Jump to content

Annual India Skill Report 2019 | AP Gets 1st Place


sonykongara

Recommended Posts

ఉద్యోగార్హ మానవ వనరుల్లో  దేశంలోనే అగ్రస్థానం 
రాష్ట్రం నంబర్‌ 1 
20ap-main4a.jpg

విభజన కష్టాలు ఇంకా తీరకపోయినా... ఆర్థిక లోటు, వనరుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నా... తగిన పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు, విద్యా సంస్థలు లేకపోయినా... ఆంధ్రప్రదేశ్‌ పలురంగాల్లో దూసుకుపోతోంది. సులభ¢తర వాణిజ్యంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఏపీ ఇప్పుడు మరో ఘనత సాధించింది. అత్యధిక ఉద్యోగార్హ నైపుణ్యం (ఎంప్లాయిబిలిటీ)గల మానవవనరులున్న రాష్ట్రంగా కీర్తి గడించింది. ఈ రంగంలో దేశంలోనే మొదటి ర్యాంక్‌ సాధించింది. పశ్చిమబెంగాల్‌, దిల్లీ వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. సర్వే ఆధారంగా ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2019 పేరుతో ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదికను ఈ నెల 22న (గురువారం) లక్‌నవూలో అధికారికంగా విడుదల చేయనున్నారు.


ఏపీ ఖాతాలో మరో ఘనత 
ఉద్యోగార్హ మానవ వనరుల్లో  దేశంలోనే అగ్రస్థానం 
20ap-main4b.jpg

ద్యోగ నైపుణ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించడం అంత సులువేం కాదు. దేశవ్యాప్తంగా  5 లక్షలమంది విద్యార్థులను పరీక్షించి, సర్వే చేసి నైపుణ్యాల లెక్క తేల్చుతారు. వాటన్నింటిలోనూ రాష్ట్రం నెగ్గుకొచ్చింది.

ఉద్యోగార్హ నైపుణ్య మానవవనరులపై సర్వేని పీపుల్‌ స్ట్రాంగ్‌, వీబాక్స్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించాయి. ఏఐసీటీఈ, యూఎన్‌డీపీ, అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్శిటీస్‌ సంస్థలు సహకారమందించాయి. ఈ సంవత్సరం జులై 15 నుంచి అక్టోబరు 30 మధ్య 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఐదు లక్షలకుపైగా విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. దీని ఆధారంగా ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ పేరుతో నివేదిక సిద్ధం చేశారు. 2014 నుంచి ఇలా ఏటా నివేదికలు విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉంది. ‘ఎంప్లాయిబిలిటీ’కి సంబంధించి దేశంలోని 10 అగ్రశ్రేణి నగరాల జాబితానూ నివేదికలో పొందుపరుస్తారు. 2019 నివేదికలో మన రాష్ట్రానికి చెందిన గుంటూరు, విశాఖపట్నం మొదటి పది నగరాల్లో చోటు దక్కించుకోవడం విశేషం.

సర్వేలో పరీక్ష... సర్వే రెండు రకాలుగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల కోర్సులు చదువుతున్న విద్యార్థుల నుంచి, ఇటు పరిశ్రమ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తారు. విద్యార్థులకు ‘వీబాక్స్‌ ఎంప్లాయిబిలిటీ స్కిల్‌ టెస్ట్‌’ పేరుతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఒక పరీక్ష నిర్వహిస్తారు. దీని ద్వారా ఎలాంటి నైపుణ్యాలు అందుబాటులో ఉన్నాయన్నది నిర్ధరిస్తారు. డొమైన్‌ (సబ్జెక్ట్‌) పరిజ్ఞానంతోపాటు, ఎంప్లాయిబిలిటీ స్కిల్‌్్సను పరీక్షిస్తారు. పరిశ్రమ అవసరాల్ని గుర్తించేందుకు, యాజమాన్యాల నుంచి ‘ఇండియా హైరింగ్‌ ఇంటెంట్‌ సర్వే’ పేరుతో సమాచార సేకరణ జరుపుతారు. ఈ రెండిటినీ క్రోడీకరించి నివేదిక రూపొందిస్తారు. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఎంత మేరకు ఉన్నాయి? నియామకాల ధోరణి ఎలా ఉంది? పరిశ్రమలు, ఉద్యోగావకాశాలపై ఆటోమేషన్‌ ఎలాంటి ప్రభావం చూపుతుంది? భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? అభ్యర్థులు ఎలాంటి ఉద్యోగాలు కోరుకుంటున్నారు? పరిశ్రమలు ఎలాంటి అభ్యర్థుల్ని కోరుకుంటున్నాయి? వంటి అంశాల్ని ఆ నివేదికలో విశ్లేషిస్తారు.

