Jump to content

Vizag land scam SIT report


sonykongara

Recommended Posts

భూదందాలో ధర్మాన
07-11-2018 02:29:30
 
636771545714151297.jpg
  • విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌ సహా 8 మంది సీనియర్‌ ఐఏఎస్‌లూ..
  • 49 మంది అధికారులూ బోనులో
  • విశాఖ భూస్కాంపై తేల్చిన సిట్‌
  • ఏడాదిన్నర క్రితం సిట్‌కు చార్జ్‌
  • 2,875 ఫిర్యాదులపై విచారణ
  • ఐఏఎస్‌, రెవెన్యూ, నేతలు సహా 100 మందికిపైగా తప్పుల చిట్టా
  • గత జనవరిలో సర్కార్‌కి నివేదిక
  • క్రిమినల్‌, క్రమశిక్షణ చర్యలకు సిట్‌ సిఫారసు.. రాష్ట్ర కేబినెట్‌ ఓకే
  • కార్యాచరణకు కమిటీ ఏర్పాటు
  • ‘ఆంధ్రజ్యోతి’ చేతికి సిట్‌ నివేదిక
ఖాళీ జాగా కనిపిస్తే చాలు చాప చుట్టేశారు. చివరకు స్వాతంత్య్ర సమరయోధుల భూముల్నీ వదల్లేదు. విశాఖలో కలకలం రేపిన ఈ మహా దందాను సిట్‌ నిగ్గు తేల్చింది. పలువురు ఐఏఎస్‌లు, నేతలను బోనులో నిలబెట్టింది.
 
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ భూ కుంభకోణం బట్టబయలైంది. నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈ భూదందాతో నేరుగా సంబంధం ఉన్నదని ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) తేల్చింది. ధర్మానతోపాటు నేటి విశాఖ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మరో 49 మంది అధికారులు, 50 మంది ప్రైవేటు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఏడాది జనవరిలోనే సర్కారుకు సిట్‌ నివేదిక అందింది.
 
అనేక మల్లగుల్లాల అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిట్‌ నివేదికపై చర్చించి ఆమోదించారు. సిట్‌ సిఫారసుల అమలుకు ముగ్గురు సీనియర్‌ అధికారులతో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. భూ దందాలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఈ కమిటీ సర్కారుకు సిఫారసులు చేస్తుందని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. సిట్‌లోని అంశాలను బహిర్గతం చేయకుండా కమిటీ ఏర్పాటు అంశాన్నే ఆయన వివరించారు. అయితే, ‘ఆంధ్రజ్యోతి’.. సిట్‌ నివేదికను సంపాదించింది. అందులో సంచలనం కలిగించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి.
 
సిట్‌ తేల్చిన అంశాలివీ..
విశాఖ గ్రామీణ మండలంలోని రెవెన్యూ రికార్డుల్లో 2015-2017 మధ్యకాలంలో 18 ఎంట్రీలను గుర్తించారు. ఇవి ట్యాంపరింగ్‌ అయినట్లు తేలడంతో ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకొంది. సిట్‌ విచారణకు ఆదేశిస్తూ గత ఏడాది జూన్‌ 20న సిట్‌ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంపై విచారణ చేపట్టిన సిట్‌కు విశాఖ జిల్లా వ్యాప్తంగా 40 మండలాల నుంచి 2,875 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1995 నుంచి జరిగిన భూ బాగోతాలకు సంబంధించినవి కూడా ఉన్నాయు. ఇందులో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య తగాదాకు సంబంధించి 1,494 ఫిర్యాదులున్నాయి. 763 కేసుల్లో రెవెన్యూ, ప్రభుత్వ బడా అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా మేలు చేశారు. ఇంకా 618 కేసుల్లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం, సహకారంతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు చెరపట్టినవి ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు 11 మంది వివిధ అంశాలపై ఫిర్యాదులు చేశారు. ఇందులోనే మంత్రి అయ్యన్నపాత్రుడుతోపాటు వివిధ పార్టీల నేతలు ఇచ్చిన ఫిర్యాదులున్నాయి. 113 అంశాలతో ముడిపడిన ఫిర్యాదులను సిట్‌ విచారించింది.
 
