Jump to content

Akhilesh Yadav , Mayawati


NTRYoungTiger

Recommended Posts

8 minutes ago, NTRYoungTiger said:

Samajwadi Party Chief Akhilesh Yadav gives twist to Chandrababu Naidu's Grand Alliance Efforts Akhilesh Yadav Praises Telangana Chief Minister K. Chandrashekar Rao for his efforts to bring Regional Parties together with 'Federal Front'. He will go to Hyderabad to meet KCR

 

whats cooking on ?

emi cook avvadhu.. UP lo SP and BSP tie up important. congress kalisina kalavakapoyina doesn't matter much. RJ, MP, GJ lo congress can do on its own. MH lo Congi and Pawar tieup confirm, KA lo congi and JDS tieup. Other big states lo regional parties dominant. so whatever they say now, at the end no one can do anything other than coming together and forming an alliance.

Link to comment
Share on other sites

3 hours ago, krantionline29 said:

Oh my Naveen patnaik.. ide smiley esava aa roju ? Ekada nindi vastar vya..konchem constructive discussion cheyali kani agenda based posts prati thread lo..em upayogam evarki upayogam

Bhayya.. okati adugutaa. cheppandi. Kukka Bow Bow ani kaakunda vere emaina morugutunda? 

Link to comment
Share on other sites

Dora ni baaaga ongo petti podduneee flight lo intiki pampincharu

Naveen and mamatha kalisinappudu kathi,thurumu ani vellipoyaka fuckoff annaru

Maya Delhi lo ne undi appointment ivvakunda pora pakodi andi

Akilesh ichina appointment kuda cancil chesi Hyd vachi kalustha ani barnal rasi pampinchadu

Ippudu maa Dora Hyd lo digina ventaneee tour grand success andaru nanne PM candidate ga undamannaru ani chebuthadu inka mana free food batch start chestharu:applause:

 

 

Link to comment
Share on other sites

అంతటి అనుభవం అన్ని రాజకీయ విన్యాసాలు తెలిసిన చంద్రబాబు లాటి నేత ఏ పార్టీకి ఆ పార్టీ ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రం విధానం తీసుకుంటాయని అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ మాటకొస్తే మమత, మాయావతి, అఖిలేశ్‌ వంటి వారూ రాహుల్‌ నాయకత్వాన్ని ఒప్పుకోరు. అగ్రవర్ణాల వోట్లు చీలాలంటే వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌, తాము విడిగా పోటీ చేస్తే ఎక్కువ ఉపయోగమని ఎస్‌పి, బిఎస్‌పి భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ టిడిపి కలసి వెళతాయో లేదో లెక్కలు తేలలేదు. కనుక చంద్రజాలం అన్ని చోట్లా ఒకేలా వుండదు సరికదా అతిగా నొక్కితే గందరగోళమే మిగులుతుంది.
 
టిఆర్‌ఎస్‌ ఘన విజయంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమరం ముగిసిపోయింది గాని అంతకు ఆరు నెలల ముందు నుంచి ఆంధ్రప్రదేశ్‌ అప్రకటిత రాజకీయ కురుక్షేత్రంగా కొనసాగుతున్నది. తెలుగుదేశం ఎన్‌డిఏ నుంచి నిష్క్రమించి మోదీ సర్కారుపై అవిశ్వాసం పెట్టింది మొదలు ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు కాళ్లు ఒక చోట పెట్టకుండా తిరుగుతూనే వున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంలో తీవ్రమైన నిరసన కార్యక్రమం, ప్రచార తతంగం మొదలెట్టారు. కమ్యూనిస్టు కాంగ్రెస్‌ పార్టీలు కూడా నిరసన చెబుతున్నాయి గాని ఆ తీరు వేరు. ప్రత్యేక హోదా నిరాకరించినందుకు, ఆర్థిక సహాయం నిధుల మంజూరులో అలక్ష్యానికి కేంద్రాన్ని తప్పక నిలదీయవలసిందే. గత ఎన్నికల్లో నమ్మి ఓట్లేసిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన మోదీ నిస్సందేహంగా అభిశంసనకు పాత్రుడు. నల్లజండాలు గో బ్యాక్‌లు కూడా కొత్త కాదు. అయితే నాలుగేళ్లపాటు ఆయనతో సహవాసం చేసి అంతా అద్భుతంగా వుందని వంతపాడిన చంద్రబాబు అరివీరభయంకర భంగిమలో మోదీ వ్యతిరేకి తానేనంటూ తక్కిన వారందరిపై బిజెపి కుమ్మక్కు ముద్ర వేస్తే ఎలా చెల్లుతుంది? ఆ వూపులో జగన్‌ పవన్‌లపైకి దాడి మళ్లించి తాజా ఎన్నికల తర్వాత కెసిఆర్‌ను తీసుకొచ్చి జోడిస్తే నమ్మడం ఎలా కుదురుతుంది? టిడిపి రాజకీయాలే ఎపి ప్రయోజనాలంటే ఇతరులు ఎందుకు ఒప్పుకోవాలి? మీరు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఒప్పుకోలేదు గనక బిజెపితో వున్నట్టేననని వాదించడం ఎలాటి తర్కం?
 
