Jump to content

Amaravati air show from November 23


sonykongara

Recommended Posts

Amaravati air show from November 23

DECCAN CHRONICLE.
Published Nov 7, 2018, 5:52 am IST
Updated Nov 7, 2018, 5:52 am IST
The first edition of the event was conducted on January 11 and 12, 2017, and was a feast to the eyes of people in Vijayawada.
The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.
 The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.

Vijayawada: AP tourism department, in collaboration with FICCI, will host the prestigious Air Show from November 23 to 25 in Vijayawada. The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.

The first edition of the event was conducted on January 11 and 12, 2017,  and was a feast to the eyes of people in Vijayawada. The event saw enthusiasts, dignitaries and general public flocking to the Punnami Ghat on the banks of River Krishna.

 

 

This is a first of its kind event in the world to happen in air space beyond the boundaries of an airport.

Global Stars Team, from UK, with four aircrafts will perform breathtaking manoeuvres such as formations, loops, barrel rolls and cubans.

The organisers requested for removal of powerlines on the river and creation of a 1 km air strip to hold aviation events in the city in the future.

 

...
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 101
  • Created
  • Last Reply
గగన .. విన్యాసం!
21-11-2018 08:02:16
 
636783841375713052.jpg
  • ఈ నెల 23, 24, 25 తేదీలలో అమరావతి ’ ఎయిర్‌ షో ’
  • జెట్‌ స్పీడ్‌ ఎయిర్‌ క్రాప్ట్‌లతో .. డేర్‌ డెవిల్‌ పైలట్ల సాహసాలు
  • యూకేకు చెందిన గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌ చే విన్యాసాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): వాయువేగంతో దూసుకుపోయే జెట్‌స్పీడ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు.. గుండె చప్పుడు వినిపించేలా.. ఉద్విఘ్నంగా సాగే డేర్‌ డెవిల్‌ పైలట్ల విన్యాసాగాలు.. గగుర్పొడిచే గగన విన్యాస ప్రదర్శనకు బెజవాడ మరోసారి వేదికకానుంది! ప్రపంచదేశాల ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏరోబాటిక్‌ ఎయిర్‌ షో’ రెండో ఎడిషన్‌ పోటీలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడ పున్నమిఘాట్‌లో జరగనున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ అండ్‌ కామర్స్‌ ఇండస్ర్టీ(ఫిక్కీ), ఏపీ టూరిజం నేతృత్వంలో గతేడాది కంటే మరింత ఘనంగా అమరావతి ఎయిర్‌షో ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. నేటినుంచి ట్రయల్స్‌తో రెండ్రోజులో ఈ ఈవెంట్‌ జరగనుంది. అమరావతి ఎయిర్‌ షో-2018 గ్రాండ్‌ ఈవెంట్‌లో యూకేకు చెందిన ‘గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌’ పాల్గొంటోంది. మోస్ట్‌ డేంజరస్‌ అడ్వెంచర్‌ టీమ్‌గా దీనికి పేరుంది. గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌కు మార్క్‌ జెఫ్రీస్‌ నాయకత్వం వహిస్తున్నారు.
 
ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లేలో అంతర్జాతీయ లెజండ్‌గా పేరుపొందిన మార్క్‌ జెఫ్రీ్‌సకు ఆయనతో పోటీపడగల అద్భుతమైన టీమ్‌మేట్స్‌ మరి కొందరు ఉన్నారు. మార్క్‌ జెఫ్రీస్‌ కెప్టెన్సీలో టామ్‌ క్యాసెల్స్‌, క్రిస్‌ బర్కెట్‌, స్టీవ్‌ కార్వర్‌, మైకే ల్‌ పికింగ్‌ వంటి సాహసోపేత పైలట్స్‌ అమరావతిలో నిర్వహించే ఎయిర్‌ షోలో పాల్గొంటున్నారు. ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లే లో భాగంగా గ్లోబల్‌స్టార్‌ టీమ్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చింది. యూఏఈ, మంగోలియా, కొరియా, చైనా (అన్షున్‌, డజు), అవలాన్‌, బహ్రెయిన్‌, రొమేనియా, దుబాయ్‌, ఐస్‌ల్యాండ్‌, ఫిన్లాండ్‌, మాల్తా, స్లోవినియా, డెన్మార్క్‌, యూకే, హాలెండ్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఈవెంట్స్‌ నిర్వహించింది. చైనాలో అత్యధికంగా నాలుగు సార్లు ఈ టీమ్‌ ఎయిర్‌ షో నిర్వహించగా.. మనదేశంలో ఇప్పటికి మూడుసార్లు ఎయిర్‌ షో నిర్వహించింది. మనదేశంలో అహ్మదాబాద్‌లో ఒకసారి, హైదరాబాద్‌లో రెండవసారి, విజయవాడలో మూడోసారి నిర్వహించింది. ప్రస్తుతం నాల్గవసారి మన దేశంలో ఎయిర్‌ షో నిర్వహిస్తోంది. విజయవాడలో వరుసగా రెండోసారి గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌ ఎయిర్‌ షో నిర్వహిస్తోంది.
 
ఇవీ ప్రత్యేకతలు
rawenrWE.jpgకేవలం 5నాటికన్‌ మైళ్ళ దూరంలోనే విన్యాసాలు మొదలయ్యేలా శ్రీకారం చుడుతున్నారు. ఒక నాటికల్‌ మైల్‌ అంటే 1.38 కిలోమీటర్‌. ఈ లెక్కన 6.9 కిలోమీటర్ల రేడియస్‌ పరిధిలోనే విమానాలు కృష్ణానదిమీదుగా విన్యాసాలు ప్రారంభం చేస్తాయి పరిమిత రేడియ్‌సను నిర్ణయించటం వల్ల కృష్ణానది గగన తలంలోకి రాగానే అతిదగ్గరగా మన కళ్లెదుటే ఉన్నట్టు అనుభూతులను కనిపిస్తాయి. మొత్తం నాలుగు విమానాలు ఆరు రకాల ప్రదర్శనల్లో పాల్గొంటాయి. ఇందులో మొదటి ది ఫార్మేషన్‌ ఎయిర్‌ డిస్‌ప్లే, రెండవది సోలో ఎయిర్‌ డిస్‌ప్లే, ఆ తర్వాత వరుసగా లూప్స్‌, బారెల్‌ రోల్స్‌, క్యూబన్స్‌, టర్న్స్‌ వంటి ప్రదర్శనలు నిర్వహిస్తాయి. ఈ ప్రదర్శనల సందర్భంలో విమానాలనుంచి రంగులు వెదజల్లుతుంటాయి. నిర్వాహకులు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడపటానికి క్లియెరెన్స్‌ తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన నిర్ణీత సమయాలలోనే ఎయిర్‌ షో జరుగుతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ట్రయల్స్‌కు మాత్రం కేవలం 15 నిమషాల సమయం మాత్రమే ఇచ్చారు. ప్రధాన పోటీలకు మాత్రం విమాన రాక పోకలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సమయం కేటాయించారు. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే మీద నుంచి ఈ విమానాలు టేకాఫ్‌ అవుతాయి. ఇప్పటికే విమానాలు ఇక్కడకు చేరుకున్నాయి.
 
వీక్షించటానికి తరలి రండి
పున్నమిఘాట్‌లో మెగా గ్రాండ్‌ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న అమరావతి ఎయిర్‌ షో -2018కి అందరూ ఆహ్వానితులేనని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతం అన్నారు. ప్రారంభ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరౌతారని తెలిపారు. లక్షమంది వీక్షించేలా గ్యాలరీలు సిద్ధం చేసినట్టు చెప్పారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా రెండు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి పాసులు లేకుండా కేవలం అక్రిడిటేషన్‌ కార్డుల మీద ఎక్కడికైనా ప్రవేశించే విధంగా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫీక్కి తరపున నచికేర్‌, ఏపీటూరిజం ఈడీ కుమార్‌, సీఎంవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- బి.లక్ష్మీకాంతం, కృష్ణాజిల్లా కలెక్టర్‌
Link to comment
Share on other sites

