Jump to content

what is this...is this political...?


SREE_123

Recommended Posts

గీతం బీటెక్‌ చెల్లదు!
29-12-2018 01:41:35
 
636816504096723921.jpg
 
  • ఏఐసీటీఈ అనుమతి లేదు
  • విద్యార్థిని సర్టిఫికెట్‌ తిరస్కరణ
  • ఉన్నత విద్యామండలి నిర్ణయం
  • పలు వర్సిటీల డిగ్రీలు ప్రశ్నార్థకం
 
 
హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని డీమ్డ్‌ యూనివర్సిటీల బీటెక్‌ డిగ్రీల గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది. ఏఐసీటీఈ అనుమతి లేకుండా ఈ వర్సిటీలు ఇచ్చే ఇంజనీరింగ్‌ డిగ్రీలు చెల్లుబాటు కావని తెలంగాణ ఉన్నత విద్యామండలి తేల్చేసింది. ఇందులో భాగంగానే ఓ విద్యార్థిని ఇంజనీరింగ్‌ డిగ్రీని తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలివేటు గీతం యూనివర్సిటీ విద్యార్థినిపై పడింది. 2014లో ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థిని ఈ ఏడాదే కోర్సు పూర్తి చేసుకుంది. అనంతరం కరీంనగర్‌లోని ఓ ఎంబీఏ కాలేజీలో యాజమాన్య కోటాలో అడ్మిషన్‌ తీసుకుంది. నిబంధనల ప్రకారం యాజమాన్య కోటా అడ్మిషన్లను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ధ్రువీకరించాలి. ఇందులో భాగంగానే కాలేజీ యాజమాన్యం ఆ విద్యార్థిని సమర్పించిన సర్టిఫికెట్లను మండలి అధికారులకు అందజేసింది. గీతం వర్సిటీ నుంచి అందిన బీటెక్‌ సర్టిఫికెట్‌ చెల్లదని అధికారులు తేల్చిచెప్పారు. ఆ సర్టిఫికెట్‌ను తిరస్కరించారు.
 
ఎంబీఏలో అడ్మిషన్‌ను కూడా నిరాకరించారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాంకేతిక కోర్సులు అందించాలంటే కచ్చితంగా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్కికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయాన్ని ఏఐసీటీఈ కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఈ యేడాది జులైలో అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యామండలిలకు లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల్లో ఏఐసీటీఈ అనుమతి లేకుండా సాంకేతిక కోర్సులు అందిస్తున్న వర్సిటీలను, కాలేజీలను మూసివేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది.
 
ఈ యేడాది ఏఐసీటీఈ అనుమతి పొందిన డీమ్డ్‌ వర్సిటీల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 3వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. అవి.. ఐఐఐటీ-హైదరాబాద్‌, కేల్‌ యూనివర్సిటీ, ఇక్ఫాయ్‌ వర్సిటీ.ప్రముఖ వర్సిటీలుగా పేరొందిన గీతమ్‌, సింఘానియా, ఎమిటీ, సింబియాసిస్‌ వర్సిటీల పేర్లు జాబితాలో లేవు. ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న 7డీమ్డ్‌ వర్సిటీలకు లేఖ రాసింది. సాంకేతిక కోర్సులు కొనసాగించేందుకు వారి వద్ద ఉన్న అనుమతి పత్రాలు అందించాలని కోరింది. అన్ని వర్సిటీలు స్పందించాయి.
 
 
గీతమ్‌కు అనుమతి లేదు
గీతం హైదరాబాద్‌ క్యాంప్‌సను 2009లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సాంకేతిక కోర్సులతో పాటు ఇతర కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. గీతం యూనివర్సిటీ యాజమాన్యం అందించిన ఆధారాల ప్రకారం వర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి లేదని, అందుకే సాంకేతిక కోర్సులు కొనసాగించే అర్హత వర్సిటీకి లేదని అధికారులు తెలిపారు. 2007 సంవత్సరంలో విశాఖపట్నంలో గీతమ్‌ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) ఇచ్చిన నోటిఫికేషన్‌ను అధికారులు ఆధారంగా చూపుతున్నారు. కోర్సులు అందించడంలో యూజీసీ, ఏఐసీటీఈతో పాటు ఆయా కోర్సుల మాతృ సంస్థల నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
 
దీని ఆధారంగానే విద్యార్థి సర్టిఫికెట్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో గీతం వర్సిటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌పై గందరగోళం నెలకొంది. 2009 నుంచి 2018 వరకు వేల సంఖ్యలో విద్యార్థులు గీతం వర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నారు. వీరంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు తెరపైకి వచ్చిన ఈ పరిణామంతో ఏం జరుగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తం విద్యార్థుల సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? లేక ఏదైనా ప్రమాణికం తీసుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గీతంతో పాటు మరికొన్ని డీమ్డ్‌ వర్సిటీలపై కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఏఐసీటీఈ అనుమతి లేకుండా సాంకేతిక కోర్సులు అందిస్తున్న వర్సిటీల డిగ్రీలను రద్దు చేసే ఆలోచనలో ఉంది.
 
 
ఏఐసీటీ ఈ అనుమతి లేదు
2papireddy-180.jpgగీతం యూనివర్సిటీకి సాంకేతిక విద్యామండలి అనుమతి లేదు. దీంతో ఈ యూనివర్సిటీకి ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక కోర్సులు కొనసాగించే అర్హత లేదు. ఈ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీఏలో అడ్మిషన్‌ తీసుకుంది. అయితే ఇంజనీరింగ్‌ కోర్సు చెల్లదు కాబట్టి ఆ విద్యార్థి అడ్మిషన్‌ను తిరస్కరించాం.
- పాపిరెడ్డి, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...