Jump to content

Recommended Posts

  • Replies 110
  • Created
  • Last Reply
సీబీఐకి ఏపీలో ‘నో ఎంట్రీ’.. అడక్కుండా అడుగుపెట్టొద్దు'
16-11-2018 02:22:23
 
636779317448123627.jpg
  • ప్రభుత్వ సంచలన ఉత్తర్వు.. పాత అనుమతి ఉపసంహరణ
  • ఢిల్లీ పోలీసు చట్టంలోని అధికారం మేరకు నిర్ణయం
  • పౌరులు, ఉద్యోగులు, కేసులు.. దేనిలోనూ జోక్యం కుదరదు
  • గతం: సీబీఐ అంటే అందరికీ ఒక నమ్మకం.
  • వర్తమానం: కేంద్రం ఆడించినట్లు ఆడే బొమ్మ అన్న అపప్రథ.
  • భవిష్యత్తు: రాష్ట్రం ఊ కొడితేనే ఇక్కడ అడుగుపెట్టాల్సిన పరిస్థితి.
ఇకపై ఆంధ్రప్రదేశ్‌ మీ ‘ఇష్టారాజ్యం’ కాదని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కిన కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్రం షాక్‌ ఇచ్చింది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం తన స్వార్థానికి ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్న రాష్ట్ర సర్కారు... ఇప్పుడు సీబీఐకి ‘నో ఎంట్రీ’ బోర్డు చూపింది. దీని ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు. చివరికి... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై సోదాలు జరపాలన్నా సరే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. రైల్వే పరిధిలోకి వచ్చే భూభాగాన్ని మినహాయిస్తే... ఇతరత్రా ఎక్కడ, ఎలాంటి సోదాలు నిర్వహించాలన్నా ఇదే నిబంధన వర్తిస్తుంది!
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సీబీఐ... కేంద్ర దర్యాప్తు సంస్థ అయినప్పటికీ, దాని ఆవిర్భావం కేంద్ర చట్టం ప్రకారం జరగలేదు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం ప్రకారం సీబీఐ ఏర్పాటైంది. అంటే... దీని పరిధి ఢిల్లీ మాత్రమే. దీంతో ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో సీబీఐ ఎలా వేలు పెడుతుందంటూ వివాదాలు తలెత్తాయి. ఈ సమస్యకు ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టంలోనే పరిష్కారం చూపించారు. ఇందులోని సెక్షన్‌ 6 ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో మాత్రమే సీబీఐ సంబంధిత రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టగలదు. కర్ణాటక వంటి ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ ఇందుకు అనుమతి ఇచ్చాయి. ఏపీ సర్కారు ఏకంగా గుండుగుత్తగా అనుమతి (జనరల్‌ కన్సెంట్‌) ఇచ్చేసింది. దీని ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు ఎవరికి వారుగా గానీ, పరస్పరం కలిసి గానీ అవినీతి/అక్రమాలకు పాల్పడితే సీబీఐ నేరుగా రంగంలోకి దిగి చర్యలు తీసుకోవచ్చు. ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైనా సీబీఐ చర్యలు చేపట్టవచ్చు.
 
ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎప్పుడో సీబీఐకి ‘జనరల్‌ కన్సెంట్‌’ ఇచ్చేశారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. అయితే ‘సీబీఐ ఇది వరకట్లా లేదు. రాజకీయ ప్రత్యర్థులపైకి కేంద్రం దీనిని అస్త్రంలా ప్రయోగిస్తోంది. స్వయంగా సీబీఐలోనే ఇటీవల లుకలుకలు బయటపడ్డాయి. అలాంటి సీబీఐకి రాష్ట్రంలో చెలరేగిపోయే స్వేచ్ఛ ఇవ్వడం అవసరమా?’ అం టూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక న్యాయవాది లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులు వృత్తిపర నైపుణ్యంలో సీబీఐకి ఏమాత్రం తక్కువ కాదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగిస్తున్నారని ఆ న్యాయవాది తెలిపారు. స్థానిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సుశిక్షితులైన పోలీసు సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రాష్ట్రానికి ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐకి గుండుగుత్తగా రాష్ట్రంపై స్వేచ్ఛ ఇవ్వడం సరికాదని... దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.
 
