Jump to content

ఎందుకీ అలసత్వం. పదే పదే చెబుతున్నాం : ముఖ్యమంత్రి


koushik_k

Recommended Posts

  • ఏమిటీ అలసత్వం !
  • తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదులో ఎమ్మెల్యేలు నిరుత్సాహం
  • చింతలపూడి, టీపీ గూడెంలో వెనకడుగు
  • 83 శాతంతో పాలకొల్లు టాప్‌
  • 24లోపు పూర్తి చేయాల్సిందే
  • అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించం
 
 
ఏలూరు: ‘మీలో ఎందుకీ అలసత్వం. పదే పదే చెబుతున్నాం. ఎన్నికల దగ్గరపడుతున్నాయి. మనంతట మనంగా బలపడాలి. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కాని ఇప్పటికే మీకు అప్పగించిన పనులపై సీరియస్‌ లేదు. ఈ నెల 24వ తేదీలోపు పార్టీ సభ్యత్వాలు పూర్తిచేసి తీరాల్సిందే’ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకింత అసహనం, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే మీకు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం అంతా జరిగి తీరాలి. ఒకటి, రెండుసార్లు ఇప్పటికే చెప్పాం. అర్ధం చేసుకుని పూర్తి చేయండి.. అని హితవు పలికారు. అమరావతి నుంచి ఎమ్మెల్యేలు,ఎంపీలతో సహా మిగతా ముఖ్యులతో బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఇంతకు ముందు మిగతావారికి మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. కాని ఈ సారి దీనికి భిన్నంగా అనేక రాజకీయ అంశాలను, పాలనా అంశాలను సీఎం చంద్రబాబు తానే ఏకరువుపెట్టారు.
 
 
50 శాతం మించని సభ్యత్వాలు...
రాష్ట్రంలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడంలో మొదటి పదినియోజకవర్గాల్లో ఈ జిల్లాకు సంబంధించి పాలకొల్లుకు స్థానం లభించింది. సుమారు 85 శాతం సభ్యత్వ నమోదుతో పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఈ సారి కూడా అధిష్ఠానం అభినందనలు అందు కున్నారు. జిల్లాలోనూ పాలకొల్లే మొదటిస్థానంలో నిలవగా.. అట్టడుగు స్థానంలో తాడేపల్లిగూడెం నమోదైంది. కేవలం 40 శాతంకు మించి సభ్యత్వం నమోదు చేయని నియోజకవర్గాలు అరడజను పైగానే ఉన్నాయి.ఇప్పటి వరకూ 15 నియోజకవర్గాల్లోనూ 4 లక్షల 70 వేలు మాత్రమే పూర్తిచేయగలిగారు. అంటే 50 శాతంకు మించి సభ్యత్వం కదల్లేదు.దీనిపై అధిష్ఠానం సీరియస్‌గా వ్యవహరించబోతుంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో 79 శాతం, ఆచంటలో 68 శాతం మాత్రమే సభ్యత్వం నమోదుకావడం విశేషం. మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడిలో కేవలం 28 శాతం పూర్తయింది. ఈ లెక్కన నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్ఠానం దృష్టిపెట్టి ప్రత్యేకంగా ఆరాతీయబోతుంది.
 
 
అసలేం జరుగుతుందంటే...
గతంలో పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశం వచ్చినా క్షణాల్లో ఎమ్మెల్యేలంతా ఆచరణలోకి దిగేవారు. క్షేత్రస్థాయి వరకు సమాచారం పంపేవారు. కిందిస్థాయి కేడర్‌ను అప్రమత్తం చేసేవారు. కాని ఏమైందో.. ఏమోగాని ఇటీవల ఎమ్మెల్యేల్లో పార్టీపరమైన వ్యవహారాల్లో కొంత నిరాసక్తత కనిపిస్తుంది. అంతకంటే మించి చేద్దాం.. చూద్దాం.. అనే ధోరణి.దీంతో జిల్లాలో సభ్యత్వంలో అనుకున్నంత పురోగతి సాధించలేకపోతున్నారు.ఆఖరికి మంత్రులు ప్రాతినిధ్యం వహి స్తున్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 లక్షల 88 వేలు లక్ష్యంగా కాగా, ఈ సారి దానికి మరో మూడు లక్షలు అదనంగా చేర్చారు.
 
