Jump to content

Lagadapati - more details


nvkrishna

Recommended Posts

3 hours ago, nvkrishna said:

TDP vote share in Telangana:

 

August 30, 2018: 5-6%

December 5, 2018: 20%

 

2.png

 

 

Estimate the results......if TDP at 20%

 

This is August number

 

votes.png

trs significant ga padipoddi ga tdp 20% regain cheste...almost 12% padipoddi ante around 30% levels ki vachestadi

Link to comment
Share on other sites

  • Replies 256
  • Created
  • Last Reply
1 minute ago, nvkrishna said:

Due to revanth arrest incident, expecting Mahabubnagar will move towards Kutami.

If once TDP batch came back in nizamabad like in Warangal, it will become a big victory for Kutami

 

But, may lose 5-6 seats due to weakness in money distribution

overall 65-70 range aithe pakka anpistundi

Link to comment
Share on other sites

కేటీఆరే నన్ను కలిశారు
06-12-2018 02:40:24
 
636796655185444978.jpg
  • సర్వే గురించి వివరాలడిగారు.. అప్పట్లో టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు
  • 65-75 సీట్లు వచ్చే అవకాశం.. కానీ 65 ు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
  • కేటీఆర్‌కు అదే మాట చెప్పాను.. చాన్స్‌ ఉంటే మార్చుకోమని చెప్పా
  • మళ్లీ ఆయనే నన్ను సంప్రదించారు.. 23 చోట్ల సర్వే చేయాలన్నారు
  • 37 చోట్ల చేసి వివరాలిచ్చా.. టీడీపీతో కలిస్తే ‘వార్‌ వన్‌సైడ్‌’ అని చెప్పా
  • సింగిల్‌గానే కొట్టేస్తామన్నారు.. నా చేదు నిజాలు ఆయనకు నచ్చలేదు
  • మా వాట్సాప్‌ చాట్‌ నిజమే.. సీట్ల గొడవతో తొలుత ‘ఫ్రంట్‌’పై విముఖత
  • హామీలతో ప్రజాభిప్రాయం మారింది.. వరంగల్‌లోనూ ‘ఫ్రంట్‌’కే ఆధిక్యం
  • గజ్వేల్‌లో ‘ఆయన’ ఓడిపోతారని అక్కడి పోలీసులే నాకు చెప్పారు
  • వారిదే స్వీప్‌ అని టి-ఉద్యోగులూ తేల్చిచెప్పారు.. లగడపాటి వ్యాఖ్యలు
‘‘సెప్టెంబరులో ఒక మీడియా కోసం మా టీమ్‌ సర్వే చేస్తే అప్పుడు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తే.. ఎందుకు నువ్వు కేటీఆర్‌తో కుమ్మక్కు అయ్యావని నన్ను ఎవ్వరూ ప్రశ్నించలేదే? నిజాలు చేదుగా ఉంటాయి. తీపి, చేదును జీర్ణించుకోవడంలోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కేటీఆర్‌ అంటే నాకు నిజంగా ఇష్టం కూడా. ఆయన యువకుడు. ఉద్యమ సమయంలో నేను హరీశ్‌రావు గొడవలు పడ్డాం కానీ నేను కేటీఆర్‌ ఎప్పుడూ గొడవ పడలేదు’’
 
 
‘‘ఎన్నికల్లో గెలుపోటములుంటాయి. ఓడినంత మాత్రాన వేరే ఊరు వెళ్లక్కర్లేదు. మళ్లీ కష్టపడి పనిజేస్తే మళ్లీ గెలుపు వస్తుంది. ఎవరూ కూడా పర్సనల్‌గా తీసుకోకండి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే గెలుపుకి, ఓటమికి సిద్ధపడి ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చిందే గెలుపుకోసం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ప్రజలు ఏ ఒక్కరికీఎల్లకాలం పట్టం కట్టరన్నది ఎన్టీఆర్‌, ఇందిర హయంలో మనం చూశాం. అందుకని దయచేసీ ఎవరూ కూడా అహంభావానికి, అహంకారానికి వెళ్లకండి’’
హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎన్నికల సర్వే ఫలితాలను నిష్పక్షపాతంగా వెల్లడించానని.. ఈ విషయంలో తనపై ఎవరి ఒత్తిడీ లేదని, ఎవరికీ భయపడేది లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒత్తిడితోనే సర్వే ఫలితాలను లగడపాటి మార్చారంటూ మంగళవారం కేటీఆర్‌ పెట్టిన ట్వీట్‌పై ఆయన బుధవారం స్పందించారు. అప్పటి సర్వే ఫలితాలు.. కేటీఆర్‌తో సంభాషణ.. మారిన ప్రజాభిప్రాయం.. ఇలా అన్ని అంశాల గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. సెప్టెంబరులో సర్వే ఫలితాల గురించి కేటీఆరే తనను సంప్రదించారని, తన సమీపబంధువు ఇంటికి వచ్చి మరీ తనను కలుసుకున్నారని వివరించారు. తానిచ్చే సమాచారం కేటీఆర్‌కు నచ్చకపోవడంతో ఆయనకు సర్వే వివరాలు పంపడం మానుకున్నానని వివరించారు.
 
