్ట్ర ప్రభుత్వం యోచన

11ap-main7a_2.jpg

ఈనాడు, అమరావతి: ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆటోలకు గతంలో త్రైమాసిక పన్ను విధానం అమల్లో ఉండేది. దాన్ని రద్దు చేసి గతేడాది జీవితకాల పన్నును తీసుకొచ్చారు. దీంతో ఒక్కో ఆటోకు రూ.2 వేలు నుంచి రూ.4 వేల వరకూ పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది తమకు భారంగా ఉంటోందని, దీన్నుంచి మినహాయింపు ఇస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆటో యజమానులు, డ్రైవర్లు, ఆటో యూనియన్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలుమార్లు విన్నవించారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రస్తుతం త్రైమాసిక పన్ను విధానం అమలవుతోంది. మూడు నెలలకోసారి వారు ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున ఏడాదికి రూ.1,200 చెల్లించాల్సి వస్తోంది. వ్యవసాయ పనుల కోసం వినియోగించే ట్రాక్టర్లకు పన్నుల విధించటం మూలంగా తమపై భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోలకు జీవితకాల పన్ను నుంచి, వ్యవసాయ ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

Link to comment
Share on other sites

నిన్న వచ్చి అటో కార్మికులు సియంని కలిసి సమస్య చెప్పారు.. ఒక్క రోజులో 5.66 లక్షల మందికి లబ్ది చేకూరుస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం...

Super User
12 January 2019
Hits: 35
 
auto-12012019.jpg
share.png

చంద్రబాబు దాక సమస్య వెళ్తే చాలు, అది నిమిషాల మీద పరిష్కారం అవుతుంది అనటానికి, ఇది మరో ఉదాహరణ... ఇది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన... విజయవాడ అర్బన్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ కార్మిక సంఘం ఆటో కార్మికులు గురువారం సాయంత్రం ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబును కలిశారు. ఆటో రిక్షాలకు రోడ్ టాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. గతంలో ఉన్న త్రైమాసిక పన్ను విధానాన్ని రద్దు చేసి 2018 జూన్ లో జీవిత కాలం పన్ను విధానాన్ని ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చి ఎంతోమంది ఆటోరిక్షాలవారిని ఆదుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. పన్ను విధానం వలన నూతనంగా కొన్న పాసెంజర్ ఆటోలకు పన్ను 2 శాతంగా ఉందన్నారు. 3 సం ॥ నుండి 6సం॥ల లోపు ఆటోలకు 1.5 శాతంగా, 6సం॥ల నుండి 9సం॥ల లోపు ఆటోలకు1.4 శాతంగా, 9సంవత్సరాలలోపు కొనుగోలు చేసిన ఆటోలకు 1.3 శాతం గాను పన్ను విధించడం జరుగుతోందని ముఖ్యమంత్రికి వివరించారు.

 

auto 12012019

ఈ విధానం వలన ఒక్కో ఆటోకు సంవత్సరానికి రూ.2000 ల నుండి రూ.4000ల వరకు డ్రైవర్లు, ఓనర్లపై భారం పడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పన్ను విధానాన్ని రద్దు చేసి ఆటో కార్మికులకు పన్నుల నుండి విముక్తి కలగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సావదానంగా వారి విన్నపాన్ని విని సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. అయితే అటో కార్మికులు మాత్రం, ఎప్పటికో చేస్తారులే, చూద్దాం అంటూ వెళ్ళిపోయారు. కాని, వారికి షాక్ ఇస్తూ, ఒక్క రోజులోనే చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, అధికారులతో సమావేశం అయ్యి, సమస్య పై చర్చించారు.

auto 12012019

అంతే, ఒకే ఒక్క నిర్ణయంతో, 5.66 లక్షల మందికి లబ్ది చేకూరుస్తూ ఈ పన్ను విధానం రద్దు చేసేసారు. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5.66లక్షల ఆటోలున్నాయి. వీటికి ప్రతినెలా రూ.110 చొప్పున ఏటా రూ.1320 రోడ్డు టాక్స్‌ చెల్లించాల్సి ఉంది. ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.440 చొప్పున ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి పన్ను చెల్లించాల్సి ఉంది. దీనిని పూర్తిగా రద్దు చేసి... జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. నిరుపేదలైన ఆటో కార్మికుల నుంచి ఆ మొత్తం తీసుకోకూడదని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. వెరసి... ఆటోలపై ఎలాంటి పన్నూ ఉండదు. ఆటో కొనుగోలు సమయంలో కట్టే రెండు శాతం పన్ను మాత్రమే అమలులో ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని 2లక్షలకు పైగా వ్యవసాయ ట్రాక్టర్లపైనా అన్నిరకాల పన్నులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

 
Adv
Link to comment
Share on other sites

auto vallu tax kattaka.. dwakras taxes kattaka.. farmers tax kattaka.. 

job chesevalla dagara taxulu dobbi vellaki free food.. free bed.. free education isthunnara.. mallai tax katte job doers ki emaina undha ante chippa... 

not just AP govt, whole country after this.. sad state of politics.. :sleep:

Link to comment
Share on other sites

On 1/12/2019 at 12:45 PM, yamaha said:

Monthly 110 ante daily Rs.3.5

Adi kooda bharama..kanisam tagginchatam ane concept ledu .....anni free free

Only employees and business class tax kattali chassss

Auto ki Quarter ki 110 happy ga kattevallu

Kontamandi time ki kattaledani revenue penchadaniki    life tax rule pettaru.

Oke sari thousands lo money kattali kabatti negitive impact vachindi. Anduke total ga remove chesaru

Pavalaki kakkurthi paddaru

Motham Rupayi poindi ippudu

Link to comment
Share on other sites

1 hour ago, Nandamurian said:

Autos at least regulate ceyyali Nellore loney thousands dhaati poyyyayi

Ya, they create too much pollution. ilanti offers CNG, electric vatiki pedithe  avi kontaru . Also, MH laga current auto scrap ki teesukoni subsity ichi electric/cng isthe unna vallu kooda switch avutaniki scope untadi :dream:

Link to comment
Share on other sites

2 hours ago, uravis said:

Ya, they create too much pollution. ilanti offers CNG, electric vatiki pedithe  avi kontaru . Also, MH laga current auto scrap ki teesukoni subsity ichi electric/cng isthe unna vallu kooda switch avutaniki scope untadi :dream:

Best one @Saichandra bro mee Lokesh varaku ceyrchamdi iddi big move avvidi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...