Jump to content

Independents in Telangana Elections


RKumar

Recommended Posts

దీటుగా స్వతంత్రులు? 
ఏడెనిమిది మందికి విజయావకాశాలు ఉన్నట్లు ప్రచారం 
మరికొందరు రెండో స్థానంలో నిలుస్తారని అంచనా 
ఈనాడు - హైదరాబాద్‌

ఈసారి ఎన్నికల్లో స్వతంత్రులే చక్రం తిప్పబోతున్నారా? కొన్ని సర్వేల ఫలితాల్లోనూ ఆరేడుగురు స్వతంత్రులు గెలుపొందుతారనే అంచనాలు వెలువడడంతో ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టీ వీరిపైనే ఉంది. సుమారు 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్‌ సరళినిబట్టి చూస్తే వీరిలో కొందరికి బాగానే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడెనిమిదిమంది విజయం సాధించే అవకాశాలున్నాయని గట్టి ప్రచారం జరుగుతోంది. కొందరు రెండో స్థానంలో ఉండవచ్చని అంచనా. 20 వేల నుంచి 25 వేల ఓట్లకు పైగా పొందే వారు కూడా ఆరేడుగురు ఉన్నారు. వీరి వల్ల తమ ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందనే భయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. స్వతంత్రులుగాను, బీఎల్‌ఎఫ్‌, బీఎస్పీ తదితర పార్టీల తరఫున పలువురు గట్టి పోటీ ఇచ్చారు.


శివకుమార్‌రెడ్డి(నారాయణపేట) 
8ts-main9a.jpg

నారాయణపేట నుంచి బీఎల్‌ఎఫ్‌ తరఫున పోటీ చేసిన శివకుమార్‌రెడ్డి తెరాస, భాజపాకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రధాన పోటీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసి 2,270 ఓట్లతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి రాకపోవడంతో బీఎల్‌ఎఫ్‌ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణకు దగ్గరి బంధువైన కె.శివకుమార్‌రెడ్డి సివిల్‌ ఇంజినీర్‌. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి.. తెదేపా అభ్యర్థి రాజేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత రాజేందర్‌రెడ్డి తెరాసలో చేరడంతోపాటు ఈసారి ఆ పార్టీ టికెట్‌ కూడా పొందడంతో శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈయనకు టికెట్‌ కోసం డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో బీఎల్‌ఎఫ్‌ టికెట్‌పై పోటీ చేశారు. కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి నాయకుల్లో ఎక్కువమంది ఈయనకే ప్రచారం చేశారు. కోయిల్‌కొండ మండలంలో తెరాస అభ్యర్థికి వచ్చే ఓట్లను బట్టి ఇక్కడి ఫలితం ఉంటుందని రాజకీయవర్గాల అంచనా.


జలంధర్‌రెడ్డి (మక్తల్‌) 
8ts-main9b.jpg

జలంధర్‌రెడ్డి మొదటిసారి మక్తల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంట్రాక్టరైన ఈయన మొదట కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి మద్దతుదారుగా ఉండేవారు. తర్వాత తెరాసలో చేరారు. నర్వ మండలంలోని 11 మంది కాంగ్రెస్‌ ఎంపీటీసీలను తనతో పాటు తీసుకెళ్లారు. అనంతరం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెరాసలో చేరడంతో పరిస్థితి తారుమారైంది. ఆయనను వ్యతిరేకించే వర్గం రామ్మోహన్‌రెడ్డికి టికెట్‌ రాకుండా ప్రయత్నించింది. ఫలితం లేకపోవడంతో చివరకు జలంధర్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఈయనకు తెరాసలో ఓ బలమైన నాయకుడి అండదండలున్నట్లు సమాచారం. ఈ స్థానంలో ప్రజాకూటమి అవగాహనలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేయడంతో కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా జలంధర్‌రెడ్డికి మద్దతుగా నిలిచినట్లు ప్రచారంలో ఉంది. 


