sonykongara 1,342 Posted December 6, 2018 ఆంధ్రజ్యోతి దినపత్రికపై తప్పుడు ప్రచారం.. 06-12-2018 20:42:28 సోషల్ మీడియాలో ప్రచారం పెడధోరణులు పడుతోంది. ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి కొన్ని సంస్థల విశ్వసనీయతకు ఎసరు పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికను వాహకంగా వినియోగించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారానికి ఏబీఎన్ చెక్‌పెట్టింది. అది ఎక్కడ మొదలైందో కనిపెట్టింది. ఎవరు సృష్టించారో శాస్త్రీయ, సాంకేతిక రుజువులు భద్రపరిచింది. తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై చట్టప్రకారం చర్యలకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో కొందరి పైత్యం పరాకాష్టకు చేరుతోంది. లేనివి ఉన్నట్లు సృష్టించడమే కాదు.. మార్ఫింగ్‌తో నిజమైన కంటెంట్‌ను తొలగించి.. ప్రజలను ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగిస్తున్న వాళ్లను తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ల దుర్బుద్ధితో ప్రజల్లో ఆదరణ ఉన్న సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గిట్టని పార్టీలపై బురద చల్లేందుకు సోషల్ మీడియాను ప్రత్యర్థులు విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. జనాన్ని నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కన్నింగ్ చేష్టలకు తెగబడుతున్నారు. ఏకంగా పత్రికలను వాహకాలుగా వినియోగించుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి విజయవాడ ఎడిషన్ పత్రికను వాహికగా చేసుకుని, మొదటిపేజీలో ఒక తప్పుడు వార్తను సృష్టించి.. దాన్ని రెండు రోజులుగా తెలంగాణలోని ఓ వర్గం విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఫోటోషాప్‌లో ఆ ఇమేజ్‌ను రూపొందించి దానికి సంబంధించి ఓ కామెంట్‌ను కూడా ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గుర్తించింది. ఈనెల 5వ తేదీన ప్రచురితమైన ఆంధ్రజ్యోతి పత్రిక మొదటిపేజీ మాస్టర్‌హెడ్‌ను మాత్రమే జాగ్రత్తగా కట్ చేసిన ఆ వ్యక్తులు.. అందులో పత్రికకు సంబంధం లేని ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వార్తను ముద్రించినట్లు ఫోటోషాప్‌లో క్రియేట్ చేశారు. ఆ వార్తను కూడా ముందుగానే డిజైన్ చేసుకొని.. ఆంధ్రజ్యోతి మాస్టర్ హెడ్‌కు జోడించారు. చూసేవాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా.. ఓ ప్రధాన పత్రిక మొదటిపేజీలో ఒక వార్తను ఎలా డిజైన్ చేస్తారో అలాగే చేశారు. ఆ వార్తను నమ్మేలా.. పక్కనే ఓ బహిరంగసభ ఫోటోను కూడా జోడించారు. వాస్తవానికి 5వ తేదీ ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో పూర్తిగా ఓ సంస్థకు సంబంధించిన అడ్వర్‌టైజ్‌మెంట్ ఉంది. వార్తలకు సంబంధించిన మొదటి పేజీని గమనిస్తే.. తెలంగాణ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన వార్త ఉంది. అయితే.. ఆంధ్రజ్యోతి పేరిట తప్పుడు మొదటి పేజీని సృష్టించిన వాళ్లు.. అడ్వర్‌టైజ్‌మెంట్ వచ్చిన తొలి పేజీ మాస్టర్‌హెడ్‌ను తమ తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకున్నారు. డిసెంబర్ 5వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రిక అసలు రూపం ఇది. తొలిపేజీలో ఓ సంస్థ ప్రకటన ఉంది.. ముఖ్య వార్తలకు వేదికైన మొదటి పేజీకి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మొదటి పేజీకి సంబంధమే లేదు. ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎదుటి పార్టీని కించపరిచేందుకు రూపొందించిన ఈ ఫోటోకు ఆంధ్రజ్యోతి దినపత్రికను వాహకంగా ఉపయోగించుకున్నారు. జనంలో పత్రికకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని.. ప్రజలు నమ్ముతారని భావించారు. కానీ.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వార్త అసలు ఆంధ్రజ్యోతికి సంబంధించినది కాదని కూడా వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు. బుధవారం నుంచి ఈ ఫోటో, దానికి సంబంధించిన వ్యాఖ్యలు వాట్సప్‌లో శరవేగంగా షికార్లు చేస్తున్నాయి. అయితే.. ఆంధ్రజ్యోతి పత్రిక విశ్వసనీయతను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ ఫోటోతో తప్పుడు ప్రచారం ఎక్కడ, ఎప్పుడు మొదలైందో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలు సంపాదించింది. మొట్టమొదటగా.. ఈనెల 5వ తేదీ ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాలకు ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫిర్ ఏక్ బార్ కేసీఆర్ అనే ట్విట్టర్ పేజీలో ఇది తొలిసారిగా పోస్ట్ అయ్యింది. అనిల్ టీఆర్‌ఎస్ హండ్రెడ్ ప్లస్ అనే ప్రొఫైల్‌తో ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న ఓ వినియోగదారుడు ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. ఐదవ తేదీకి సంబంధించిన దినపత్రికను మార్ఫింగ్ చేసి.. అదేరోజు తెల్లవారుజామున ఐదు గంటలకే ట్విట్టర్‌లో పోస్ట్ చేశారంటే పక్కా ప్లాన్ ప్రకారమే ముందుగా ఈ వార్తను డిజైన్ చేసుకొని.. ఆన్‌లైన్‌లో పత్రిక అందుబాటులోకి రాగానే.. మాస్టర్‌హెడ్‌ను జోడించి షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. గతంలో తాను విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాననీ, తెలంగాణ ఉద్యమకారుడిననీ అతను రాసుకున్నాడు. డిసెంబర్ ఐదవ తేదీ తెల్లవారుజామున ఐదుగంటల ఆరు నిమిషాలకు ట్విట్టర్‌లో ఈ తప్పుడు ఫోటో మొట్టమొదటగా అప్‌లోడ్ అయ్యింది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో కొందరు షేర్ చేసుకున్నారు. మరికొందరు రీట్వీట్లు చేశారు. అక్కడినుంచి ఫోటో వాట్సప్‌లోకీ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. వాట్సప్‌లో వ్యాఖ్యాలతో సహా షేరింగ్‌లు సాగుతున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గుర్తించింది. అది ఎక్కడ మొదలైందో నిర్ధారించుకుంది. శాస్త్రీయంగా, సాంకేతికంగా ఆధారాలను సేకరించింది. సైబర్ చట్టాల ప్రకారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Share this post Link to post Share on other sites
Andhra Dada 205 Posted December 6, 2018 Okadini bokkalo Este migathavallaki buddi vastundi..waste Naa kondelu Share this post Link to post Share on other sites