Jump to content

Polavaram to Set Guinness Record! |


sonykongara

Recommended Posts

గిన్నిస్‌ రికార్డు కోసం పోలవరంలో ముమ్మరంగా ఏర్పాట్లు

 

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో మరో రికార్డు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్పిల్‌ ఛానల్‌లో 24 గంటల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేసి ప్రపంచ రికార్డును అధిగమించాలన్న పట్టుదలతో నవయుగ గుత్తేదారు సంస్థ పనిచేస్తున్నట్లు ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేష్‌బాబు చెప్పారు. శుక్రవారం పనులను నవయుగ ఎండీ కె. శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 6న ఉదయం ఎనిమిది గంటలకు కాంక్రీట్‌ పనులు ప్రారంభమై.. ఏడో తేది ఉదయం ఎనిమిది గంటల వరకు ఏకధాటిగా సాగుతాయన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారికోసం ప్రాజెక్టు సమీపంలోనే ఇసుక తిన్నెలపై వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు నవయుగ ఎండీ  కె. శ్రీధర్‌ పేర్కొన్నారు.

 

 
Link to comment
Share on other sites

గిన్నిస్‌ రేస్‌
06-01-2019 03:14:53
 
636823412915814276.jpg
  • ప్రపంచ రికార్డు బాటలో పోలవరం
  • 24 గంటల్లో 28000 క్యూ.మీ. కాంక్రీట్‌
  • 21,580 క్యూ.మీ. వేస్తే రికార్డు ఛేదనే
  • నేటి ఉదయం 7 నుంచి రేపు ఉదయం
  • ఆరు గంటలదాకా అవిశ్రాంత పరిశ్రమ
  • ‘రికార్డు’ ఖరారుకు రంగంలోకి గిన్నిస్‌
  • 15 నిమిషాలకు ఒకసారి పని నమోదు
  • గంట గంటకు లండన్‌కు సమాచారం
  • పని స్థలంలో 8 మంది నిరంతర ఆరా
అమరావతి, ఏలూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదవుతోంది. తన రికార్డులను తానే తిరగరాసేందుకు ఈ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. అతి భారీ కాంక్రీట్‌ విన్యాసం ద్వారా గిన్ని్‌సబుక్‌లోకి ఎక్కనుంది. చైనాలోని త్రీగార్జెస్‌ ప్రాజెక్టు కాంక్రీట్‌ పనుల రికార్డును ‘పోలవరం’ ఇప్పటికే అధిగమించింది. తాజాగా దుబాయ్‌లోని అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ షబీబ్‌ , రాల్స్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులను అధిగమించేందుకు నవయుగ ఇంజనీరింగ్స్‌ సిద్ధమైంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఈ అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. అప్పటినుంచి సోమవారం ఉదయం ఆరు గంటల లోపు 28,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అదే జరిగితే ‘నవయుగ’ మరో ప్రపంచ రికార్డును ఛేదించినట్టే!
 
రికార్డుకిదే గీటురాయి..
ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సంస్థ ప్రతినిధి రిషినాథ్‌ బృందం శుక్రవారం సాయంత్రమే పోలవరం చేరుకొంది. స్వతంత్రంగా వచ్చిన సివిల్‌ ఇంనీరింగ్‌ ప్రతినిధులు, జాతీయ మీడియా సంస్థలు, స్థానిక మీడియా సంస్థలతో ఈ ప్రాంతం సందడిగ మారింది. ఈ అద్భుత క్షణాల కోసం ఉత్సుకతతో వీరంతా ఎదురుచూస్తున్నాయి. వీరందరి కోసం ప్రాజెక్టు స్థలంలో తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ రికార్డు నమోదులో భాగంగా గిన్నిస్‌ బృందం కాంక్రీటు ప్రతి గంటకు ఎంత వేస్తున్నారనేది పరిగణనలోకి తీసుకొంటుంది. ఆ వివరాలను ఎప్పటికప్పుడు టెలి వీడియోల ద్వారా లండన్‌లోని కేంద్ర కార్యాలయానికి చేరవేస్తుంది. కాంక్రీటు వేసే దృశ్యాలను ప్రతి 15 నిమిషాలకు ఒకసారి రికార్డు చేస్తారు. ఈ బృందంలోని ఎనిమిదిమంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
 
