Jump to content

Recommended Posts

TG lo Ministers vunna leka poyina okkate.. aa padavalu just perukega .. Panulanni ayyedi KCR, KTR dwarane kabatti .. vallu inko 5 yrs expand cheyyaka poyina vachina nastam ledu ...ministers ki iche salaries and allowances save chesi TG ni malli surplus budget loki teddam anukontunnadu emo dora

Link to comment
Share on other sites

 

 
ee53740ea96cc2eb2c70d24aaab45552.jpg
 
 
 

మంత్రులు లేరు..ఉద్యోగులు రారు!

కళతప్పిన సచివాలయం
తగ్గిన సందర్శకుల తాకిడి
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయం కళ తప్పింది. మంత్రులు ఎవరూ లేకపోవడంతో అధికారులదే హాజరు కూడా తగ్గుముఖం పట్టింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు నెల రోజులు అవుతున్నా మంత్రి మండలిని ఏర్పాటు చేయకపోవడంతో సచివాలయంలోని వారి పేషీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వస్తున్నా ఆయన చూడాల్సిన బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో అన్నింటినీ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సచివాలయంలో పలువురు విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళతారో, అసలు వస్తారో లేదో అనేది సందిగ్దమే అవుతోంది.

సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులదే ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారైంది. అధిక శాతం మంది సచివాలయానికి రాకుండా ఇతర వ్యాపకాలపై నిమగ్నమయ్యారు. ఫలితంగా రాష్ట్ర సచివాలయం రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి హోం మంత్రిని మాత్రమే ఏర్పాటు చేశారు.

మిగిలిన మంత్రి పదవులు ఎరికీ కేటాయించ లేదు. దీంతో సచివాలయంలోని మంత్రుల పేషీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోపక్క ఐఏఎస్‌ అధికారులు కొందరు అవసరాన్ని బట్టి సచివాలయానికి వస్తున్నారు. ప్రధానంగా చీఫ్‌ సెక్రటరీ సమావేశాలను నిర్వహించే సమయంలోనే అధికారులు వస్తున్నారు.

మిగిలిన రోజుల్లో పలవురు దాదాపు రావడం తగ్గించేశారు. ఐఏఎస్‌లు అంతా ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఇక సచివాలయంలో కింది స్థాయి సిబ్బంది సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలతోపాటు, మిగిలిన ఉద్యోగుల్లో ఎక్కువమంది ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు రాకపోవడంతో అవి వెలవెలబోతున్నాయి.

ఎవరైనా పనులమీద ఎప్పుడు వచ్చినా మీటింగ్‌కు వెళ్లారనే సమాధానం మాత్రమే వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు సహ ఉద్యోగులతో ముచ్చట్లు పెట్టుకుంటూ కాలక్షేపం చేయడం సర్వసాధారణమైంది. సచివాలయంలో నడుస్తున్న క్యాంటిన్‌ కూడా జనం ఎక్కువగా లేకపోవడంతో వెలవెల పోతోంది. క్యాంటిన్‌ వద్ద సందర్శకుల కన్నా పోలీసు సిబ్బందే ఎక్కువగా కన్పిస్తున్నారు.

మంత్రులు లేకపోవడం, కిందిస్థాయి అధికారులు, ఉద్యోగుల సమయపాలనను పాటించకపోవడంతో సచివాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడిన సచివాలయం నేడు ఊసూరుమంటోంది. అటెండర్‌ మొదలుకొని ఉన్నతాధికారి వరకూ కార్యాలయాలకు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుండి ప్రజా సమస్యలను పరిష్కరించుకునే నిమిత్తం వచ్చే వారికి పనులు జరగడం లేదు.

ఎప్పుడు వచ్చినా ఏ ఒక్క అధికారి అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. సచివాలయం నిర్వహణపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడంతో దొంగతనాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోందనే భావన పలువురిలో నెలకొంది. ఈనేపథ్యంలోనే సచివాలయంలో దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌ సీ బ్లాక్‌ పక్కనే ఉండే డీ బ్లాక్‌లో ఇటీవల దొంగలు జనరేటర్‌ బ్యాటరీని ఎత్తుకెళ్లడం సంచలనం అయ్యింది.

కాగా దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నందున వాటిని పారదర్శకంగా కొనసాగించడం కోసం సచివాలయ వ్యవస్ధ పటిష్టంగా ఉండాల్సినా అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉందనే చర్చ సాగుతోంది. నిత్యం సాయంత్రం 3 నుండి 5 గంటల వరకూ సచివాలయానికి వచ్చే సందర్శకుల కోసం అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. రాష్ట్ర స్థాయి అధికారులెవరూ కింది స్థాయి ప్రజాప్రతినిధులకు అందుబాటులో దొరకని పరిస్థితులు సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సచివాలయానికి వచ్చినా అధికారులను కలుసుకోలేకపోతున్నారు.

ఇక కిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి విధి నిర్వహణ సమయాన్ని పాటించే విధంగా చూడాల్సిన సాధారణ పరిపాలన శాఖ కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని అంటున్నారు. అన్ని విభాగాల్లోనూ బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చినా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నేతల అభ్యంతరాల కారణంగా నిలిచిపోయింది. దీని ఫలితంగా ఉదయం సచివాలయానికి రావాల్సిన అధికారులు, ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలు అయినా ఇంకా వస్తూనే ఉంటున్నారు.

వీటన్నింటినీ పట్టించుకోకపోవడంతో రాష్ట్ర సచివాలయం పనితీరు అపహాస్యం పాలవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Link to comment
Share on other sites

9 hours ago, Raaz@NBK said:

సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌ సీ బ్లాక్‌ పక్కనే ఉండే డీ బ్లాక్‌లో ఇటీవల దొంగలు జనరేటర్‌ బ్యాటరీని ఎత్తుకెళ్లడం సంచలనం అయ్యింది.

:roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...