కేటీఆర్‌ ఎందుకు కలిశారంటే..
‘‘సెప్టెంబరు పదిహేనో.. పదహారునో.. కేటీఆర్‌ నన్ను మా సమీప బంధువు ఇంట్లో కలిశారు. అంతకుముందే మా ఆర్జీ ఫ్లాష్‌టీమ్‌ ఒక మీడియా సంస్థకు సర్వే చేసినట్టు సమాచారం వచ్చింది. దాన్ని తెలుసుకుందామని నా ఆప్తమిత్రుడితో ఫోన్‌ చేయించారు. అలా మా సమీపబంధువు ఇంట్లో కలిశాం.’’ అని లగడపాటి చెప్పారు. ‘సర్వే మాకు అనుకూలంగా ఉందట కదా?’ అని ఆరోజు కేటీఆర్‌ తనను అడిగారని, తాను ఆయన మెయిల్‌ ఐడీకి వివరాలు పంపిస్తానని చెప్పినట్టు వెల్లడించారు. ‘‘ఆరోజు ఆయనకు మెయిల్‌ పంపించాను. నాకు మా వాళ్లు చెప్పినదాని ప్రకారం అప్పటి పరిస్థితి టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉందని చెప్పాను. అయితే, 65% ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఉందని, అప్పటికే జాబితా విడుదల చేసినందున.. అవకాశం ఉంటే మార్చుకోమని చెప్పాను.
 
ఏ పార్టీ అయినా సరైన అభ్యర్థికి ఇవ్వకపోతే ఇండిపెండెంట్లను గెలిపించే పరిస్థితి ఉంది. ప్రజలకు కావాల్సిన అభ్యర్థిని కాకుండా ఎవరినైనా దిగుమతి చేసుకొని పెట్టొచ్చంటే ప్రజలు వ్యతిరేకిస్తారని నా అంచనాలో తేలింది. అదే చెప్పాను’’ అని వివరించారు. విపక్షం కంటే టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌లో 10 శాతం తేడా ఉంది. మరోవైపు టీడీపీకి 6శాతం, కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలకు కలిపితే 3శాతం ఉంది. మొత్తం 9శాతం అవుతుంది. కోదండరాం, సీపీఐ వాళ్లు ఎక్కువ సీట్లు అడిగితే మీకు మంచిదే. వారు ముగ్గురూ కలిసి 2009లో మీలాగా 40-50 సీట్లు తీసుకుంటే మీపై పాలు పోసినట్టే. వాళ్లు తక్కువ సీట్లు తీసుకుంటే ఓట్ల బదిలీ అవుతుంది’’ అని కేటీఆర్‌కు తెలిపానన్నారు.
 
బాబును కలుపుకొంటేనే...
‘‘చంద్రబాబు మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని పేపర్లో చూశా. ఎందుకు కలుపుకోకూడదని కేటీఆర్‌ను అడిగా. అప్పుడు మీకు వార్‌ వన్‌ సైడ్‌ అయిపోతుంది కదా అని కూడా అన్నా. కానీ అది కుదరదని, తాము సింగిల్‌గానే కొట్టేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘అయినా ఆ విషయం నాది కాదు. పెద్దాయన చూసుకుంటారు’ అని కేటీఆర్‌ చెప్పారు’’ అని లగడపాటి వివరించారు. టీఆర్‌ఎస్‌ ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదని అనడంతో.. ‘మీ ఇష్టం, వాళ్లంతా కలిస్తే మాత్రం పోటీ హోరాహోరీగా ఉంటుంది..దానికి సిద్ధపడాలి’ అని తాను సూచించినట్టు చెప్పారు.
 
