Jump to content

Lagadapati Rajagopal Press Meet Live | KTR VS Lagadapati


sonykongara

Recommended Posts

ఆ సర్వేపై ఎందుకు ప్రశ్నించలేదు?: లగడపాటి
05-12-2018 12:12:12
 
636796087326562112.jpg
హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల వారీగా అనుకూలంగా ఉన్న స్థానాలు చెప్పానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. సెప్టెంబర్ 20న టీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వే ఇచ్చినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. తాను తెలంగాణకు వ్యతిరేకం అంటే కేటీఆర్‌కు రిపోర్టులు ఎందుకు పంపుతానని లగడపాటి ప్రశ్నించారు. డిసెంబర్‌ 7న సాయంత్రం తన మనసులో మాట చెబుతానని ఆయన అన్నారు. మేలుకోరి టీడీపీతో కలిసి వెళ్లాలని కేటీఆర్‌కు చెప్పా..దానిని కూడా తప్పుబడితే ఎలా? అని లగడపాటి అన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 75
  • Created
  • Last Reply
జీపీ హాజరుకావాల్సిందే: హైకోర్టు
05-12-2018 12:06:23
 
636796083843134342.jpg
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ డీజీపీని మధ్యాహ్నం 2:15 గంటలకు హాజరుకావాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే డీజీపీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలియజేశారు. తాము కూడా కోర్టు కేసుల విచారణలో బిజీగా ఉన్నామని... ఒక అరగంట సమయం డీజీపీ కోర్టుకు రావడానికి కేటాయించలేరా అని ప్రశ్నించింది. ఏది ఏమైనా డీజీపీ కోర్టుకు హాజరుకావాల్సిందే అని హైకోర్టు ఆదేశించింది. ఏ విధమైన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు రేవంత్‌‌ను అరెస్ట్ చేశారనే దానిపై సవివరమైన నివేదికను అందజేయాలని హైకోర్టు సూచించింది
Link to comment
Share on other sites

సీఆర్ నియంత.. ఎవరినీ మాట్లాడనివ్వరు: చంద్రబాబు
05-12-2018 12:19:00
 
636796091412175697.jpg
ఖమ్మం: కేసీఆర్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అశ్వరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఓ నియంత అని...ఎవరినీ మాట్లడనివ్వరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న వనరులు ఎక్కడా లేవన్నారు. తెలంగాణకు కేసీఆరే ప్రధాన సమస్యగా మారారని విమర్శించారు. అభివృద్ధి ఫలాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోడు భూముల్ని రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాకూటమి గెలిస్తేనే సంక్షేమం అమలవుతుందని చంద్రబాబు తెలిపారు. నరేంద్ర మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్నానని... కేంద్రంలో బీజేపీని ఓడించేందుకే రాహుల్‌ను కలిశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

2 minutes ago, Yaswanth526 said:

MIM-7(Hyd)

Khammam, Sathupally & Aswaraopeta -TDP -3

Amberpet, Goshamahal & Nizamabad Urban -BJP -3

Bellampally & Ibrahimpatnam -BSP -2

Narayanapeta & Devarakonda -BLF -2

Ramagundam -AIFB -1

Bodh, Vikarabad, Makthal & Wyra -Independents -4

Makthal TDP win avudhi

Link to comment
Share on other sites

అక్టోబర్ 28 న నేను గజ్వేల్ కి వెళ్ళా,అప్పుడు 7 constables, ఒక SI నన్ను కలిసారు.. ఆ సందర్భంలో ఇక్కడ గజ్వేల్ లో పరిస్థితి ఏంటి అని నేను అడిగితే, వాళ్ళు 'పోతారు సార్' అని చెప్పారు,ఆ పోయేది ఎవరో ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు..#lagadapatiRajagopal కేసీఆర్ ఓటమి ని కూడా confirm..?

