Jump to content

Rahul Gandhi planning for Telangana Elections


RKumar

Recommended Posts

సామాజిక ‘వ్యూ’హం
04-12-2018 03:34:22

 
636794912630008259.jpg
  • తెలంగాణపై రాహుల్‌ లోతైన కసరత్తు
  • బీసీ, దళిత నేతలు, కోదండపై ముందస్తు సమాచారం
  • అందర్నీ ఒక తాటిపైకి తేవడంలో సఫలం
  • 31 ఎస్సీ, ఎస్టీ స్థానాలపై ప్రత్యేక దృష్టి
  • వాటిలో 25 సీట్లలో గెలుపు ఖాయమంటున్న కాంగ్రెస్‌
  • కార్యకర్తలు ఓకే చేశాకే టీడీపీతో పొత్తు
 
(న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి)
‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. టీఆర్‌ఎస్‌ను ఢీకొనే శక్తి కాంగ్రెస్ కు ఎంతమాత్రం లేదు. కేసీఆర్‌ అనే కొండను ఢీకొట్టడం కాంగ్రెస్‌ వల్ల ఏమవుతుంది?’’ రెండు, మూడు నెలల కిందట సర్వత్రా వినిపించిన అభిప్రాయం ఇది! ఇప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా కూటమి టీఆర్‌ఎస్‌కు చాలా గట్టి పోటీ ఇస్తోందని, ఉభయ పక్షాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోందని అందరూ అంగీకరిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వినూత్నమైన కదలిక ఎలా తేగలిగారు? పలువురు బీసీ, దళిత నేతలను, తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండ్‌ రామ్‌ను, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను తన వైపునకు ఎలా తిప్పుకోగలిగారు? మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ఏ విధంగా ఎంపిక చేశారు? ఎంతమందితో చర్చించారు? అసలు తెలంగాణలో కింది స్థాయిలో పరిస్థితిని రాహుల్‌ ఎలా తెలుసుకున్నారు? అనే ప్రశ్నలు పలువురి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించినప్పుడు తెలంగాణ విషయంలో రాహుల్‌ గాంధీ వేసిన అడుగుల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది.
 
 
బలహీన వర్గాల నేతలపై దృష్టి
చాలాకాలం నుంచే తెలంగాణలో బలహీన వర్గాల నేతలపై రాహుల్‌గాంధీ దృష్టి సారించారు. బీసీ నేత కృష్ణయ్య, ముదిరాజ్‌ నేత కాసాని జ్ఞానేశ్వర్‌, మాలమహానాడు నాయకుడు అద్దంకి దయాకర్‌, గోండు నాయకుడు సోయం బాపూరావు, ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజా కళాకారుడు గద్దర్‌ గురించి ఆయన సమగ్రమైన సమాచారం తెప్పించుకున్నారు. సామాజిక సమస్యలపై, ప్రజా హక్కులపై రాత్రింబవళ్లు పోరాడి, ఆయా వర్గాల విశ్వాసాన్ని చూరగొనగలిగే వారితో కాంగ్రెస్‌ కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని, రాహుల్‌ గాంధీ ప్రతి ఒక్కరి గురించీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ఇది నిర్ణయించారని సమాచారం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ గతంలో మూడు చోట్ల మాత్రమే గెలిచిన సందర్భాలున్నాయి. ఈ సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కొప్పుల రాజును నియమించారు. ఎస్సీ, ఎస్టీ సీట్ల నుంచి గెలిచే అభ్యర్థులను సిద్ధం చేయాల్సిందిగా ఆయనను అనుక్షణం ప్రోత్సహించారు. అందుకోసం ఎల్‌డీఎంఆర్‌సీ మిషన్‌ (లీడర్‌షిప్‌ డెవలప్ మెంట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వుడ్‌ కాన్సిట్యూషన్స్‌ - రిజర్వుడు నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని కనిపెట్టి, అభివృద్ధి చేసే వినూత్న కార్యక్రమం)ను రూపొందించారు.
 
