Jump to content

Demand for Lagadapati Survey


Saichandra

Recommended Posts

  • ఆంధ్రా ఆక్టోపస్‌కు తెలంగాణలో భారీ డిమాండ్‌
  • తమ జాతకాలు అడుగుతున్న నేతలు
  • పెద్దసంఖ్యలో ఫోన్‌ చేస్తున్న నాయకులు, కాంట్రాక్టర్లు
  • ఐఏఎస్‌, ఐపీఎస్‌లలోనూ అమితాసక్తి
  • ఇప్పటిదాకా ఒక్కసారీ తప్పని అంచనా
  • సీట్లవారీగా సర్వే చేయనన్న లగడపాటి
  • రాష్ట్రస్థాయి ఫలితాలు డిసెంబరు 7 సాయంత్రం వెల్లడి
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌... రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనేలేరు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎందరో ప్రముఖులు ఆయనను సంప్రదిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేకమంది అగ్ర నాయకులు, అభ్యర్థులు లగడపాటికి ఫోన్‌ చేస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ ఆయనను ఆశ్రయిస్తున్నారు. కొందరు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, మీడియా సంస్థల వారు కూడా లగడపాటితో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారు. కారణం... సర్వే నిపుణుడిగా, ఆంధ్రా అక్టోప్‌సగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, విశ్వసనీయత! 
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందుగా అంచనా వేసేందుకు లగడపాటి ఓ సర్వే చేయుంచబోతున్నారు.
 
 
గతంలో ఆయన సర్వేలన్నీ నూటికి నూరుపాళ్లు నిజం కావడంతో... ఆయన నుంచి సమాచారం తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందా, లేదా తెలుసుకోవాలని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఆయనను సంప్రదిస్తున్నారు. వ్యక్తిగతంగా తాము విజయం సాధిస్తామా, లేదా సర్వే చేసి పెట్టాలని పలువురు అభ్యర్థులు అడుగుతున్నారు. వ్యాపారవేత్తలు, బడా కాంట్రాక్టర్లు ఎన్నికలప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు ఎంతోకొంత విరాళాలు ఇస్తుంటారు. అయితే గెలిచే పార్టీతో ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నాయకులకు ఎక్కువగా, ఓడిపోయే పార్టీకి తక్కువగా ఇస్తుంటారు. అలాంటివారు కూడా లగడపాటి అంచనా ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో కీలక పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఆయనను సంప్రదిస్తున్నారు.
 
 
అయితే నామినేషన్ల ఘట్టం ముగిసిన వారం తర్వాతే తన సర్వే ప్రారంభమవుతుందని లగడపాటి చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో అభ్యర్థి గెలుపోటములపై సర్వే చేయబోమని, రాష్ట్ర స్థాయిలో మొత్తం ఫలితంపైనే తన సర్వే ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. సర్వే ఫలితాలను డిసెంబరు 7న పోలింగ్‌ ముగియగానే సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌ ఎన్నికలపైనా ఆయన సర్వే చేయిస్తున్నారు. సర్వేల్లో లగడపాటి ట్రాక్‌ రికార్డును బట్టి చూస్తే... ఎన్నికల ఫలితాల కోసం డిసెంబరు 11 వరకూ వేచి చూడనక్కర్లేదని, పోలింగ్‌ రోజునే ఫలితాలు కూడా వెల్లడవుతాయని భావించవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 
వ్యక్తిగతంగా సర్వే చేయను
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాను వ్యక్తిగతంగా ఆయా అభ్యర్థుల గెలుపోటములపై సర్వే చేయబోనని లగడపాటి స్పష్టంచేశారు. అలాచేస్తే సర్వే నిజమయ్యే అవకాశాలు తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మరో వారం రోజుల్లో ఓటర్ల అభిప్రాయంలో స్థిరత్వం వస్తుంది. అప్పుడు నా సర్వే ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 సాయంత్రం 5 గంటలకు సర్వే ఫలితాలను వెల్లడిస్తా’’ అని చెప్పారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో వ్యక్తిగత సర్వేలు చేయడానికి తాను వ్యతిరేకమని, అయితే ఉప ఎన్నికల్లో మాత్రం మీడియా తరఫున తన ప్రమేయం లేకుండా తన బృందం సర్వే చేసి పెడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఎన్నికల సర్వే లగడపాటి వ్యక్తిగత పర్యవేక్షణలో జరగబోతోంది. ‘‘కడప లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి 4 లక్షల కంటే అధిక మెజారిటీతో గెలుస్తారని నేను ముందుగా సర్వే చేసి చెప్పాను. కానీ కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఫలితం వస్తుందని నేను చెప్పడం సోనియాగాంధీకి కొంత అసంతృప్తి కలిగించింది. అయితే ఎవరి ఇష్టాయిష్టాల కోసమో సర్వే ఫలితాలను నేను మార్చలేను. సర్వేలో ప్రజానాడిని పట్టుకోవడం ఒక సైన్స్‌. సైన్స్‌ ఎప్పుడూ నిజమే చెబుతుంది’’ అని ఆయన అన్నారు.
 
