Jump to content

NRI About cbn


Vvnspsnrntr

Recommended Posts

Bhargav Alexander King

అమెరికాలో ఉండే తెలుగువాడు సోదరుడు బాబుపై రాసిన పోస్టు టచ్‌ చేసింది! ప్రతి ఆంధ్రుడు చదివి తీరాల్సిందే...

“ఓ దార్శనికుడా నీకు వందనం! 
మీకు ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాదని ఆంగ్లం లో గొప్ప పండితుడు, బహు భాషా కోవిదుడు అయిన సదరు ప్రతిపక్ష నేత అసెంబ్లీ లోనే ఆరోపించారు. కేవలం అయిదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక అపర కుబేరుడిని అరగంటకి పైగా టెక్నాలజీ మీద మీ దార్శనికత చూపించి ప్రపంచంలో ఒక్క అమెరికాలో తప్ప ఇంకో దేశంలో లేని మైక్రోసాఫ్ట్ కంపెనీని అవిభాజ్య ఆంధ్ర కి రప్పించారు.

అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని అగ్ర రాజ్యాధినేతని అరవై నిమిషాలకి పైగా ఆలా కూర్చోబెట్టి మీ విజన్ 2020 తో రాష్ట్ర అభివృద్ధిలో మీ ముందు చూపు ఏంటో చెప్పి ఆయన ఆశ్చర్యపోయేలా చేశారు. ఇవన్నీ మీరు ఇంగ్లీష్ రాకుండా చేశారు అనుకుంటున్న వాళ్ళ అజ్ఞానాన్ని ఏమందాం? ఒక నవ్వు నవ్వి ఊరుకుందాం. మీకొచ్చిన కనీస ఇంగ్లీష్ తోనే నిరుద్యోగంతో సతమవుతున్న నాలుగు కుటుంబాలకైనా రోజూ నాలుగు వేళ్ళు నోట్లోకి పోయేలా చేశారు… మరి జగన్‌ తనకి వచ్చిన ఇంగ్లీష్ తో తన అక్రమ సంపాదనతో పారిశ్రామికవేత్తలను లోపలికి పోయేలా చేశాడు. విశ్వామిత్రుడు ఇటు భూమండలం మీద అటు ఆకాశంలో కాకుండా మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తే…
” అమరపురి వాసులు కూడా ” అచ్చెరువొందారు .
మొన్నామధ్య జేమ్స్ కేమెరూన్ పండోర అని ఒక ఊహజనిత లోకాన్ని అత్యంత సుందరంగా సృష్టించి చూపిస్తే అలా నోరెళ్ళ బెట్టి చూశారు.

మరి మీరు ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా అమరావతిని నిర్మించాలని చూస్తుంటే అసూయ పడిన ప్రతి ఒక్కడు అడ్డు పుల్ల వేస్తుంటే బాధగా వుంది సర్ …..
ఏంటా పంట చేలు తగలబెట్టడం, సచివాలయం లో ఏ.సి పైపులో నీళ్లు పోయడం, 
రైతులతో ధర్నాలు చేపించడం….. ఉద్యమాలని ముసుగు వేసుకొని ఊర్లు తగలబెట్టడం…….
ఏమో విశ్వామిత్రుడు, 
జేమ్స్ కేమెరూన్ లు అద్భుతాల్ని సృష్టించాక లోకానికి తెలిసింది కానీ వాటిని సృష్టించేటప్పుడు వాళ్లెన్ని అడ్డంకులు, అడ్డుపుల్లలు ఎదుర్కొన్నారో……. 
క్రికెటర్లు కొన్ని మ్యాచ్ లు ఆడి మేము అలిసిపోయాం విశ్రాంతి కావాలని ఆట విడుపు కోసం ఎదో ఒక దేశానికి వెళ్తారు. సినిమా నటులు ఒకటో రెండో సినిమాలు చేసి ఇంకా అలసిపోయాం విశ్రాంతి కావాలని వాళ్ళు కూడా విహార యాత్రకి ఎదో దేశం వెళ్తారు. ఉద్యోగులు, శ్రామికులు విశ్రాంతి కోసం వీకెండ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాం. అంతెందుకు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి కోసం కొడనాడు గెస్ట్ హౌస్ అని బయలుదేరేవారు.

ఇక మన వై ఎస్…
విశ్రాంతి కోసం ఇడుపులపాయ అంటే, కె సి ఆర్.. వారానికొకసారి విశ్రాంతి కోసం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ అని వెళ్తుంటారే.. 
అంతెందుకు అక్కడెక్కడో ఢిల్లీ లో వుండే రాష్ట్రపతి విశ్రాంతి కోసం ప్రతి ఏటా కేరళ వస్తుంటారు.

