Jump to content

Asia Pulp & Paper industry, Rs 24,500 cr investment


sonykongara

Recommended Posts

ఫలిస్తున్న పరిశ్రమ
కాగితం పరిశ్రమ ఏర్పాటుకు భూముల పరిశీలన
‌ సానుకూలతలను వివరించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌
pks-gen2a.jpg

గుడ్లూరు, లింగసముద్రం, న్యూస్‌టుడే: గుడ్లూరు మండలంలోని తీర ప్రాంత గ్రామం చేవూరులో కాగితం పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూములను రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం పరిశీలించింది. ఆరోఖ్యరాజ్‌తోపాటు ఏసియన్‌ పేపర్‌ పల్ప్‌ గ్రూపు సీఈవో సురేష్‌ కిలం, పరిశ్రమ ఏర్పాటు చేసే ఇండోనేషియా కంపెనీ ఎండీ జోసెఫ్‌ మైరిస్‌ చేవూరుకు వచ్చారు. వారికి గ్రామానికి తూర్పు వైపు ఉన్న 2,480 ఎకరాల భూమిని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చూపించి, అక్కడి పరిస్థితులను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రామాయపట్నం ఓడరేవు, పక్కనే పేపర్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం ప్రతినిధులు భూములు పరిశీలించేందుకు వచ్చారని కలెక్టర్‌ వివరించారు. పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతం నెల్లూరు జిల్లా సరిహద్దును ఆనుకుని ఉండటంతోపాటు పక్కనే బంగాళాఖాతం, బకింగ్‌హామ్‌ కాలువ అందుబాటులోఉన్న విషయాలను కలెక్టర్‌ వారికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు పది వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందనీ, జిల్లాలో విస్తారంగా సాగవుతున్న సుబాబుల్‌, జామాయిల్‌ కర్రకు మంచి ధర లభించి రైతులు లాభపడే అవకాశం ఉంటుందన్నారు. ప్రతినిధుల వెంట సంయుక్త కలెక్టరు నాగలక్ష్మి, ఆర్డీవో రామారావు, తహసీల్దారు సీతారామయ్య, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

తీరం, రాళ్లపాడు సందర్శన
కంపెనీ ప్రతినిధులు సముద్ర తీరాన్ని పరిశీలించారు. అనంతరం రాళ్లపాడు జలాశయం వద్దకు చేరుకుని నీటి లభ్యతపై ఆరా తీశారు. కంపెనీని సుమారు రూ. 24వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పరిశీలనాంశాలను తమ కంపెనీ సభ్యులకు వివరిస్తామని అన్నారు. ఇదే విషయమై బుధవారం అమరావతిలో కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పరిశ్రమలశాఖ కార్యదర్శి తెలిపారు.

2,480 ఎకరాలు అవసరం
కంపెనీ ఏర్పాటుకు మొత్తం 2,480 ఎకరాలు అవసరం కాగా, అందులో సుమారు 1800 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయని గుడ్లూరు తహసీల్దారు సీతారామయ్య వెల్లడించారు. రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు ఇప్పటికే భూములు సిద్ధం చేశామన్నారు. రామాయపట్నం-చేవూరు మధ్య ఓడరేవు ప్రతిపాదిత స్థలాలు ఉన్నాయనీ, పేపర్‌ పరిశ్రమకు చేవూరుకు తూర్పు, దక్షిణంగా భూములు చూపించామని వివరించారు.

Link to comment
Share on other sites

ప్రకాశంలో భారీ పరిశ్రమ!
రూ. 21,600 కోట్లతో 2 వేల ఎకరాల్లో పేపరు, టిష్యూ ఇండస్ట్రీ ఏర్పాటు
  ఇండోనేసియాకి చెందిన సినర్‌ మాస్‌ గ్రూపు సంసిద్ధత
6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
కియా మోటార్స్‌ తరువాత రెండో భారీ పెట్టుబడి
నెలాఖరులో సీఎంకు ప్రాజెక్టు నివేదిక అందజేయనున్న నిర్వాహకులు
ఈనాడు - అమరావతి
15ap-main2a.jpg

రాష్ట్ర పారిశ్రామిక రంగంలోకి మరో భారీ పెట్టుబడి రానుంది. కియా మోటార్స్‌ స్థాయిలో ఇది రెండో పెద్ద పరిశ్రమ కానుంది. ఇండోనేసియాకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్‌ పేపర్‌ (ఏపీపీ) గ్రూపు అనుబంధ సంస్థ సినర్‌ మాస్‌ గ్రూపు ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించనుంది. రెండు దశల్లో రూ.21,600 కోట్ల (3 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. టిష్యూ, ప్యాకింగ్‌, పేపర్‌ తయారీ పరిశ్రమను 2 వేల ఎకరాల్లో పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు. జిల్లాలోని పలు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించిన ప్రతినిధుల బృందం పెట్టుబడులపై సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిర్వాహకులు నెలాఖరులో ముఖ్యమంత్రికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) అందజేయనున్నారు.