 
దీనివల్ల గత మూడు సంవత్సరాల్లో ఈ 31 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసి బూత్‌ స్థాయి వరకు నిర్మించడం, డాటా బేస్‌ ద్వారా గెలిచే నాయకులను గుర్తించడం, కేవలం దళితులు, గిరిజనులు మాత్రమే కాకుండా వీరిని గెలిపించేందుకు దళితేతరులు, గిరిజనేతరుల సహకారం కోరడంలో పార్టీ సఫలీకృతమైంది. దాదాపు సంవత్సరం పాటు పరిశోధన చేసి, ఆ నియోజకవర్గాల్లో ఫీల్డ్‌ సర్వే చేసి, గెలవాలంటే ఏ వర్గాల వారిని సమీకరించాలి, ఆ వర్గాల నాయకులు ఎవరు, వారు ఎందులో ఉన్నారు, గ్రామ స్థాయి వరకు వెళ్లి, ఏ విధంగా ప్రజల్ని కదిలించవచ్చు, ప్రతి బూత్‌ దాకా వెళ్లి, ఈ సారి గెలిచేందుకు ఎన్ని ఓట్లు రావాలి అన్న సమగ్ర సమాచారాన్ని సేకరించి ఒక ప్లేబుక్‌ ను రూపొందించారు. 31 మంది అభ్యర్థులకు ఈ ప్లే బుక్‌ ఇచ్చారు. అంతే కాకుండా ప్రతి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థికి 18 నుంచి 26 సంవత్సరాల వరకు వయసున్న, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి జాబితాను ఇచ్చి బూత్‌ స్థాయి నుంచి వారిని సంప్రదించేలా చూశారు. దీంతో వారం రోజుల క్రితం జరిపిన సర్వేలో వీటిలో కనీసం 25 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నట్లు తేలిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై కొప్పుల రాజును సంప్రదించగా ఇది కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సర్వే కాదని, ఒక స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వేలో ఇలా తేలడం విశేషమని ఆయన వెల్లడించారు.
 
 
నాలుగున్నర లక్షల మందితో శక్తి
కేవలం ఢిల్లీలో తన ఇంటిలోనో, ఏఐసీసీ కార్యాలయంలోనూ కూర్చుని నిర్ణయాలు తీసుకుని వాటిని పార్టీ కార్యకర్తలపై రుద్దడం ఇష్టంలేని రాహుల్‌, లక్షలాది మంది కార్యకర్తల నుంచి వచ్చిన సలహాల ద్వారా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాహుల్‌ అభీష్టానుసారం తెలంగాణలో నాలుగున్నర లక్షలమందిని శక్తి అనే వేదికపై జోడించారు. వారికి రాహుల్‌ నిత్యం సందేశాలు పంపుతున్నారు. కైలాస మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినప్పుడు కూడా తాను పొందిన అనుభూతి గురించి ఆయన వారిని పేరుపేరునా ఉద్దేశించి సందేశాలు, చిత్రాలు పంపారు. ఈ నాలుగున్నర లక్షల మందిలో ప్రతి బూత్‌లో 10-15 మంది ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 
టీడీపీతో పొత్తుపై కసరత్తు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వచ్చి తనను కలవడం వల్లనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాహుల్‌ నిర్ణయం తీసుకోలేదని, దాని వెనుక ఎంతో కసరత్తు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో పొత్తు వద్దని కొందరు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌కు సలహా ఇచ్చారు. అయితే రాహుల్‌ అంతకు ఎన్నో నెలల ముందే శక్తి వేదిక ద్వారా నాలుగున్నర లక్షలమంది కార్యకర్తలకు సందేశం పంపారు. తెలుగుదేశంతో పొత్తు మంచిదా కాదా? ఎస్‌ ఆర్‌ నో.. మీ జవాబు చెప్పండి అని ఆయన వారిని అడిగారు. వారికి 48 గంటల సమయం ఇచ్చారు. ఈ 48 గంటల్లో మెజారిటీ కార్యకర్తలు తెలుగుదేశంతో పొత్తు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం ఉంటుందని, ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా ఉండదని చెప్పడంతో రాహుల్‌ గాంధీ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
 