23 అడిగితే.. 37 ఇచ్చా..
కేటీఆరే తనకు 23 నియోజకవర్గాల జాబితా ఇచ్చి సర్వే చేయాలని అడిగితే.. 37 నియోజకవర్గాల్లో సర్వే చేసి వివరాలు పంపినట్టు లగడపాటి వివరించారు. ‘‘దానికి నేను రూపాయి తీసుకోలేదు. పొలిటికల్‌ ఫేవర్‌, గవర్నమెంట్‌ ఫేవర్‌ అడగలేదు. నా దగ్గరికి ఎవరొచ్చినా సాయం చేస్తా. నాకు ప్రజల నాడి పసిగట్టే స్వభావం ఉంది. అడుగుతున్నారు కాబట్టి సర్వే పంపాను. అది కూడా నవంబర్‌ 11న పంపాను. ఆ 37లో అత్యధిక శాతం కాంగ్రెస్‌కు వస్తాయని చెప్పా. దానిపై కేటీఆర్‌ నాకు.. ‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంది (గ్రౌండ్‌ పొజిషన్‌ ఈజ్‌ వెరీ డిఫరెంట్‌)’’ అని మేసేజ్‌ పెట్టారు. ‘‘డిసెంబరు 11న దాన్ని మీరు చూస్తారు (యు విల్‌ సీ ఇట్‌ ఆన్‌ డిసెంబర్‌ 11)’’ అని చాలెంజ్‌ చేశారు’’ అని వెల్లడించారు. ‘‘దాన్ని ఆయన నమ్మలేదు. కరెక్టు కాదని ఖండించారు. ఆయనకు చేదు నిజం చెబితే ఇష్టం లేదోమోనని అనుకున్నా’’ అని తెలిపారు.
 
రిపోర్టు చూసి నిరాశపడవద్దని మెసేజ్‌ కూడా పంపినట్టు చెప్పారు. ‘‘రెండు వారాల నుంచి మీరు చేస్తున్న ఎఫర్ట్‌ చాలా బాగుంది. మీ నాన్నగారు బయటకు వచ్చి కొంచెం పాడు చేశారు. దాన్ని మీరు చక్కదిద్దుతున్నారని కేటీఆర్‌కు మేసేజ్‌ చేశా. నోరు పారేసుకోకండి. ఉపయోగం ఉండదు. అరెస్టులు చేయించకండి. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిని అరెస్టు చేయించడం సరికాదని చెప్పా’’ అని లగడపాటివివరించారు. ఎన్నికల సమయంలో అలా పోలీసు ఫోర్సును వాడటం వల్ల తేడా వస్తుందని, ఇది తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని కేటీఆర్‌కు చెప్పానన్నారు. అదేసమయంలో.. ప్రజాఫ్రంట్‌ సీట్ల పంపకంపై గందరగోళం నడుస్తోందని, దీంతో ప్రజలు ‘అరే.. మనమేదో ఓటేద్దామనుకుంటే వీరు వీరు కొట్టుకుంటాన్నారేంటి’ అని భావించారని లగడపాటి వెల్లడించారు.
 
అప్పుడున్న పరిస్థితిని కూడా కేటీఆర్‌కు మళ్లీ పంపానని తెలిపారు. ‘‘65-75 టీఆర్‌ఎ్‌సకు, కూటమికి 35-40 వస్తాయని నవంబర్‌ 20 కేటీఆర్‌కు వాట్సప్‌ ద్వారా పంపాను. దానికి కేటీఆర్‌ సంతృప్తి చెందలేదు. ‘మేం దాన్ని అధిగమిస్తాం, మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం (వి కెన్‌ సరపాస్‌ దట్‌. అండ్‌ సర్‌ప్రైజు యూ)’ అని సమాధానం ఇచ్చారు. నేను చాలెంజ్‌ చేయలేదు. ‘ఇంకా ప్రచారానికి 17 రోజులున్నాయి. మీ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ బాగున్నాయి. బాగా తెలుసు, గ్రేటర్‌లో తెలుసు. ఆల్‌ది బెస్ట్‌’ అని పంపాను.’’ అని వివరించారు. ‘‘చేదు నిజం పంపాను ఆయనకు నచ్చలేదు. మంచి నిజం పంపాను ఆయనకు చాల్లేదు. ఇక కేటీఆర్‌కు ఏదీ పంపకూడదు. ఏదున్నా ఏడో తారీఖునాడు పంచుకుందాంలే’’ అని నిర్ణయించుకున్నానని లగడపాటి వెల్లడించారు. సెప్టెంబర్‌ 16 నుంచి ప్రజల్లో డైనమిక్‌గా మార్పు వచ్చిందన్నారు.
 
