Jump to content

Asia Pulp & Paper industry, Rs 24,500 cr investment


sonykongara

Recommended Posts

రికార్డు ఎఫ్‌డీఐగా ఏపీపీ పెట్టుబడి

 

రాష్ట్రంలో రూ.24,500 కోట్ల పెట్టనున్న ఇండోనేషియా సంస్థ
నేడు కాగిత గుజ్జు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న సీఎం

ఈనాడు, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం(2018-2019)లో మన దేశంలోకి వచ్చిన అతిభారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా ఏషియా పల్ప్‌, పేపర్‌ (ఏపీపీ) గ్రూపు పెట్టుబడి రికార్డు సృష్టించింది. ఆ పెట్టుబడి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రావడం విశేషంగా మారింది. ఇండోనేషియాకు చెందిన సదరు సంస్థ ఏకంగా రూ.24,500 కోట్లను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్రం సాధిస్తున్న పారిశ్రామిక ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ అనంతపురం జిల్లాలో రూ.13 వేల కోట్ల భారీ పెట్టుబడితో కార్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తుండగా తాజాగా అంతకు రెండింతల పెట్టుబడితో ఏపీపీ గ్రూపు కాగితపు గుజ్జు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేసే ఈ కార్యక్రమంలో ఏపీపీ గ్రూపు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. పలు రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పించి ఏపీపీ గ్రూపును రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైంది.  కాగిత గుజ్జు తయారీకి అందుబాటులో ముడిసరకు, రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, తగినంత భూమి లభ్యత వంటివన్నీ ప్రకాశం జిల్లాలో ఇండోనేషియా సంస్థ పెట్టుబడులకు కలిసొచ్చిన అంశాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకేచోట ఇంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం ఇదే మొదటిసారని ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌ అభిప్రాయపడ్డారు.

 

 
Link to comment
Share on other sites

ఏపీలో భారీ కాగిత పరిశ్రమ
09-01-2019 00:43:29
 
636825914102426394.jpg
  • రూ.24 వేల కోట్ల పెట్టుబడులు
  • ఏర్పాటు చేయనున్న ఇండోనేషియా కంపెనీ
ఒంగోలు/అమరావతి (ఆంద్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పేరుకు కోస్తా జిల్లా అయినప్పటికీ... వెనుకబాటు, వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమతో పోటీపడే ప్రకాశం జిల్లాకు పారిశ్రామిక కళవస్తోంది. అటు భారీ కాగితపు పరిశ్రమ, ఇటు రామాయపట్నం పోర్టుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ (ఏపీపీ) రామాయపట్నం సమీపంలో ఆంధ్రా పేపర్‌ ఎక్స్‌లెన్స్‌ (ఏపీఈ) పేరుతో భారీ కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రెండు దశల్లో రూ.24వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం ఇదే విశేషం.
 
మూడో దశలో దాదాపు ఇంతే పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్దదైన ఐటీసీ పేపర్‌ మిల్స్‌కు పదిరెట్ల పెద్ద కాగిత గుజ్జు, కాగిత తయారీ పరిశ్రమగా ఏపీఈ అవతరించనుంది. ఇందులో ప్రత్యక్షంగానే 15వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇక... ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60వేల మంది సుబాబుల్‌, యూకలిప్టస్‌ రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రైతులకు ఏపీపీ మిల్స్‌ స్వయంగా మేలిరకం వంగడాలను ఏపీపీ అందిస్తుంది.
 
రామాయపట్నం పోర్టుకూ శ్రీకారం
కాగా ‘రామాయపట్నం’ పోర్టుకు ఎట్టకేలకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. సుమారు 3092 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 30 బెర్త్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో రూ.4,240 కోట్లతో ఐదు బెర్త్‌లను నిర్మించనున్నారు. డీపీఆర్‌ తయారు చేసి, టెండర్లు పిలిచి 2020 జనవరిలో పనులు ప్రారంభించనున్నారు. 2023 జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రామాయపట్నం నుంచి గ్రానైట్‌, బొగ్గు, ఎరువులు, ఆయిల్‌, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశం ఉంది. ప్రతిపాదిత కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, కనిగిరి నిమ్జ్‌, దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, మాచర్ల సమీపంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీల ఉత్పత్తులను ఇక్కడి నుంచే ఎగుమతి చేయవచ్చు. ఈ పోర్టు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి
Link to comment
Share on other sites

ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంలా మారింది: చంద్రబాబు
09-01-2019 16:32:19
 
636826484134668213.jpg
ప్రకాశం: రామాయపట్నంలో ఆసియా పల్ప్‌ అండ్ పేపర్, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. రెండు దశల్లో రూ.24వేల కోట్ల పేపర్ పరిశ్రమ పెట్టుబడి పెట్టనుంది. పేపర్ పరిశ్రమ ద్వారా 4500 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుంది. 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. పేపర్ పరిశ్రమలో ప్రతి ఏడాది 4.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి కానుంది.
 
