Jump to content

టీడీపీ నూజివీడు ఇన్‌చార్జి నియామకంపై ఉత్కంఠ


koushik_k

Recommended Posts

  • త్వరలో సీఎంతో నియోజకవర్గ సమీక్ష సమావేశం
  • ఇన్‌చార్జే అభ్యర్థి అవుతారా ?
  • చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు
నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కారణం సీఎం చంద్రబాబు నూజివీడు, మంగళగిరి నియోజకవర్గాలపై గత మంగళవారం సమీక్ష సమావేశం జరుగుతుందని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు సమాచారం వచ్చింది. అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలో తిరిగి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే ఇన్‌చార్జిల నియామకంపై చర్చించి, ప్రకటించవచ్చునని తెలుస్తోంది. వీరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులని ఊహాగానాలు రావడంతో ఈ నియోజకవర్గంలో సర్వత్రా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
 
 
నూజివీడు: నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీసీ వర్గానికి చెందిన ఈయన స్థానికేతరుడైనా, పార్టీ కార్యాలయాన్ని నూజివీడులో సొంత ఖర్చులతో నిర్మించుకుని, నాలుగున్నరేళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా ఎంపీ మాగంటి బాబుకు, ముద్దరబోయినకు మధ్య సఖ్యత అంతగా లేదు. అయితే నాలుగు నెలలుగా వీరు ఒకేమాట, ఒకే బాటగా పయనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ సఖ్యత ఇద్దరికీ అవసరమే. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ కోసం పలువురు ప్రయత్నిస్తుండటమే ప్రస్తుతం ఆసక్తికర చర్చలకు తావిస్తోంది.
 
 
రెండు ఎన్నికల నుంచి చివరి నిమిషంలో అభ్యర్థి ఎంపిక
గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక చివరి నిమిషంలోనే ఖరారవుతుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీకి చెందిన చిన్నం రామకోటయ్యను చివరి నిమిషంలో టీడీపీలో చేర్చుకుని నూజివీడు టికెటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆయన రెండేళ్లు గడవక ముందే పార్టీని వీడారు. అలాగే 2014లో కూడా చివరి నిమిషంలోనే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన పక్క నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావుకు బీసీ కోటా కింద టికెట్‌ ఇస్తే ఓటమి చెందారు. అయినా నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఆయనకు పోటీగా రెండేళ్ల నుంచి అట్లూరి రమేష్‌.. ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
 
 
పార్టీ కార్యకలాపాల్లో స్థానిక నేతలతో కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఇక అనూహ్యంగా దేవినేని కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఈ నియోజకవర్గ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న ముద్దరబోయిన స్థానంలో మరో వ్యక్తికి టీడీపీ టికెట్‌ ఇవ్వాలంటే అనేక లెక్కలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. మరో వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలంటే యాదవులకు జిల్లాలో మరోచోట స్థానం చూపడంతో పాటు ముద్దరబోయినను పార్టీ అదిష్ఠానం సంతృప్తి పరచవలసి ఉంటుంది. జిల్లాలో ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ టికెట్‌ కోసం విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల లాగానే చివరి నిమిషంలో మార్పులు ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే సమీక్ష సమావేశానికి రమ్మని పెద్దసంఖ్యలో స్థానిక నాయకులకు ఆహ్వానాలు అందటంతో నియోజకవర్గం ఇన్‌చార్జి విషయంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
 
 
ధీమాగా ముద్దరబోయిన 
ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనకే టికెట్‌ ఖాయమనే ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలోని పల్లెర్లమూడి గ్రామానికి చెందిన అట్లూరి రమేష్‌, విజయవాడకు చెందిన దేవినేని అవినాష్‌, దేవినేని అపర్ణ (దేవినేని బాజీ సతీమణి)లు కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనదైన శైలిలో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఇతర పార్టీల్లోని బీసీ వర్గాలను కలుపుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయనే చెప్పాలి. ఇటీవలే వైసీపీలో బీసీ వర్గానికి చెందిన కౌన్సిలర్‌ ఒకరు ముద్దరబోయిన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మరికొందరు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్‌ పరిధితో పాటు జిల్లాలో బీసీల్లో యాదవ వర్గానికి ఒక ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు టీడీపీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిలకు ఇచ్చిన రేటింగ్‌లో కూడా ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మంచి రేటింగ్‌ వచ్చింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...