Jump to content

చంద్రబాబును కలిసిన ఒడిషా ఎంపీ


sonykongara

Recommended Posts

Today naveen send his MP to amaravati to extend his support to Naidu`s Front

చంద్రబాబును కలిసిన ఒడిషా ఎంపీ
25-12-2018 22:29:21
 
636813738845636286.jpg
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబును ఒడిషా ఎంపీ సౌమ్యా రంజన్ కలిశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా సౌమ్య రంజన్ బాబును కలిశారు. ఈ సమావేశంలో మహిళ రిజర్వేషన్లు, ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ వంటి అంశాలపై చర్చించారు. పలు జాతీయ అంశాలపై కలిసి పని చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిపారు. పోలవరం సహా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుందాని ఈ సందర్భంగా సౌమ్య రంజన్ బాబుతో తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో చంద్రబాబు బాసటగా ఉంటామన్న ఎంపీ సౌమ్య రంజన్ హామీ ఇచ్చారు.
DvRpkISU8AAo24d.jpg
Link to comment
Share on other sites

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్.

మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రస్తావించిన ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్.

తన ప్రతినిధిగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి రావాలని ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ను పంపించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తిన అభ్యంతరాలకు మద్ధతు తెలుపుతున్న ఒడిషా సీయం.

ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

మద్దతు తెలిపిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.

ఈ అంశంతో పాటు పలు జాతీయ అంశాలపై కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ చర్చలు.

ఒడిషా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలు కొనసాగాలని ఉభయుల ఆకాంక్ష.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యల్ని కూర్చుని చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ఒడిషా ఎంపీ రంజన్ పట్నాయక్.

ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ స్థాయిలో జరిపే పోరాటంలో బాసటగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన ఒడిషా ఎంపీ పట్నాయక్.

Link to comment
Share on other sites

మేము చంద్రబాబు వైపే.. ఒడిసా సీఎం పట్నాయక్‌ సందేశం!
26-12-2018 02:18:41
 
636813875230567901.jpg
  • బీజేపీ వ్యతిరేక కూటమికి నవీన్‌ సై
  • ఒడిసా సీఎం పట్నాయక్‌ సందేశం
  • బీజేడీ ఎంపీ ద్వారా బాబుకు లేఖ
  • కేంద్రంలో బీజేపీ దిగిపోవాలి!
  • ప్రాంతీయ పార్టీలన్నీ కలిసివెళ్లాలి
  • ఒడిసా సీఎంను కేసీఆర్‌ కలిసిన రెండోరోజే కీలక పరిణామం
  • పోలవరంపైనా సానుకూల చర్చలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ సారథి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసిన రెండోరోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నవీన్‌ పట్నాయక్‌ ప్రతినిధిగా బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ మంగళవారం అమరావతికి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుమారు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిసా వైఖరులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన స్వయంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా పాల్గొన్నారు. తమ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇచ్చిన లేఖను సౌమ్యా రంజన్‌ ఈ సందర్భంగా చంద్రబాబుకు అందించారు.
 
 
తాము కూడా బీజేపీయేతర కూటమివైపు మొగ్గుచూపుతున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘‘బీజేపీ దిగిపోవాలన్నది మా అభిమతం. అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. దీనిపై అంతా కలిసి పోరాడదాం’’ అని ఆ లేఖలో నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒక వేదికపైకి రావడంపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి రాకూడదన్నది తమ నాయకుడి అభిమతమని సౌమ్యా రంజన్‌ పేర్కొనట్లు తెలిసింది. మరోవైపు పోలవరానికి సంబంధించి ఒడిసాలో ముంపు ప్రాంతంపైనా చర్చ జరిగింది. సమస్యలు ఏమున్నా కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అనుకున్నారు. కాగా, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, అది ప్రజాస్వామ్యాన్ని నడిపించే శక్తి అని చంద్రబాబు చెప్పారు. కీలకమైన ఫలితాలను నిర్ణయించే అంశాన్ని.. కంప్యూటర్‌ చిప్‌లు తయారుచేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బ్యాలెట్‌ ఓటింగ్‌పైనే అందరికీ విశ్వాసం ఉంటుందని సీఎం అనగా, సౌమ్యా రంజన్‌ కూడా సానుకూలంగా స్పందించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...