ఇక మిగిలిన 2,531 ఫిర్యాదులు సిట్‌ విచారణ పరిధిలో లేవు. దీంతో వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని సిట్‌ కోరింది. ఇవికాకుండా మరో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములపై ఇచ్చిన నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కేసులు 68 సిట్‌ విచారించింది. సిట్‌ విచారణ రెవెన్యూ చట్టాలు, నియమ నిబంధనలు, భూములపై ఇచ్చిన ఉత్తర్వులు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా కొనసాగింది. సిట్‌ మొత్తంగా విచారించిన 181 ఫిర్యాదులపై అనేక అంశాలను వెలికితీసింది. భారీగా ప్రభుత్వ భూములను చెరబట్టారని ఈ క్రమంలో గుర్తించింది. అడ్డగోలుగా మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు ఎన్‌వోసీలు ఇచ్చారని, ఈ కేటగిరీలోకి రాని భూములను కూడా ఈ పద్దుకింద చేర్చి రెవెన్యూ రికార్డులను తారుమారుచేసి ఎన్‌వోసీలు ఇచ్చారని తేల్చింది. ప్రభుత్వ భూములను కూడా ప్రైవేటు భూములుగా చూపిస్తూ రికార్డులు తారుమారు చేయడం, రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు కింద చూపించి పరాధీనం చేయడం, ప్రభుత్వ భూముల కబ్జా చేయడం, వాటికి బడా అధికారులు సహకరించడం జరిగిందని తేల్చారు.
 
ఈ నేపధ్యంలో 50 మందిపై ప్రెవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేయించింది. 49 మంది అధికారులపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేసింది. 134 కేసుల్లో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఎన్‌వోసీలకు సంబంధించి 68 కేసుల్లో క్రిమినల్‌, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక ప్రభుత్వ భూమిని ప్రైవేటుగా చూపించిన 20 కేసుల్లో అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని చెప్పింది. 29 రిజిస్ట్రేషన్‌లు రద్దుచేయాలని, ఇంతకుముందు మూసేసిన అనేక కేసులను తెరిపించాలని కోరింది. ఇంకా ఏపీ భూ కబ్జా నిరోధక చట్టం 1905 కింద 1,225.925 ఎకరాలు, అసైన్‌మెంట్‌ చట్టం-1977 కింద 751.19 ఎకరాలు తిరిగి ప్రభుత్వ వశం చేసుకోవాలని సిఫారసు చేసింది. ఏపీ పట్టాదార్‌ పాస్‌పుస్తక చట్టం-1971 కింద 109 కేసులు పెట్టాలని కోరింది..
 
తప్పుల చిట్టాలో పెద్దలు
అనేక భూ వివాదాలకు సంబంధించిన కేసులను సిట్‌ పరిశీలించింది. 1995, 2005, 2007, 2013,2015 నాటి రెవెన్యూ రికార్డులను పరిశీలించి పలు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో నలుగురు ఆయన అనుచరులపై కఠిన చర్యలకు సిఫారసు చేసింది. ఇక విశాఖ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లుగా పనిచేసిన వారిని కూడా సిట్‌ వదిలిపెట్టలేదు. ప్రస్తుత కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కూడా తప్పుల చిట్టాలో చేర్చింది. ఓ భూమి కేసులో ఆయన జేసీగా పనిచేసినప్పుడు తప్పు జరిగిందని పేర్కొంటూ జాబితాలో ఆయన్ను కూడా చేర్చి కఠిన చర్యలకు సిఫారసు చేసింది. విశాఖ కలెక్టర్‌లుగా పనిచేసిన లవ్‌ అగర్వాల్‌( ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు); జే శ్యామలరావు( ప్రస్తుతం కమర్షియల్‌ టాక్సెస్‌ కమిషనర్‌), సునీల్‌ శర్మ(తెలంగాణలో సర్వీసులో ఉన్నారు)లపై కూడా చర్యలకు సిఫారసు చేశారు.
 