DtopzDuUUAAxoIr.jpg
Dtop0ayUcAAV-qy.jpg
Dtop1dqUcAE6IT5.jpg
Link to comment
Share on other sites

65% ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత 
సెప్టెంబరులోనే కేటీఆర్‌కు చెప్పా 
తెలంగాణలో ప్రజానాడి మారుతోంది 
కూటమితో పోటాపోటీ ఏర్పడింది 
వరంగల్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం 
కేటీఆర్‌ ట్విటర్‌ వ్యాఖ్యలపై లగడపాటి రాజగోపాల్‌ 
5ap-main4a.jpg
తెలంగాణలో సెప్టెంబరు 16 నుంచే ప్రజానాడి వేగంగా మారుతోంది. ప్రజాకూటమి కారణంగా పోటాపోటీ వాతావరణం తలెత్తింది. దాంతో గత 15 రోజుల నుంచి అంతకుముందు లేని వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తమవుతోంది. భూమి ఇవ్వలేదని ఎస్సీలు, 12% రిజర్వేషన్‌ ఏదని ఎస్టీలు అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు.. ప్రభుత్వం మాకేం ఇచ్చింది... చేసిందని చూస్తారు తప్ప భావోద్వేగాలు చూడరు. అందుకే తాజాగా వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉందని 
మా బృందం బుధవారం ఉదయమే చెప్పింది.

గతంలో తెదేపాకు 20 శాతం ఓట్లు ఉండగా చాలా వరకు అది తెరాసకు మళ్లింది. కాంగ్రెస్‌ తోడు దొరకడంతో తెదేపా శ్రేణులు మళ్లీ సొంతగూటికి చేరుకుంటున్నాయి. వీటన్నిటి వల్ల పరిస్థితి వేగంగా మారుతోంది.

  - లగడపాటి

ఈనాడు, హైదరాబాద్‌: ఎవరి ఒత్తిడితోనూ ఎన్నికల సర్వే ఫలితాలు మార్చే వ్యక్తిత్వం తనది కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. 
తెరాసకు 65-70 సీట్లు వస్తాయని నవంబరు 20న సంక్షిప్త సందేశం పంపిన లగడపాటి.. చంద్రబాబు ఒత్తిడితో ప్రజాకూటమి పైచేయని సర్వే ఫలితాలను మార్చి వేశారని...ఆ సర్వేను నమ్మవద్దని కేటీఆర్‌ ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడంపై రాజగోపాల్‌ స్పందించారు. బుధవారం రాజగోపాల్‌ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో చేసిన సర్వే వివరాలు కేటీఆర్‌కు పంపానని, అయితే గత 15 రోజుల్లో ఓటర్ల మనోగతంలో శరవేగంగా మార్పు వచ్చిందని చెప్పారు. ఇంతకుముందు వరంగల్‌లో తెరాసకు అధిక సీట్లు వస్తాయని చెప్పానని, తాజాగా మంగళవారం ఆ జిల్లాలో చేసిన సర్వే ఫలితాలు వచ్చాయని, అక్కడా కాంగ్రెస్‌ కూటమికే ఆధిక్యం ఉన్నట్లు తేలిందన్నారు. వరంగల్‌ జిల్లా కేంద్రంలోనూ కూటమికే అనుకూల పరిస్థితి ఉందన్నారు.