రాములు నాయక్‌ (వైరా) 
8ts-main9g.jpg

కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసిన ఈయన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. రాములు నాయక్‌ ఎస్‌ఐగా పనిచేసి పదవీ విరమణ చేయగా, కుమారుడు, కోడలు ఆలిండియా సర్వీసులో ఉన్నారు. 2014లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించగా, ఒప్పందంలో భాగంగా సీపీఐకి కేటాయించారు. గత రెండేళ్లుగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఈయనకు టికెట్‌ కోసం కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నం చేశారు. అయితే కూటమి అవగాహనలో భాగంగా వైరా స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. దీంతోపాటు తెరాసలో తాజా మాజీ ఎమ్మెల్యేకు టికెట్‌ కేటాయించడంతో ఆ పార్టీలో అసమ్మతి చెలరేగింది. పలువురు రాజీనామా చేశారు. ఇటు కాంగ్రెస్‌ అటు తెరాస అసమ్మతి వర్గం అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టిపోటీ ఇచ్చారు. 


కోరుకంటి చందర్‌ (రామగుండం) 
8ts-main9d.jpg

ఈయన 2009లో తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తెరాస టికెట్‌ దక్కకపోవడంతో ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన సోమారపు సత్యనారాయణ తెరాసలో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. దీంతో చందర్‌ ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇవ్వడంతో మళ్లీ తిరుగుబాటు అభ్యర్థిగా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున పోటీచేశారు. ఒకసారి కార్పొరేటర్‌గా పని చేయడం, వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడం, నియోజకవర్గంలో మరింత పట్టుకోసం పని చేయడం తదితర కారణాలతో ఈయన గట్టిపోటీ ఇచ్చారు. తెరాసకు ప్రధాన పోటీ ఈయన నుంచే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. 


అనిల్‌కుమార్‌ జాదవ్‌ (బోథ్‌) 
8ts-main9e.jpg

మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. 2009, 2014లో ఓడిపోయారు. రెండుసార్లు సుమారు 35వేల ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈయనకు టికెట్‌కోసం డీసీసీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఈయనకు కాంగ్రెస్‌లోని ఓ వర్గం సహకరించినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది. 


గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి) 
8ts-main9f.jpg

సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న ఈయన మంత్రిగానూ పని చేశారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత కాలానికి సోదరుడు, మాజీ ఎంపీ వివేక్‌తో కలసి తెరాసలో చేరారు. ఈ ఎన్నికల్లో చెన్నూరు నుంచి తెరాస టికెట్‌ కోరారు. దక్కకపోవడంతో బెల్లంపల్లి నుంచి బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థిగా బరిలో దిగారు. కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. దీంతో తెరాస, సీపీఐ, బీఎస్పీల మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. 


మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) 
8ts-main9c.jpg

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీ చేశారు. మలక్‌పేట మాజీ ఎమ్మెల్యే అయిన మల్‌రెడ్డి గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇబ్రహీంపట్నం టికెట్‌ కోసం ప్రయత్నించారు. కాని కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశంకు దక్కింది. దీంతో మల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు ఈయన విజయం కోసం కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఓటర్లకు పిలుపునివ్వడం విశేషం. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా ఈయన కోసమే ఎక్కువగా పని చేసినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

అన్నా.. నువ్వు మా వాడివే! 
విజయావకాశాలున్న స్వతంత్ర..తిరుగుబాటు అభ్యర్థులకు   ప్రధాన పార్టీల వల 
ఫలితాల వెల్లడికి ముందే మంతనాలు 
డబ్బు, కీలక పదవులపై హామీలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగిన ఉత్కంఠభరిత ఎన్నికల పోరులో రాజకీయ పక్షాలు  ముందస్తు వ్యూహాలకు తెరతీశాయి. తెరాస, మహాకూటమి తామే అధికారంలోకి వస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్నాయి. ఒక వైపు గెలుపుపై భరోసా వ్యక్తం చేస్తూనే... మరో వైపు ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే ఎలా ముందుకు సాగాలనే అంశాలపై ఆయా పార్టీల కీలక నేతలు దృష్టి సారించారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇతరుల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితే ఉత్పన్నమయితే తగిన బలాన్ని కూడగట్టటానికి ఉన్న అవకాశాలపై తెరాస, ప్రజాకూటమి దృష్టి సారించాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల టికెట్లు దక్కకపోవడంతో ఇతర పార్టీల తరఫున అభ్యర్థులుగా బరిలోకి దిగి దీటుగా ప్రచారం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అభ్యర్థులుగా 15 మంది నిలిచారు. వీరిలో ఏడు లేదా ఎనిమిది మంది గెలిచే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. వీరితోపాటు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న తిరుగుబాటు అభ్యర్థులతో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు చర్చలు ప్రారంభించారు. ‘టికెట్‌ ఇవ్వలేకపోయినా నువ్వు మా వాడివే’ అంటూ దగ్గరయ్యేందుకు మాటలు కలుపుతున్నారు. అత్యంత సన్నిహితులైన వారితోనూ చర్చిస్తున్నారు. వారికి రాజకీయ గురువులుగా భావించే ముఖ్యనేతలూ రంగంలోకి దిగారు.