వరంగల్‌ జిల్లా కూడా హస్తానిదే
తన ఫ్లాష్‌ టీం సర్వే చేసి బుధవారం ఉదయం నాటికి అందించిన సమాచారం ప్రకారం.. వరంగల్‌ జిల్లా, పట్టణంలో కూడా కాంగ్రె్‌సదే ఆధిక్యమని లగడపాటి తెలిపారు. నిజామాబాద్‌కు కూడా తన బృందాన్ని పంపానని, ఆ వివరాలు బుధవారం సాయంత్రానికి అందుతాయని అన్నారు.
 
టి-ఉద్యోగులదీ అదే మాట..
ఫలితం ప్రజాఫ్రంట్‌ వైపే రాబోతోందని తెలంగాణ ఉద్యోగులు కూడా తనతో అన్నట్టు లగడపాటి చెప్పారు. ‘‘నవంబర్‌ 18న నా ఇంటికి సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో 30 మంది ఉద్యోగులు వచ్చారు. పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘మళ్లీ చెప్తానులే’ అన్నాను. దానికి వారు.. ‘మీరే చూస్తారు సార్‌, ఫలితం ఒకవైపు(ప్రజాఫ్రంట్‌) స్వీప్‌ అవబోతోంది’ అని నన్ను చాలెంజ్‌ చేసి వెళ్లారు. ‘గతంలో మీరంతా ఆయన వైపు( కేసీఆర్‌)ఉన్నారు కదా’ అని అడిగితే.. ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్‌ అంతా (టీఆర్‌ఎ్‌సకు) వ్యతిరేకమయ్యారని చెప్పారు. ఆ రోజు కూడా నేను వారితో ఏమీ చెప్పలేదు’’ అని వివరించారు. ‘‘నాకు, కేటీఆర్‌కు మధ్య సెప్టెంబర్‌ 17 నుంచి నవంబర్‌ 20 వరకు మాత్రమే వాట్సాప్‌ సంభాషణ జరిగింది. ఆ తర్వాత నేను ఏ రిపోర్టులూ పంపలేద’’ని చెప్పారు. కేటీఆర్‌కు తనకు మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణలను లగడపాటి మీడియాకు విడుదల చేశారు.
 
గజ్వేల్‌లో ‘ఆయన’ ఓటమి
ఈ మధ్య గజ్వేల్‌ వెళ్లాను.. అక్టోబరు 28న అనుకుంటా. గజ్వేల్‌, సిద్దిపేట చూద్దామని వెళ్లినప్పుడు పోలీసులు నా కారును చెక్‌ చేద్దామని ఆపారు. పరిశీలకుడిగా వెళ్తున్నా కాబట్టి ఎవరూ గుర్తుపట్టకూడదని కామ్‌గా కూర్చున్నా. కానీ ఒక కానిస్టేబుల్‌ నన్ను గుర్తు పట్టి అందరికీ చెప్పేశాడు. ఏడెనిమిది మంది పోలీసులు నా దగ్గరకు వచ్చి నాతో ఫొటోలు దిగారు. ‘మీ సర్వే గురించి చెప్పండి’ అని అడిగారు. ‘ఇంకా చాలా టైముంది. ఇప్పుడెలా చెప్తా?’ అన్నాను. ‘మీరెక్కడున్నారు’ అనడిగితే.. ‘ఇది గజ్వేల్‌’ అన్నారు. ‘ఇక్కడెలా ఉంది?’ అనడిగితే.. ‘పోతారు సార్‌’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు అన్నారు.
 
‘ఎవరు?’ అని అడిగా. ఈ సందర్భంలో పేరు చెప్పడం బాగోదుగానీ.. ఆయన ఓడిపోతారంటే ‘ఆ సమస్యే లేదు’ అన్నాన్నేను. ‘డిసెంబరు 11న మీరే చూస్తారు’ అంటూ చాలెంజ్‌ చేశారు. ‘‘రాష్ట్రం విడిపోతే దళితుడు ముఖ్యమంత్రి అన్నమాట నెరవేర్చారా? అధికారంలోకి వచ్చినవాళ్లు ఆ మాటే నెరవేర్చనప్పుడు.. ఏస్వార్థంలేని మీరెందుకు (రాజకీయాల నుంచి) తప్పుకోవాలి సార్‌? మీరు ఇక్కడొచ్చి పోటీ చేయండి. మేం గెలిపిస్తాం’’ అని తెలంగాణ కానిస్టేబుళ్లు అంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదంతా గమనించుకుని మార్పు చేసుకోవాలికానీ, పోట్లాడితేనో తిడితేనో సమస్య పరిష్కారం కాదు.
 