సంక్షిప్త సందేశాల వెనక జరిగింది ఇదీ.. 
కేటీఆర్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపిన దాని వెనుక ఏ జరిగిందో రాజగోపాల్‌ విలేకరులకు వెల్లడించారు. ‘‘ఓ మీడియా సంస్థ కోరితే నా ఆర్‌జీ ఫ్లాష్‌ టీం సర్వే చేసింది. ఆ సర్వేలో తెరాసకు అనుకూల ఫలితాలు వచ్చాయని తెలిసి మంత్రి కేటీఆర్‌ నా మిత్రుడితో ఫోన్‌ చేయించారు. దాంతో నా సమీప బంధువు ఇంట్లో సెప్టెంబరు 15 లేదా 16నో ఇద్దరం కలిశాం. సర్వే ఫలితాల నివేదిక ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. మీడియా సంస్థ అనుమతి తీసుకొని సెప్టెంబరు 17న కేటీఆర్‌కు మెయిల్‌ చేశా. ఆ సర్వే ఆగస్టు 20- సెప్టెంబరు 10 తేదీల మధ్య చేసింది. అందులో 60 శాతం అసెంబ్లీ రద్దుకు ముందు, 40 శాతం రద్దు తర్వాత చేసిన సర్వే అని చెప్పా. 65 శాతం ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వివరించా. సర్వే ప్రకారం తెరాసకు, కాంగ్రెస్‌కు 10 శాతం ఓట్ల తేడా ఉంది కదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే తెదేపాకు 6 శాతం, తెజస, సీపీఐకు 3 శాతం ఓట్లు ఉన్నందున కాంగ్రెస్‌తో పొత్తు కలిస్తే ఇబ్బంది అవుతుందని తెలిపా. ఒకవేళ తెదేపా, తెజసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎక్కువ సీట్లు అడిగితే తెరాసకు మంచిదని విశ్లేషించా. చంద్రబాబు మీతో పొత్తుకు అడుగుతున్నారని పత్రికల్లో చదివానని, తెదేపాతో పొత్తు వల్ల తెరాసకు ఏకపక్ష ఎన్నికగా మారుతుందని చెప్పా. తాము ఒంటరిగానే వెళ్తామని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో తెదేపా తదితర పార్టీలు పొత్తు కలిస్తే పోటాపోటీ ఎన్నికలు జరుగుతాయని వివరించా. ఆ తర్వాత కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా చెప్పి పరిస్థితి ఎలా ఉందో తెలపాలని అడిగారు. నేను ఆ 23తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 37 నియోజకవర్గాలకు సంబంధించి సర్వే నివేదికను నవంబరు 11న కేటీఆర్‌కు పంపించా. ఆ 37లో అత్యధిక శాతం కాంగ్రెస్‌కు ఆధిక్యం ఉందని చెప్పా. క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉందని, డిసెంబరు 11న అది తెలుస్తుందని కేటీఆర్‌ నాకు సంక్షిప్త సందేశం పంపారు. చేదు నిజం ఆయనకు ఇష్టం లేదు. అందుకే మీ నాన్న కేసీఆర్‌ అనుకూల వాతావరణాన్ని పాడు చేసినా మీరు రెండు వారాలుగా చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయని కేటీఆర్‌కు సంక్షిప్త సందేశం ద్వారా చెప్పా. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరుల అరెస్టులు ఎన్నికల సమయంలో పార్టీకి మంచిది కాదని సూచించా. నవంబరు 11-20 మధ్య ప్రజా కూటమిలో టికెట్ల పంపిణీ పంచాయితీ నడిచింది. ఆనాటి పరిస్థితిని అంచనా వేసి తెరాసకు 65-70, కూటమికి 35-40 వస్తాయని కేటీఆర్‌కు సంక్షిప్త సందేశం పంపా. దానికి ఆ సంఖ్యను కూడా అధిగమించి ఆశ్చర్యపరుస్తామని కేటీఆర్‌ సమాధానం పంపారు. దాంతో నవంబరు 20 తర్వాత వాట్సప్‌ సందేశాలు పంపించలేదు.

15 రోజుల నుంచి వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు 
సెప్టెంబరు 16 నుంచే ప్రజానాడి వేగంగా మారుతోంది. ప్రజాకూటమి కారణంగా పోటాపోటీ వాతావరణం తలెత్తింది. దాంతో గత 15 రోజుల నుంచి అంతకుముందు లేని వ్యతిరేకత ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఎస్సీలు తమకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని, తమ సామాజిక వర్గం వ్యక్తిని ముఖ్యమంత్రి చేయలేదని, 12 శాతం రిజర్వేషన్‌ ఏదని ఎస్టీలు(ముఖ్యంగా వరంగల్‌, ఆదిలాబాద్‌ లాంటి జిల్లాల్లో) అధికార పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వలేదని, మైనారిటీలు కూడా 12 శాతం రిజర్వేషన్‌ అమలుకాకపోవడంపై గుర్రుగా ఉన్నారు. దానికితోడు ప్రజా కూటమి ఇంటికి ఇద్దరికి పింఛన్లు ఇస్తామనడం, రూ.2 లక్షల రుణమాఫీ లాంటివి ప్రభావం చూపుతున్నాయి. అక్టోబరు 28న నేను గజ్వేల్‌ వెళ్లాను. పోలీసుల తనిఖీ సందర్భంగా ఓ కానిస్టేబుల్‌ నన్ను గుర్తుపట్టారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అడిగితే ఏడుగురు కానిస్టేబుళ్లు ‘పోతారు...సార్‌’ అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఏమీ లేదని చెప్పినా వారు నాతో సవాల్‌ చేశారు. నాకు కేటీఆర్‌ అంటే ఇష్టం. హరీశ్‌రావుతో తప్ప కేటీఆర్‌తో ఎన్నడూ గొడవలు లేవు. ఈ అయిదేళ్లలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో ఒకసారి కలిశా. మళ్లీ సెప్టెంబరులో కలిశా’’ అని రాజగోపాల్‌ వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...