బిజెపికి అతి పెద్ద నేస్తంగా వున్న దశపోయి అతి తీవ్ర ప్రత్యర్థిగా మారానంటున్న చంద్రబాబు కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ఆమోదించడం ఆయన నిర్ణయం. అలా బిజెపి వ్యతిరేక శిబిరంలోకి తాను కొత్తగా ప్రవేశించి తానే దాని సమన్వయకర్తగా మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెసేతర పార్టీలేవీ ఆయన క్లెయిమును బలపర్చిన దాఖలాలు లేవు, ఆ అవకాశం కూడా వుండదు. కమ్యూనిస్టు, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలను మినహాయిస్తే మిగిలిన వారి నాయకత్వాన్ని ఎవరూ అంత తేలిగ్గా ఆమోదించరన్నది వాస్తవం. కర్ణాకటలో కూడా జెడిఎస్‌ నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించిందనేది నిజం. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. యుపిలో కూడా ఎస్‌పి బిఎస్‌పి చేతులు కలిపాయి తప్ప కాంగ్రెస్‌ను కలుపుకోలేదు. బిజెపి మతతత్వ రాజకీయాలను ఏ ఒక్కరికన్నా తీవ్రంగా వ్యతిరేకించి పోరాడే సిపిఎం కూడా కాంగ్రెస్‌ నాయకత్వమే శరణ్యమన్న వాదనను ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు ఎవరిని బలపరిస్తే వారితో వెళ్లవలసిన లేదా ఆయన వ్యతిరేకతను బట్టి వ్యవహరించవలసిన అవసరం ఇతరులకు ఏముంది? ఎపిలో బలాబలాలను బట్టి ఆయన చేపట్టే ఎత్తుగడలు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ కెసిఆర్‌లు కూడా ఎందుకు పాటిస్తారు?
 
    మరి 2014లో ఆయన రెండు చోట్ల బిజెపితో కలసి వెళ్లినప్పుడే వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు ఆయన కోసం శీలపరీక్ష చేసి నిబద్ధత నిరూపించుకోవలసిన అవసరం వుందా? ఇలాటి ప్రశ్నలు వేస్తే టిడిపి వ్యతిరేకులనీ లేదా వైసీపీ జనసేన మద్దతుదారులని ముద్ర వేసేస్తారు. ఏకంగా బిజెపితో అంటకడతారు. గతంలో ఇందిరాగాంధీ కూడా తనను వ్యతిరేకించే వారందరూ ప్రతీప శక్తులనీ అభివృద్ధి నిరోధకులనీ ఆరోపించేవారు. ఆ పేరుతోనే ఆమె అత్యవసర పరిస్థితి పేరిట ప్రత్యక్ష నియంతృత్వమే అమలు చేశారు. (అప్పుడు చంద్రబాబు ఆ పార్టీతోనే వున్నారు గనక ఆ ఎత్తుగడలు నేర్చుకుని వుండొచ్చు. ఆమె మనవడి హయాంలో ఇప్పుడు ఉపయోగిస్తుండొచ్చు. తన మనుగడ కోసం ఆయన చేసే ప్రచారాలను అందరూ ఆమోదించేస్తారనుకుంటే మాత్రం అవాస్తవికతే అవుతుంది.)
 