అందుబాటులో ముడిసరుకు, ఓడరేవు..
రూ.13 వేల కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా మోటార్స్‌ పారిశ్రామిక రంగంలో మైలురాయిలా నిలిచింది. ఇలాంటి భారీ పెట్టుబడుల కోసం యత్నిస్తున్న ప్రభుత్వంతో ఏపీపీ గ్రూపు చేతులు కలిపింది. అందుబాటులో సుబాబుల్‌, యూకలిప్టస్‌, సరుగుడు కర్రలను ఉపయోగించి పేపర్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పరిశ్రమలశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముడి సరుకు కలిగిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇటీవల సినర్‌ మాస్‌ గ్రూపు ప్రతినిధుల బృందాన్ని  తీసుకెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా టిష్యూ, ప్యాకింగ్‌, పేపర్‌కు బాగా గిరాకీ ఉన్నందున ఎగుమతులకు వీలుగా ఓడరేవుకు సమీపంలో భూములు కావాలన్న నిర్వాహకుల సూచనలపై రామాయపట్నంలోని పలు ప్రాంతాలను  చూపించారు. భారీ పెట్టుబడులతో వచ్చేవారికి ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను అధికారులు వివరించారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాథమిక నిర్ణయానికి సినర్‌ మాస్‌ గ్రూపు వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో రెండు బిలియన్లు,  తదుపరి దశలో బిలియన్‌ డాలర్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రభుత్వంతో కియా మోటార్స్‌ తుది ఒప్పందం
కియా మోటార్స్‌ నిర్వాహకులు ప్రభుత్వంతో తుది ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ సంస్థ, అనుబంధ పరిశ్రమలు కలిపి రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న నేపథ్యంలో తుది ఒప్పందం చేసుకున్నారు. సచివాలయంలో గురువారం పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, కియా మోటార్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ కూక్‌ హాన్‌ షిమ్‌ మధ్య ఇది జరిగింది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమ
31-12-2018 08:57:37
 
636818434577745070.jpg
అమరావతి: రాష్ట్రానికి తలమానికంగా భావిస్తున్న ఆసియా పల్ప్‌ అం డ్‌ పేపర్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమను ఆసియా పల్స్‌ అండ్‌ పేపర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 9న రామాయపట్నం సమీపంలో సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలితో అవగాహనా ఒప్పందం చేసుకోవడం చకచకా జరిగిపోనున్నాయి. తొలిదశలో ఆసియా పల్స్‌ అండ్‌ పేపర్‌ రూ.28వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 15వేలమందికి ఉపాధి, 30లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేస్తారు. సుబాబుల్‌, సరుగు తోటలు పెంచేందుకు 60వేలమంది రైతులతో ఇప్పటికే యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. తొలిదశలో రూ.28,000 కోట్ల పెట్టుబడితో 15వేల మందికి ఉపాధి కల్పించడం ద్వారా 30 లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నారు.
 
 
ప్రకాశం జిల్లా రైతులు గతంలో సరుగుడు కొంతకాలం, ఆ తరువాత సుబాబులు కొంతకాలం వేశారు. రాబడి పెద్దగా లేకపోవడంతో నిలిపేశారు. తాజాగా, కాగిత పరిశ్రమ ఏర్పాటుతో రైతులు మళ్లీ సుబాబుల్‌, సరుగుడు తోటలను పెంచేందుకు వీలు కలుగుతుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు రావాల్సి ఉన్నందున దోనకొండ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

At $3.5 billion, Andhra Pradesh gets India’s single biggest FDI
By
Swati Bharadwaj Chand
, TNN|
Updated: Jan 06, 2019, 11.19 AM IST
At $3.5 billion, Andhra Pradesh gets India’s single biggest FDI
By
Swati Bharadwaj Chand
, TNN|
Updated: Jan 06, 2019, 11.19 AM IST

 

Link to comment
Share on other sites

ఇండియాలో ఇప్పటి దాకా స్థాపించిన మొత్తం పేపర్ మిల్లుల installed capacity 18 నుంచి 20 మిలియన్ tons. రామాయపట్నం లో పెట్టె పేపర్ పరిశ్రమ installed capacity 5 మిలియన్ tons ఇప్పుడు మీరు అర్ధం చేసుకోండి ఎంత పెద్ద ఇండస్ట్రీనో అది, జై ఆంధ్ర ప్రదేశ్ జై @ncbn

DwPD3HQUwAQaxpx.jpg
Link to comment
Share on other sites

Ee sababulu plantation ki water limited ga unna saripotunda? PantA chetiki ravalante Enta time padtundi..  Marketing ela gittibatavtunda? 

