Jump to content

Uttara Telangana - Eenadu Analysis


RKumar

Recommended Posts

3hyd-main8d.jpg 
ఉత్తరం.. రసవత్తరం 
పలు చోట్ల హోరాహోర 
కొన్ని చోట్ల త్రిముఖం 
ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాల ముఖచిత్రం 
ఈనాడు - హైదరాబాద్‌ 
3hyd-main8a.jpg

ఉద్యమాల పురిటిగడ్డ, రాజకీయ చైతన్యానికి జీవగడ్డ అయిన ఉత్తర తెలంగాణపై తన పట్టును పూర్తి స్థాయిలో నిలుపుకొనేందుకు తెరాస గట్టి ప్రయత్నం చేస్తుండగా, ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా అధికారానికి దగ్గర కావాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. గత ఎన్నికల్లో 8 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారి అదనంగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్లు పెంచుకోవడంతోపాటు రెండు,మూడు స్థానాలైనా దక్కించుకోవాలని భాజపా గట్టిగా పోరాడుతోంది. ప్రభుత్వ పథకాల పట్ల ఉన్న సానుకూలతతో గతంలోకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న విశ్వాసంతో తెరాస ఉంది. కొందరు తెరాస అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో పాటు, తామిచ్చిన హామీల ఫలితంగా ఎక్కువ స్థానాలో గెలుస్తామని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్తర తెలంగాణ ముఖచిత్రమిది.

3hyd-main8b.jpg 
3hyd-main8c.jpg

వరంగల్‌ జిల్లా  హోరాహోరీ

వరంగల్‌ జిల్లాలోని అన్ని స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మూడు నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలుండగా, మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలున్నాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందువరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు గట్టిపోటీ ఇవ్వడంతోపాటు కొన్ని స్థానాలను దక్కించుకోగలమన్న ధీమాతో ఉంది.

స్పీకర్‌ మధుసూధనాచారి బరిలో ఉన్న భూపాలపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు తెరాస తిరుగుబాటు అభ్యర్థి సత్యనారాయణ, భాజపా అభ్యర్థి కీర్తిరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తెరాస తిరుగుబాటు అభ్యర్థి, జనగాంలో సీపీఎం అభ్యర్థి  ఓట్లు చీల్చే అవకాశం ఉంది. జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో తెరాస అభ్యర్థుల పట్ల అసంతృప్తి నెలకొని ఉంది. అక్కడ సంక్షేమ పథకాలపై తెరాస ఆశపెట్టుకుంది. పాలకుర్తి, పరకాల, నర్సంపేట, డోర్నకల్‌, మహబూబాబాద్‌లలో తెరాస,కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. వర్ధన్నపేటలో చివరి నిమిషంలో తెజస అభ్యర్థి రంగప్రవేశం చేయగా, ఇక్కడ తెరాసకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ములుగులో మంత్రి చందూలాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్య గట్టిపోటీనే నెలకొని ఉంది. పశ్చిమలో భాజపా గట్టి ప్రయత్నం చేస్తున్నా ప్రధాన పోటీ వినయ్‌భాస్కర్‌, రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్యనే ఉంది.

ఖమ్మం జిల్లా  అమీతుమీ

ఎన్నికలు సమీపించే కొద్దీ తెరాస నాయకత్వంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి శాసనసభ రద్దు నాటికి తమకు ఉన్న స్థానాలను తిరిగి పొందడం తెరాసకు అంత సులభంగా కనిపించడం లేదు.

ఒకప్పుడు వామపక్షాలకు కేంద్రమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకొనేందుకు తెరాస, ప్రజాకూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. బహుముఖ పోటీలున్న మధిర, భద్రాచలం, కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి ఉన్న వైరా, మాజీ ఎమ్మెల్యే , న్యూడెమోక్రసీ అభ్యర్థి ఉన్న ఇల్లెందు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు.  తెరాసలో అంతర్గత కుమ్ములాటల వల్ల ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిష్ఠానం జోక్యంతో  సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. ఖమ్మం, అశ్వారావుపేట, సత్తుపల్లిల్లో పోటీ తెలుగుదేశంతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మధిరలో కాంగ్రెస్‌, తెరాసకు దీటుగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి  ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మరింత హోరాహోరీగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పాలేరులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సునాయాసంగా గెలుస్తారని మొదట భావించినా, కాంగ్రెస్‌ గుత్తేదారు ఉపేందర్‌రెడ్డిని రంగంలోకి దించిన తర్వాత పోటాపోటీగా తయారైంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో తెరాస గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెం. ఇక్కడ జలగం వెంకటరావుకు  కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నుంచి తీవ్ర పోటీ ఉంది. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేస్తుండటం తమకు లాభిస్తుందని తెరాస భావిస్తున్నా, చివరివరకు ఇక్కడ ఉత్కంఠŸ కొనసాగనుంది. పినపాకలో తెరాస అభ్యర్థి  పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ అభ్యర్థి  కాంతారావు నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇతర పార్టీలున్నా వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. తెలుగుదేశం ఈ జిల్లాలో రెండు స్థానాలను గెల్చుకొనే అవకాశం కనిపిస్తోంది. భాజపా పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన అభ్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయిలో లేదు.