చంద్రబాబు విడుదల చేస్తున్నవి శ్వేతపత్రాలు కాదు, భూత పత్రాలని నేనన్నాను. ఎందుకంటే అవన్నీ భూత కాలానికి సంబంధించినవి. ఇదే శీర్షికలో ఎన్నోసార్లు నేనే వాటిని ఏకరువు పెట్టాను. అప్పుడు నన్ను ఖండించారు. హోదా బదులు ప్యాకేజీ వల్ల ప్రయోజనాలను వల్లెవేశారు. ప్రస్తుతం ఛానళ్లను బద్దలు కొడుతున్న ఆ పార్టీ ప్రతినిధులే అప్పట్లో ఆ పవిత్ర కర్తవ్యం నిర్వహించారు. బిచ్చగాడిని వెళ్లిపొమ్మనడానికి కూడా అత్తకు తప్ప కోడలికి అధికారం లేదన్న కథలో వలె హోదా ప్యాకేజీలపై తాను కాదంటే సత్యం ఇతరులు కాదన్నప్పుడు తప్పు అని టిడిపి వాదిస్తే అయిపోదు. ప్రత్యేక వంచన పేరిట ఈ విషయంలో నేను రెండు పుస్తకాలు రాశాను. పవన్‌ కళ్యాణ్‌ జెఎఫ్‌సి వేసి వాదించారు. వైసీపీ ఎంపిలు రాజీనామా చేసి అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆఖరుకు 2018 మార్చి4న టిడిపి ఇంకా బిజెపితో తెగతెంపులు చేసుకోకముందే, చంద్రబాబు ఆలోచనలు తెమలకముందే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సూటిగా ప్రత్యేక హోదాను బలపర్చారు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని పవన్‌ మొదటే ధ్వజమెత్తారు.
 
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక హోదా సాధన సమితి వంటివి నిరంతరం పోరాడుతున్నాయి. చాలాసార్లు చెప్పుకున్నట్టు ఆ దశలో టిడిపి ప్యాకేజీ భజన చేసింది. అందుకు సత్కారాలు చేసింది. కాదన్నవారిపై విరుచుకుపడింది. కేసులు పెట్టింది. ఇదంతా ఇటీవలి చరిత్రే. ఈ వైఖరిని అలుసుగా తీసుకున్నందునే మోదీ సర్కారు ఎపికి ఇచ్చిన హామీలను ఏకపక్షంగా తోసిపుచ్చింది. చివరాఖరి వరకూ అలా కానిచ్చిన అధినేత పతాక సన్నివేశంలో వ్యతిరేక పతాకం ఎత్తుకుని అప్పటి వరకూ వ్యతిరేకిస్తున్నవారిపై దాడి మొదలుపెట్టారు. సోనియా గాంధీపై తిరుగుబాటు చేసి జగన్‌ స్థాపించిన వైసీపీని పిల్లకాంగ్రెస్‌ అన్నవారు ఇప్పుడు టిడిపికి ఆ ‘ప్రత్యేక హోదా’ దక్కించుకోవడానికి ఇదై పోతున్నారు. పవన్‌ పాచిపోయిన లడ్డూగురించి మాట్టాడితే పరాచకాలాడి పరమ ప్రసాదమని ప్రశంసించి పరవశించిన వారు ఇప్పుడు ఆయనను మోదీతో కలిపేస్తున్నారు. పనిలో పనిగా పవన్‌ జగన్‌ ఒకటేనని మరో ఉప పల్లవి వినిపిస్తున్నారు. బలమైన పోటీ దారులుగా లేరు గనక ఒక వేళ ఆరోపించినా నమ్మరు గనక కమ్యూనిస్టులను మాత్రం వదలిపెట్టారన్నమాట.
 
  వైసీపీ, జనసేన కూడా బిజెపిని తీవ్రంగా విమర్శిస్తే సంతోషమే గాని అది వారి విధానాన్ని బట్టి జరుగుతుంది. మీరు భజన చేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసమని నమ్మమంటున్నవారు వారి మౌనాన్ని మాత్రం మహాద్రోహంగా చిత్రించడమేమిటి? మోదీపై ఏకోన్ముఖంగా జరగాల్సిన దాడిలో ఇతరులను వాటాదారులను చేసి ఆయన పాత్రను చిన్నది చేయడమేమిటి? లోటు భర్తీ, వెనకబడినప్రాంతాల నిధులు హోదా ఏ విషయంలోనైనా సరే మీరు కొత్తగా పత్రాలలో చెబుతున్నదేమిటి? ఈ సమయంలోనే మాజీ మంత్రి మాణిక్యాల రావు వంటివారు రాజీనామా చేస్తామని మరో పోటీ నాటకం నడిపిస్తున్నారు. ఏతావాతా పైన బిజెపి కింద టిడిపి కలిపి కథ నడిపించి ఇప్పుడు ఒకరిని ఒకరు అనుకోవడం కొత్త ట్విస్టు. అయితే అన్నీ చూస్తున్న ప్రజలకు మాత్రం ఎవరి పాత్ర ఏమిటో బాగా తెలుసు.
 