Link to comment
Share on other sites

$3.5 బిలియన్ ( షుమారు రూ 24500 కోట్లు) విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్,ప్రకాశం జిల్లా కు ....జయహో ఆంధ్రప్రదేశ్
5 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో 2500 ఎకరాలలో,ప్రకాశం జిల్లా రామాయపట్నం లో పేపర్ పరిశ్రమను స్థాపిస్తున్న దిగ్గజ కంపెనీ ఏషియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్(APP). దాదాపు 15000 మందికి ప్రత్యక్ష,పరోక్ష ఉద్యోగ కల్పన.
ఇంత పెద్ద పరిశ్రమను వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో నెలకొల్పడానికి ప్రోత్సహించిన దార్శనిక నేత చంద్రన్నకు ధన్యవాదాలు
అందుకే చంద్రన్నా మళ్లీ మీరే రావాలన్నా!!

Link to comment
Share on other sites

పారిశ్రామిక ప్రకాశం 

 

చేవూరులో ఏపీపీ కాగిత పరిశ్రమ 
రావూరులో రామాయపట్నం పోర్టు 
రేపు రెండింటికీ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

7ap-story3a.jpg

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: కరవుకాటకాలు... వెనుకబాటుతనం... ఉపాధి లేమి... వనరులున్నా వినియోగించుకోలేని స్థితి. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాను తలచుకుంటే గుర్తుకు వచ్చేవి ఇవే... ఇక మీదట ఈ పిలుపు, ఆ తలపు మారనుంది. రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, జిల్లాకు తలమానికమైన కీలక పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు కానుంది. రూ.27 వేల కోట్ల పెట్టుబడితో 18 వేల మందికి ఉపాధి లక్ష్యంతో కాగిత గుజ్జు పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీనికి సమీపంలోనే 15 వేల మందికి ఉపాధి కల్పించే రామాయపట్నం పోర్టు నిర్మాణం కానుంది. ఈ రెండు కీలక ప్రాజెక్టులకు ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 
పేపరు పరిశ్రమకు కలిసొచ్చిన అంశాలు 
ప్రకాశం జిల్లా సమీపంలోని నేలలు అనుకూలంగా ఉండడం, ముడిసరకు (జామాయిల్‌, సుబాబుల్‌) విరివిగా లభించడం, సమీపంలోనే రామాయపట్నం పోర్టు ఏర్పాటు కానుండడం కాగిత గుజ్జు పరిశ్రమ ఏర్పాటుకు కలిసొచ్చే అంశాలు కావడంతో పరిశ్రమ ఏర్పాటుకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. ఇండోనేషియా కేంద్రంగా నడుస్తున్న ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు తమ ఉత్పత్తులను చేరవేస్తోంది. మన దేశంలో ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పడం ఇదే తొలిసారి. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తారు. 
సాకారం దిశగా రామాయపట్నం పోర్టు 
గుడ్లూరు మండలం రావూరులో ప్రభుత్వమే ఈ ఓడరేవును నిర్మించనుంది. 
నాన్‌-మేజర్‌ పోర్టుగా దీన్ని నిర్మించనున్నారు. దీనికి 4,652 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 
దీని ద్వారా కనీసం 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. 
ఈ పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే చేవూరులో కాగిత పరిశ్రమ నెలకొల్పనున్నారు. 
పోర్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చే సమయానికే పరిశ్రమ కూడా కార్యకలాపాలు మొదలు పెడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌ పరిశ్రమ వివరాలు 
పరిశ్రమ పేరు : ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌ (ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌) 
పెట్టుబడి : తొలి దశలో రూ. 27 వేల కోట్లు (3.85 బిలియన్‌ డాలర్లు) 
ఉత్పత్తి సామర్థ్యం : 5 మిలియన్‌ టన్నులు (ఏడాదికి) 
కావాల్సిన భూమి : 2,450 ఎకరాలు 
ప్రాంతం : గుడ్లూరు మండలం చేవూరులో (రామాయపట్నం పోర్టు ప్రతిపాదిత స్థలానికి కొద్ది దూరంలోనే) 
ఉపాధి కల్పన : 18 వేల మందికి (ప్రత్యక్షంగా 6 వేలు, పరోక్షంగా 12 వేల మందికి)

 

