Jump to content

New Party in AP


ask678

Recommended Posts

కొత్త పార్టీ 26న 
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయం! 
  జెండా, అజెండాలపై అదే రోజు వివరణ 
22ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్‌ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నేతృత్వంలో పార్టీ ఏర్పాటవుతోంది. ఈనెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు. సీబీఐ సంయుక్త సంచాలకులుగా ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈ కేసులను విచారించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రభుత్వ సేవలో ఉన్నప్పటినుంచే ఆయన గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల ఇక్కట్లపై అధ్యయనం చేశారు. పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి రైతులతో మమేకమయ్యారు. వారి సాధకబాధకాల్ని స్వయంగా తెలుసుకున్నారు. అనేక కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్యపరిచారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రస్తావిస్తూనే.. బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఆయన విరామమిస్తూ సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుంది. కడప జిల్లాకు చెందిన ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యాభ్యాసం కర్నూలు జిల్లా శ్రీశైలంలో సాగింది. వరంగల్‌ నిట్‌ (అప్పట్లో ఆర్‌ఈసీ) నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా, చెన్నైఐఐటీ నుంచి ఎంటెక్‌ చేశారు.

Link to comment
Share on other sites

16 minutes ago, ramntr said:

Sivaji script ప్రకారం 2 new party's, one is already floated, name edo vundi ముందడుగు ప్రజా party ఏదో n filed case on amatavathi it companies n other one is this.. No change in script.. Nice.. 

kothapalli geeta yedo paty pettindi gaaaaaa:roflmao:

Link to comment
Share on other sites

BJP is following the same kind of strategy which it is following in Maharashtra. Create as many parties as it wants by dividing the people based on Caste, Religion and other sectors. 

In our Andhra Pradesh Kothapalli Geetha's party, this new JDL party to take away neutral and educated votes away from TDP, Pawan kalyan party to take away kapu's votes and keep watching MIM will start contesting in AP in 2019 elections. 

Modi and Shah duo just do politics 24x7 and they don't care about governance and development. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...