ప్రభుత్వ వ్యతిరేకతకు కారణాలివే
ఎన్నికల్లో పోరు హోరాహోరీగా ఉంటే.. ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంశం బలంగా బయటకు వస్తుందని, సిట్టింగ్‌లపై వ్యతిరేకతతో మరొకరికి ఓటు వేద్దామని ప్రజలు అనుకుంటారని కేటీఆర్‌కు తెలిపినట్టు లగడపాటి వివరించారు. గత పదిహేను రోజులుగా ఓటింగ్‌ ఇలాగే పోలరైజ్‌ అవుతూ వస్తోందని ఆయన వివరించారు. ‘‘ప్రభుత్వం ఎప్పుడూ ఆధిక్యతలో ఉండాలి కానీ, పోటాపోటీ పరిస్థితికి రాకుండా చూసుకోవాలి’’ అని సూచించారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరగడానికి గల కారణాలను వెల్లడించారు. (కాంగ్రె్‌సకు) బాబు, కోదండ, సీపీఐ కలిసి పోటాపోటీ వాతావరణం వచ్చాక ప్రజలు ఎమ్మెల్యేల నెగెటివ్‌తో పాటు ప్రభుత్వ నెగెటివ్‌ కూడా చూడటం మొదలుపెట్టారు.
 
దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్టీలకు 12% రిజర్వేషన్‌ ఇవ్వలేదని ఆదిలాబాద్‌, వరంగల్‌లోని ఎస్సీ, ఎస్టీ బెల్ట్‌ అంతా వన్‌సైడ్‌గా మారిపోయిందని మా పరిశీలనలో తేలింది. గెలిస్తే దళితుణ్ణి చేస్తానన్న సీఎం మాట తప్పారనే విషయం ఇప్పుడు వారికి గుర్తుకు వచ్చింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు గ్రామాల్లో ఇచ్చి, పట్టణాల్లో ఇవ్వకపోవడంతో అర్బన్‌ ఓటర్లకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. దానికి పోటీగా కాంగ్రెస్‌ డబుల్‌ రానివాళ్లకు రూ.50 వేలు.. తాము రాగానే ఇస్తామన్నది. అలాగే కాంగ్రెస్‌ ఇళ్లు ఇస్తానంది. పెన్షన్లను పెంచడమే గాకుండా ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తానంది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంది. దీంతో ఓటర్ల నాడి మార్పు మా పరిశీలనలో కనిపించింది. మైనారిటీలు వేగంగా మారుతున్నారు. వారికి 12 శాతం రిజర్వేషన్స్‌ ఇస్తానన్న అంశం.. వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు గుర్తొచ్చింది.
Link to comment
Share on other sites

65% ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత 
సెప్టెంబరులోనే కేటీఆర్‌కు చెప్పా 
తెలంగాణలో ప్రజానాడి మారుతోంది 
కూటమితో పోటాపోటీ ఏర్పడింది 
వరంగల్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం 
కేటీఆర్‌ ట్విటర్‌ వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్‌ 
5ap-main4a.jpg
తెలంగాణలో సెప్టెంబరు 16 నుంచే ప్రజానాడి వేగంగా మారుతోంది. ప్రజాకూటమి కారణంగా పోటాపోటీ వాతావరణం తలెత్తింది. దాంతో గత 15 రోజుల నుంచి అంతకుముందు లేని వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తమవుతోంది. భూమి ఇవ్వలేదని ఎస్సీలు, 12% రిజర్వేషన్‌ ఏదని ఎస్టీలు అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు.. ప్రభుత్వం మాకేం ఇచ్చింది... చేసిందని చూస్తారు తప్ప భావోద్వేగాలు చూడరు. అందుకే తాజాగా వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉందని 
మా బృందం బుధవారం ఉదయమే చెప్పింది.

గతంలో తెదేపాకు 20 శాతం ఓట్లు ఉండగా చాలా వరకు అది తెరాసకు మళ్లింది. కాంగ్రెస్‌ తోడు దొరకడంతో తెదేపా శ్రేణులు మళ్లీ సొంతగూటికి చేరుకుంటున్నాయి. వీటన్నిటి వల్ల పరిస్థితి వేగంగా మారుతోంది.