 
అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేశారు?
తెలంగాణలో కొందరు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నామినేషన్ల ముగింపు తేదీ వరకూ కూడా కొనసాగింది. అయితే రాహుల్‌ గాంధీ అంతకు ఎన్నో నెలల ముందే ప్రతి నియోజకవర్గంలో అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... ఒక నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే రాహుల్‌ గాంధీ వారిని స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. కొన్ని ప్రశ్నలు వేసి ఆ వ్యక్తి తప్పకుండా గెలుస్తాడని ధ్రువపరచుకున్న తర్వాతే టికెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. స్ర్కీనింగ్‌ కమిటీ అభ్యర్థుల పేర్లను వడపోసి, కేంద్ర ఎన్నికల కమిటీలో ఖరారు చేసిన తర్వాత కూడా రాహుల్‌ గాంధీ వారు గెలుస్తారా లేదా అన్న నిర్ధారణ వచ్చేంతవరకూ బయటకు ప్రకటించనీయలేదు. మొదటి నుంచే రాహుల్‌ గాంధీ సామాజిక తెలంగాణపై దృష్టి సారించి పార్టీ విజయావకాశాలకు పెద్దపీట వేస్తూనే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించారు. ఓబీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయకూడదు, కేసీఆర్‌ ఇచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆయన ప్రతి దశలోనూ పట్టుబట్టారు.
 
 
దీనితో సాధారణంగా గంటసేపట్లో ముగిసే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు నాలుగైదు గంటలపాటు సాగిన సందర్భాలున్నాయి. టీఆర్‌ఎస్‌ బీజేపీ అనుకూల పార్టీ అని, అది మోదీకి బీ టీమ్‌గా పనిచేస్తోందని చెప్పడం ద్వారా ముస్లింలకు స్పష్టమైన సందేశం పంపాలని రాహుల్‌ గాంధీ వ్యూహాత్మకంగా నిర్ణయించారని, దీనివల్ల పలు నియోజకవర్గాల్లో ముస్లింల నుంచి కూడా సరైన స్పందన లభిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 119 నియోజక వర్గాల అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ ఒక టూల్‌ కిట్‌ తయారు చేసి ఇచ్చేలా రాహుల్‌ గాంధీ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన కీలకమైన బూత్‌లు, విజయంలో ప్రధాన భూమిక పోషించే బూత్‌లు, ఒక్కో బూత్‌లో ముఖ్యమైన వర్గాలు, వారి ఆదరణను పొందేందుకు సూచనలు, ఆ బూత్‌లోని పోలీస్‌స్టేషన్లు, ముఖ్య అధికారుల పేర్లు ఈ టూల్‌ కిట్‌లో ఉంటాయి.
 
 
ప్రతి రోజూ నివేదికలు
ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ గెలిచే అవకాశాలున్నాయి, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదన్న సమాచారాన్ని, అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రతి రోజూ రాహుల్‌ గాంధీకి నివేదించే టీమ్‌ ఒకటి ఉన్నది. దాని ఆధారంగా ఏ ఏ నాయకుడితో మాట్లాడాలో రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకుంటారు. అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తుంటారు. రాహుల్‌ ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడ ఉన్న ప్రధానమైన సమస్యల గురించి తెలుసుకున్నాకే వెళుతున్నారు. భూపాలపల్లి వెళ్లినప్పుడు ఆయన గిరిజనులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్‌ కోటాను కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందేశాన్ని లక్షలాది మంది గిరిజనులు వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో పంచుకున్నారు. ఈ ప్రకటన వల్ల ఆదివాసీలు, లంబాడాలు మొత్తం కాంగ్రెస్‌ పట్ల మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందిందని పార్టీ వర్గాలు చెప్పాయి.
 