 
Link to comment
Share on other sites

పరిశ్రమకు ‘ప్రకాశం’
09-01-2019 02:55:44
 
636825993447022395.jpg
  • నేడు రామాయపట్నం పోర్టు, పేపర్‌ మిల్స్‌కు శంకుస్థాపన
  • వెనుకబడిన జిల్లాలో కొత్త వెలుగులు
  • రూ.24 వేల కోట్లతో ఆంధ్రా పేపర్‌ ఎక్స్‌లెన్స్‌
  • ఇండోనేషియా కంపెనీ ఏపీపీ మిల్స్‌ స్థాపన
  • దేశానికి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే
  • ఐటీసీ పేపర్‌ మిల్స్‌కంటే పది రెట్లు పెద్దది
  • ఎట్టకేలకు రామాయపట్నం రేవుకు శ్రీకారం
  • తొలి విడతలో రూ.4,240 కోట్ల పెట్టుబడి
 
ఒంగోలు/అమరావతి, జనవరి 8 (ఆంద్రజ్యోతి): పేరుకు కోస్తా జిల్లా అయినప్పటికీ... వెనుకబాటు, వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమతో పోటీపడే ప్రకాశం జిల్లాకు పారిశ్రామిక కళవస్తోంది. అటు భారీ కాగితపు పరిశ్రమ, ఇటు రామాయపట్నం పోర్టుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌ (ఏపీపీ) రామాయపట్నం సమీపంలో ఆంధ్రా పేపర్‌ ఎక్స్‌లెన్స్‌ (ఏపీఈ) పేరుతో భారీ కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ రెండు దశల్లో రూ.24వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం ఇదే విశేషం. ప్రస్తుతం దేశంలో అతిపెద్దదైన ఐటీసీ పేపర్‌ మిల్స్‌కు పదిరెట్ల పెద్ద కాగిత గుజ్జు, కాగిత తయారీ పరిశ్రమగా ఏపీఈ అవతరించనుంది. ఇందులో ప్రత్యక్షంగానే 15వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 60వేల మంది సుబాబుల్‌, యూకలిప్టస్‌ రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
 
 
రామాయపట్నం పోర్టుకూ శ్రీకారం
అనేక మలుపులు తిరిగిన ‘రామాయపట్నం’ పోర్టుకు ఎట్టకేలకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. సుమారు 3092 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 30 బెర్త్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో రూ.4240 కోట్లతో ఐదు బెర్త్‌లను నిర్మించనున్నారు. డీపీఆర్‌ తయారు చేసి, టెండర్లు పిలిచి 2020 జనవరిలో పనులు ప్రారంభించనున్నారు. 2023 జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రఈ పోర్టు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
 
 
మరికొన్ని కంపెనీల చూపు
రామాయపట్నం వద్ద పోర్టు ఏర్పాటు, సమీపంలోనే భారీ కాగితపు పరిశ్రమ కూడా రానున్న నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు కూడా ప్రాంతం వైపు దృష్టి సారించాయి. దేశంలో పేరు ప్రఖ్యాతులున్న జిందాల్‌ కంపెనీ స్టీల్‌ ఫ్యాక్టరీని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. సుమారు రూ.20వేల కోట్ల పెట్టుబడి, పది వేల మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామార్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు కంపెనీ ముందుకు వచ్చింది. వ్యవసాయ యంత్ర పరికరాలు, ఎరువుల తయారీ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న అకార్డ్‌ కంపెనీ కూడా ఇక్కడ తమ యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది.
 
 
అతి భారీ కాగితపు పరిశ్రమ...
  • ప్రపంచంలోనే అతిపెద్ద కాగితపు తయారీ కంపెనీ... ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ మిల్స్‌! రామాయపట్నం సమీపంలో రూ.24వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది.
  • ఏపీపీ మిల్స్‌ వార్షిక టర్నోవర్‌ రూ.లక్ష కోట్లు.
  • ప్రకాశం జిల్లాలో స్థాపించే ప్లాంటులో 50 లక్షల టన్నుల కాగితపు గుజ్జును తయారు చేస్తారు.
 
 
ఇదీ రామాయపట్నం రేవు...
  • ఏపీ మారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టును నిర్మిస్తారు.
  • దేశంలోనే అతిపెద్ద బ్రేక్‌ వాటర్‌ 3.5 కి.మీ.ల పొడవునా తూత్తుకుడి పోర్ట్‌కు ఉంది. రామాయపట్నం పోర్ట్‌ దానికంటే ఎక్కువగా... 4.9కి.మీ బ్రేక్‌ వాటర్‌ కలిగి ఉంటుంది.
  • జనవరి 2020లో టెండర్లు పిలిచి .. 2023 నాటికి పూర్తి. పోర్టు నిర్మాణంకోసం 3500 ఎకరాల భూమిని సేకరిస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...