Jump to content

చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీలోనూ వేలుపెడతాం.


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని స్పష్టం చేశారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామన్నారు. ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు.
 
‘నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. నువ్వు తప్పు చేయలేదా..? నువ్వు సుద్దపూసవా..? కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి ఎందుకు సీటిచ్చారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా..? మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది. అవసరం అయితే రేపటి రోజున రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు ఏపీలోనూ వేలుపెడతాం..’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు.
Link to comment
Share on other sites

  • Replies 109
  • Created
  • Last Reply
5 minutes ago, baggie said:

deenibatti eellu entha frustration lo unnaro artamaitandi:roflmao:

Anthe ga annai.. TDP party Telugu vaari  kosam TS lone puttindhi.. TRS only TS party Adhi TS lo puttindhi..

 

Veedu vachi entha kelikithe antha manchodu TDP ki.. intha Chinna logic Ela miss avtunaro ardham kavadam ledhu :D

Link to comment
Share on other sites

అవసరమైతే ఏపీలోనూ వేలు పెడతాం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే తాము ఏపీలోనూ వేలుపెడతామని, రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు కూడా వెనుకాడమన్నారు. శనివారం ఆయన మూసాపేటలో ఎన్నికల సభలో మాట్లాడారు. చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

‘పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. పోడుగోడి నెత్తి పోచమ్మ కొట్టిందన్న’ సామెత చందంగా సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చన్నారు. హైదరాబాద్‌లో నాటకాలాడితే ఆయనను అమరావతికి తరిమికొట్టామన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరిమికొడుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...