Jump to content

Rayalaseema steel corporation


sonykongara

Recommended Posts

  • Replies 81
  • Created
  • Last Reply
50 minutes ago, subash.c said:

Overall steel demand taggindi Ani news lo chepthunnaru....asala avasarama ee plant ?

Public asalu avi emi think cheyyatam ledhu...istham annaru, ivvandi antunnaru...use undha ledha they don't care

So central hand ichindhi...state peduthundi.

Link to comment
Share on other sites

రాయల’ స్టీల్స్‌కు రేపే శ్రీకారం
26-12-2018 02:33:25
 
636813884064293231.jpg
  • కడప ఉక్కు పరిశ్రమకు సీఎం శంకుస్థాపన
  • ఖనిజం, నిధుల లభ్యతపై కార్యాచరణకు సిద్ధం
  • వేలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశం
  • 2,700 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు
  • 18వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ ఏర్పాటు
  • ఆర్‌ఎస్‌సీఎల్‌ మనుగడకు 2వేల కోట్లు
  • కేంద్రం మొండి వైఖరితో రాష్ట్రం నిర్ణయం
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి? ‘కడప ఉక్కు’పై కేంద్రం ఎంతకీ కదలని నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంటు నిర్మాణంతో వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకావకాశాలు దక్కడంతో పాటు ఉక్కు ఉత్పత్తులతో రాయలసీమ ఆర్థికంగానూ బలోపేతం కానుంది. కడప ఉక్కు ప్లాంటుకు శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక పరిశ్రమకు అవసరమైన నిధులు, ఖనిజం లభ్యత తదితర అంశాలపై కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
 
ముడిఖనిజ నిక్షేపాలు పుష్కలం: రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని వెలికితీస్తే ముడిసరుకు కొరతే ఉండదు. ఇతర ప్లాంట్‌ల తరహాలో బయటినుంచి ముడి ఇనుము దిగుమతి చేసుకునే ప్రయాస, రవాణా చార్జీల భారం కూడా తగ్గుతాయి. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడంపై మెకాన్‌ సంస్థతో కేంద్రం అధ్యయనం చేయించింది. వారు సానుకూలంగా ఇచ్చిన నివేదికను మాత్రం బయటకు రాకుండా తొక్కిపెట్టింది. పైగా కడపలో స్టీల్‌ప్లాంటు నిర్మాణం వల్ల ఏ ప్రయోజనం లేదంటూ రాగాలెత్తుతోంది. సమీపంలోనే కావాల్సినంత ఇనుప ఖనిజం లభ్యమవుతోంది. గండికోట నుంచి అవసరమైన నీరు, తగినన్ని మానవ వనరులు ఉన్నా కూడా ఇంకా అభ్యంతరాలేంటని ఏపీ ప్రశ్నిస్తోంది. స్టీల్‌ప్లాంటు స్థాపించాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆమరణ దీక్షకూ దిగారు.
 
దీక్ష విరమణ సమయంలో 100రోజుల గడువు ఇచ్చిన చంద్రబాబు, ఆలోగా కేంద్రం స్పందించకుంటే రాష్ట్రమే ప్లాంట్‌ను నిర్మిస్తుందంటూ అల్టిమేటమ్‌ ఇచ్చారు. యథావిధిగా కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో కడప జిల్లా మైలవరం సమీపంలోని ఎం.కంబాలదిన్నె వద్ద 3వేల ఎకరాల్లో రూ.18వేల కోట్ల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధమైంది. ఇందుకోసం కంపెనీల చట్టం కింద ఆర్‌ఎ్‌ససీఎల్‌ను రిజిస్టర్‌ చేసింది. దీనికి గతంలో విశాఖ ఇస్పాత్‌ నిగమ్‌ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కలిగిన పి.మధుసూదన్‌ను సీఎండీగా నియమించింది. ఈ కార్పొరేషన్‌ను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీని మనుగడ కోసం రూ.2వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. కడప స్టీల్‌ ప్లాంటు కోసం ఇప్పటికే 2,300ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మిగిలిన 700ఎకరాలు కూడా సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడానికి ప్రైవేటు సంస్థలేమైనా ముందుకొస్తాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.
Link to comment
Share on other sites

Ah hundai company  ni ikkadaki vachi pettamante aipotadi ga kia ki deggera ga untadi plus sricity & chennai lo unna automobile industry ki deggera ga untadi ...automobile manufacturing  ki related steel production kabbati vadiki problem undadu anukunta 

