Jump to content

KCR dummu dulipina Balayya


RKumar

Recommended Posts

కేసీఆర్‌కు బాలకృష్ణ వార్నింగ్
03-12-2018 19:52:33
 
636794636244217634.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం నగరంలోని గడ్డి అన్నారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య..  ఏపీ సీఎం చంద్రబాబు, హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్‌ ఆంధ్రాలో వేలుపెడతానంటున్నారని.. తెలంగాణ ప్రజలు తరిమికొడితే ఆంధ్రాకే కాదని, ఎక్కడికైనా పారిపోవాల్సిందేనన్నారు. ఆంధ్రాకు రా... చూసుకుందామని కేసీఆర్‌‌ను బాలకృష్ణ హెచ్చరించారు. అప్పుడు మోదీకి వార్నింగ్‌ ఇచ్చానని, ఇప్పుడు కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇస్తున్నానని చెప్పారు. బాలయ్య ఈ మాటలు మాట్లాడుతుండగా నందమూరి అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. ప్రపంచమంతా తిరిగి చంద్రబాబు పెట్టుబడులు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌లా ఫామ్‌హౌస్‌లో పడుకోలేదని బాలయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ది లాటరీ అని... చంద్రబాబుది హిస్టరీ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
 
కాగా..  సీఎం చంద్రబాబు తెలంగాణలో వేలు పెడుతున్నారని.. అవసరమైతే రేపొద్దున తాము కూడా ఏపీలో వేలుపెడతామని తాజా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌‌గా బాలయ్య మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...