సగానికి సగం నియో జకవర్గాల్లో 50 శాతం లోబడే పార్టీ సభ్యత్వం నమోదైంది. వీటన్నింటిపైనా సీఎం చంద్రబాబు బుధవారం నిర్వ హించిన టెలికాన్ఫరెన్సులో సీరియస్‌ అయ్యారు. ఏ నియోజకవర్గాన్ని ప్రస్తావించకుండానే.. సభ్యత్వంలో ఎందుకు ఈ అలసత్వం అంటూ గట్టిగానే ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన గడువు మరో ఐదు రోజులే మిగిలి ఉంది. ఇంత స్వల్ప వ్యవధిలో లక్ష్య సాధన పూర్తవుతుందా? పార్టీ ఆదేశాలకు ఇప్పటికైనా ఎమ్మెల్యేలు విలువిస్తారా? తమంతట తాముగానే నియోజకవర్గాల స్థాయిలో ఎందుకు వెనుకంజ వేశారు? మరికొందరు అసలు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదు ఎందుకు? అనే ప్రశ్నల పరంపర పార్టీలో వినిపిస్తోంది.
Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

but why

 

peethala aunty pani cheyatleda

Outsider kadaa... Locals oka vargam, eevida sontha vargam kosam working. Friction ekkuva ayyindi

Sontha vargam kosam CRDA level IAS lani kooda hair care antondi :D

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

 chintalapudi candidate maarusthaaraa?

 sabyatvaala valla emainaa use vuntaayaa. vote vese vaallu etlaagu vesthaaru.

Cheppalemu. 

Last time sentiment tho kottesindi eevida. Mee kosam naa teacher udyogam vadulukuni vachhanu ani vipareetamaina sobbing panchayati

Link to comment
Share on other sites

3 minutes ago, AbbaiG said:

Peetala ni odistam ani 2014 lo CBN deggara noru jararu Jangareddygudem tammullu

"magallu aite, mee sontha candidate ni nilabetti gelipinchuku randi raa" ani reply

anni moosukuni vachharu

ishtam lekunda candidate ni ruddhithe result thedaa kodutundhi. itlaanti 10 seats vunte chaalu doola teeripothadhi. mla seat vodipothe tammullaku vache nashtam emi vundadhu. cbn ke cm seat loss . madhyapradesh lo konni chotla bjp candidate selection lo debbakottindhi. 7 seats tedaa tho cm seat poyindhi. 

Link to comment
Share on other sites

పశ్చిమ జిల్లాలో కూడా ఓ  మంత్రి, మరో మాజీమంత్రికి టికెట్లు దక్కడం అనుమానమే అనే పరిస్థితి పార్టీ వర్గాల్లో ఉంది.  కృష్ణాజిల్లాలో కూడా ఒకరిద్దరు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనని అంటున్నారు. సీనియారిటీ ఉన్నా పనితీరు సరిగా లేని తూర్పు కృష్ణా ప్రాంత ఎమ్మెల్యే పట్ల  సీఎం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పశ్చిమ కృష్ణ పరిధిలో ఓ నియోజకవర్గ ఇన్‌ఛార్జికి టికెట్‌ కష్టమే అంటున్నారు. జిల్లాలో మరికొందరు సిట్టింగ్‌లకు స్థాన చలనం తప్పదని సూచనలు ఉన్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు eenadu eroju news

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

పశ్చిమ జిల్లాలో కూడా ఓ  మంత్రి, మరో మాజీమంత్రికి టికెట్లు దక్కడం అనుమానమే అనే పరిస్థితి పార్టీ వర్గాల్లో ఉంది.  కృష్ణాజిల్లాలో కూడా ఒకరిద్దరు సిట్టింగ్‌లకు సీటు కష్టమేనని అంటున్నారు. సీనియారిటీ ఉన్నా పనితీరు సరిగా లేని తూర్పు కృష్ణా ప్రాంత ఎమ్మెల్యే పట్ల  సీఎం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పశ్చిమ కృష్ణ పరిధిలో ఓ నియోజకవర్గ ఇన్‌ఛార్జికి టికెట్‌ కష్టమే అంటున్నారు. జిల్లాలో మరికొందరు సిట్టింగ్‌లకు స్థాన చలనం తప్పదని సూచనలు ఉన్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు eenadu eroju news

Pedana and?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...