Jump to content

ప్రజాదరణ లేకపోవడం వల్లే బీజేపీని వీడుతున్నా: ఆకుల


sonykongara

Recommended Posts

ప్రజాదరణ లేకపోవడం వల్లే బీజేపీని వీడుతున్నా: ఆకుల
09-01-2019 19:29:50
 
636826594174519639.jpg
రాజమండ్రి: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయననే స్వయంగా ప్రకటించారు. ప్రజాదరణ లేకపోవడం వల్లే బీజేపీని వీడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21లోపు బీజేపీకి రాజీనామా ఇస్తానని తెలిపారు. విశాఖ రైల్వేజోన్, కడప స్లీల్‌ప్లాంట్‌ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం తీరు బాధ కలిగించిందన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపు ఇస్తే ప్రజలు తరలివస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 21న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరతున్నట్లు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు.
 
 
ఈ నెల 7న ఆకుల రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి రాజీనామా లేఖను అందజేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆకుల సత్యానారాయణ జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంతకు పూర్వం టీడీపీలో చేరాలని భావించారని సమాచారం. అయితే అధ్యక్షుడు చంద్రబాబు నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో టీడీపీలో చేరాలన్న ఆలోచన విరమించుకొని జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారని వినికిడి. ఇందుకు సంబంధించి ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
 
అయితే అదేరోజు సాయంత్రం బీజేపీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆకుల సత్యనారాయణ ఖండించారు. తాను నియోజకవర్గ సమస్యలపై కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టం చేశారు. అసలు తానింకా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే కలవలేదని వెల్లడించారు. బీజేపీలోనే ఉన్నానని ఆకుల క్లారిటీ ఇచ్చి.. రాజీనామా చేసినట్లు వచ్చిన ఫుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఏమైందో ఏమోగాని ఈ రోజు తాను బీజేపీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

భాజపాకు ఎమ్మెల్యే ఆకుల గుడ్‌బై! 

9brk166-akula.jpg

రాజమహేంద్రవరం (ఆనంద్‌నగర్)‌: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు సమాచారం. ఆకుల.. పార్టీ మారుతారంటూ గత 15 రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఆయన ప్రధాన అనుచరులు చెక్‌ పెట్టారు. సత్యనారాయణ పార్టీ మారుతున్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. జనసేన పార్టీ తరఫున ఆయన సతీమణి ఆకుల పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం.. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం ఆకుల సత్యనారాయణకు కేటాయించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ ఈ నెల 21న అధికారికంగా జనసేనలో చేరతారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. వైద్యుడిగా, రియల్‌ ఎస్టేట్ ‌వ్యాపారిగా ఆయన రాజమహేంద్రవరం ప్రజలకు సుపరిచితుడు. ఏడేళ్ల క్రితం భాజపాలో చేరిన ఆయన 2014లో అనూహ్యంగా భాజపా టికెట్‌ పొందారు. ఆ ఎన్నికల్లో భాజపా, తెదేపా పొత్తులో భాగంగా ఆయన రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...