 
రామాయపట్నంలో పోర్టు, పేపర్ పరిశ్రమ ఏర్పాటు ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం ఒక మంచి లాజిస్టిక్ పోర్టుగా మారుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌గా ఉన్నామని ఆయన తెలిపారు. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందని, పోర్టు, పేపర్ పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని సీఎం తెలిపారు. ప్రతిపక్ష నేతలు పరిశ్రమలను అడ్డుకోవాలని చూసినా ప్రజలే వాళ్లను తిప్పి కొడుతున్నారని పేర్కొన్నారు. ఏపీ తీర ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

N Chandrababu NaiduVerified account @ncbn 22s23 seconds ago

 
 

రామాయపట్నంలో ఆసియా పల్ప్‌ అండ్ పేపర్, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నాం. రెండు దశల్లో రూ.24వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా 16 వేల మందికి ఉపాధి, ముఖ్యంగా 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. #Janmabhoomi2019

DweOFy4V4AE8_v3.jpg
DweOLRTU0AIG8HG.jpg
DweOLQ3V4AEFk0a.jpg
DweOLQTVsAEjPF_.jpg
Link to comment
Share on other sites

రామాయపట్నం పోర్టుకు సీఎం శంకుస్థాపన 

 

రూ.24,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కాగిత పరిశ్రమకు కూడా 
ప్రకాశం జిల్లా రూపురేఖలు మారనున్నాయి: చంద్రబాబు నాయుడు

9ap-main4a_2.jpg

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం రెండు కీలకమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఒకటి ఇటీవలి కాలంలో దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో ఏర్పాటు కానున్న కాగిత పరిశ్రమకాగా రెండోది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకోనున్న రామాయపట్నం పోర్టు. ఈ రెండింటికి బుధవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. పైలాన్లను ఆవిష్కరించారు. అనంతరం జన్మభూమి- మావూరు సభలో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, పిల్లల ఆటల పోటీలనూ సీఎం సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు మాట్లాడారు.

ఇదే అతి పెద్ద విదేశీ పెట్టుబడి 
‘రూ.24,500 కోట్ల పెట్టుబడితో ఆసియా పేపర్‌, పల్ప్‌ (ఏపీపీ) కాగిత పరిశ్రమ రాష్ట్రానికి రావడం మంచి విషయం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో దేశంలో ఇదే అతి పెద్ద పెట్టుబడి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,622 ఎంవోయూలు కుదుర్చుకోగా వాటిలో 810 కార్యరూపం దాల్చాయి. రూ.15 లక్షల కోట్లలో రూ.1.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2.5 లక్షల మందికి ఉపాధి లభించింది.

ప్రకాశం జిల్లాకు మహర్దశ 
రామాయపట్నం పోర్టు, ఏపీపీ పరిశ్రమతో ప్రకాశం జిల్లా రూపురేఖలు మారనున్నాయి. రూ.4200 కోట్ల అంచనాలతో పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. పోర్టు పక్కనే మత్య్సకారుల కోసం ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తాం. అమరావతి తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందేది ఒంగోలు నగరమే.

సౌర విద్యుత్తుతో రైతులకు ఆదాయం 
రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణలకు 138 అవార్డులు వచ్చాయి. విద్యుత్తు ఛార్జీలు పెంచని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. భవిష్యత్తులో సౌర విద్యుత్తుతో రైతులకు ఆదాయం వచ్చే వినూత్న ఆలోచన చేస్తున్నాం.’