Link to comment
Share on other sites

1 hour ago, MVS said:

Ah hundai company  ni ikkadaki vachi pettamante aipotadi ga kia ki deggera ga untadi plus sricity & chennai lo unna automobile industry ki deggera ga untadi ...automobile manufacturing  ki related steel production kabbati vadiki problem undadu anukunta 

Specialized steel green steel ki demand undhi regular steel ki asalu ledhu appudu eppudo petina rtpp ke dangadaga idoka gudibanda 2k is not small amount 

Link to comment
Share on other sites

కడప ఉక్కుకు నేడు శంకుస్థాపన 

 

కడప జిల్లా ఎం.కంబాలదిన్నెలో పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు 
రూ.20వేల కోట్ల పెట్టుబడి 
3వేల ఎకరాల్లో నిర్మాణం 
ఏడాదికి 3మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం 
గడ్డం దీక్షను విరమించనున్న సీఎం రమేష్‌

26ap-main2a_2.jpg

ఈనాడు, అమరావతి, కడప: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర సర్కారే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకొంది. ఇప్పటికే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తిచేసిన ప్రభుత్వం గురువారం మరో మైలురాయిని అధిగమించబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆకాంక్ష ఇప్పటిది కాదు. పదేళ్ల క్రితమే ‘బ్రహ్మణి  ఉక్కు పరిశ్రమ’ పేరిట ఆ దిశగా అడుగులు పడ్డాయి. పదివేల ఎకరాల్లో నిర్మించేందుకు అనుమతులు లభించినా అనివార్య కారణాలతో అది అసంపూర్తిగా మిగిలింది. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టం హామీల్లో కడప ఉక్కు ప్రస్తావన రావడం తెలిసిందే. కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపనే జరిగింది.  రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు దిల్లీ పెద్దలకు విన్నవించినా ఫలితం లేకపోయింది. మెకాన్‌ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా  కేంద్రం బహిర్గతం చేయలేదు. చివరకు పార్టీలకు అతీతంగా ఉద్యమ బాట పట్టడం, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ ఆమరణదీక్షకు దిగడంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. విషయం రెండు నెలల్లోగా తేల్చాలని చంద్రబాబు కేంద్రానికి అల్టిమేటం ఇచ్చినా స్పందన కరవైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వమే దాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి ‘రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌’గా నామకరణం చేశారు. ప్రొద్దుటూరులో ధర్మపోరాట వేదికపై ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. నెలలో పునాదిరాయి వేసి కడప ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. తదనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11.12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 

గడ్డం దీక్ష విరమణ 
కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ గురువారం తన దీక్ష విరమించనున్నారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి తలనీలాలు సమర్పించడంతో పాటు గడ్డం తొలగించనున్నారు.

26ap-main2b_2.jpg

 

 
Link to comment
Share on other sites

కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది, 3 వేల ఎకరాల విస్తీర్ణంలో 20 వేల కోట్ల ఖర్చు తో నిర్మించబడుతున్న "రాయలసీమ ఉక్కు పరిశ్రమ" కు 11:15 గం.లకు భూమిపూజ చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఫైలాన్ ను ఆవిష్కరించారు.#KadapaSteelPlant

DvaSaSqUYAA54mJ.jpg
DvaScb4VYAARoX_.jpg
DvaSe15UUAIH_Kp.jpg
DvaShJYU0AEcKJK.jpg
Link to comment
Share on other sites

On 11/1/2018 at 3:51 PM, LION_NTR said:

Antha baagaane undi kaani...Rayalaseema steel plant ani peru pettadam enduku? 

AP name meeda pettadam manchidi.

we should not encourage anymore divisive ideas.

very true!

kadapa steel corporation anna parledu... why rayalaseema? like no one from other regions should not work?

Link to comment
Share on other sites

30 years ki saripada iron ore undhi.... plus that will create local employment (indirect employment) 

kadapa lanti place lo employement generation valla party ki plus locals ki use untundi.... 22k Correa which will benefit fetch 10k direct employment and indirect employment on same scale.... 

 

not it bad to be honest. Inka naming antaaraaa.... it is strategic. We have to prove that seema ki Jagan or YSR chesindemi ledu.... 

Link to comment
Share on other sites

27 minutes ago, swarnandhra said:

job creation is a over blown benefit in this kind of high tech industry. very few % of jobs are given to locals. most of the jobs will be recruited pan India.

Adi state govt project so normaly local valle recruit ayye chances ye ekkuva bro if we can give training to local educated people 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...