Jump to content

GVL lol


Royal Nandamuri

Recommended Posts

ఇంట్లో కూర్చుని తీరుబడిగా టిఫిన్ తింటున్నాడు జీవీఎల్.
..
..
టీవీ విలేకరి ఆట ఆడుకుంటున్న పక్కింటి తుంటరి బుడ్డోడు పరుగెత్తుకుంటూ వచ్చి బొమ్మ మైక్ ని జీవీఎల్ ముందు పెట్టి వేగంగా తుర్రు మన్నాడు.
..
..
మైక్ ని చూడా గానే జీవీఎల్ మొకంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం మొదలెట్టాయి. నవ్వు మాయమయి ఫేసు కంద గడ్డలా అయింది. దానికితోడు ఏడుపు ఎక్స్ప్రెషనూ ప్లస్ మూతి వంకరా ఆటోమేటిక్ గా వచ్చేసాయి.
..
..
ఇంత దరిద్రంగా బ్రేక్ ఫాస్టు ప్రిపేర్ చేయడం ఏమిటి ? అసలు దీనికి చిల్లు ఏమిటి ? అంటే ఈ చిల్లు పెట్టడం వల్ల మిగిలిన కోట్లాది రూపాయిలు మీ పుట్టింటికి పంపి స్కాం చేస్తున్నావన్నమాట. అసలు నువ్వు పోయిన నెల వంట నిధులు లెక్క నాకు ఇంకా చెప్పకపోయినా మంచితనంతో, సహృదయంతో ఈనెల వంట నిధులు ఇవ్వడం పొరపాటయింది. ఈరోజు నుండీ నీ మొత్తం స్కాములన్నీ బయట పెడతా. ఇంత దారుణమయిన స్కాములు నేను దేశంలో ఎక్కడా చూడలేదు....
..
..
ఏంటీ..గారికి చిల్లు పెట్టడం స్కామా ? పైగా కోట్లాది రూపాయిలా ? టీవీలో వాగినట్టు ఫాల్తూ వాగుడు ఈడ వాగినావంటే బండకేసి నూకుతా...వార్నింగ్ ఇచ్చింది ఇంటావిడ చేతిలో మైక్ లాక్కుంటూ
..
..
note : జీవీఎల్ అనేది ఒక ఫిక్షనల్ కారెక్టర్. మీకు ఎవరో గుర్తు వస్తే రచయితకు సంబంధం లేదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...