నిజామాబాద్‌ జిల్లా  ఢీ అంటే ఢీ

గత ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను గెల్చుకొన్న తెరాస తిరిగి అవే ఫలితాలను పొందాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నం చేస్తోంది.

ఈ జిల్లాలో కొన్ని చోట్ల భాజపా గణనీయంగా ఓట్లు పొందనుంది. ఒకచోట గెలవాలని హోరాహోరీ పోరాడుతోంది.మరొక చోట తెరాస తిరుగుబాటు అభ్యర్థి  బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఈ అభ్యర్థితో పాటు భాజపా అభ్యర్థులు ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించనునున్నారు. నిజామాబాద్‌ పట్టణం, జుక్కల్‌, ఆర్మూరు, బాల్కొండలో అటు భాజపా, ఇటు తిరుగుబాటు అభ్యర్థులతో త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా పోలింగుతేదీ దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల మధ్యనే ప్రధాన పోటీగా మారుతోంది.  బాన్సువాడలో మంత్రి పోచారానికి తిరుగులేదనే అభిప్రాయం మొదట ఉన్నా, కాంగ్రెస్‌ బలహీనవర్గాలకు చెందిన కాసుల బాలరాజుకు టికెట్‌ ఇచ్చిన తర్వాత క్రమంగా గట్టి పోటీగా మారినట్లు తెలుస్తోంది. ఎల్లారెడి,్డ కామారెడ్డిలలో తెరాస, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కామారెడ్డిలో భాజపా చీల్చే ఓట్ల ప్రభావం ప్రధాన పార్టీలపైన పడనుంది. నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్‌, భూపతిరెడ్డిల మధ్య హోరాహోరీగా ఉంది. నిజామాబాద్‌ పట్టణంలో భాజపాతో  త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఈ రెండుచోట్ల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ వర్గం ప్రభావం కూడా ఉంటుంది. బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్‌, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిల మధ్య గట్టిపోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక సీటు కూడా దక్కని కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో రెండు, మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది.

కరీంనగర్‌ జిల్లా  కదనోత్సాహం

జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులైన మాజీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ పోటీలో ఉన్న సిరిసిల్ల, హుజూరాబాద్‌లతో పాటు మిగిలిన అన్ని చోట్లా  గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

13 శాసనసభా స్థానాలున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత ఎన్నికల్లో జగిత్యాల మినహా మిగిలిన అన్ని స్థానాల్లో తెరాస గెలిచింది. కరీంనగర్‌లో తెరాస, కాంగ్రెస్‌, భాజపాల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బీఎల్‌ఎఫ్‌ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించింది.ఈ పార్టీ అభ్యర్థి వల్ల తెరాస లేదా కాంగ్రెస్‌కు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జగిత్యాలపై మంచి పట్టున్న జీవన్‌రెడ్డి తెరాస అభ్యర్థి సంజయ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.ఎంపీ కవిత ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు.జీవన్‌రెడ్డిని ఓడించడం ద్వారా ఇక్కడ పాగా వేయాలని తెరాస ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం తనకు కలిసి వస్తుందని జీవన్‌రెడ్డి భావిస్తున్నారు. కోరుట్లలో భాజపాతో త్రిముఖ పోటీ కనిపిస్తున్నా, ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ప్రధాన పోటీదారుగా మారారు. ధర్మపురిలో తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మణ్‌కుమార్‌ల మధ్య మంచి పోటీ ఉంది. ఈశ్వర్‌కు ఈ నియోజకవర్గంపై ఎక్కువ పట్టుంది. రామగుండంలో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థి  చంద్రం సవాలు విసురుతున్నారు. ఈయన మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మంథని, వేములవాడ, మానకొండూరు, పెద్దపల్లి స్థానాల్లో తెరాస, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. పెద్దపల్లిలో భాజపా అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పట్టును నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నా తెరాస, కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే శోభకు టికెట్‌ దక్కకపోవడంతో భాజపా అభ్యర్థిగా రంగంలో దిగారు. ఈమె చీల్చే ఓట్లపై తెరాస అభ్యర్థి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎక్కువ ఓట్లు చీల్చితే కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బరిలో ఉన్న హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కని ప్రవీణ్‌రెడ్డి ఏ మేరకు పని చేస్తారన్నదానిపై విజయం ఆధారపడి ఉంది. ఈయన పూర్తి స్థాయిలో పని చేస్తేనే తెరాస అభ్యర్థి సతీష్‌కుమార్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక స్థానాన్ని మాత్రమే గెల్చుకొన్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉందని అంచనా.

ఆదిలాబాద్‌ జిల్లా  అనేక సవాళ్లు

పది అసెంబ్లీ స్థానాలున్న ఆదిలాబాద్‌లో  బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌ మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. భాజపా అన్ని చోట్ల పోటీ చేస్తున్నప్పటికీ ఆదిలాబాద్‌, ముథోల్‌, నిర్మల్‌లో గట్టి పోటీ ఇస్తోంది. ఆదిలాబాద్‌,  ముథోల్‌లలో త్రిముఖ పోటీ నెలకొంది.