 
ఇదీ ట్రాక్‌ రికార్డు
  • 2007లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలపై మొదటిసారిగా ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ పేరిట ఏలూరుకు చెందిన తన మిత్రుడు యర్రంశెట్టి శ్రీనివాస్ తో కలిసి తన సొంత టీంతో లగడపాటి సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి.
  • 2009లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 155 అసెంబ్లీ, 33 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని తన సర్వే వివరాలను లగడపాటి హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే కాంగ్రెస్ కు 33 లోక్‌సభ సీట్లు వచ్చాయి. అసెంబ్లీ సీట్లు అతి దగ్గరగా 156 వచ్చాయి. సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా ఈ సర్వే ఫలితాలను నమ్మలేదు. నిజంగా గెలుస్తామంటావా అని లగడపాటిని ప్రశ్నించారు. కానీ చివరకు లగడపాటి చెప్పినట్లే జరిగింది.
  • 2010లో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు 10 స్థానాలకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 10 సీట్లలోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పగా అది నిజమైంది.
  • రాష్ట్ర విభజన జరిగాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తారని లగడపాటి చెప్పారు. తెలంగాణ విషయంలో ఆ సర్వేను విశ్వసించినా, ఏపీ విషయంలో మాత్రం సందేహాలు వ్యక్తంచేశారు. కానీ లగడపాటి చెప్పినట్లుగానే టీడీపీ విజయం సాధించింది.
  • నంద్యాల ఉప ఎన్నికలో పోటీ హోరాహోరీగా ఉంటుందని రాజకీయ పక్షాలు, విశ్లేషకులు, అధికారులు భావించారు. కానీ టీడీపీ 27,000 మెజారిటీతో గెలుపొందుతుందని లగడపాటి ముందుగానే చెప్పారు.
 
 
prannoy-roy223.jpg 
ప్రణయ్‌ రాయ్‌ స్ఫూర్తితో..
అది 1989వ సంవత్సరం. రాజగోపాల్‌ అప్పుడు పాతికేళ్ల యువకుడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల సరళి, ప్రజల నాడి గురించి దూరదర్శన్‌లో ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్‌రాయ్‌ అలవోకగా, అనర్గళంగా చెబుతున్నప్పుడు ఆయన కనురెప్ప వేయకుండా ఆసక్తిగా గమనించారు. తానూ ఇదే తరహాలో ఎన్నికల సరళిని పట్టుకోగలిగే నేర్పరితనాన్ని అలవరచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ప్రణయ్‌ రాయ్‌ను తన గురువుగా భావించారు. 2003లో లగడపాటి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రె్‌సలో చేరారు. 2004లో పుట్టిన తన కుమారుడికి ప్రణయ్‌ అని పేరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ఎన్నికల సమయంలో ప్రజా నాడిని సంపూర్ణంగా ఒడిసిపట్టాలన్న కాంక్ష లగడపాటిలో పెరుగుతూనే వచ్చింది. 
 
 
 azad223.jpg
మొదటి సర్వేను నమ్మలేదు
2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజానాడిని పట్టుకోవాలన్న ఆసక్తితో లగడపాటి ఏసీ న్యూస్‌మార్గ్‌కు కాంట్రాక్టు ఇచ్చి సర్వే చేయించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రె్‌సకు ఆధిక్యం వస్తుందని ఈ సర్వే ఫలితాలు చెప్పాయి. ఈ సర్వే నివేదికను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్‌ ద్వారా ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అందజేశారు. అయితే కాంగ్రెస్‌ పెద్దలు ఈ సర్వేను అంతగా నమ్మలేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సర్వేను అసలు నమ్మలేదు. 2004లో రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అధిష్ఠానంతో సహా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలూ భావించారు. లగడపాటి మాత్రం పోటీ ఏకపక్షమేనని, టీడీపీకి 50 లోపు సీట్లే వస్తాయని ఢంకా భజాయించడంతో కాంగ్రెస్‌ పెద్దలు దీనిని సీరియ్‌సగా తీసుకోలేదు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం లగడపాటి చెప్పినట్లే రావడంతో వారు ఆశ్చర్యపోయారు. నాటి నుంచి గులాంనబీ ఆజాద్‌కు లగడపాటిపై పూర్తిగా గురి కుదిరింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడి ఫలితంపై లగడపాటితో చర్చించేవారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...