Jump to content

Central Institute of Plastics Engineering & Technology, Vijayawada


sonykongara

Recommended Posts

వేగంగా ‘సిపెట్‌’ నిర్మాణం
10-12-2018 09:41:06
 
636800316672601777.jpg
  • వచ్చే ఏడాది నుంచి ఇక్కడే తరగతులు
  • ప్రస్తుతం కొత్త ఆటోనగర్‌లో కళాశాల
సూరంపల్లి(గన్నవరం) : సిపెట్‌(సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ) భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి సిపెట్‌ తరగతులు ఇక్కడే నిర్వహించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం కొత్త ఆటోనగర్‌లో కళాశాల నడుస్తోంది. మండలంలోని సూరంపల్లిలో 12 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఏడాది నుంచి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ మౌల్డ్‌ టెక్నాలజీలో తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. పదో తరగతి పాసైన వారికి డిప్లొమా, బీఎస్సీ కెమిస్ర్టీ పూర్తి చేసిన వారికి పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సును ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌లో ప్రవేశపెట్టారు.
 
దీనిలో ఒక సంవత్సరం ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌, ఆరు నెలలు ఇండస్ర్టియల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. విద్యార్థులకు ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ సంస్థల్లో కనీస వేతనాలతో ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 500మంది విద్యార్థులు ప్రస్తుతం సిపెట్‌లో విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని వసతులతో భవనాలను నిర్మిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన ఉంటుంది. విద్యార్థుల సంఖ్య ప్రకారం రూములు నిర్మిస్తున్నారు. అకడమిక్‌ సెల్‌తో పాటు ప్లేస్‌మెంట్‌ సెల్‌ కలిగి ఉండటం ఈ సంస్థ ప్రత్యేకతగా చెబుతున్నారు. సిపెట్‌ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...