అంతా సిద్ధం...
కాంక్రీటుకు కావల్సిన ముడి పదార్థాలు, భారీ యంత్రాలు సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం పోలవరం వద్ద 10 బ్లాచింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ బ్లాచింగ్‌ పాయింట్‌ ద్వారా ఒక గంటకు 1560 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు సిద్ధం చేయొచ్చు. ఇలా సిద్ధ్దమైన కాంక్రీటును స్పిల్‌ చానల్‌కు తరలించడానికి 70 ట్రాన్సిక్‌ మిల్లర్లు, 20 ఎడిటర్లు, 20 డంపర్లు, 5 టెలిబెల్టులను సిద్ధం చేశారు. స్పిల్‌ చానల్‌లో సుమారు 350 బ్లాకుల్లో కాంక్రీటు వేయడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నాటికి 320 బ్లాకుల్ని రెడీ చేశారు. ఈ బ్లాకుల్లో కాంక్రీట్‌ను నింపేందుకు 2 లక్షల బస్తాల సిమెంట్‌, 40 క్యూబిక్‌ మీటర్‌ల మెటల్‌, 2 లక్షల క్యూబిక్‌ మీటర్‌ల మేర ఇసుకను సిద్ధం చేసినట్టు ప్రాజెక్ట్‌ ఈఈ శ్రీనివాస్‌ వివరించారు. ఈ కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్‌ మిక్చరు కూడా ఉందన్నారు. ప్రతీ క్యూబిక్‌ మీటరుకు 4 కేజీలు చొప్పున ఈ యార్డ్‌ మిక్చరు కలపనున్నారు.
 
వడి..వడిగా..
పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పూర్తయితే.. 38.78 లక్షల ఎకరాలకు సాగునీరు ..540 గ్రామాలకు చెందిన 28.5లక్షల మందికి తాగునీరు అందనున్నది. అదేవిధంగా 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కానున్నది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌వే కుడి ఫ్లాంక్‌ 1128.4 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి 48 రేడియల్‌ గేట్లు అమర్చుతారు. 16 మీటర్లు వెడల్పు, 20.84 మీటర్ల ఎత్తు కలిగిన ఈ రేడియల్‌ గేట్లు హైడ్రాలిక్‌ విధానంలో పనిచేస్తాయి. అదేవిధంగా 1000 మీటర్ల వెడల్పు ..2920 మీటర్ల పొడవు కలిగిన స్పిల్‌ చానల్‌ ద్వారా 50 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు బయటకొస్తాయి. మొత్తం కాంక్రీట్‌ 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర వేయాలి. ఇందులో ఇప్పటికే 21.48 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
 
నేడు పోలవరంలో రివ్యూ కమిటీ భేటీ
పోలవరం పని స్థలంలోనే కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా అధ్యక్షతన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశం ఆదివారం జరగనున్నది. ఈ సమీక్షలోనైనా డిజైన్లను ఆమోదిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది. డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ కమిటీ సమావేశంలో గ్యాప్‌ 1, గ్యాప్‌ 3కు సంబంధించిన డిజైన్లను సమీక్షిస్తారు. ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌), అప్రోచ్‌ చానల్‌ ఎస్కవేషన్‌, స్పిల్‌వే ఎడమ గైడ్‌బండ్‌ డిజైన్లను ఈ కమిటీ సమీక్షిస్తుంది.
 
