Jump to content

Demo Day


RamaSiddhu J

Recommended Posts

మన ప్రియతమ ఏభై ఆరంగుళాల ఛాతీ  ప్రధానమంత్రి గారు దేశ ప్రజలమీద డీమానిటైజేషన్ సర్జికల్ స్ట్రైక్ చేసి రెండేళ్ళవుతుంది.ప్రతీ చిన్న విషయానికి ఇళ్ళెక్కి(ఇక్కడ మీడియా) కూసే బీజేపీ ఐటీ సెల్ మూసుకొని కూర్చుంది.
ఒక సర్జికల్ స్ట్రైక్ కీ తెగ సంబరాలు చేశారు దీనికేమైంది? ఓహో ఇది సామాన్యుడి మీద దింపిన గుణపం కదా ఎలా మాట్లాడతారు.ఏభై రోజులు ఓపిక పట్టండి నేను చేసింది తప్పైతే ఉరి తీయండి అన్నారు. ఏదీ మరి రెండేళ్ళవుతుంది ఉలుకూ పలుకూ లేదు.నెలకొకసారి గోల్ పోస్ట్ మారుస్తూ జనాల్ని వెర్రోళ్ళని చేసారు కదా అయ్యలూ.

#ఏది నల్ల ధనం ఏమైంది? 
తీవ్ర వాదం తగ్గిందా?
క్యాష్ టూ జిడీపి నిష్పత్తి పెరిగిందా?
పన్నుల మొత్తం పెరిగిందా?

#ఇవన్నీ జరగకపోగా రిజర్వ్ బ్యాంకు ప్రతీ సంవత్సరం అరవై వేల కోట్లకి పైగా ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్ 2017 లో ముప్పైఐదువేల కోట్లకి తగ్గిపోయింది.అంటే దాదాపుఇరవై ఐదువేల కోట్లు నష్టం.

#ఇక జీడీపీ ఎంతలేదనుకున్నా ఒక సంవత్సరం ఒక శాతం తగ్గింది. అంటే దాదాపు లక్షా ఇరవై  వేల కోట్లు హాంఫట్ అయ్యింది. ఇది కనీస నష్టం?

#అసంఘటిత రంగంలో కోల్పోయిన ఉద్యోగాలు కనీసం పది లక్షల నుండి ఇరవై లక్షల దాకా లెక్కలు వేస్తున్నారు. ఎంతమంది సామాన్యుల బ్రతుకులు చితికి పోయాయోకదా దీని వలన?

#క్యూలో నిలబడడం ఒత్తిడి తదితర కారణాల వల్ల వందమంది దాకా చనిపోయారు?.ఎంతమంది పనిగంటలు కోల్పాయారో కదా.?
పేదవాడికి ఏ రోజు కూలీ ఆ రోజు రాకపోతే డొక్కాడదు.మరి ఎంతమంది డొక్కలెండాయో కదా?
 
#ఛాయి అమ్మాను సామాన్యుడిని  అని జనాల్లో సానుభూతికి డైలాగ్లు కొట్టడంతో ఆగితే బాగుండు కానీ  మీ పైశాచిక ఎన్నికల గెలుపు ప్రక్రియకు దేశ ఆర్థిక వ్యవస్థను లక్షల మంది సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేశారు కదయ్యా.

#ఏదీ ఇదేనా చౌకీదార్ చేసేపని జవాబు దారీతనం ఎక్కడ? దీనికి సమాధానం లేక రాములోరిగుడి,విగ్రహాలు, మత విద్వేషాలు, లవ్ జీహాదులు,గోమాత రాజకీయాలు మీద పడ్డారు.
  వీటికి జబ్బలు చరచుకునే భక్తులు ఉన్నంత కాలం మీ ఆటలు సాగుతాయి.ఏం చేస్తాం దేశంలో రాజకీయ సామాజిక చైతన్యం అలా ఎడిచ్చచ్చింది?

చదువు ఆరోగ్యం ఉద్యోగం రోడ్లు గురించి పట్టించుకోకుండా జై శ్రీరామ్,భారత్ మాతాకీ జై, పాకిస్థాన్ ముర్దాబాద్ లాంటి స్లోగన్లకు ఓట్లేసే వెర్రిజనాలున్నంత వరకూ మీ ఆటలు సాగుతూనే ఉంటాయి.??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...