Jump to content

మోదీ ‘ఊ’ అంటే...32వేల కోట్లు | Revenue deficit for AP


sonykongara

Recommended Posts

అక్షరాలా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు! కేంద్రం కరుణిస్తే మన రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు అందే నిధులు ఇవి! కానీ... అందుకు ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ మూడ్‌ మారాలి! లేదంటే... ప్రధాని మోదీయే మారాలని రాష్ట్ర ఆర్థిక శాఖ భావిస్తోంది.
  • ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధం
  • ప్రధాని కరుణ లేకే అన్యాయం
  • రెవెన్యూ లోటు నిధులే 12 వేల కోట్లు
  • పోలవరం ఖర్చు, వెనుకబడిన జిల్లాలు,
  • ఇతరత్రా కలిపితే మరో 20 వేల కోట్లు
  • మోదీ మనసు మారడమే ముఖ్యం...
  • లేదా.. ప్రధానే మారాలనే వ్యాఖ్యలు
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): విభజన జరిగిన తొలి ఏడాది రెవెన్యూ లోటు నుంచి ప్రత్యేక హోదా అమలు దాకా... రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రం ఆది నుంచీ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రంతో ఒక విధంగా యుద్ధమే చేస్తోంది. ఒకవైపు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే... వీలైనన్ని ఇతర మార్గాల్లో నిధులు సమీకరించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ, రాయితీలు, విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు... ఇలాంటివి పక్కనపెట్టినా... స్పష్టమైన ఆర్థిక హామీలకు సంబంధించిన నిధులే రూ.32వేల కోట్లు కేంద్రం నుంచి అందాల్సి ఉంది. 2014-15 రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లుగా నిర్ధారించినా... కేంద్రం రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ ఖాతాలో రూ.12 వేల కోట్లు రావాలి. పోలవరంపై ఖర్చు పెట్టిన సొమ్ము, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇవ్వాల్సిన 90ు నిధులను కూడా కలిపితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.32,000 కోట్లు తక్షణం రావాల్సి ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
 
‘‘విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ... ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలి’’ అని కేంద్రంలోని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా వారు అదే మాట చెబుతున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి... మనకు ఆ సొమ్ములు దక్కాలంటే... మోదీ వైఖరి మారాలి, లేదా ఆయనస్థానంలో ‘ఏపీ అనుకూల’ ప్రధాని రావాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
అప్పుల వేట...
‘‘కొత్త రాష్ట్రంలో ఏ ఖర్చునూ వాయిదా వేయలేం. మరోవైపు... ప్రతిదీ కొత్తగా సమకూర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ! ఈ పరిస్థితుల్లో నగదు నిర్వహణ భారంగా మారింది. కేంద్రం సహకరించి విభజన చట్టం-సంబంధిత హామీల ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు సక్రమంగా వచ్చి ఉంటే రాష్ట్రానికి అప్పుల కష్టాలు తప్పేవి’’ అని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ లోటును యథాతథంగా ఆమోదించి ఉంటే... రైతు రుణమాఫీ సులువయ్యేది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం దీనిని విడతల వారీగా అమలు చేస్తోంది. 4, 5 విడతల రుణమాఫీ కోసం కూడా రుణాల వేటలో ఉంది.
 
ఈ నెలాఖరులోగా నిధులు సేకరించి.. రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే, రాష్ట్రం తరచూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్తోంది. నిధులకు కటకట ఏర్పడింది. రాష్ట్ర జీఎ్‌సడీపీలో 3ు మొ త్తాన్ని రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం రూపంలో అప్పు తీసుకోవచ్చు. దీనిద్వారా రూ.27,000కోట్ల రుణం సేకరించవచ్చు. జీఎస్టీ నిధులు నెలకు రూ.2,300 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కింద రూ.2000 కోట్లకు పైగా నిధులు వస్తాయి. ఇవి కాకుండా రాష్ట్ర సొంత ఆదాయం ఉంటుంది. ఇన్ని మార్గాల ద్వారా నిధులు వస్తున్నప్పటికీ.. కేంద్రం చేసిన అన్యాయం వల్ల అప్పులు తప్పడం లేదని ఆర్థికశాఖ వాపోతోంది.
Link to comment
Share on other sites

పేదలకు పెన్షన్ ఇచ్చామనే నెపంతో కోత కోశారు: చంద్రబాబు
12-01-2019 21:35:43
 
636829258572194486.jpg
అమరావతి: కేంద్రం రూ.30 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నా ప్రధాని మోదీ అడ్డుపడటం వల్ల ఇవ్వడం లేదని వార్తలొచ్చాయని, ప్రధానమంత్రి ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. పేదవారికి పెన్షన్ ఇచ్చామనే నెపంతో ఏపీకి రావాల్సిన రూ.16 వేల కోట్లలో కోత కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు. పేదవారికి పెన్షన్లు ఇవ్వడం నేరమా?అని చంద్రబాబు ప్రశ్నించారు. 660 పురస్కారాలు ఏపీకి వచ్చాయని, వర్షాభావంతో పాటు 3 తుఫాన్లు ఎదుర్కొన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...