Jump to content

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని?


krish2015

Recommended Posts

నందమూరి హరికృష్ణ తనయ.. నందమూరి సుహాసినిచే కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారా? ఈ ప్రతిపాదనపై ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు చర్చించారా?
 
..విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. పార్టీ ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్‌ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది. సుహాసిని.. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌ సతీమణి. కూకట్‌పల్లి నుంచి ఆమెను బరిలోకి దింపాలన్న యోచనపై టీడీపీ సీనియర్‌ నేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
 
‘‘ఆ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీచేస్తే బాగుంటుందని భావించాం. హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాం లేదా కూతురు సుహాసిని పోటీపై పార్టీలో చర్చించాం. కళ్యాణ్‌రాం ఆసక్తి కనబరచలేదు. అందుకే సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాం’’ అని ఆయన వివరించారు. ఈ సీటు కాక, టీడీపీ ప్రకటించాల్సిన మిగతా నాలుగు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ముఖ్యనేతలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కూటమి సర్దుబాట్లలో కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ ఇప్పటికే ఆ పార్టీ ఖాతాలో చేరాయి. బాన్సువాడ-నిజామాబాద్‌ రూరల్‌, ఖైరతాబాద్‌-సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌-ఇబ్రహీంపట్నం స్థానాల్లో ఏవైనా మూడు టీడీపీకి దక్కనున్నాయి.
 
‘కూకట్‌పల్లి’ కోసం తీవ్ర పోటీ..
ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన కూకట్‌పల్లి సీటు కోసం తీవ్రపోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు పార్టీ సీనియర్‌ నేత పెద్ది రెడ్డి కొద్దిరోజులుగా స్థానిక కార్యకర్తలకు చెబుతూవచ్చారు. ఈయనకు పోటీగా మందాడి శ్రీనివాసరావు కూడా గట్టి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇద్దరు నాయకులూ మూడురోజుల కిందట భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. కూకట్‌పల్లి స్థానాన్ని బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా పెరిగింది. ఈ స్థానాన్ని కాపులకు కేటాయించాలని ఏపీకి చెందిన కొంతమంది కాపు నేతలు.. బీసీలకు ఇవ్వాలని పలు బీసీ సంఘాలు కూడా చంద్రబాబును కోరినట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌కుమార్‌, పారిశ్రామిక వేత్త ప్రభాకర్‌రావులు అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ కావ్యారెడ్డి భర్త హరీశ్‌ రెడ్డి మంగళవారం విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకుని, తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Link to comment
Share on other sites

కూకట్‌పల్లిలో పెద్దిరెడ్డికి బ్రేక్.. ప్రచారం ఆపేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశం?
14-11-2018 08:46:47
 
636777822007924997.jpg
 
హైదరాబాద్‌: కూకట్‌పల్లి టీడీపీ టికెట్‌ ఎవరికి దక్కుతుందన్న విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ స్థానం కాంగ్రెస్‌కా, టీడీపీకా అన్న ఉత్కంఠ ఇంతకాలం కొనసాగగా, చివరికి టీడీపీ సీటు కేటాయించారు. అయితే, టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇనుగాల పెద్దిరెడ్డి పేరు వినిపించింది.
 
ఆయన ముందస్తుగా నియోజకవర్గంలో ప్రచారాన్నీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్దిరెడ్డిని ప్రచారం నిలిపివేయాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. టికెట్‌ కేటాయించక ముందే ఇలా ప్రచారం చేయడం వల్ల ఆశావహులకు తప్పుడు సాంకేతలు వెలుతాయని, పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని భావించిన అధిష్ఠానం ఇంకా ప్రకటించని స్థానాల్లో ప్రచారం చేయవద్దని ఆదేశించినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ కావ్యారెడ్డి భర్త హరీశ్‌ రెడ్డి  vidu chal gatti vadu,vidu TDP kukatpally municipality unnappudu municipal councillor ethanu,ghmc lo kalisaka 2009 lo kphb seat adigadu,appuduu dandamudi sobhanadri garu hyder nagar seat adigadu,mayor candidate kosam hyder nagar icchi, dandamudi sobhanadri ni kphb ki marcharu,adi gadi harish seat asalu ,rebel ga vadu poti chesadu chivaraki tg godava vacchka mari over chesi trs ki poyadu,pjr time lo TDP tarpuna gattiga work chesadu edirichi, time bad party maredu, andhara vallani tittedu lekapothe janalalo gatti pattu unnadi ethanike..Srinivasa Sudhish Rambhotla gadu appudu2009 lo mayor candidate  vadu  hydernagar safe ani adigi tisukonai vacchadu,vacchadu andari seat vadi valla marayi, chivaraki bhanu tanu nomination vesi , Rambhotla gadi ni nomination  veyya kuda addukunnadu,time ayipoyindi chivaraki party kuda bhanu ki seat icchindi, E Rambhotla gadu ippudu bjp loki maredu ap bjp lo work chesthunnadu sudda vedava vidu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...