  - లగడపాటి

ఈనాడు, హైదరాబాద్‌: ఎవరి ఒత్తిడితోనూ ఎన్నికల సర్వే ఫలితాలు మార్చే వ్యక్తిత్వం తనది కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 
తెరాసకు 65-70 సీట్లు వస్తాయని నవంబరు 20న సంక్షిప్త సందేశం పంపిన లగడపాటి.. చంద్రబాబు ఒత్తిడితో ప్రజాకూటమి పైచేయని సర్వే ఫలితాలను మార్చి వేశారని...ఆ సర్వేను నమ్మవద్దని కేటీఆర్‌ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడంపై రాజగోపాల్‌ స్పందించారు. బుధవారం రాజగోపాల్‌ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో చేసిన సర్వే వివరాలు కేటీఆర్‌కు పంపానని, అయితే గత 15 రోజుల్లో ఓటర్ల మనోగతంలో శరవేగంగా మార్పు వచ్చిందని చెప్పారు. ఇంతకుముందు వరంగల్‌లో తెరాసకు అధిక సీట్లు వస్తాయని చెప్పానని, తాజాగా మంగళవారం ఆ జిల్లాలో చేసిన సర్వే ఫలితాలు వచ్చాయని, అక్కడా కాంగ్రెస్‌ కూటమికే ఆధిక్యం ఉన్నట్లు తేలిందన్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోనూ కూటమికే అనుకూల పరిస్థితి ఉందన్నారు.

సంక్షిప్త సందేశాల వెనక జరిగింది ఇదీ.. 
కేటీఆర్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపిన దాని వెనుక ఏ జరిగిందో రాజగోపాల్‌ విలేకరులకు వెల్లడించారు. ‘‘ఓ మీడియా సంస్థ కోరితే నా ఆర్‌జీ ఫ్లాష్‌ టీం సర్వే చేసింది. ఆ సర్వేలో తెరాసకు అనుకూల ఫలితాలు వచ్చాయని తెలిసి మంత్రి కేటీఆర్‌ నా మిత్రుడితో ఫోన్‌ చేయించారు. దాంతో నా సమీప బంధువు ఇంట్లో సెప్టెంబరు 15 లేదా 16నో ఇద్దరం కలిశాం. సర్వే ఫలితాల నివేదిక ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. మీడియా సంస్థ అనుమతి తీసుకొని సెప్టెంబరు 17న కేటీఆర్‌కు మెయిల్‌ చేశా. ఆ సర్వే ఆగస్టు 20- సెప్టెంబరు 10 తేదీల మధ్య చేసింది. అందులో 60 శాతం అసెంబ్లీ రద్దుకు ముందు, 40 శాతం రద్దు తర్వాత చేసిన సర్వే అని చెప్పా. 65 శాతం ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వివరించా. సర్వే ప్రకారం తెరాసకు, కాంగ్రెస్‌కు 10 శాతం ఓట్ల తేడా ఉంది కదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే తెదేపాకు 6 శాతం, తెజస, సీపీఐకు 3 శాతం ఓట్లు ఉన్నందున కాంగ్రెస్‌తో పొత్తు కలిస్తే ఇబ్బంది అవుతుందని తెలిపా. ఒకవేళ తెదేపా, తెజసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లు అడిగితే తెరాసకు మంచిదని విశ్లేషించా. చంద్రబాబు మీతో పొత్తుకు అడుగుతున్నారని పత్రికల్లో చదివానని, తెదేపాతో పొత్తు వల్ల తెరాసకు ఏకపక్ష ఎన్నికగా మారుతుందని చెప్పా. తాము ఒంటరిగానే వెళ్తామని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో తెదేపా తదితర పార్టీలు పొత్తు కలిస్తే పోటాపోటీ ఎన్నికలు జరుగుతాయని వివరించా. ఆ తర్వాత కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా చెప్పి పరిస్థితి ఎలా ఉందో తెలపాలని అడిగారు. నేను ఆ 23తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 37 నియోజకవర్గాలకు సంబంధించి సర్వే నివేదికను నవంబరు 11న కేటీఆర్‌కు పంపించా. ఆ 37లో అత్యధిక శాతం కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉందని చెప్పా. క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉందని, డిసెంబరు 11న అది తెలుస్తుందని కేటీఆర్‌ నాకు సంక్షిప్త సందేశం పంపారు. చేదు నిజం ఆయనకు ఇష్టం లేదు. అందుకే మీ నాన్న కేసీఆర్‌ అనుకూల వాతావరణాన్ని పాడు చేసినా మీరు రెండు వారాలుగా చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయని కేటీఆర్‌కు సంక్షిప్త సందేశం ద్వారా చెప్పా. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరుల అరెస్టులు ఎన్నికల సమయంలో పార్టీకి మంచిది కాదని సూచించా. నవంబరు 11-20 మధ్య ప్రజా కూటమిలో టికెట్ల పంపిణీ పంచాయితీ నడిచింది. ఆనాటి పరిస్థితిని అంచనా వేసి తెరాసకు 65-70, కూటమికి 35-40 వస్తాయని కేటీఆర్‌కు సంక్షిప్త సందేశం పంపా. దానికి ఆ సంఖ్యను కూడా అధిగమించి ఆశ్చర్యపరుస్తామని కేటీఆర్‌ సమాధానం పంపారు. దాంతో నవంబరు 20 తర్వాత వాట్సప్‌ సందేశాలు పంపించలేదు.