 
దేశంలో ఎవరికీ లేని డిజిటల్‌ వేదిక
దేశంలో ఏ పార్టీ రూపొందించని విధంగా చార్మ్స్‌ (కాంగ్రెస్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌) పేరుతో ఒక డిజిటల్‌ వేదికను రూపొందించారు. ఇలాంటి వినూత్నమైన వేదిక ఏదీ వేరే పార్టీకి లేదంటూ అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌ చానల్‌ ఇటీవల 15 నిమిషాల కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ వేదిక ద్వారా మొత్తం 30 వేల బూత్‌ కమిటీల అధ్యక్షులతో మాట్లాడే సదుపాయం ఉంటుంది. ఈ వేదికలో ఈ కమిటీల వివరాలు, ఫోన్‌ నంబర్లు ఉంటాయి. రాహుల్‌గాంధీ ఒక్కోసారి ఒక్కో బూత్‌ కమిటీ అధ్యక్షుడికి రాండమ్‌గా ఫోన్‌ చేసి మాట్లాడుతుంటారు. ‘మీ బూత్‌ పేరు ఏమిటి, గత ఎన్నికల్లో పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, గెలవాలంటే ఎన్ని ఓట్లు రావాలి..’ అనే ప్రశ్నలు వేయడమే కాక, ఆ బూత్‌ కమిటీ అధ్యక్షుడి పిల్లల గురించి, వారు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు.. అన్న వివరాలను కూడా తెలుసుకుంటుంటారు. రాహుల్‌ గాంధీ స్వయంగా తమతో ఢిల్లీ నుంచి ఇలా స్నేహితుడిగా మాట్లాడడం వల్ల బూత్‌ కమిటీ అధ్యక్షుల్లో ఒక నూతనోత్సాహం వచ్చిందని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి.
 
 
అన్నీ స్వీయ ప్రసంగాలే
ఎవరో ప్రసంగం రాసి ఇస్తే రాహుల్‌ దానిని అనుసరించే విధానం ఎప్పుడో పోయిందని, ఏదైనా బాగా అధ్యయనం చేసి ధ్రువపరచుకున్నాకే రాహుల్‌ మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌ పాలన ఎలా ఉంది, ఆయన ఏ పథకాలు ప్రవేశపెట్టారు, ఆయన పాలనలో అవినీతి ఎలా ఉంది, తెలంగాణ బడ్జెట్‌ ఏమిటి, యూపీఏ పాలనలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల పరిస్థితి గురించి రాహుల్‌ వద్ద పూర్తి సమాచారం ఉన్నదని, ఆయన అందుకోసం ఒక ప్రత్యేక పరిశోధక బృందాన్ని రూపొందించుకున్నారని రాహుల్‌ కార్యాలయ వర్గాలు చెప్పాయి.
 
వివిధ ప్రజాసంఘాలకు సారథ్యం వహించి, తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర నిర్వహించిన కోదండరాం పట్ల తెలంగాణలో ఉన్న గౌరవం, ఆయనకు కేసీఆర్‌ చేసిన అవమానం గురించి రాహుల్‌ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని సమాచారం. కోదండరాంతో ఢిల్లీలో రాహుల్‌ చాలా సమయం గడపడంతోపాటు సీట్ల సంఖ్యతో సహా అనేక విషయాలపై చర్చించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక బంగారు తెలంగాణ సాకారం చేయడానికి ఆయన సహకారం అవసరమని రాహుల్‌ భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

Image building exercises guruinchi ellu navvatam edaitey undho.... meeru chesthey samsaram ellu chestey vyabhicharam......

 

RG Arnab gadi interview eskostaru.... Devil’s advocate lo Boondi garu answers ivvaleka walk out chesina scenes marchipoyinattunnaru!!! 

 

Goppolu saami meeru!

Link to comment
Share on other sites

Modi ni lepataniki konni vela jaakelu (bhakts) tirigaru Desam antha.... entho mandini betray chesaru over 4.5 years.... what’s wrong when RK is trying to lift RG? Ekkado kaltunnattu undi.... RG gurinchi positive vintuntey.....

 

ainaa 2019 lo 2 digits ki confirm avtaruga.... appudu matladandi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...