ప్రయోజనం... 
ఇండియా స్కిల్స్‌ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవడం వల్ల దేశంలోని అన్ని పరిశ్రమలు, సంస్థల దృష్టి ఆంధ్రప్రదేశ్‌పై పడుతుంది. మన రాష్ట్రం నుంచి యువతను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు, బహుళజాతి సంస్థలు ఇక్కడకు వస్తాయి.


బహుముఖ వ్యూహాలతో అగ్రస్థానానికి..!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థులు, యువతలో నైపుణ్యాభివృద్ధిపై అత్యంత శ్రద్ధ పెట్టింది. ప్రత్యేకంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అటు పరిశ్రమకు, ఇటు యువతకు మధ్య ప్రధాన అనుసంధానకర్తగా మారింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఉద్యోగావకాశాల్ని ముందే ఊహించి... వాటిని అందిపుచ్చుకునేలా యువత ప్రతిభకు సానబెట్టింది. ఎంప్లాయిబిలిటీలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలపడానికి ఏపీఎస్‌ఎస్‌డీసీ బహుముఖ వ్యూహాలు అనుసరించింది. 
* ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులు, కోర్సులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు... ఇలా వివిధ కేటగిరీలుగా విభజించుకుని వారిలో నైపుణ్యాలకు సానబెట్టేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 
* డొమైన్‌ (సబ్జెక్ట్‌) నైపుణ్యాలు మెరుగు పరిచేందుకు ఇండస్ట్రీ సర్టిఫికేషన్‌ కోర్సులు, మాడ్యులర్‌ మార్కెట్‌ డిమాండ్‌ కోర్సులు రూపొందించింది. భావ వ్యక్తీకరణ, ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ‘యూనిఫైడ్‌ కాంపిటెన్సీస్‌ ఫ్రేంవర్క్‌’ పేరుతో ఎనిమిది అంశాల్లో ప్రత్యేక కోర్సులు రూపొందించింది. 
* ఏపీఎస్‌ఎస్‌డీసీ ఈ సంవత్సరం 6.14 లక్షల మందికి శిక్షణనిస్తోంది. వీరిలో 2.5 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, లక్ష మంది వరకు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, మరో లక్ష మంది ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ పొందుతున్నవారు ఉంటారు. మిగతా వారు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలోల చదువుతున్న విద్యార్థులు. 
* అమెజాన్‌, గూగుల్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, టాలీ, యుడాసిటీ, ఆటోడెస్క్‌, యుడెమీ, ఎన్‌ఎస్‌ఈ అకాడెమీ, జోహో వంటి సంస్థలతో భాగస్వామ్యాలు నెలకొల్పుకొని మెషీన్‌ లెర్నింగ్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, బిగ్‌డేటా అనలటిక్స్‌, ఆటోక్యాడ్‌, స్కైలాబ్‌, గేమింగ్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, డేటాసైన్స్‌, గూగుల్‌ ఐటీ వంటి అంశాల్లో ఇండస్ట్రీ సర్టిఫికేషన్‌ కోర్సులు అందజేస్తోంది. 
* క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా 2018-19లో 13 వేల మంది డిగ్రీ విద్యార్థులు, 17500 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. టాటా, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, కాగ్నిజెంట్‌ వంటి సంస్థల్ని కాలేజీలకు రప్పిస్తోంది. 
* విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల భాగస్వామ్యంతో... ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ వెంచర్‌ డెవలప్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇన్‌ కమ్యూనిటీ సర్వీసెస్‌, ఎడ్యుకేటర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రాం ఫర్‌ ఫ్యాకల్టీ, గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌ వంటి రంగాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తోంది. 
* ఇండస్ట్రీ కనెక్ట్‌... పేరుతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు గుర్తించి, దానికి అనుగుణంగా యువతకు శిక్షణ అందిస్తోంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారిలో నైపుణ్యాలు మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది.


అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం

రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు, రాష్ట్రాన్ని విజ్ఞాన, నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ పనిచేస్తోంది. మా కృషికి గుర్తింపుగా ఎంప్లాయిబిలిటీలో మన రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో సీఐఐ నిర్వహించే ప్రపంచ నైపుణ్యాల సదస్సులో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎమర్జింగ్‌ స్టేట్‌ పార్ట్‌నర్‌గా పాల్గొంటోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రయత్నాలు చేస్తోంది.

-కోగంటి సాంబశివరావు, ఎండీ, సీఈఓ, ఏపీఎస్‌ఎస్‌డీసీ 
-ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...