Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి : నందమూరి సుహాసిని

 
November 16, 2018
 
 
 
 
nandamuri-suhasini.jpg?resize=600%2C400&
 

కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రజాసేవ చేయాడనికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని… ప్రజల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు మామ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తానని చంద్రబాబు నమ్మారన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని విజ్ఞప్తి చేశారు. మా నాన్న పార్టీకి చాలా సేవ చేశారని గుర్తు చేశారు. తాతయ్య ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణ, మామయ్య చంద్రబాబు తనకు స్ఫూర్తి అని సుహాసిని ప్రకటించారు. చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టమన్నారు. ప్రముఖ సినీనటులు, సోదరులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చే అంశంపై నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఎన్టీఆర్‌ ఆశయాలకోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

శనివారం కూకట్ పల్లిలో భారీ ర్యాలీతో సుహాసిని నామినేషన్ వేయబోతున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుండటంతో అందరూ తప్పని సరిగా వస్తామని చెబుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, మనుమళ్లు, మనవరాళ్లందరూ కూకట్ పల్లిలో ప్రచారం చేయాలని ప్రాధమికంగా నిర్ణయానికొచ్చారు. గత కొద్ది కాలం నుంచి తెలుగుదేశం రాజకీయాలకు దూరంగా ఉంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక సోదరి గెలుపు కోసం రంగంలోకి దిగుతారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

 

కూకట్ పల్లిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి స్థిరపడిన వారు అత్యధికంగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండటంతో సుహాసిని విజయం నల్లేరు పై నడకేనని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అక్కడ నందమూరి వారి ఆడపడుచు రంగంలోకి దిగడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారం కోసం కూకట్ పల్లిలో తిరగడం వంటి అంశాలు తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్ధులందరికీ, ప్రజా కూటమికి కూడా ప్లస్ పాయింట్ అవుతుందని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Link to comment
Share on other sites

కుటుంబ సభ్యుల ఆమోదంతోనే పోటీ చేస్తున్నా: సుహాసిని
16-11-2018 19:11:14
 
636779923653930654.jpg
హైదరాబాద్: ప్రజలకు సేవ చేయాలనే దివంగత నేత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని.. తమది డబ్బు పార్టీ కాదని ప్రజల పార్టీ అని దివంగతనేత నందమూరి హరికృష్ణ కుమార్తె, కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని చెప్పారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆమె.. కుటుంబసభ్యులందరి ఆమోదంతోనే తాను కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసేందుకు అవకాశమిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా సుహాసిని కృతజ్ఞతలు తెలిపారు.
 
 
శనివారం నామినేషన్ వేస్తున్నామన్నారు. నామినేషన్ అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని ఆమె తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచే తనకు కోరిక అని ఆసక్తికర విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. తెలంగాణలో పోటీ చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.
Link to comment
Share on other sites

సుహాసినికి నామినేషన్‌ పత్రాలు అందజేసిన టీడీపీ
16-11-2018 16:54:51
 
636779853965844026.jpg
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ కుమారై నందమూరి సుహాసినికి టీడీపీ ప్రతినిధులు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. శనివారం కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్నారు. రేపు ఎన్టీఆర్, హరికృష్ణ ఘాట్‌లో నందమూరి సుహాసిని తాతకు, తండ్రికి నివాళులర్పించబోతున్నారు. అనంతరం ఆమె సుహాసిని నామినేషన్‌ వేస్తారు. సుహాసినిని కూకట్‌పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె ఆమె. కూకట్‌పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబును ఆమె విశాఖలో కలిశారు. కూకట్‌పల్లి టికెట్‌పై ఆమె చంద్రబాబుతో చర్చించారు. సుహాసినికే కూకట్‌పల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సుహాసినికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన వారితో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తుండటంతో అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Link to comment
Share on other sites

Just now, Balayya_Dada said:

Frankly speaking chala darunam ga matladindi..appa cheppindi batti pattina speech..hope she learns fast..

First time ga bro beruku vuntadhi.. taruvata journalist lu adigina questions ki manchiga reply icharu.. okasari flow alavaatu ayithe chalu..

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

konchem kastapadithe chalu brother, malli TTDP dasha tirgavacchu

2 things spoiled TTDP

1. vote ki note
2. trying for alliance with TRS

 

now, he is taking brilliant moves.....BCs+Kamma+Madiga..used to be unbeatable combination for TDP.

Hope...it will happen gradually

Link to comment
Share on other sites

32 minutes ago, Balayya_Dada said:

Frankly speaking chala darunam ga matladindi..appa cheppindi batti pattina speech..hope she learns fast..

Agreed.. Let us give her some time n see.. But as you said vachey mundey preparation aithey bavuntundi.. Tg motham manchi speakers unnaru asaley

Link to comment
Share on other sites

20 minutes ago, nvkrishna said:

2 things spoiled TTDP

1. vote ki note
2. trying for alliance with TRS

 

now, he is taking brilliant moves.....BCs+Kamma+Madiga..used to be unbeatable combination for TDP.

Hope...it will happen gradually

add alliance with bjp also in 2014 . they took half of seats even though there are no candidates for them . bjp imported candidates from other parties to contest in many segments. we surrendered half of seats to bjp . now we surrendered before congress for 14 seats.  out of 14 seats we may win 9. i don't have any hopes in tg except beating trs. after winning elections congress will buy tdp mlas.

Link to comment
Share on other sites

33 minutes ago, ravindras said:

add alliance with bjp also in 2014 . they took half of seats even though there are no candidates for them . bjp imported candidates from other parties to contest in many segments. we surrendered half of seats to bjp . now we surrendered before congress for 14 seats.  out of 14 seats we may win 9. i don't have any hopes in tg except beating trs. after winning elections congress will buy tdp mlas.

too much of imagination. geliste trs ollani manam line lo nilchopetti select chesi tisukuntam chusta undandi. trs is udyama party. udyamam over. alane cheekatlo kalisipoddi

Link to comment
Share on other sites

బాలయ్యతో కలిసి నామినేషన్ వేయనున్న సుహాసిని
16-11-2018 21:26:15
 
636780005958700799.jpg
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించి అనంతరం 11.21 గంటలకు కూకట్‌పల్లిలో సుహాసిని నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

  • baggie changed the title to Kukatpally TDP candidate Nandamuri Suhasini

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...