ఎంవోయూ 
కాగిత పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పర అంగీకార పత్రాలు (ఎంవోయూ) మార్చుకున్నారు. ఏపీపీ పరిశ్రమ ప్రతినిధి సురేష్‌ కెల్లం మాట్లాడుతూ.. పరిశ్రమకు 11 నెలల వ్యవధిలోనే అన్ని అనుమతులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాము ఈ పరిశ్రమ ఏర్పాటుకు గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీలోని ఇతర ప్రాంతాలు చూశామని కానీ ప్రకాశం జిల్లా అనువుగా ఉందని గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, రాష్ట్ర పోర్టుల కార్యదర్శి కోయ ప్రవీణ్‌, ఏపీఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్‌, కలెక్టరు వినయ్‌ చంద్‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

20 నెలల్లోనే కాగిత పరిశ్రమ
10-01-2019 03:48:54
 
636826889351292949.jpg
  • మోడల్‌ టౌన్‌షి్‌పగా రామాయపట్నం
  • రాజకీయ లబ్ధికి కొందరు యత్నం
  • వారి మాయమాటలను నమ్మవద్దు
  •  రైతులు సహకరించాలి : చంద్రబాబు
  • ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద సీఎం సమక్షంలో ఏపీపీతో ఎంవోయూ
ఒంగోలు, జవనరి 9(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా రామాయపట్నం సమీపంలో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ (ఏపీపీ) నిర్మించనున్న కాగిత పరిశ్రమ తొలిదశ నిర్మాణం 20 మాసాల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద ఓడరేవుకు, పేపర్‌ పరిశ్రమ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పేపర్‌ మిల్స్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాలను ఏపీపీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ కిలాం, ఈడీబీ సీఈవో జే కృష్ణకిషోర్‌ ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు. పోర్టు నిర్మాణ ప్రారంభ దశలోనే ఒక పెద్ద పరిశ్రమ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం ఓ చరిత్ర అని సీఎం అభివర్ణించారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు ఈనెల 29వతేదీ మార్కెట్‌లో విడుదల కానుందని చెప్పారు.
 
ఆ తరహాలోనే పేపర్‌ పరిశ్రమ తొలిదశను 20 నెలలోపు పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అందుకు స్థానికంగా అవసరమైన అనుమతులు, సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన అందిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 2,500 ఎకరాల భూమిని సమీకరించే సమయంలో రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘రాజధాని అమరావతి నిర్మాణ ప్రాంతంలోను, అలాగే కియ పరిశ్రమ నిర్మాణ సమయంలోను కొందరు రాజకీయ లబ్ధికోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే రైతులు వారికి ఎదురు తిరిగి ప్రభుత్వానికి చక్కటి సహకారం అందించారు. ఇప్పుడు వారంతా తగిన ఫలితాన్ని పొందుతున్నారు. ఇక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం మాయ మాటలతో మోసం చేసే ప్రయత్నాలు చేయవచ్చు. వాటిని రైతులు తిప్పి కొట్టాలి’’ అని పిలుపునిచ్చారు.
 
ఇటు రహదారి.. అటు సముద్రం..
ఇటు పోర్టు, ఇటు పరిశ్రమ నిర్మాణానికి కేంద్రమైన రామాయపట్నం గ్రామాన్ని మోడల్‌ టౌన్‌షి్‌పగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక్కడ పోర్టు, పేపర్‌ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్న ఆయన, రెండు కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి, ఆరు కిలోమీటర్ల దూరంలో సముద్రం, మూడు నాలుగు రాష్ట్రాలకు రవాణా మార్గాలు ఉండటంతోపాటు 61 కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు రానుందని తెలిపారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్‌ నుంచి నీటిని మళ్లించుకునే అవకాశం ఉందన్నారు.
 
ఇదే పెద్ద పరిశ్రమ
తమ కంపెనీ 1978లో కాగిత పరిశ్రమను ప్రారంభిందని కంపెనీ ఈడీ సురేశ్‌ కిలాం తెలిపారు. ‘‘రామాయపట్నంలో రూ.24,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 4,500 మందికి ప్రత్యక్షంగా, 12వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 50వేల మంది సామాజిక వనాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది’’ అని వివరించారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన వాటిలో అతిపెద్దపరిశ్రమ ఇదేనని ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న వనరులకు తోడు, సీఎం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
 
నాలుగున్నరేళ్లలోనే జీడీపీ 60% పెరుగుదల సాధించడం సీఎం సమర్థతకు నిదర్శనమన్నారు. మరికొన్ని విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, త్వరలో ఇంకొన్ని ఒప్పందాలు జరగబోతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, కంపెనీ ఇండియా సీఈవో జోసెఫ్‌ మైయర్స్‌, ఎమ్మెల్యే పోతుల రామారావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దివి శివరాం తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...