Jump to content

2 Trs mp's


supertdp

Recommended Posts

  • ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి..?
  • ఇద్దరు కాదు ముగ్గురన్న ఎంపీ
  • ఇప్పటికే పార్టీ వ్యవహారాలకు దూరం
  • ఆ ఇద్దరు ఎవరనేదానిపై చర్చ
  • టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓ ఎంపీ, ఎమ్మెల్సీ షాక్‌ ఇవ్వనున్నారా..? మరో ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి ఝలక్‌ ఇచ్చి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారా..? అంటే ప్రస్తుత పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా వీరు పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతున్నప్పటికీ బుధవారం జరిగిన పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొడంగల్‌ సభలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి త్వరలో తమ పార్టీలోకి ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వస్తున్నారని చెప్పారు. ఇదేసమయంలో తాండూరులో విశ్వేశ్వర్‌రెడ్డి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కాలుష్యంపై మాట్లాడారు.
 
విలేకరులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రె్‌సలో చేరే ఇద్దరు ఎంపీల్లో మీరు కూడా ఉన్నారా? అని అడిగారు. స్పందించిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ‘ఇద్దరు కాదు ముగ్గురు’ అంటూ విలేకర్ల సమావేశం ముగించి వెళ్లిపోయారు. ఆయన నర్మగర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన యథాలాపంగా అన్నారా? లేక నిజంగానే అన్నారా? అన్నది చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఆయన్ని ఫోన్‌లో సంప్రదించింది. ‘తనపై రోజూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, తనతో పాటు ఇద్దరుముగ్గురిపై కూడా ఇలానే ప్రచారం జరుగుతోందని.. ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని’ చెప్పారు. గతంలో కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగిందని, అపుడు విలేకర్లు అడిగితే చేరుతున్నాననే చెప్పానని.. ఇప్పుడు కూడా అలాగే యథాలాపంగా చెప్పానని అన్నారు. అయితే ఆయన ఎలా చెప్పినప్పటికీ కొన్ని నెలలుగా టీఆర్‌ఎ్‌సకు దూరంగా ఉండడం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ముందుగానే టికెట్‌ హామీ ఇవ్వడంతో పాటు ఆయన వర్గీయులకు కూడా పార్టీలో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సోనియా త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనతో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలిసింది.
 
ప్రచారానికి వెళ్లని ఎంపీ
టీఆర్‌ఎస్‌ నేతలంతా ప్రచారంలో తలమునకలై ఉండగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన వెన్నంటి ఉండే ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి ప్రచారంలో ఉండగానే విశ్వేశ్వర్‌రెడ్డి పలుమార్లు వచ్చారు. కానీ, ఒక్కసారి కూడా ప్రచారంలో పాల్గొనలేదు. బుధవారం కూడా ఆయన తాండూరు కాలుష్యంపై విలేకర్లతో మాట్లాడారు. కాలుష్యంపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తనకే సిగ్గేసిందని వాఖ్యానించారు. అంతేతప్ప మహేందర్‌రెడ్డికి ఓటేయాలని కానీ కోరలేదు. కొన్నాళ్లుగా విశ్వేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేటీఆర్‌, కవిత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదని తెలిసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...