Jump to content

నవ్యాంధ్రకు కొత్త చిహ్నం

sonykongara

Recommended Posts

నవ్యాంధ్రకు కొత్త చిహ్నం
15-11-2018 03:10:11
 
636778482122643969.jpg
  • రాష్ట్ర అధికార చిహ్నం ఖరారు
  • తెలుగుదనం ఉట్టిపడేలా రూపం
  • నోటిఫికేషన్‌ జారీచేసిన సీఎస్‌
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : నవ్యాంధ్రకు నూతనంగా రాష్ట్ర అధికారచిహ్నం ఖరారయింది. అందంగా రూపుదిద్దుకున్న ఈ చిహ్నానికి లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర అధికార చిహ్న మకుటం, పాదభాగాల్లో తెలుగు అక్షరాలను కూర్చడం విశేషం. అమరావతి బౌద్ధ సంస్కృతి ఉట్టిపడేలా, నాలుగున్నరేళ్ల రాష్ట్ర ప్రస్థానానికి మరింత వన్నెను తెచ్చేలా సుందరంగా తీర్చిదిద్దారు. అధికార కార్యకలాపాలకు మాత్రమే ఈ చిహ్నాన్ని వినియోగపెట్టాలంటూ సీఎస్‌ అనిల్‌చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు (జీవో 740) జారీ చేశారు. అధికారిక అవసరాల కోసం మూడు రకాల చిహ్నాలను విడుదల చేశారు. బహుళ వర్ణంలో ఒకటి ఉండగా, నీలం, తెలుపు-నలుపు రంగుల్లో మిగతా రెండు ఉన్నాయి. జారీ అయిన రోజునుంచే (నవంబరు 14, 2018) ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. 2014 రాష్ట్ర విభజన దరిమిలా ప్రభుత్వం తన అధికార చిహ్నాన్ని ఖరారు చేసుకొన్నట్టు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.
 
అధికార చిహ్నం రూపురేఖలు..
అమరావతి బౌద్ధ సంస్కృతిని ప్రతిఫలించేలా రూపురేఖలు దిద్దారు. ధర్మచక్రం, దాని మధ్యలో పూర్ణకుంభం ఉంచారు. త్రిరత్నాకరాలయిన బౌద్ధం, ధర్మం, సంఘ్‌లను ప్రతిఫలిస్తూ, ధర్మచక్రంలో మూడువర్తులాలు ఉన్నాయి. ఆ వర్తులాలను ఆకులు, దివ్య రత్నాలతో అలంకరించారు. లోపలి వర్తులంలో 48, మధ్యలో 118, వెలుపలి వర్తులంలో 148పూసలను కూర్చారు. పూర్ణకుంభం చుట్టూ నాలుగు వరుసల్లో పూలదండలతో అలంకరించారు. కుచ్చులు, పతకాల ముద్రలతో ప్రధాన భాగం తీర్చిదిద్దారు. కుంభం మెడ, మూతి భాగాల చుట్టూ కుచ్చులతో అల్లిక చేశారు. ఈ చిహ్నం అడుగుభాగంలో జాతీయ చిహ్నం అయిన మూడు సింహాలు ఉన్నాయి. మకుట భాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అని తెలుగులో, దానికి కుడి, ఎడమ పక్కల ఇంగ్లీషు, హిందీలో రాసి ఉంది. అడుగున సత్యమేయ జయతే అనే తెలుగు అక్షరాలు ఉన్నాయి. ఈ చిహ్నం ఎత్తు 24మిల్లీమీటర్లకు తగ్గకూడదు. ఈ చిహ్నంలోని సింహాలు నారింజరంగులో ఉండాలి. ధర్మచక్రం, మధ్యలోని పూర్ణకుంభం ఆకుపచ్చ రంగులో ఉండాలి. ధర్మచక్రం లోపలి, మధ్య వర్తులాలకు పసిడి రంగును కేటాయించారు.
 
ఎవరు వాడాలి
సీఎం, మంత్రులు, సీఎస్‌, ప్రభుత్వ కార్యదర్శులు, ఏజీ, విభాగాల అధిపతులు, కలెక్టర్లు, జిల్లా ప్రభుత్వ విభాగాల అధిపతులు, సచివాలయంలోని మధ్యశ్రేణి అధికారులు, తత్సమాన హోదా కలిగిన అధికారులు
 
వీరు వాడకూడదు
స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థల అధిపతులు, కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ట్రస్టీలు, కార్యనిర్వాహక ఆదేశాలతో ఏర్పాటయిన సంస్థలు, చట్టం ద్వారా ఏర్పాటయిన సంస్థలు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...