నవయుగ విజయ పరంపర..
  •  2018 జూన్‌ 10,11 తేదీలలో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
  • 2018 నవంబరు 25-26 తేదీల్లో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 11,298 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
  •  2018 డిసెంబరు 15-16 తేదీల్లో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కోసం 16,368 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ వేశారు.
  •  మొత్తంగా 2018లో 12 నెలల కాలంలో 16,64,397 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
Link to comment
Share on other sites

కాంక్రీట్‌ రికార్డుకు సిద్ధం

 

5ap-main3a_1.jpg

పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో అరుదైన రికార్డు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌లో ఒక టవర్‌ నిర్మాణానికి 2017 మేలో 36గంటల్లో 21,580 ఘనపు మీటర్ల(ఘ.మీ.) కాంక్రీట్‌ వేశారని, ఇప్పుడా రికార్డును అధిగమించేందుకు 24 గంటల్లోనే 30వేల ఘ.మీ. కాంక్రీట్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూణ్నెల్ల కిందట 24 గంటల్లో 11,158 ఘ.మీ. కాంక్రీటు వేశారు. మళ్లీ గత నెలలో 11,289 ఘ.మీ. కాంక్రీట్‌ పనులు చేసి ఆ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఏకంగా 30వేల ఘ.మీ. కాంక్రీటు వేసేందుకు గుత్తేదారు సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు.

30వేల ఘ.మీ. కాంక్రీట్‌కు కావాల్సినవి..

సిమెంటు : ఏడువేల టన్నులు
ఇసుక :  22వేల టన్నులు
కంకర :  36వేల టన్నులు

 

మానవ వనరులు

కార్మికులు : 3,600 మంది
సాంకేతికేతర సిబ్బంది : 720
సాంకేతిక సిబ్బంది : 500
వివిధ హోదాల్లోని ఇంజినీర్లు : 21 మంది

ప్రస్తుతం ప్రాజెక్టులో గంటకు 3,770 మెట్రిక్‌ టన్నుల కంకర తయారు చేసే క్రషర్లున్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర రసాయన మిశ్రమాలు కలిపే బ్లాచింగ్‌ప్లాంట్లలో గంటకు 1560ఘ.మీ. కాంక్రీట్‌ కలిపేలా సన్నద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8గంటలకు స్పిల్‌ఛానల్‌లో పని ప్రారంభించి సోమవారం ఉదయం 8గంటలకు 30వేల ఘ.మీ. పైబడి కాంక్రీట్‌ వేసి రికార్డు సాధించాలనుకుంటున్నారు. అదే పనిని మరికొన్ని గంటలపాటు కొనసాగించే ఆలోచనతో ఉన్నారు.

5ap-main3b.jpg

రికార్డు సాధించాకే సంబరాలు
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సిబ్బంది అనుమతి ఇచ్చిన వెంటనే ఆదివారం ఉదయం స్పిల్‌ఛానల్‌లో కాంక్రీట్‌ వేసే పనిని ప్రారంభించేందుకు అవసరమైన యంత్రసామగ్రినంతా ఇప్పటికే సమకూర్చారు. శనివారం రాత్రికే గిన్నిస్‌ ప్రతినిధులు, అధికారులు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రణాళిక ప్రకారం కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తామని జలవనరుల శాఖాధికారులు తెలిపారు. రికార్డు సాధించిన అంశంపై లండన్‌ నుంచి ప్రకటన వచ్చాక ప్రాజెక్టులో సంబరాలు చేసుకునేందుకు నవయుగ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు.

5ap-main3c_1.jpg

నిర్విరామంగా కొనసాగిస్తాం
పోలవరం ప్రాజెక్టులో మరో రికార్డు సాధించే దిశగా పనులు ముమ్మరంగా చేస్తున్నాం. స్పిల్‌ఛానల్‌లో 30వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వేసే పనిని 24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఉన్నాం. దీనికి దైవసంకల్పం తోడవ్వాలి.