15 రోజుల నుంచి వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు 
సెప్టెంబరు 16 నుంచే ప్రజానాడి వేగంగా మారుతోంది. ప్రజాకూటమి కారణంగా పోటాపోటీ వాతావరణం తలెత్తింది. దాంతో గత 15 రోజుల నుంచి అంతకుముందు లేని వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఎస్సీలు తమకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని, తమ సామాజిక వర్గం వ్యక్తిని ముఖ్యమంత్రి చేయలేదని, 12 శాతం రిజర్వేషన్‌ ఏదని ఎస్టీలు(ముఖ్యంగా వరంగల్‌, ఆదిలాబాద్‌ లాంటి జిల్లాల్లో) అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వలేదని, మైనారిటీలు కూడా 12 శాతం రిజర్వేషన్‌ అమలుకాకపోవడంపై గుర్రుగా ఉన్నారు. దానికితోడు ప్రజా కూటమి ఇంటికి ఇద్దరికి పింఛన్లు ఇస్తామనడం, రూ.2 లక్షల రుణమాఫీ లాంటివి ప్రభావం చూపుతున్నాయి. అక్టోబరు 28న నేను గజ్వేల్‌ వెళ్లాను. పోలీసుల తనిఖీ సందర్భంగా ఓ కానిస్టేబుల్‌ నన్ను గుర్తుపట్టారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అడిగితే ఏడుగురు కానిస్టేబుళ్లు ‘పోతారు...సార్‌’ అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఏమీ లేదని చెప్పినా వారు నాతో సవాల్‌ చేశారు. నాకు కేటీఆర్‌ అంటే ఇష్టం. హరీశ్‌రావుతో తప్ప కేటీఆర్‌తో ఎన్నడూ గొడవలు లేవు. ఈ అయిదేళ్లలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో ఒకసారి కలిశా. మళ్లీ సెప్టెంబరులో కలిశా’’ అని రాజగోపాల్‌ వివరించారు.

Link to comment
Share on other sites

Nandyal:

 

At nominations time: TDP is leading by 10,000 votes

Final result: TDP won by 26,000 votes

 

Reason: Jagan & Roja comments

 

Telangana: 

 

At nominations time: TRS at 65-70 seats

Final result: Praja Kutami may get 65-70 seats

 

Reason: KCR Ahankaaram & comments

Link to comment
Share on other sites

ప్రత్యర్థులకు ఊహించని షాక్‌
06-12-2018 11:59:50
 
636796944941510766.jpg
  • జోరుగా హోరెత్తించారు
  • ప్రచారంలో ఔరా అనిపించిన ప్రజాకూటమి
  • క్షేత్రస్థాయిలో దూసుకెళ్లిన అభ్యర్థులు
  • స్టార్‌ క్యాంపెయినర్లతో రోడ్‌షోలు
  • ఏకతాటిపై నడిచిన కూటమి నేతలు
 హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో ప్రజా కూటమి అభ్యర్థులు ఔరా..! అనిపించారు. నామినేషన్ల చివరి అంకంలో తెరపైకి వచ్చినా.. కూటమిలోని పార్టీల ఆశాహహులు, అసంతృప్తులను బుజ్జగించడంతోపాటు నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి ప్రచార పర్వంలో దూసుకుపోయారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అభ్యర్థులకు ఊహించని షాక్‌లు ఇస్తూ, ప్రచారంలో ప్రత్యేకతను చాటుకున్నారు.
 