అందుకే కత్తెర...
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు నిర్లజ్జగా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నేతలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో... కక్షపూరిత సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. ఏదో ఒక లింకులు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటి ఫలితంగా... గతంలో ఇచ్చిన ‘జనరల్‌ కన్సెంట్‌’ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెరసి... ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను కోరిన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తు జరపగలదు. లేదా... న్యాయస్థానం ఆదేశాలతో అడుగు పెట్టగలదు. అంతకుమించి... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా సీబీఐ చర్యలు తీసుకోలేదు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, సీఆర్పీసీ, ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ చట్టాల కింద సీబీఐ తనంతట తాను కేసు నమోదు చేయలేదు.
 
ఏసీబీ పరిధిలోకి ‘కేంద్రం’
ఇప్పటిదాకా రాష్ట్రంలో ఐటీ అధికారులు హడలు పుట్టిస్తున్నారు. అదే ఐటీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే... రాష్ట్రానికి చెందిన ఏసీబీ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవచ్చు. ఐటీ మాత్రమే కాదు... రైల్వే మినహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిపై ఏసీబీ పరిధిలోకి వస్తారు. కేంద్ర ప్రభుత్వం తమ నేతలు, మంత్రులపైకి ఉద్దేశపూర్వకంగా ఐటీ అధికారులను ఉసిగొల్పుతోందంటూ... గత ఏడాది కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు మండిపడింది. ఐటీ అధికారులపైకి తమ ఏసీబీని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర నిఘా విభాగం పసిగట్టి... ఐటీ అధికారులను అప్రమత్తం చేసింది.
 
‘ఇలాంటి ప్రతీకార చర్యలు సరికావు. ఏసీబీని దుర్వినియోగం చేయొద్దు’ అని కర్ణాటక డీజీపీకి ఐటీ ఉన్నతాధికారి లేఖ రాశారు. అయితే, ఏసీబీ పరిధిలోకి ఐటీ కూడా వస్తుందని, తమకు మాత్రం ఏసీబీని దుర్వినియోగం చేసే ఉద్దేశం లేదని కర్ణాటక మంత్రులు ప్రకటించారు. తాజాగా సీబీఐకి ఏపీ కళ్లెం వేసిన నేపథ్యంలో పాత పరిణామాలు తెరపైకి వచ్చాయి. తమకు ఇలా ఇతర కేంద్ర విభాగాలను లక్ష్యం చేసుకునే ఉద్దేశం లేదని, సీబీఐ అనవసర వేధింపుల నుంచి తప్పించుకునేందుకే జాగ్రత్త పడుతున్నామని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
9ABSTRACT6.jpg 
Link to comment
Share on other sites

taxing flexibility states ki lekunda chesi prati daaniki center ni beg chesukovalsina avasaram vunna current system ni marchali. asalu ekkado maru moola village lo toilets vishayam central govt ki enduku?  Central government powers should be limited to defence, international affairs, inter state issues like commerce, rivers and other disputes.

Link to comment
Share on other sites

1 minute ago, swarnandhra said:

1 hour ago, kishbab said:

CBI office unda andhra lo.unte close chesi bytaku pampali vallani.IT dept pina ashoka vidam ga ACB Case lu petit bokka lo veyyali

Actual target IT dept అంటున్నారు, acb raids plan cheyyochu అని talks going on.. 

Link to comment
Share on other sites

50 minutes ago, swarnandhra said:

taxing flexibility states ki lekunda chesi prati daaniki center ni beg chesukovalsina avasaram vunna current system ni marchali. asalu ekkado maru moola village lo toilets vishayam central govt ki enduku?  Central government powers should be limited to defence, international affairs, inter state issues like commerce, rivers and other disputes.

Link to comment
Share on other sites

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది...కోర్టులూ కాదనలేవు: లాయర్ వేదవ్యాస్
16-11-2018 11:54:21
 
636779663955124676.jpg
విజయవాడ: దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని, సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం సీబీఐకి అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కోర్టులూ కూడా కాదనలేవని..న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత పౌరుడిగా, బెజవాడ న్యాయవాదిగానే సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చానని ఆయన తెలియజేశారు.
 
సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని తెలిపారు. ఏపీ ఏసీబీ పనితీరును సీబీఐ, ఐటీ కూడా ప్రశంసించాయని గుర్తుచేశారు. ఏసీబీ నుంచి ఐటీ అధికారులు వివరాలు తీసుకున్న సందర్భాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్ధ్యం ఏసీబీకి ఉందని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యం కూడా ఏపీ ఏసీబీ సొంతమని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్‌ పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

17 minutes ago, sonykongara said:

Vedavyas :no1:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...