Jump to content

కూకట్‌పల్లిలో రచ్చ రచ్చ చేస్తున్న టీఆర్ఎస్, వైసీపీ...


sonykongara

Recommended Posts

కూకట్‌పల్లిలో రచ్చ రచ్చ చేస్తున్న టీఆర్ఎస్, వైసీపీ...

 

kukatapalli-06122018.jpg
share.png

ఒక పక్క నందమూరి వంశం అంటే మాకు గౌరవం, హరికృష్ణ అంటే ప్రాణం అంటూ, కేసీఆర్ చెప్పిన చిలక పలుకులు తెలిసినవే. సెటిలర్ల ఓట్లు కోసం, అప్పట్లో అలా చేసారు. కాని అదే నందమూరి వంశం నుంచి, హరికృష్ణ కూతురు పోటీలో ఉంటే, ఆమె పై దండ యాత్ర చేస్తున్నారు. ఒక పక్క టీఆర్ఎస్ చేస్తున్న రచ్చకు తోడు, మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది అంటూ, అటు జనసేన, ఇటు జగన్ పార్టీ కూడా ఆమె ఓటమికి కలిసి పని చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న సుహాసిని మాత్రం, ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. సెంటిమెంట్ ప్రయోగించలేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. కాని టీఆర్ఎస్, వైసీపీ మాత్రం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమ పైత్యం చూపిస్తున్నారు. అక్కడ ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తున్నారు. దీంతో, కూకట్‌‌పల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

kukatapalli 06122018

సెటిలర్స్‌‌ను కొందరు టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు. వివరాల్లోకెళితే.. కూకట్‌పల్లిలోని సీబీఎన్ ఆర్మీ నాయకుడు బొల్లిన నాగేంద్ర ఇంట్లో ఉండగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి గాయపరిచారు. సుమారు 25 మంది నాగేంద్ర ఇంట్లోకి చొరబడి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్‌‌లో పెట్టి అనంతరం పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేయించారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం కూకట్‌‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తోడల్లుడు వాటర్ రవి (రవీంద్రారెడ్డి) ఆధ్వర్యంలో జరిగిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

kukatapalli 06122018

ఈ దాడికి పాల్పడిన వారిలో కాంచనపల్లి నాగరాజు దుర్గరాజు (వివేక్‌నగర్) నక్కా జశ్వంత్ ఆరోగ్యా రెడ్డి, కరుణాకర్‌రెడ్డిగా గుర్తించినట్లుగా సీబీఎన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు.. తమపై కుట్ర పన్ని దాడికి పాల్పడటమే కాకుండా టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తక్షణమే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సీబీఎన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరో పక్క నిన్న జూపూడి ప్రభాకర్ ఇంటి పై కూడా ఇలాగే దాడి చేసారు. మూడు సార్లు ఎన్నికలు కమిషన్, రెండు సార్లు పోలీసులు కలిసి దాడులు చేసి, చివరకు ఏమి దొరక్క వెళ్ళిపోతే, అక్కడ డబ్బులు దొరికాయంటూ, మీడియాలో తెరాస నాయకులు రచ్చ చేసారు. మొత్తానికి, ఓటమి తధ్యం అని తెలుసుకుని, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

Link to comment
Share on other sites

కూకట్‌పల్లిలో ఉద్రిక్తత.. సెటిలర్స్‌పై టీఆర్ఎస్ నాయకుల దాడి
06-12-2018 21:11:18
 
636797276116523384.jpg
హైదరాబాద్: నగరంలోని కూకట్‌‌పల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెటిలర్స్‌‌ను కొందరు టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు. వివరాల్లోకెళితే.. కూకట్‌పల్లిలోని సీబీఎన్ ఆర్మీ నాయకుడు బొల్లిన నాగేంద్ర ఇంట్లో ఉండగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి గాయపరిచారు. సుమారు 25 మంది నాగేంద్ర ఇంట్లోకి చొరబడి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్‌‌లో పెట్టి అనంతరం పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేయించారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
 
 
కాగా.. ఈ వ్యవహారం మొత్తం కూకట్‌‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తోడల్లుడు వాటర్ రవి (రవీంద్రారెడ్డి) ఆధ్వర్యంలో జరిగిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిలో కాంచనపల్లి నాగరాజు దుర్గరాజు (వివేక్‌నగర్) నక్కా జశ్వంత్ ఆరోగ్యా రెడ్డి, కరుణాకర్‌రెడ్డిగా గుర్తించినట్లుగా సీబీఎన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు.. తమపై కుట్ర పన్ని దాడికి పాల్పడటమే కాకుండా టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తక్షణమే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సీబీఎన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Link to comment
Share on other sites

డీసీపీ, ఏసీపీ తీరుపై మండిపడ్డ సుహాసిని
06-12-2018 16:43:14
 
636797113954007510.jpg
హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రజాఫ్రంట్ అభ్యర్థి నందమూరి సుహాసిని పోలీసులపై మండిపడుతున్నారు. మాదాపూర్‌ డీసీపీ, కూకట్‌పల్లి ఏసీపీపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర బహిరంగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీసీపీ బంధువు, కృష్ణారావుకు ఏసీపీ బంధువు అని చెప్పారు. తమ కింద పనిచేస్తున్న పోలీసుల ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలంటే... ఏసీపీ, డీసీపీలను వెంటనే బదిలీ చేయాలని సుహాసిని డిమాండ్ చేశారు. బాలాజీనగర్‌లో తమ బంధువులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దూషించి, దాడి చేస్తే పోలీసులు అడ్డుకోలేదన్నారు. అల్లాపూర్‌, ఓల్డ్‌బోయినపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు తరలించాలని నందమూరి సుహాసిని కోరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...