ప్రజాకూటమి నుంచి గ్రేటర్‌లోని వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌ అభ్యర్థుల్లో ఒక్కరిద్దరు మినహా ఎక్కువమందికి చివరి టైంలో టికెట్లు ఖరారయ్యాయి. ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి స్థానం కోసం కాంగ్రెస్‌ పట్టుబట్టినా చివరకు టీడీపీకి కేటాయించారు. రాజేంద్రనగర్‌, ఎల్‌బీనగర్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌, సనత్‌నగర్‌ స్థానాలు కూటమిలోని వివిధ పార్టీలకు దక్కాయి. లేటుగా రంగంలోకి దిగినా అభ్యర్థులు ప్రచారంలో సత్తా చాటారు. కూకట్‌పల్లి అభ్యర్థిని నందమూరి సుహాసిని(టీడీపీ), రాజేంద్రనగర్‌ అభ్యర్థి ఆర్‌.గణేష్‌ గుప్తా(టీడీపీ), ఖైరతాబాద్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్‌(కాంగ్రెస్‌), అంబర్‌పేట అభ్యర్థి నిజ్జన రమే్‌ష(టీజేఎస్‌), సికింద్రాబాద్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌(కాంగ్రెస్‌), మల్కాజిగిరి అభ్యర్థి దిలీ్‌పకుమార్‌(టీజేఎస్‌) అనూహ్యంగా తెరపైకి వచ్చారు. నామినేషన్లనూ చివరి రోజు దాఖలు చేశారు.
 
అగ్ర నేతల చొరవ
నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎ్‌సను పాలనను తూర్పారబడుతూ, దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాకూటమి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సీట్ల పంపకాలు, అసంతృప్తి అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ముషీరాబాద్‌, ఎల్‌బీనగర్‌ తదితర స్థానాల కోసం టికెట్లను ఆశించిన వారిని బుజ్జగించారు. ఏఐసీసీ ప్రత్యేక కమిటీ రంగంలోకి తమ పార్టీ తరపున టికెట్‌ దక్కని వారికి నచ్చజెప్పి దారికి తెచ్చుకుంది. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్‌, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌లో కార్తీక్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో బండా కార్తీకరెడ్డితోపాటు ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌లో అసంతృప్తి నేతల ఇళ్లకు అగ్రనేతలు వెళ్లి సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. అసంతృప్తులు ఇలా సర్దుకుపోతారని ప్రత్యర్థి అభ్యర్థులు సైతం ఊహించకపోవడం గమనార్హం.
 
ప్రచారంలో ప్రత్యేకత
టీఆర్‌ఎస్‌ నగరంలోని తమ అభ్యర్థుల పేర్లను అందరి కంటే చాలా ముందుగా ప్రకటించింది. దాంతో అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో వీధివీధినీ చుట్టివచ్చారు. ప్రజా కూటమి అభ్యర్థులను మాత్రం పోలింగ్‌కు కేవలం 15 రోజుల ముందే ప్రకటించినా, అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజాకూటమి మేనిఫెస్టోను వివరించారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, కోదండరాం, విజయశాంతి, బాలకృష్ణ, గులాంనబీ అజాద్‌, ఖుష్బూ, నగ్మా అభ్యర్థుల తరపున రోడ్‌షోలు, సభల్లో పాల్గొన్నారు.
 
 
కలిసికట్టుగా
వివిధ స్థానాల కోసం కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎ్‌స తీవ్ర ప్రయత్నాలు చేసినా.. కూటమి లక్ష్యం నెరవేరాలనే ఉమ్మడి లక్ష్యంతో సర్దుబాట్లు చేసుకున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ, కాంగ్రెస్‌ కొన్ని సీట్లను వదులుకోవడంపై ఆ పార్టీల్లోనూ అసంతృప్తులు చెలరేగాయి. కానీ, అగ్ర నేతల బుజ్జగింపులతో నామినేషన్ల ఉపసంహరణ నాటికి వరకు కూటమిలోని పార్టీల నేతలు ఏకమవడం విశేషం. రెబల్‌గా నామినేషన్లు వేసిన వారూ ఉపసంహరించుకుని ప్రజాకూటమికి అభ్యర్థికి బాసటగా నిలిచారు.
 
 
నువ్వా, నేనా అన్నట్టు
టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా కూటమి అభ్యర్థులు నిలుస్తున్నారు. ప్రత్యేకించి సోనియాగాంధీ ప్రచారం తర్వాత పరిస్థితి బాగా మెరుగుపడింది. ఆ తర్వాత వారం రోజులు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడుతోపాటు పలువురు స్టార్‌ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో జోష్‌ పెరిగింది. పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులు ప్రచారంలో టీఆర్‌ఎ్‌సను మించి జనాల్లోకి వెళ్లారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాకూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు నగరంలో పాగా వేసి ప్రచారం చేయడంతో చాలా ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ నెలకొంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...