విశాఖలో జాయింట్‌ కలెక్టర్లుగా పనిచేసిన ఎంటీ కృష్ణబాబు (ప్రస్తుతం వీపీటీ చైర్మన్‌), వీరబ్రహ్మయ్య (తెలంగాణ సర్వీసులో ఉన్నారు), సందీ్‌పకుమార్‌ సుల్తానియా( తెలంగాణ సర్వీసులో ఉన్నారు), ప్రవీణ్‌కుమార్‌ (ప్రస్తుత కలెక్టర్‌)లపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఇక విశాఖలో డీఆర్‌వోగా పనిచేసి ఐఏఎస్‌ పదోన్నతి పొందిన ఎస్‌ సత్యనారాయణ(ప్రస్తుతం కర్నూలు కలెక్టర్‌)పై కూడా కొన్ని కేసుల్లో కఠిన చర్యలకు సిఫారసు చేశారు. మరో ఏడుగురు అధికారులపై కూడా తీవ్రమైన అభియోగాలు రాగా అవి సిట్‌ పరిధిలోకి రావని ఆయా శాఖల విచారణకు అప్పగించింది. వీటి విచారణ పూర్తయితే వారి వ్యవహారం కూడా తేటతెల్లం కానుంది. కాగా, సిట్‌కు మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన ఫిర్యాదును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
 
13మంది డిప్యూటీ కలెక్టర్లకు మరక
విశాఖలో డీఆర్‌వోలు, ఆర్‌డీవోలుగా పనిచేసిన 13 మంది డిప్యూటీ కలెక్టర్‌లపై క్రిమినల్‌ చర్యలతోపాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సిట్‌ స్పష్టంగా సిఫారసు చేసింది. వీరిలో ఎక్కువగా ఆయా సందర్భాల్లో విశాఖ ఆర్‌డీవోలుగా పనిచేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉంటే, తహసిల్దార్‌, డిప్యూటీ తహసిల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సర్వేయర్‌, వీఆర్‌వో, ఉప సబ్‌ రిజిస్ట్రార్‌ కేడర్‌లో ఉన్న 49 మంది రెవెన్యూ అధికారులపై కూడా సిట్‌ క్రిమినల్‌ చ ర్యలకు సిఫారసు చేసింది.
Link to comment
Share on other sites

34 minutes ago, RKumar said:

Only Dharmana involved from politicians?

Other congress leaders who are in YSRCP, TDP & JS now?

Anakapalli MLA involved annaru thappinchaara?

అనకాపల్లి, ayyana కదా, did he do? 

ఆయనే కంప్లయింట్ chesinattunnadu.. 

Link to comment
Share on other sites

32 minutes ago, ramntr said:

అనకాపల్లి, ayyana కదా, did he do? 

ఆయనే కంప్లయింట్ chesinattunnadu.. 

Not ayyanna, Anakapalli MLA meeda raasaru ippudu emi lenattu vundi.

Link to comment
Share on other sites

37 minutes ago, Kiran said:

GDP growth - 8.2

Stone pelting decreased - Yes

Formalized Economy- Yes

Tax Payer Base Increased - Yes

Digital Economy Increased - Yes

Realestate affordability- Yes

 

Kiran garu, if above are true Modi garu press meets enduku pettadam ledu?  

I have seen many NRI BJP hardcore fans, turning against BJP after DEMON. 

Africa is doing better in Digital economy than India, though they lack proper internet and electricity.

BJP could have done better in Education, agriculture and Medical sector, Unfortunately, they didn't.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, Kiran said:

GDP growth - 8.2

Stone pelting decreased - Yes

Formalized Economy- Yes

Tax Payer Base Increased - Yes

Digital Economy Increased - Yes

Realestate affordability- Yes

 

Common man is petrified to do money transactions due to Demonitation. That’s only happened to control black money 

Link to comment
Share on other sites

31 minutes ago, APDevFreak said:

Kiran garu, if above are true Modi garu press meets enduku pettadam ledu?  

I have seen many NRI BJP hardcore fans, turning against BJP after DEMON. 

Africa is doing better in Digital economy than India, though they lack proper internet and electricity.

BJP could have done better in Education, agriculture and Medical sector, Unfortunately, they didn't.

pressmeet eppudu pettala ga ippudu pedathaniki, appudappudu interviews, Mann ki batt, Townhalls and daily twitter.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...