బర్డ్స్‌ ఐ వ్యూ ... అదుర్స్
22-11-2018 09:37:48
 
636784762693452557.jpg
  • బెజవాడను 480 డిగ్రీల కోణంలో బంధించే కెమెరాలు ..
  • ఎరోబాటిక్‌ విన్యాసాలు చేసే విమానాలకు బిగింపు
  • గగనంలో విన్యాసాల అద్భుత దృశ్యాల చిత్రీకరణ
  • భూ భాగంపై దృశ్యాలను బంధించే కెమెరాలు
  • ఎయిర్‌ షో ముగిసిన వెంటనే దృశ్యాల ప్రదర్శన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెజవాడ ఎంతో అందమైన నగరం. ఈ సుందర నగరాన్ని బర్డ్స్‌ ఐ వ్యూలో చూస్తే మరింత ద్విగుణీకృతంగా కనిపిస్తుంది. డ్రోన్ల ద్వారా చిత్రీకరించే చిత్రాలను చూసే అబ్బుర పడుతున్నాం. అదే ఫ్లయింగ్‌ జెట్‌ల నుంచి తీసే ఏరియల్‌ దృశ్యాలు చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే. విమాన రేసింగ్‌ దృశ్యాలు, దిగువన సుందరమైన నగరాన్ని రెండింటి మేళవింపుతో కూడిన దృశ్యాలు పోటీలు ముగిసిన వెంటనే వీక్షకులకు కను‘విందు’ చేయనున్నాయి.
 
ఇలాంటి అరుదైన అవకాశం అమరావతి ఎయిర్‌ షో- 2018లో కలగబోతోంది. ఎయిర్‌ షో ముగిసిన వెంటనే ఏరోబాటిక్‌ విమానాలు చిత్రీకరించే దృశ్యాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయింది మొదలు కృష్ణానదిలో చేసే విన్యాసాల వరకు 480 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరి స్తాయి. ఈ బర్డ్స్‌ ఐ వ్యూ దృశ్యాల ను పర్యాటక శాఖ, ఫిక్కీ అధికారులు షో ముగిసిన వెంటనే విడుదల చేయబో తున్నారు. ఇంతకీ ఈ దృశ్యాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయ నుకుంటున్నారా? ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లే చేసే విమానాల నుంచే ఈ దృశ్యాల చిత్రీకరణ జరుగుతుంది. సింగిల్‌ సీటింగ్‌ కలిగిన ఈ విమానాలలో వీడియో తీయటం ఎలా సాధ్యమనుకుం టున్నారా? పైలట్లు విమానాల నడిపే దానిమీదనే దృష్టి సారిస్తారు.
 
పైలట్లకు సంబంధం లేకుండా విమానాలకు బిగించిన 480 డిగ్రీల కోణంలో తిరుగాడే కెమెరాలు తమ పని ప్రారంభిస్తాయి. భూమి మీద చూడలేని దృశ్యాలను కూడా ఆకాశంలో విమానా ల విన్యాసాలు ఎంత ముచ్చటగొలిపే విధంగా ఉన్నా యో ఇవి చిత్రీకరిస్తాయి. వీటితోపాటు దిగువన ఉన్న దృశ్యాలను కూడా ఇవి తిరుగాడే క్రమంలో బంధిస్తాయి. కిందటి ఏడాది నిర్వహించిన ఎయిర్‌ షో విన్యాసాలను పర్యాటక శాఖ, ఫిక్కీ అధికారులు ప్రస్తుతం విడుదల చేశారు. ఈసారి 480 డిగ్రీల కోణంలో చిత్రీకరించే దృశ్యాలను మాత్రం వెంటనే విడుదల చేయటానికి సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...