బిజెపి గతంలో చేసిన అన్యాయాన్ని చక్కదిద్దుకునే బదులు అసలు హోదా అవసరం లేదని 15వ ఆర్థిక సంఘానికి ముందస్తుగా మహజరు నిచ్చింది. గతంలో ఇచ్చిన మట్టి నీరునే ఖాయం చేసుకోమంటున్నది. అలాటి పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వ ప్రధానిగా మోదీ మాటలు ఎపి ప్రజలు ఎంతమాత్రం ఆలకించబోరు సరికదా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతారు. విభజన చట్టంలో 14 అంశాలుంటే కేంద్రం 9 అంశాలు పూర్తిగా విస్మరించింది. తక్కిన ఐదింటిని కూడా అరకొరగా అమలు చేసింది.
ఇచ్చానంటున్న వాటిలో కూడా 11 విశ్వవిద్యాలయాలకు రూ.12, 746 కోట్లు ఇవ్వాల్సి వుంటే 840 కోట్లు మాత్రమే విదిల్చింది. హోదాకు బదులు ప్యాకేజీ అంటూ ఆఖరుకు హళ్లికి హళ్లి సున్నకు సున్న చుట్టింది. 29 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టిన, ప్రధానిని కలిసిన ఎపి ముఖ్యమంత్రి ఆ సమయంలో వీటిని కనీసంగా చెప్పింది లేదు. ఇప్పుడేమో ఎన్నికల విజయం తర్వాత కెసిఆర్‌ పర్యటనలో మోదీని కలిస్తే అడ్డుపడ్డారని ఆరోపిస్తున్నారు. వైసీపీ, టిఆర్‌ఎస్‌, జనసేన ఎవరితో కలుస్తాయో, ఎపిలో రాజకీయాలకు వస్తే కెసిఆర్‌ ఎవరిని బలపరుస్తారో తమకు చెప్పాలంటున్నారు. కాంగ్రెస్‌ బిజెపిల మధ్య తేల్చుకోవాలని శాసిస్తున్నారు. అంతటి అనుభవం అన్ని రాజకీయ విన్యాసాలు తెలిసిన చంద్రబాబు లాంటి నేత ఏ పార్టీకి ఆ పార్టీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విధానం తీసుకుంటాయని అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
గంగాస్నానానికి కొండుభొట్లవారి ఆజ్ఞ అన్నట్టు ఎవరూ ఎవరి అనుమతీ తీసుకోనవసరంలేదు. ఆ మాటకొస్తే మమత, మాయావతి, అఖిలేశ్‌ వంటి వారు కూడా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకోరు. అగ్రవర్ణాల వోట్లు చీలాలంటే వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌, తాము విడిగా పోటీచేస్తే ఎక్కువ ఉపయోగమని ఎస్‌పి, బిఎస్‌పి భావిస్తున్నాయి. ఎపిలో కూడా కాంగ్రెస్‌, టిడిపి కలసి వెళతాయో లేదో లెక్కలు తేలలేదు. కనుక చంద్రజాలం అన్ని చోట్లా ఒకేలా వుండదు సరికదా అతిగా నొక్కితే గందరగోళమే మిగులుతుంది. ఈ రెంటినీ కలిపితే మోదీకే మేలు. పవన జగన నామస్మరణలు వారికీ మేలే. తెలంగాణ చంద్రుడి రాకకు ముందే రంగం సిద్ధం చేయడమూ అవుతుంది. ఎప్పుడు ఎవరిపై చేసే పోరాటం వారిపై జరగాలి. ముందు మోదీ గో బ్యాక్‌ అయిపోతే ఎన్నికలలో ఇతరులపై పోరాటం చేయొచ్చు. అన్నీ కలిపితే
మొదటికే మోసం ఖాయం. 
తెలకపల్లి రవి 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...