- సీఈ శ్రీధర్‌, ఈఈ డి.శ్రీనివాస్‌
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టులో మరో అరుదైన ఘట్టం
06-01-2019 08:50:53
 
636823614513577468.jpg
 
అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మరో అరుదైన ఘట్టం అవిష్కృతం కానుంది. పోలవరం తన రికార్డులను తానే తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. 24 గంటల్లో 28వేల క్యూ.మీల కాంక్రీట్‌ వేయనుంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఏకధాటిగా పనులు ప్రారంభించినుంది. రికార్డు ఖరారు చేయడానికి గిన్నిస్‌ వరల్డ్ రంగంలోకి దిగింది. 15 నిమిషాలకు ఒకసారి పని నమోదు చేయనుంది. గంట గంటకు లండన్‌కు కాంక్రీట్‌ పనుల సమాచారం అందించనుంది. 8మంది అధికారులు క్షేత్రస్థాయిలో ఆరా తీయనున్నారు.
Link to comment
Share on other sites

అర్ధరాత్రి కల్లా అరుదైన రికార్డు ఏపీ ప్రభుత్వ సొంతం!
06-01-2019 20:37:29
 
636824039564280727.jpg
పోలవరం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించబోతోంది. పోలవరం ప్రాజెక్టులో ఏకధాటిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 6 జోన్లలో 300 బ్లాకుల్లో కాంక్రీట్ నింపే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 3600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికే 11 గంటల్లో 15,107 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. 24గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి కల్లా దుబాయ్‌ రికార్డ్‌ను దాటే అవకాశం ఉంది. దుబాయ్‌ దేశం ఓ టవర్ నిర్మాణంలో భాగంగా 36 గంటల్లో 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి రికార్డ్‌ సాధించింది.
Link to comment
Share on other sites

48 minutes ago, vasu4tarak said:

Quality and safety matters lo compromise kaakundaa cheyyandi em chesinaa.. Chinna porapaatu jarigina aa Project ki party ki kolukolenantha damage avuthundi...  Next 100yrs ki nilabadi povali :pray:

this is spill channel works(river bed/flooring). there is nothing much that can go wrong.

Link to comment
Share on other sites

గిన్నీస్‌బుక్ రికార్డ్ దిశగా పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు
06-01-2019 23:30:58
 
636824143060486369.jpg
ఏలూరు: పోలవరం ప్రాజెక్టులో ఏకధాటిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 6 జోన్లలో 300 బ్లాకుల్లో కాంక్రీట్ నింపే పనులు చేస్తున్నారు. ఒక్కో బ్లాకులో 100 క్యూ.మీల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 3600 మంది కార్మికులతో పాటు 500 మంది సాంకేతిక సిబ్బంది.. పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 12 గంటల్లో 16,584 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేశారు. ఈ అర్థరాత్రికల్లా దుబాయ్‌ రికార్డ్‌ను దాటే అవకాశం ఉంది. 36 గంటల్లో 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి దుబాయ్‌ రికార్డ్‌ సృష్టించింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య రికార్డ్‌స్థాయిలో 1477 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయి. ఈ ప్రాజెక్టు దగ్గర కాంక్రీట్‌ పనులను మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు.
Link to comment
Share on other sites

పోలవరం గిన్నిస్‌ రికార్డు

07012019brk-50a.jpg

పోలవరం: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్‌ పనుల్లో శరవేగంగా దూసుకెళుతున్న ఈ ప్రాజెక్ట్‌ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్‌ వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు.

 

Link to comment
Share on other sites

24 గంటల్లో 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన పోలవరం ప్రాజెక్టు...???? సీబీఎన్ గారు చెప్పినట్లు ఈ రోజు సోమవారం కాదు విశ్వమంతటికీ పోలవారమే...✌️✌️✌️#Polavaram #AndhraPradesh #APwithCBN #AmazingAndhra #BangaloreTDP . .

DwSXZTYUwAMgn8n.jpg
DwSXZyZV4AAsPZ4.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...