Jump to content

AP lo votes


sonykongara

Recommended Posts

1 hour ago, Hello26 said:

Per the above statement from EC.......Final Voters list will be released on Jan-04th ....so, people meevi check cheskondi. mee family, relatives, friends, Beneficiaries from TDP schemes and TDP supporters andarivi check  @akhil chcheyinchandi

mana leader ki undali uncle ruling lo ne unadu ga em pikuthavo piku ra giff

Link to comment
Share on other sites

ఓటర్ల కోసం కాల్‌సెంటర్‌
15-12-2018 03:23:46
 
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో తప్పులు, సవరణల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఎన్నికల కమిషన్‌(ఈసీ) అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఓట ర్లు ఎలాంటి ఫిర్యాదులనైనా నేరుగా ఈసీ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు కల్పిస్తోంది. సమస్యలు, ఫిర్యాదుల కోసం ఇప్పటికే ప్రత్యే క వెబ్‌సైట్‌, మెయిల్‌ ఐడీని ఏర్పాటు చేసిన ఈసీ.. ఓటర్లకు మ రింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 17న సాయంత్రం 5గంటలకు విజయవాడలోని వినాయక థియేటర్‌ ఎదురుగా రాష్ట్రస్థాయి కాల్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు.
Link to comment
Share on other sites

రాష్ట్రంలో 1.28 లక్షల ఓట్ల తొలగింపు
19-12-2018 02:47:21
 
636808050507570159.jpg
  • 20,65,032 ఓట్లు సక్రమమని నిర్ధారణ: సిసోడియా
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం 1,28,840ల ఓట్లను తొలగించింది. ఇందులో చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటూ వైసీపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన దరిమిలా.. ఎన్నికల కమిషన్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 25,47,019 అనుమానాస్పద ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు గుర్తించింది. వెంటనే నెల రోజులపాటు సిబ్బందితో జల్లెడపట్టించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది. 25,47,019 ఓట్లలో.. 1.28,840 ఓట్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించాల్సినవిగా గుర్తించింది. ఇందులో వలస వెళ్లిన ఓటర్లు, చనిపోయినవారు, డూప్లికేట్‌ ఓట్లుగా గుర్తించి ఎన్నికల జాబితాల నుంచి తొలగించింది. మిగిలిన 20,65,032 లక్షల ఓట్లు సక్రమమైనవిగా గుర్తించింది. ఇవి యథావిధిగా ఓటర్ల జాబితాలో కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆర్‌పీ సిసోడియా ంగళవారం వెల్లడించారు. ఇంటి పేర్లు, పేర్లు తప్పుగా నమోదైన 3,52,383 ఓటర్ల వివరాలను సరిచేసినట్లు తెలిపారు. అంధులైన ఓటర్ల కోసం బ్రెయిలీ లిపిలో ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రెయిలీ లిపిలో ఉన్న ఓటరు స్లిప్‌లు, ఓటరు కార్డులు కూడా ఇస్తామన్నారు. 9మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీతో సీఈవో సచివాలయంలో సమావేశమయ్యారు. దివ్యాంగుల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి వారితో ఎన్నికల సమయంలో ఒక యాడ్‌ రూపొందించి ప్రచారం కల్పిస్తామని సిసోడియా తెలిపారు.
 
పరిశీలనలో తేలింది ఇవీ..
  • అనుమానాస్పద ఓట్లు - 25,47,019
  • తొలగించిన ఓట్లు - 1,28,840
  • సరిచేసిన ఓట్లు - 3,52,383
  • డూప్లికేట్‌ ఓట్లు - 31,158
  • చనిపోయిన వారివి - 38,331
  • వలస వెళ్లిన వారివి - 54,516
  • విచారణ పూర్తి కానివి - 764
  • సక్రమమైన ఓట్లు - 20,65,032
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...