ఆదివాసీల మధ్య పోరు, గని కార్మికుల ప్రభావం, తిరుగుబాటు అభ్యర్థుల బెడద, పలు నియోజకవర్గాల్లో భాజపా నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ ఈ జిల్లాలో రెండు ప్రధాన పార్టీలకు సవాలుగా మారాయి. సీపీఐ పోటీ చేస్తున్న బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్‌ తెరాస టికెట్‌ దక్కక బిఎస్పీ తరఫున బరిలోకి దిగడంతో  త్రిముఖ పోటీ నెలకొంది. సిర్పూరు, చెన్నూరు, మంచిర్యాలలో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదని తెరాసలో చేరడంతో తమ విజయం తథ్యమని భావిస్తోంది. అయితే కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీనే ఉంది.నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వరరెడ్డిల మధ్య తీవ్ర పోటీ ఉండగా, భాజపా అభ్యర్థి స్వర్ణారెడ్డి కూడా మంచి పోటీ ఇస్తున్నారు. అయితే తుది పోరు తెరాస, కాంగ్రెస్‌ల మధ్యనే. ఆదివాసీ ఉద్యమాలు తీవ్రంగా జరిగిన అసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా ఉంది. ఖానాపూర్‌లో తెరాస టికెట్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఇవ్వడంతో ఈ టికెట్‌ ఆశించిన రమేశ్‌రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థి అయ్యారు. అప్పటివరకు కాంగ్రెస్‌  టికెట్‌ కోసం ప్రయత్నించిన హరినాయక్‌ తిరుగుబాటు అభ్యర్థిగా బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఈయనకు లభించే ఓట్లపై కాంగ్రెస్‌ అభ్యర్థి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక్కడ భాజపా అభ్యర్థి అశోక్‌ కూడా గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలకు సవాలుగా నిలిచే అవకాశం కూడా ఉంది.  బోథ్‌, ఆసిఫాబాద్‌లలో తెరాస, కాంగ్రెస్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్‌ కొంత మెరుగైన ఫలితాలు ఈ జిల్లాలో సాధించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. 

Link to comment
Share on other sites

So prathi district lo solid ga TRS last time kanna, minimum lo minimum 3 seats pothayi.

Ikkade oka 25-30 minus. Ee poye 25-30 ni vere chota (Hyd/RR Dist) lo fill chesukovali. Kaani iikkada max 2-3 vasthayemo GHMC lo.

Altogther TRS gone case. CONG individual leaders giving very tough fight.

TRS is going to confine max for 40 seats.

RIP TRS

Link to comment
Share on other sites

Warangal: 5 (Janagon, Narsampeta, Dornakal, Mulugu, Parakala) Congress favor ga vunna seats

Khammam: 4 Kootamiki favor (Madhira, Aswaraopeta, Sathhupalli, khammam)

Nizamabad: 3 for Congress minimum (Nizamabad rural, Kamareddy, Bodhan)

Karimnagar: 4 for congress minimum (Jagityala, Choppadandi, Manthani, Karimnagar)

Adilabad: 2 for congress minimum (Khanapur, Asifabad)

18/54 seats minimum for Peoples front. Inko 10 seats laagithe TRS will be out of power.

 

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Warangal: 5 (Janagon, Narsampeta, Dornakal, Mulugu, Parakala) Congress favor ga vunna seats

Khammam: 4 Kootamiki favor (Madhira, Aswaraopeta, Sathhupalli, khammam)

Nizamabad: 3 for Congress minimum (Nizamabad rural, Kamareddy, Bodhan)

Karimnagar: 4 for congress minimum (Jagityala, Choppadandi, Manthani, Karimnagar)

Adilabad: 2 for congress minimum (Khanapur, Asifabad)

18/54 seats minimum for Peoples front. Inko 10 seats laagithe TRS will be out of power.

 

Babu gaaru background baaga analysis chesuntaaru, KCR dissolve cheyagane.

Positive vundi vuntadhi CONG ki kaneesam last time kanna konni seats lo, andhuke diguntadu field loki. 

Anyway if Hyd/RR vote for Kootami, at least 15-18, kootami on cards.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Warangal: 5 (Janagon, Narsampeta, Dornakal, Mulugu, Parakala) Congress favor ga vunna seats

Khammam: 4 Kootamiki favor (Madhira, Aswaraopeta, Sathhupalli, khammam)

Nizamabad: 3 for Congress minimum (Nizamabad rural, Kamareddy, Bodhan)

Karimnagar: 4 for congress minimum (Jagityala, Choppadandi, Manthani, Karimnagar)

Adilabad: 2 for congress minimum (Khanapur, Asifabad)

18/54 seats minimum for Peoples front. Inko 10 seats laagithe TRS will be out of power.

 

Nizamabad lo nirmal,karimnagar lo maanakonduru,adilabad lo boath(congress rebel) people front ki add chesuko

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...