Jump to content

Recommended Posts

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వును ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) తెలపాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. 
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. అయితే సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను మన రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది. రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది. ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేయిస్తున్న దాడులకు సహకరించే, కొమ్ముకాసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. తమ జోలికి వస్తే... చేతులు ముడుచుకుని కూర్చోబోమని, అంతకు అంత బదులు చెబుతామని కేంద్రానికి ఓ గట్టి హెచ్చరిక పంపించాలనుకుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపించిందని భావిస్తున్నారు.

ఏమిటీ ‘సాధారణ సమ్మతి’... 
దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946 ప్రకారం కేంద్రం సీబీఐని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దఖలు పడిన అధికారాలను సీబీఐ దిల్లీ భూభాగం పరిధిలోనే అమలు చేయడానికి అవకాశముంది. దిల్లీ బయట దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకు తమ భూభాగంలో పరిధిని కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు, 63కు పైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాల దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి(జనరల్‌ కన్సెంట్‌)ను ఇవ్వాలి. సాధారణ సమ్మతిని రాష్ట్రాలు వెనక్కి తీసుకునే అధికారం కూడా చట్టంలో నిర్దేశించారు. అయితే ఒకటి, రెండు రాష్ట్రాలు వేర్వేరు కారణాలతో ఈ సమ్మతిని ఇవ్వడం లేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు ఈ సమ్మతిని ఇస్తూ వస్తోంది. దీనికి సంబంధించి చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలు నిర్వహణపరమైన సమస్యలతో సీబీఐ పనితీరు మందగించిందని, తన పాత్రను సమర్థంగా నిర్వహించలేకపోతోందని ఓ సీనియర్‌ న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రమిచ్చారు. సీబీఐతో పోలిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థలే వృత్తిపరంగా మెరుగ్గా వ్యవహరిస్తున్నాయని, ఆధునికంగా ఉన్నాయని తెలిపారు. సరిపడా సిబ్బంది, దర్యాప్తు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అవసరమైన సాధనా సంపత్తి కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఇక్కడ జరిగే నేరాలను దర్యాప్తు చేసే సమర్థత ఉన్నందున... సీబీఐకు సాధారణ సమ్మతి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ వినతిపైన, ఆ మధ్య జరిగిన కేంద్రప్రభుత్వ సంస్థల దాడులపైనా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించింది. రాజకీయ దురుద్దేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మంత్రి వర్గం గట్టిగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీబీఐకి సాధారణ సమ్మతి ఇచ్చే, వెనక్కి తీసుకునే అధికారం రెండూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున...‘సమ్మతి’ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

Link to comment
Share on other sites

  • Replies 110
  • Created
  • Last Reply
1 minute ago, Jaitra said:

Looks like CBN is prepared to go all out in this fight against gujju mafia

Terrific move...win or loose, no one can dare in India...now other states will follow the same.

Kachara gaadu...arrreee naaku ee vishayam theliyaka mundhasthuki poyanu...ee CBI ekkada bokkalo vesthadi donga passport case lo ani

Link to comment
Share on other sites

19 minutes ago, ask678 said:

Terrific move...win or loose, no one can dare in India...now other states will follow the same.

Kachara gaadu...arrreee naaku ee vishayam theliyaka mundhasthuki poyanu...ee CBI ekkada bokkalo vesthadi donga passport case lo ani

hmm

also other scam when he was labour minister in centre.

Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

Whatever CBN bhayapadaadu anna jaffa, baffa and pawala batch kanipinchatam ledhu

With Decisive telugu vote in Karnataka cbn,ee pushpams ni power loki raakunda ela addukunnadoo chusaaka kooda mosha ki buddi raalaadhu antay,nothing can save them now.

Link to comment
Share on other sites

Jaffas Paffas and Baffas will start new tune saying CBI antey bhayapadutunnadu....

arey love da kay bals.... one by one all states having anti-BJP govts will do this and that will throw doubts on CBI’s integrity. 

This step has pros and cons, but you need a lion’s heart to ride a mad lion. CBN is currently doing that. 

His moves in next 5-6 months will make him remember as the one who fought against the center (just like NTR against Indira)

once he retains power and hope he can guide UF to power in center, we will see the negotiator in CBN. He tried to repeat this against Modi but Modi lost his common sense and conscience, CBN style central politics are long due and the current generation definetly deserves to see his mark. 

Link to comment
Share on other sites

25 minutes ago, sskmaestro said:

Excellent post

Link to comment
Share on other sites

37 minutes ago, sskmaestro said:

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...