నీ మద్దతు మాకే కావాలి 
బలమైన అభ్యర్థులను తమ వైపునకు తిప్పుకొనే క్రమంలో ముందస్తు ఒప్పందాలూ జరుగుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలతో పాటు పదవులూ చర్చకు వస్తున్నాయి. ‘నీ మద్దతు మాకు ఉంటే ఎన్నికల ఖర్చు అంతా మేమే భరిస్తాం’అంటూ ఒక పార్టీ ముఖ్యనేత ఒకరు తిరుగుబాటు అభ్యర్థికి ప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గంలోకి తీసుకునే అంశాన్నీ ఆలోచిస్తామని, కేబినెట్‌ హోదా కలిగిన ఇతర పదవులైనా సరే ఇవ్వడానికి సిద్ధమని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై తిరుగుబాటు అభ్యర్థులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వేర్వేరు పార్టీల నేతలు సంప్రదిస్తుండటంతో మెరుగైన ప్రతిపాదనలపై దృష్టిసారించినట్లు తెలిసింది. ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెబుతూనే ఓట్ల లెక్కింపు రోజు చర్చిద్దామని చెప్పి దాటవేస్తున్నట్లు తెలిసింది. ఒక అభ్యర్థికి అయితే భారీ మొత్తంలో డబ్బు హామీతో పాటు కీలక పదవి, భవిష్యత్తులో ఆ స్థానంలో పార్టీ టికెట్పై కూడా భరోసా ఇస్తున్నారు. అవసరమైతే అగ్రనేతలతోనూ హామీ ఇప్పిస్తామని స్పష్టం చేస్తున్నారు.

అందరిదీ ముందస్తు వ్యూహమే 
భవిష్యత్తు వ్యూహంతో ప్రధాన పార్టీల నేతలు పరోక్షంగా కొందరు తిరుగుబాటు అభ్యర్థులకు ప్రచార, పోలింగ్‌ సమయంలో సహకరించినట్లు సమాచారం. సొంత పార్టీ అభ్యర్థులు బాగా వెనుకబడ్డారని గుర్తించిన చోట గెలవగలిగిన తిరుగుబాటు అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటు అందించడం వారి ముందు చూపునకు నిదర్శనం. వరుసగా పార్టీలు మారి తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారితో రెండు పార్టీల నేతలూ చర్చిస్తుండటం గమనార్హం. దక్షిణ తెలంగాణలో గెలుస్తాడని భావిస్తున్న ఒక తిరుగుబాటు అభ్యర్థితో ఇప్పటికే పలువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. ‘గెలిస్తే నువ్వు మా వాడివే. మా వైపే ఉండాలి.... నీకేం కావాలన్నా ఇస్తాం’ అని స్పష్టం చేస్తున్నారు. ఒక తిరుగుబాటు అభ్యర్థి... పార్టీ టికెట్‌ అడిగితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు నేను కావాలా? అని గట్టిగా నిలదీయగా... సర్దిచెప్పి మద్దతు కూడగట్టుకొనే యత్నం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Both TRS & Congress expecting HUNG Assembly Internally. Lekapothe they would not have went to Independents now.

TRS ayithe ghoram 100+ ani cheppi Independents venakala paduthond, why they are not confident?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...