మరి మీరేంటి సర్……
ఆదివారాలు కూడా ఆ ప్రాజెక్ట్ మీద సమీక్ష….
ఈ పధకం మీద సమీక్ష అని చేస్తూనే వుంటారు….
అప్పుడప్పుడు మీరు విదేశీ పర్యటన కోసం వెళ్తున్నారు అంటే విశ్రాంతి కోసం ఏమో అనుకునే లోపు.. ఒక దేశానికి పొయ్యి కార్ల కంపెనీ ని లాక్కొచ్చారు , ఇంకో దేశానికి పొయ్యి మొబైల్ తయారు చేసే కంపెనీ ని లాక్కొచ్చారు….. 
మా అందరికి విశ్రాంతి అవసరం అయినప్పుడు……
68 ఏళ్ళు వచ్చాయి……
మీకు విశ్రాంతి అవసరం లేదా సర్?

రోజు మా అమ్మ నాన్నల్ని అడుగుతుంటా సర్! 
వాకింగ్ కి వెళ్తున్నారా? టాబ్లెట్ లు వేసుకున్నారా…
ఆరోగ్యం బావుందా అని…..

పొద్దున్న లేస్తే సమస్యలతో సతమతమయ్యే మీకు వాకింగ్ చేసే అదృష్టం ఎక్కడిదిలే గాని…సమయానికి మందులు వేసుకోండి సర్…..
మీ ఆరోగ్యం కూడా బావుండాలి…….. పదమూడేళ్లుగా అమెరికా లో ఉంటున్నా…. మరీ కోట్లు కోట్లు కాకపోయినా ఎంతో కొంత సంపాదించుకున్నా……. 
మళ్ళీ సమీప భవిష్యత్హు లో ఇండియా లో స్థిరపడతానో లేదో తెలియదు…. రెండు రూపాయలకి కిలో బియ్యం,
ఎన్టీఆర్ సుజల స్రవంతి, 
ఎన్టీఆర్ భోజన పథకం, 
ఉచిత విద్య, 
ఉచిత వైద్యం, 
డ్వాక్రా ఋణం, 
ఇలాంటి పథకాల నుంచి లబ్ది పొందే అవసరం నాకుండకపోవచ్చు…….. మహా అయితే అన్న భోజనం పథకం ఎలా వుంది, సుజల స్రవంతి నీళ్లు ఎలా వున్నాయి అని చూడడానికి ఒకటి రెండు సార్లు ఇండియా వచ్చినప్పుడు తినడం తాగడం చేస్తానేమో……అలాంటప్పుడు నాకెందుకు అక్కడి రాజకీయం? మన పక్క తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఎప్పుడైనా రాష్ట్రం లో పెట్టుబడుల కోసం వేరే దేశం వెళ్లడం విన్నామా?

మహానేత అనబడే మహానుభావుడు ఏనాడైనా ఒకదేశానికి వెళ్లి కనీసం ఒక్క కంపెనీని అయినా తీసుకొచ్చి నాలుగు కొత్త ఉద్యోగాలు
సృష్టించాడా? దానికి బదులుగా అపారమైన మన ఖనిజ సంపదని, మన ప్రకృతి వనరులని వేరే దేశాలకి తరలించి వాళ్ళకి ఆదాయం సృష్టించాడు…. వై.ఎస్ లాగ, రోశయ్య లాగ, కిరణ్ కుమార్ లాగ, కె.సి.ఆర్ లాగ…. హాయిగా రాజధానిలో కూర్చుని…
రాజకీయం చేయొచ్చు కదా……..
మరి అలాంటప్పుడు మీరు మా రాష్ట్రాన్ని, మాకున్న సహజ వనరుల్ని, ఖనిజ సంపదని చూడండి, పెట్టుబడులు పెట్టండి…
ఉద్యోగాలు కల్పించండి….
అని ఎందుకు సర్ కాలికి బలపం కట్టుకుని తిరిగినోడు తిరిగినట్లే వున్నారు…..

కనీసం ఒక్క ఉద్యోగం కల్పించగల శక్తి వున్నవాడు అని తెలిసినా వాళ్ళని బ్రతిమాలుకుంటారు……ఎవరికోసం ఇదంతా?
మన ఆంధ్రుల కోసమేగా? 
అక్కడున్న నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కోసమేగా?….
మరి అక్కడున్న మన ఆంధ్రులకి మీ కష్టం తెలియాలి కదా సర్…..
అందుకే ఈ నా ప్రయత్నం...
మీ అభిమాని..

#ncbn #chandrababu #tdp

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...