Jump to content

రేకింగ్ న్యూస్: ఫైనల్ జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్


sonykongara

Recommended Posts

రేకింగ్ న్యూస్: ఫైనల్ జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
18-11-2018 23:21:22
 
636781804503834190.jpg
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ విడుదలైన జాబితాల్లో పేర్లులేని నేతలు.. తాజా జాబితాలోనైనా పేర్లుంటాయని ఆశించారు కానీ.. వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు రెబల్స్‌గా తయారయ్యారు. సనత్‌నగర్, రాజేంద్రనగర్‌లాంటి స్థానాల్లో అభ్యర్థులు మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ అధిష్టానం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాజేంద్రనగర్ టికెట్ ఆశించిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి, సనత్‌నగర్ టికెట్ ఆశించిన సీనియర్ మర్రి శశిధర్ రెడ్డి‌కి అధిష్టానం పెద్ద షాకే ఇచ్చినట్లైంది. 
 
ఇదిలా ఉంటే.. మొత్తం 119 స్థానాల్లో 94 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. మొదటి జాబితాలో 65మంది, రెండవ జాబితాలో 10మంది, మూడవ జాబితాలో 13 మంది, చివరి జాబితాలో ఆరుగురికి అధిష్ఠానం చోటు కల్పించింది.
 
 
ఆరుగురు అభ్యర్థులు వీరే..
మిర్యాలగూడ - ఆర్. క్రిష్ణయ్య
దేవరకద్ర- డా. పాబన్ కుమార్‌రెడ్డి
నారాయణ్‌పేట్- వామనగిరి క్రిష్ణ
సికింద్రాబాద్- కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
నారాయణ్‌ఖేడ్- సురేశ్ కుమార్ షెక్తర్
కోరట్ల- జువ్వాడి నర్సింగ్‌రావు
 
 
కాగా.. మిర్యాలగూడ టికెట్ కోసం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన బంధువుకు టికెట్ ఇప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టీజేఎస్‌ కూడా తమ అభ్యర్థికే టికెట్ కేటాయించాలని ఆందోళన చేపట్టింది. అయితే చివరి నిమిషంలో ఎవరూ ఊహించని ఆర్. క్రిష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ కేటాయించడం గమనార్హం. కాగా ఇంతవరకూ ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు. పార్టీలో చేరకుండానే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు, మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు కంగుతిన్నారు.  మరోవైపు దేవకద్ర టికెట్ కోసం కూడా సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకె అరుణ అంటూ పోటాపోటీగా అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అయితే చివరకు అరుణ అనుచరుడైన పాబన్ కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం జై కొట్టింది. కాగా ఈ జాబితాలోని నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...