Jump to content

Kphb confirmed


Saichandra

Recommended Posts

  • Replies 227
  • Created
  • Last Reply
5 minutes ago, ChiefMinister said:

I think quthbullapur kudaa mahaakutami candidate win avtaaru ani anukuntunna because it was strong hold of tdp in past

Vivek did some works. Vaishyas and bc s including few kams are with him. Kootami ki chance ille mostly. Max 1L votes. Vivek will poll minimum 1.3 L anukunta bro 

Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

Akkda unna settlers e local kaadhu logical ga...

Anyway let see

Kikikiki. Srinivas movva bhavya evaro okariki ivalsindi. But lyt I think cbn wants to make hindupur out of Kukatpally. Chuddam. Click aythe saradaga 50k majority from next time. 

Link to comment
Share on other sites

మాధవరం కృష్ణారావుపై కసిగా కార్యకర్తలు
16-11-2018 02:28:33
 
కేపీహెచ్‌బీకాలనీ/హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): నందమూరి సుహాసిని కూకట్‌పల్లి అభ్యర్థిగా రంగంలోకి దిగడంపై స్థానిక పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2014లో టీడీపీ తరఫున గెలిచిన మాధవరం కృష్ణారావు ఏడాది తిరగకముందే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనకు 43వేల మెజారిటీ వచ్చింది. ఈసారి ఎన్టీఆర్‌ మనవరాలు బరిలోకి దిగుతుండడంతో 50 వేలకు తగ్గకుండా మెజారిటీ సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ విజయం ఖాయమని.. పార్టీకి ద్రోహం చేసిన కృష్ణారావును చిత్తుగా ఓడించాలని కార్యకర్తలే కసిగా ఉన్నారని తెలిపారు.
Link to comment
Share on other sites

నందమూరి సుహాసినికే కూకట్‌పల్లి!
16-11-2018 02:25:22
 
636779319239368625.jpg
  • టీడీపీ టికెట్‌ ఖరారు
  • రేపు నామినేషన్‌
హైదరాబాద్‌/అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు సుహాసినిని కూకట్‌పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె ఆమె. కూకట్‌పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్‌లో ఆమె చంద్రబాబును కలుసుకున్నారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు వారికి వెల్లడించి, సుహాసిని విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శనివారం ఆమె కూకట్‌పల్లిలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖ వచ్చిన వారిలో కేపీహెచ్‌బీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. కూకట్‌పల్లి టిక్కెట్‌ను ఆశించిన ఆయనకు మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ టిక్కెట్‌ ఆశించిన పెద్దిరెడ్డిని కూడా రావాలని కబురు పంపినా రాలేదు. తనకు విడిగా పార్టీ అధినేత నచ్చచెప్పాల్సిన అవసరం లేదని, ఖరారు చేసిన అభ్యర్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఫోన్లో పార్టీ నేతలకు తెలిపారు. హరికృష్ణ కుమార్తె అయిన సుహాసినిని.. తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. పిల్లల చదువుల కోసం కొన్ని సంవత్సరాలుగా సుహాసిని హైదరాబాద్‌లోనే స్ధిరపడ్డారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం నుంచి టీడీపీలో రాజకీయ వారసత్వం కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం భావించింది. పోటీ చేయాల్సిందిగా ఆయన కుమారుడు కల్యాణ్‌రామ్‌ను అడిగారు. కానీ ఆయన చేయనన్నారు. ఇక ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని అనుకొంటున్న తరుణంలో ఆకస్మికంగా సుహాసిని పేరును అధిష్ఠానం తెరపైకి తెచ్చింది.
 
వ్యూహాత్మక నిర్ణయం
సుహాసిని ఎంపిక వ్యూహాత్మకంగా కీలక నిర్ణయంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. వారితోపాటు, స్థానికుల్లోనూ ఎన్టీఆర్‌ కుటుంబం పట్ల సానుకూలత ఉంది. ఆ కుటుంబం నుంచి అభ్యర్థిని నిలపడం ఓటర్లలో మహాకూటమికి అనుకూల వాతావరణం సృష్టిస్తుందని, అదే సమయంలో తెలంగాణలో టీడీపీ శ్రేణులను కూడా ఉత్సాహపరుస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆకస్మికంగా మరణించిన హరికృష్ణ కుటుంబానికి అధిష్ఠానం అండగా నిలిచిందని, వారి రాజకీయ ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడిందని కూడా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందినప్పుడు కుటుంబ పెద్దగా చంద్రబాబు రెండు రోజులు హరికృష్ణ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకొన్నారు. ఆ పరిణామాల కొనసాగింపుగానే ఇప్పుడు సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్‌ కుటుంబ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె విజయం సునాయాసమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చుట్టుపక్కల మరి కొన్ని నియోజకవర్గాలపైన కూడా ఈ ప్రభావం ఉంటుందని, పార్టీ సానుభూతిపరులు మరింత చురుగ్గా ఎన్నికల్లో పనిచేస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్‌ కుటుంబం అంతా ఏకతాటిపై ఉందన్న పరిణామాన్ని ఈ నిర్ణయం సూచిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఈ నిర్ణయంతో గట్టి సమాధానం ఇచ్చినట్లయిందని టీడీపీ ముఖ్య నేత ఒకరు అన్నారు.
Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

Vote lekunda aa state lo contest cheyyaleru....last time 2014 lo Jupudi Prabhakar same problem, he has not registered vote in AP, so did not contest last minute

yes, TG lo ame ki vote lekapothe MLA ga poti cheyyataniki chance ledu akkada.

Link to comment
Share on other sites

ఈనాడు, హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను గురువారం అక్కడికి పిలిపించి మాట్లాడారు. ఆమె కుటుంబసభ్యులతో వెళ్లి కలిశారు. ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు హరికృష్ణ తనయులు, సినీనటులు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతోనూ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఒకరు పోటీచేస్తే తెదేపాకే కాకుండా మహాకూటమికి సైతం ఊపు వస్తుందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. సుహాసిని హైదరాబాద్‌లోనే న్యాయవిద్యలో డిగ్రీ చదివారు. ఆమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...