Jump to content

కారెక్కనున్న తెదేపా ఎమ్మెల్యేలు!


KING007

Recommended Posts

కారెక్కనున్న తెదేపా ఎమ్మెల్యేలు!

 

కార్యకర్తలతో సండ్ర సమావేశం
మెచ్చా నాగేశ్వరరావుతోనూ భేటీ

221218brk-tdptrs.jpg

ఈనాడు, ఖమ్మం, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే తెలంగాణ శాసనసభలో తెదేపాకు ప్రాతినిధ్యం గల్లంతైనట్లే! ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ ఫిరాయింపుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం గురించి ముఖ్య నాయకులకు వివరించారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులతోపాటు ముఖ్య నేతల మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం సమంజసమేనని వారు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. తెరాసకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుని ఆధ్వర్యంలో ఈ వ్యవహారమంతా కొనసాగుతుండగా, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కొందరు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. తనకు తెరాస అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని.. ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు సమాచారం. సండ్రతో మాట్లాడిన తర్వాత మెచ్చా నాగేశ్వరరావు మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. తాను తెదేపాను వీడడంలేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు వినిపిస్తున్నవన్నీ వదంతులేనంటూ కొట్టి పారేశారు.

రమ్మంటే వెళ్లా: మెచ్చా నాగేశ్వరరావు
సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుకుందాం రమ్మంటూ తనను ఖమ్మం ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిన మాట నిజమేనని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ ఫిరాయింపు విషయమై సండ్ర తనతో చర్చించారని.. అయితే తనకు తెదేపాను వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

2 hours ago, vgchowdary said:

Opposition lekundaa em rajyam elutaataru dora palan laaga

 

27 minutes ago, rama123 said:

New type politics chestunnadu kcr gaadu.

 

 

10 minutes ago, rama123 said:

Veellu pothe hope assalu vundadu gaa

Vundali porradali.

 

 

ilaa cheyyaam dora ki kotta kaadhu, mallee cheyyamani mandate kuudaa  ichhaaru, cheseyyanivvatame, mancho chedo akkadi janame padathaaru.. cool baabuu cool.. akkada cheyyi daatindhi.. ikkada chejaarakundaa chethanainantha chuusukovaali.. 

Link to comment
Share on other sites

పార్టీ మారడంపై ఎమ్మెల్యే మెచ్చా స్పందన

2212brk-mecha1a.jpgహైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుపై అశ్వారావుపేట తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏదీ లేదని స్పష్టంచేశారు. తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన తెదేపాను వీడే ఆలోచన లేదని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. 

కాంగ్రెస్‌కు చెందిన నలుగురు శాసనమండలి సభ్యులు ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్‌ తెరాసలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తమ మండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని వారు ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ను అభ్యర్థించడం.. ఆయన ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెదేపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడతారన్న ప్రచారం ఊపందుకుంది.

సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. తనకు తెరాస అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని.. ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు సమాచారం. సండ్రతో మాట్లాడిన తర్వాత మెచ్చా నాగేశ్వరరావు మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ మారతారన్న ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో వాటిని మెచ్చా కొట్టిపారేశారు.

Link to comment
Share on other sites

టీఆర్ఎస్ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు?
22-12-2018 12:45:47
 
636810795452248004.jpg
ఖమ్మం: తెలంగాణలో టీడీపీని మరోసారి టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. తెలంగాణలో టీడీపీని లేకుండా చేస్తామంటూ మొదటి నుంచి చెప్పే టీఆర్ఎస్ అందుకు తగినట్టుగా మరోసారి పావులు కదుపుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావుకు వల విసిరింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం పొత్తులో భాగంగా 13 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇందులో రెండు చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఇప్పడు వీరిద్దరికీ టీఆర్ఎస్ గాలం వేసింది.
 
సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనేతలు ఈ ఇద్దరు నేతలతో చర్చలు జరిపారు. సండ్రకు కేబినెట్ పదవి, మచ్చాకు కార్పొరేషన్ పదవిని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుచరులతో సండ్ర వెంకటవీరయ్య చర్చలు జరిపారు. అటు మచ్చా నాగేశ్వరరావు కూడా సన్నిహితులతో మాట్లాడారు. ఈ నెలాఖరును వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

టీడీపీని వీడేది లేదు: మెచ్చా నాగేశ్వరరావు
22-12-2018 14:07:27
 
636810844456798644.jpg
ఖమ్మం: తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీ తరపున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీని వదిలేసి టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన లేదని మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...